కొత్త తరహా కామెడీతో వస్తోన్న ‘ప్లాంట్‌ మ్యాన్‌’‘! | Comedy Entertainer Plant man Movie First look Poster Release | Sakshi
Sakshi News home page

Plant man Movie: సైంటిఫిక్‌ కామెడీగా వస్తోన్న ప్లాంట్‌ మ్యాన్.. ఆసక్తిగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌!

Published Fri, Sep 1 2023 9:47 PM | Last Updated on Fri, Sep 1 2023 9:49 PM

Comedy Entertainer Plant man Movie First look Poster Release - Sakshi

కాలింగ్‌ బెల్‌, రాక్షసి వంటి చిత్రాలతో మెప్పించిన పన్నా రాయల్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే కొత్తవారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పన్నా రాయల్ డీఎం యూనివర్సల్‌ స్టూడియోస్ పేరుతో కొత్త బ్యానర్‌ను స్థాపించారు. ఈ పతాకంపై తాజాగా  ఆయన ‘ప్లాంట్‌ మ్యాన్‌’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కె.సంతోష్‌బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీంతో పాటు పన్నా రాయల్‌ దర్శకత్వంలో మరో చిత్రం ‘ఇంటి నెం.13’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కాబోతోంది. 

(ఇది చదవండి: 'జైలర్‌'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నిర్మాత!)

సైంటిఫిక్‌ కామెడీగా వస్తున్న ‘ప్లాంట్‌ మ్యాన్‌’ను ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. భవిష్యత్తులో కొత్తవారికి అవకాశాలు ఇచ్చి మరిన్నీ సినిమాలు నిర్మిస్తామని నిర్మాత పన్నా రాయల్‌ తెలిపారు.  చంద్రశేఖర్‌, సోనాలి పాణిగ్రాహి, అశోక్‌ వర్థన్‌, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్‌, లక్ష్మీకిరణ్‌, శేఖర్‌, వీరభద్రం, శ్రీకుమార్‌, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ పి.ఎస్‌.మణికర్ణన్‌.. ఆనంద బాలాజీ సంగీత మందిస్తున్నారు. 

(ఇది చదవండి: పూజలో పాల్గొన్న మెగా వారసురాలు.. ఉపాసన పోస్ట్ వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement