సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..! | Anuradha Recalls Divorce With Sanjay Gupta, Got Married | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి- విడాకులు... ఆరేళ్ల తర్వాత మళ్లీ మనసులు కలిశాయి!

Published Thu, Jun 20 2024 12:43 PM | Last Updated on Thu, Jun 20 2024 12:57 PM

Anuradha Recalls Divorce With Sanjay Gupta, Got Married

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గుప్తా లైఫ్‌.. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. అనురాధ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు కలిసి కాపురం చేసిన వీరు అంతలోనే విడిపోయారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ దూరాన్ని ఎంతోకాలం భరించలేకపోయారు. ఆరేళ్ల తర్వాత ఒకరి కోసం మరొకరు తీవ్రంగా తపించారు. తిరిగి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ మళ్లీ పెళ్లి ఒక సెన్సేషన్‌..

ఇద్దరి తప్పు
తాజాగా అనురాధ.. భర్త సంజయ్‌తో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'మేము విడిపోవడానికి సంజయ్‌ ఒక్కడే కారణం కాదు. నా వాటా కూడా ఉంది. ఒకానొక సమయంలో ఇక చాలు, నా వల్ల కాదు అనిపించింది. అందుకే విడాకులు తీసుకున్నాం. అయితే అప్పట్లో నా భర్తకు ఎఫైర్స్‌ ఉన్నాయని రూమర్స్‌ వచ్చాయి. కానీ నేను అవేమీ నమ్మలేదు. అందరికంటే ఎక్కువగా నా భర్తనే నమ్మాను. విడిపోయినప్పుడు కూడా అతడు నాతో, నా కుటుంబంతో టచ్‌లోనే ఉన్నాడు.

విడిపోయాక కూడా..
సంజయ్‌ అంటే నా కుటుంబానికి ఎంతో ఇష్టం. విడాకుల తర్వాత తన బంగ్లాలో ఎప్పుడూ ఏదో ఒక పార్టీ నిర్వహించేవాడు. మాకు కామన్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. అలా కొన్నిసార్లు నేను కూడా తన పార్టీలకు హాజరయ్యేదాన్ని. ఫ్రెండ్స్‌తో కాసేపు చిల్‌ అయి వెళ్లిపోయేదాన్ని. ప్రతి ఆరు నెలలకోసారి మళ్లీ కలిసిపోదామా అని అడిగేవాడు. అలా చివరకు మళ్లీ పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. కాగా అనురాధ ఇటీవలే మిసెస్‌ వరల్డ్‌ ఇంటర్నేషనల్‌ 2024 కిరీటం అందుకుంది.

చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement