కూతురి ప్రేమను అర్థం చేసుకుని నచ్చినవాడితో పెళ్లి జరిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. తన పెద్ద కూతురు ఐశ్వర్య.. లెజెండరీ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆమె ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్.. తంబిరామయ్యతో మాట్లాడాడు. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో ఈ మధ్యే ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం చెన్నైలో ఎంతో వేడుకగా రిసెప్షన్ సెలబ్రేట్ చేశారు.
కోట్లాది కట్నం
తన గారాల కూతుర్ని అత్తారింటికి సాగనంపిన అర్జున్.. అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. వందలాది కోట్లు కట్నం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడట! అర్జున్‌కు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరూ కూతుర్లే! అందుకే తను సంపాదించిన ఆస్తులను భారీ మొత్తంలో కట్నంగా ఇచ్చేందుకు అస్సలు వెనకడుగు వేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
యాక్టరే కాదు సింగర్ కూడా!
అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. విరున్ను అనే ద్విభాషా(మలయాళ, తమిళ) చిత్రం చేస్తున్నాడు. అలాగే తీయవర్ కులైగళ్ నాదుంగ, విడాముయుర్చి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకనిర్మాత కూడా! అలాగే చిట్టుకురువి (పరశురామ్), కట్టున అవలా కట్టువేండ (జైసూర్య) వంటి పలు సాంగ్స్ సైతం పాడాడు. సర్వైవర్ తమిళ్ షోతో హోస్ట్‌గానూ మారాడు.
Comments
Please login to add a commentAdd a comment