మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.
ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?
తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.
మీటూ ఎలా మొదలైంది?
గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.
నా పరిస్థితి వేరు
మంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్‌స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్‌బాబు), మోహన్‌లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.
తెలివిగా నో చెప్పాలి
ఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్‌రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.
చదవండి: బిగ్‌బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment