
జిమ్‌లో శ్రీదేవిని అలా చూసినప్పటి నుంచి నా మనసు మార్చేసుకున్నాను అంటోంది సినీనటి మంచు లక్ష్మి (Lakshmi Manchu). తాజాగా ఆమె చేసే బ్యూటీ విత్ లక్ష్మి టాక్ షోకు బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ భార్య మహీపా కపూర్ హాజరైంది. వీరిద్దరూ అందం, ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.
ట్రెడ్‌మిల్‌పై శ్రీదేవి
శ్రీదేవి (Sridevi)ని ఓసారి జిమ్‌లో చూశాను. తను ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతోంది. అప్పుడు జిమ్ లోపలికి అడుగుపెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాను. శ్రీదేవి తన జుట్టుకు ఒత్తుగా నూనె పట్టించి ఉంది. అది చూసి షాకయ్యాను. దక్షిణ భారతదేశంలో తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా సాధారణ విషయం. ఎందుకో కానీ, జుట్టుకు నూనె పెట్టుకోవడాన్ని నేనసలు ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడైతే శ్రీదేవిని అలా చూశానో సడన్‌గా నా మనసు మారిపోయింది.
శ్రీదేవికి అన్నీ తెలుసు
అంత గొప్ప నటి శ్రీదేవియే జుట్టుకు నూనె రాసుకుందంటే చాలా గొప్ప విషయం అనిపించింది. తనెప్పుడూ సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుంది అని చెప్పుకొచ్చింది. మహీరా కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవికి ఏం చేయాలి? ఏది తినాలి? అన్నీ తెలుసు. ఇలాంటి విషయాల్లో ఆమె జీనియస్ అని పేర్కొంది. ఇకపోతే లక్ష్మీ మంచు చివరగా ఆదిపర్వం సినిమాలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment