బిగ్‌బాస్‌ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? | Bigg Boss Telugu 8: These Expected Contestants May Participate In BB Show, Check Out All Other Details | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: మారిన లిస్ట్‌.. కంటెస్టెంట్ల జాబితా ఇదే!

Published Thu, Aug 22 2024 12:47 PM | Last Updated on Thu, Aug 22 2024 1:40 PM

Bigg Boss Telugu 8: These Contestants May Participate in BB Show

బిగ్‌బాస్‌ షురూ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌ హంగామా మామూలుగా ఉండదు. ఎప్పుడెప్పుడు కొత్త ప్రోమో రిలీజ్‌ అవుతుందా? ఈసారి ఎవరెవరు వస్తారా? అని సోషల్‌ మీడియాలో తెగ ఆరా తీస్తుంటారు. గత సీజన్‌ పుణ్యమా అని జనాల్లో ఈ ఉత్సాహం మళ్లీ కనిపిస్తోంది. మరి ఈసారి ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

వచ్చే వారమే బిగ్‌బాస్‌ 8
అయితే ఈసారి ఏయే కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లనున్నారనేదానిపై ఇంతవరకు స్పష్టతర రాలేదు. వారం రోజుల్లో  (సెప్టెంబర్‌ 1న) షో పెట్టుకుని ఇంతవరకు జాబితా ఫైనల్‌ చేయకపోవడం నిజంగానే విడ్డూరం! బిగ్‌బాస్‌ టీమ్‌ సెలక్ట్‌ చేసిన లిస్టులో కొందరి పేర్లు ఈపాటికే లీకయ్యాయి. అందులో కొందరైతే చాలామందికి తెలియను కూడా తెలీదు. ఏదేమైనా ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదేనంటూ నెట్టింట ఓ లిస్టు వైరలవుతోంది. దీని ప్రకారం.. సీనియర్‌ నటి సనా హౌస్‌లోకి రానుందట.

ప్రచారంలో కొత్త పేర్లు
కమెడియన్‌ యాదమ్మ రాజు, నటి అంజలి పవన్‌, యాంకర్‌ రీతూ చౌదరి, యాంకర్‌ సౌమ్య రావు, ఏక్‌నాథ్‌ హారిక, సింగర్‌ సాకేత్‌ కంటెస్టెంట్లుగా దాదాపు కన్ఫార్మ్‌ అయ్యారట! కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌ ఫేమ్‌ యష్మి గౌడ కూడా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. యువసామ్రాట్‌, హర్షసాయి, విష్ణుప్రియ, బంచిక్‌ బబ్లూ, సోనియా సింగ్‌, బెజవాడ బేబక్క పేర్లు వినిపించినా ఇంతవరకు ఫైనల్‌ కాలేదని భోగట్టా!

ఆమె తప్పుకుందా?
నటుడు ప్రభాకర్‌, కిర్రాక్‌ ఆర్పీ, ఇంద్రనీల్‌, అనిల్‌ గీల, బుల్లితెర నటుడు రవితేజ, సెల్వరాజ్‌, మోడల్‌ సయ్యద్‌ రోహన్‌ అబుల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్‌ రన్నరప్‌ అమర్‌దీప్‌ భార్య తేజస్విని గౌడ కూడా షోలోకి వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే పారితోషికం దగ్గర చర్చలు విఫలం కావడంతో ఆమె ఈ సీజన్‌ నుంచి తప్పుకుందట. బహుశా నెక్స్ట్‌ సీజన్‌కు వద్దామని ఈసారి సైడ్‌ అయిపోయిందేమో!

చదవండి: Chiranjeevi Birthday: సుప్రీమ్‌ హీరో.. మెగాస్టార్‌గా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement