హీరోల సోదరీమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటోంది మంచు లక్ష్మి. అక్కడిదాకా ఎందుకు? అసలు తాను నటిగా మారడం కన్న తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు మాట్లాడుతూ.. నా జీవితానికి, కెరీర్‌కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారా? అంటే అది నా కుటుంబమే!
మేమంతా కలిసే ఉంటాం. అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు.. అసలు ఒప్పుకునేవారే కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువులాంటిది. అందులో చిన్న చేపపిల్లలా నువ్వు ఈదగలవా? అని భయపడ్డారు.
ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తనెప్పుడూ.. ముంబైకి వచ్చేయొచ్చుగా అని అంటూ ఉండేది. హీరో రానా కూడా.. నువ్వు ఎల్లకాలం హైదరాబాద్‌లోనే ఉండిపోలేవని అంటుండేవాడు. నాక్కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యాను.
సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరీమణులను సినిమాలో సెలక్ట్ చేసుకునేందుకు తెగ ఆలోచిస్తారు. మాలాంటివాళ్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్న (మోహన్‌బాబు)కు కూడా నేను యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలినే! నా తమ్ముళ్లు ఈజీగా సాధించేవాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్‌లోనే కాదు దేశమంతటా ఉంది' అని చెప్పుకొచ్చింది.
కాగా మంచు లక్ష్మి చివరగా మాన్‌స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన యక్షిణి సిరీస్ ఈ మధ్యే హాట్‌స్టార్‌లో విడుదలైంది.
చదవండి: నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment