మంచు ఫ్యామిలీ గొడవ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం మొదలైన వివాదం చివరికీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే మంగళవారం మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మంచు మనోజ్ దంపతులను లోపలికి రాకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు.
అయితే మంచు ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం ముంబయిలో ఉన్నారు. గొడవ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే.. తాజాగా ఆమె చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా తన కూతురి వీడియోను పోస్ట్ చేస్తూ పీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఈ పోస్ట్‌పై నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్‌ను చూస్తే శాంతించండి అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మంచు లక్ష్మి సలహా ఇచ్చినట్లు అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment