
నటి మంచు లక్ష్మీ మోహన్ బాబు కూతురిగానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా దూసుకుపోతున్న లక్ష్మీ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. మొహమాటం లేకుండా తన ఓపీనియన్‌ని నిక్కచ్చిగా చెబుతుంటుంది.
తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. అవి ఇప్పుడు మార్చలేను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. కాబట్టి మళ్లీ ఆ తప్పులు చేయను అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అయితే ఏ విషయంలో మంచు లక్ష్మీ తప్పు చేసింది అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment