సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా Anand Deverakonda's Gam Gam Ganesha movie is now available for streaming on this OTT platform. Sakshi
Sakshi News home page

Gam Gam Ganesha OTT: 20 రోజులకే ఓటీటీలో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Thu, Jun 20 2024 9:33 AM | Last Updated on Thu, Jun 20 2024 10:16 AM

Gam Gam Ganesha Movie OTT Streaming Now

మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అదే రోజు రిలీజైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'భజే వాయు వేగం' చిత్రాల వల్ల సరైన వసూళ్లు సాధించలేకపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)

'బేబి' మూవీతో గతేడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. దీంతో ఇతడు నటించిన 'గం గం గణేశా' మూవీపై కాస్త బజ్ ఏర్పడింది. యాక్షన్ క్రైమ్ కామెడీ స్టోరీతో తీసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

'గం గం గణేశా' విషయానికొస్తే.. గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న సైజ్ దొంగ. అతడికో ఫ్రెండ్ (ఇమ్మాన్యుయేల్). ఓ షాపులో పనిచేసే శ్రుతి (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. ఆమె గణేశ్‌ని కాకుండా షాప్ ఓనర్‌తో పెళ్లికి రెడీ అవుతుంది. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే డబ్బు ముఖ్యమని ఓ డైమండ్ దొంగతనానికి గణేశ్ సిద్ధపడతాడు. మరోవైపు ఓ రాజకీయ నాయకుడు రూ.100 కోట్ల బ్లాక్ మనీని ముంబై నుంచి కర్నూలు తీసుకొచ్చే పనిలో ఉంటాడు. ఈ రెండింటికి లింక్ ఏంటి? డైమండ్ ఎవరికి దక్కింది అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement