జీవితంలో కొత్త మజిలీ ప్రారంభించబోతున్నా, త్వరలోనే కొత్త చాప్టర్ అన్‌లాక్ చేస్తున్నా అంటూ ఊరించిన మంచు మనోజ్ చివరికి తన సినిమా అప్‌డేట్ చెప్పి అభిమానులను ఉసూరుమనిపించిన విషయం తెలిసిందే! అతడు గుడ్‌న్యూస్ అన్న క్షణం నుంచి ఫ్యాన్స్ అంతా కచ్చితంగా అది పెళ్లి వార్తే అయి ఉంటుందని ఫిక్స్ అయ్యారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వాట్ ద ఫిష్ మూవీని ప్రకటించాడు. అయినప్పటికీ మనోజ్ త్వరలో పెళ్లిపీటలెక్కడం ఖాయమంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం మంచు లక్ష్మీ చెవిన పడింది. ఆదివారం నాడు మంచు లక్ష్మీ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుంది.
ఈ సందర్భంగా ఆమెకు మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె మాట్లాడుతూ.. 'నేను గుడికి వచ్చినప్పుడు పర్సనల్ విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్? మనోజ్ పెళ్లి గురించి అతడినే అడగండి. నా సినిమాల గురించి అడిగితే చెప్తాను. అగ్ని నక్షత్రం సహా నాలుగు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. శివరాత్రికి ఓ పాట రిలీజ్ చేస్తున్నాను. టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవోలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 40 మంది యాక్టర్స్ వస్తున్నారు. దాని ద్వారా 45వేల మందికి మంచి విద్య అందించగలుగుతున్నాం. ఇవన్నీ నా పరిధిలోవి కాబట్టి చెప్పాను. నా పరిధిలో లేనివి అడిగితే చెప్పలేను' అని పేర్కొంది మంచు లక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment