Sanjay Gupta
-
సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..!
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా లైఫ్.. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. అనురాధ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు కలిసి కాపురం చేసిన వీరు అంతలోనే విడిపోయారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ దూరాన్ని ఎంతోకాలం భరించలేకపోయారు. ఆరేళ్ల తర్వాత ఒకరి కోసం మరొకరు తీవ్రంగా తపించారు. తిరిగి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ మళ్లీ పెళ్లి ఒక సెన్సేషన్..ఇద్దరి తప్పుతాజాగా అనురాధ.. భర్త సంజయ్‌తో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'మేము విడిపోవడానికి సంజయ్ ఒక్కడే కారణం కాదు. నా వాటా కూడా ఉంది. ఒకానొక సమయంలో ఇక చాలు, నా వల్ల కాదు అనిపించింది. అందుకే విడాకులు తీసుకున్నాం. అయితే అప్పట్లో నా భర్తకు ఎఫైర్స్ ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. కానీ నేను అవేమీ నమ్మలేదు. అందరికంటే ఎక్కువగా నా భర్తనే నమ్మాను. విడిపోయినప్పుడు కూడా అతడు నాతో, నా కుటుంబంతో టచ్‌లోనే ఉన్నాడు.విడిపోయాక కూడా..సంజయ్ అంటే నా కుటుంబానికి ఎంతో ఇష్టం. విడాకుల తర్వాత తన బంగ్లాలో ఎప్పుడూ ఏదో ఒక పార్టీ నిర్వహించేవాడు. మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా కొన్నిసార్లు నేను కూడా తన పార్టీలకు హాజరయ్యేదాన్ని. ఫ్రెండ్స్‌తో కాసేపు చిల్ అయి వెళ్లిపోయేదాన్ని. ప్రతి ఆరు నెలలకోసారి మళ్లీ కలిసిపోదామా అని అడిగేవాడు. అలా చివరకు మళ్లీ పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. కాగా అనురాధ ఇటీవలే మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటం అందుకుంది.చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా -
ఆర్యన్ కేసులో బాలీవుడ్ నిశ్శబ్ధం అవమానకరం: డైరెక్టర్ అసహనం
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. ముంబై క్రూయిజ్ షిప్‌పై అక్టోబర్ 2 రాత్రి పోలీసులు దాడి చేయగా ఈ పార్టీలో ఆర్యన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి షారుక్‌కు, ఆయన కుటుంబానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే షారుక్‌కు సల్మాన్, హృతిక్ రోషన్, పూజ బేడీతో పాటు పలువురు మద్దతు తెలిపారు. చదవండి: హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస ఇదిలా ఉంటే అరెస్ట్ అయినప్పటీ నుంచి ఆర్యన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆర్యన్ మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటిషన్‌ను పదే పదే తిరస్కరిస్తోంది. దీంతో బెయిల్ దొరక్క ఆర్యన్‌కు జైలు కూడు తప్పడం లేదు. ఈ క్రమంతో తాజాగా మరో సెలబ్రిటీ షారుక్‌కు మద్దతుగా నిలిచారు. ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ట్విటర్ ద్వారా షారుక్‌కు మద్దతు తెలిపారు. చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్ రోడ్డు జైల్లో ఆర్యన్‌ను కలుసుకున్న షారుక్ ఈ మేరకు సంజయ్ గుప్తా ట్వీట్ చేస్తూ.. ఆర్యన్ అరెస్టు విషయంలో నిశబ్ధంగా ఉన్న పలువురు బాలీవుడ్ పెద్దలను ఆయన ప్రశ్నించారు. ‘షారుక్‌ఖాన్ సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతీ విషయంలో షారుక్ ముందుంటారు. అలాంటి ఆయన సంక్షోభ పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటమంటే దానికంటే అవమానకరమైన విషయం మరొకటి లేదు’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరో ట్వీట్లో ‘ఈ రోజు షారుక్ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్లు లేదా మీ వాళ్లు ఉండోచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: షారుఖ్ బీజేపీలో చేరితే డ్రగ్స్ కాస్తా షుగర్ అవుతుంది: ఛగన్ భుజ్‌భల్ Shahrukh Khan has and continues to give jobs and livelihoods to thousands in the film industry. He has always stood up for every cause for the film industry. And the astute silence of the same film industry in his moment of crisis is nothing short of SHAMEFUL. — Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021 Aaj uska beta hai, kal mera ya tumhaara hoga… Tab bhi issi buzdalli se chup rahoge??? — Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021 -
బన్నీని ఒక్క ఛాన్స్ అడిగిన బాలీవుడ్ డైరెక్టర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైంకుఠపురములో’ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బన్నీ కెరీర్లో బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాటకు అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 263 మిలియన్ వ్యూస్ రాబట్టి.. తెలుగులో అత్యధిక మంది చూసిన సాంగ్‌గా రికార్డులకు ఎక్కింది. (లేట్‌గా లేటెస్ట్గా దుమ్మురేపుతున్న బుట్టబొమ్మ) తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా ‘అల వైకుంఠపురములో’ సినిమాపై ప్రశంసలు జల్లు కురిపించారు. కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, జబ్బా వంటి సినిమాలతో బీటౌన్‌లో సంజయ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘అల వైకుంఠపురములో’ చూసిన ఆయన.. బన్నీ గురించి, సినిమా గురించి ట్విటర్లో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘ఇటీవలే అల వైకుంఠపురములో సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో చూశాను. ఎంతో వినోదభరితంగా ఉంది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడకపోతే.. ఆ లోటు ఎప్పటికీ ఉండిపోతుంది. ప్రస్తుతమున్న పరిస్థితులన్నీ కుదుటపడ్డాక, వీలైనంత త్వరగా ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాలి’. అంటూ సంజయ్ ట్వీట్ చేశారు. (కరోనా: మరో బుల్లితెర నటుడికి పాజిటివ్) #JustWatched ALA VAIKUNTHAPURRAMULOO on Netflix. What a film! Pure unadulterated entertainment. Not having seen it in a full theatre will be a life long regret. Beat the pandemic blues and watch this gem asap. — Sanjay Gupta (@_SanjayGupta) July 11, 2020 కాగా సంజయ్ ట్వీట్‌పై బన్నీ స్పందించారు... ‘మీరు ఈ సినిమా చూడటం ఆనందంగా ఉంది. సినిమాను ఇష్టపడినందుకు మీకు థాంక్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బన్నీ ట్వీట్‌పై మళ్లీ డైరెక్టర్ సంజయ్ స్పందించారు. సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అయినట్లు సంజయ్ పేర్కొన్నారు. ‘బ్రదర్.. మీ యాక్టింగ్‌కి నేను ఎలా కనెక్ట్ అయ్యానో చెప్పలేను. మీరు నన్ను నవ్వించారు.. ఏడిపించారు. జీవితాంతం నేను మీ అభిమానిని. మీతో వర్క్ చేయడానికి ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఇక సంజయ్ ఆఫర్ ఇవ్వడంపై బన్నీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత) Thank you very much Sanjay Ji ! Glad u really liked the movie . Humbled — Allu Arjun (@alluarjun) July 11, 2020 -
అంధుడైన హీరోకు వాచీ ఎందుకు?
సంజయ్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న కాబిల్ సినిమాలో హృతిక్ రోషన్ ఒక అంధుడి పాత్ర పోషిస్తున్నాడు. హృతిక్ సరసన యామీ గౌతమ్ (ఈమెదీ అంధురాలి పాత్రే) నటిస్తున్న ఈ సినిమాలో అతడు చేతికి వాచీ పెట్టుకుంటాడు. ఈ సినిమా ప్రోమో విడుదల అయినప్పటి నుంచి.. అంధుడి చేతికి వాచీ ఉంటే ఉపయోగం ఏంటి.. అతడు అందులో టైమ్ ఎలా చూసుకుంటాడంటూ దాని మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి దర్శకుడు సంజయ్ గుప్తా గట్టి సమాధానమే ఇచ్చారు. '' హృతిక్ కాబిల్ సినిమాలో అంధుడైనా వాచీ ఎందుకు పెట్టుకున్నాడని చాలామంది అడుగుతున్నారు. అయితే వాళ్లు తమ తెలివితేటలు కొంచెం పెంచుకోవాలి. అంధుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాచీలున్నాయి. వాటిని బ్రెయిలీ వాచీలు అంటారు. అలాగే చూడలేని వారు వాడేందుకు మాట్లాడే వాచీలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో హృతిక్ చేతికి పెట్టుకునేది అలాంటి వాచీయే. మేం హోంవర్కు చేసిన తర్వాతే సినిమా తీస్తున్నాం. సినిమా చూసిన తర్వాత.. ఈ వాచీకి సినిమాలో ఎంత ముఖ్యమైన పాత్ర ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు దాని గురించి మీకు చెప్పలేను. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు చూస్తే.. వేరేవాళ్లు ఎంత కష్టపడి పనిచేసినా, దాన్ని వెంటనే నీరుగార్చడానికి జనం సిద్ధంగా ఉంటారని అర్థమవుతోంది'' అని ఆయన అన్నారు. -
రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌పై రేస్ పవర్ దృష్టి
సౌర విద్యుత్ రంగ సంస్థ రేస్ పవర్ ఇన్ఫ్రా తాజాగా రూఫ్‌టాప్ సోలార్ పవర్ (పైకప్పుమీద అమర్చే సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుదుత్పత్తి)పై దృష్టి సారిస్తోంది. అనుబంధ సంస్థ సోలార్ కార్ట్.. ఇప్పటికే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మొదలైన సంస్థలకు సంబంధించి సుమారు 5 మెగావాట్ల (మె.వా.) ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సంజయ్ గుప్తా తెలిపారు. రూఫ్‌టాప్ సోలార్ పవర్‌కి సంబంధించి రాబోయే రెండేళ్లలో తెలంగాణలో 20 మె.వా., దేశవ్యాప్తంగా 50 మె.వా. లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మరోవైపు, ఈపీసీ తదితర మార్గాల్లో తెలంగాణలో ఇప్పటిదాకా 55 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టగా అందులో 45 మె.వా. పూర్తి చేసినట్లు గుప్తా పేర్కొన్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలోని 20 మె.వా. సోలార్ పార్క్‌లో సుమారు 10 మె.వా. విద్యుత్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు, మిగతాది సెప్టెంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి రాగలదని చెప్పారు. ఇప్పటిదాకా మొత్తం 290 మె.వా. సౌర విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు వివరించారు. 170 మె.వా. మేర ఆర్డర్ బుక్ ఉండగా.. ఇందులో 110 మె.వా. ప్రాజెక్టులు ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాగలవన్నారు. గత ఆర్థిక సంవత్సరం సుమారు రూ.330 కోట్ల మేర టర్నోవరుగా నమోదైందని.. ఈసారి దాదాపు రూ. 600-650 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
భారత సంతతి వైద్యుడికి అమెరికాలో రెండోస్థానం
న్యూయార్క్: న్యూరోసర్జన్‌గా అమెరికన్లకు సుపరిచితులైన భారతసంతతి వైద్యుడు సంజయ్ గుప్తా ఆ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వైద్యుడిగా స్థానం దక్కించుకున్నారు. వైద్యుల ట్విటర్ ఖాతా సాయంతో ఓ సంస్థ చేసిన సర్వేలో గుప్తాకు రెండోస్థానం దక్కింది. అమెరికాలోని అట్లాంటాలో ఎమోరి క్లినిక్ పేరుతో ఆస్పత్రిని నడుపుతున్న గుప్తాకు ట్విటర్లో దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. పలుమార్లు ఎమ్మీ అవార్డుతోపాటు సీఎన్ఎన్ చీఫ్ మెడికల్ కరెస్పాండెంట్ అవార్డును కూడా అందుకున్న గుప్తాకు అత్యం త సక్సెస్ రేటుతో ఆపరేషన్లు చేసిన వైద్యుడిగా గుర్తింపు ఉంది. ఇక ఈ సర్వే లో 30 లక్షల మంది ఫాలోవర్లతో డ్రూ పిన్స్కీ మొదటిస్థానంలో నిలిచారు. 2006 నుంచి కొనసాగుతున్న వైద్యుల ట్విటర్ ఖాతాల ఆధారంగా ఆగస్టానా యూనివర్సిటీ విద్యార్థులు ఈ వివరాలను వెల్లడించారు. -
భారతీయ వైద్యుడికి అమెరికాలో అరుదైన గౌరవం
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన వైద్యులలో రెండోస్థానాన్ని పొంది.. భారత సంతతికి చెందిన న్యూరోసర్జన్ సంజయ్ గుప్తా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆయనకు ట్విట్టర్లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు ట్విట్టర్ తెలిపింది. దేశవ్యాప్తంగా ట్విట్టర్ వాడుతున్న వైద్యుల వివరాలను పరిశీలించిన తర్వాత ఈ విషయం చెప్పింది. అట్లాంటాలోని ఎమోరీ క్లినిక్‌లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న గుప్తాకు ఇంతకుముందు ఎమ్మీ అవార్డు పలుమార్లు వచ్చింది. ఆయనకంటే ఎక్కువగా 31.8 లక్షల మంది ఫాలోవర్లతో డ్రూ పిన్స్కీ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ వివరాలు తేల్చడానికి అగస్టానా యూనివర్సిటీ విద్యార్థులు 2006 నుంచి అమెరికా వ్యాప్తంగా వైద్యులు ఉపయోగిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను విశ్లేషించారు. ఇందుకోసం మొత్తం 4,500 మంది యూజర్లను పరిగణనలోకి తీసుకున్నారు. వైద్యులు ఇతరులతో ట్విట్టర్ ద్వారా ఎలా ఎంగేజ్ అవుతున్నారో చూశామని పరిశోధనలో పాల్గొన్న పేజ్ ష్విట్టర్స్ తెలిపారు. ఎక్కువ పాపులర్ అకౌంట్లు సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు, టీవీ పర్సనాలిటీలకు చెందినవని చెప్పారు. గుప్తా ఇచ్చే వైద్య శిక్షణ, ప్రజారోగ్య విధానంలో ఆయన అనుభవం, యుద్ధప్రాంతాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆయన రిపోర్టింగ్ అన్నింటి ద్వారా ఆయన ప్రముఖుడిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఇబోలా వ్యాప్తి, తలకు తగిలే గాయాలు, విపత్తుల నుంచి రక్షణ, ఆరోగ్యరంగ సంస్కరణలు, సైన్యానికి ప్రత్యేక చికిత్సలు, ఫిట్నెస్, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అవగాహన లాంటి విషయాల్లో కూడా సంజయ్ గుప్తా సలహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయట. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా అన్నిరకాలుగా సలహాలు, సూచనలు ఇస్తున్నారని అన్నారు. -
'నేనైతే షూటింగ్‌కు వెళ్లేవాణ్నికాను'
ముంబై: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా అందాలతార ఐశ్వర్య రాయ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఓ తల్లిగా, నటిగా రెండు పాత్రలకు ఐశ్యర్య న్యాయం చేస్తోందని అన్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో 'జజ్బా' చిత్రంలో ఐశ్వర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ విశేషాల గురించి సంజయ్ చెబుతూ.. 'ఓసారి ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు ఒంట్లో బాగలేదు. షూటింగ్ రద్దు చేస్తామని ఐశ్వర్యకు చెప్పాను. అయితే ఆమె అందుకు నిరాకరించి షూటింగ్‌కు వచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వరకు షూటింగ్ జరిగింది. ఇంతలో ఐశ్వర్య సిబ్బంది వచ్చి ఆమె వాంతి చేసుకుందని చెప్పారు. నేను ఎవరని ఆరా తీయగా ఆరాధ్య అని ఐశ్వర్య సిబ్బంది చెప్పారు. ఆ సమయంలో ఐశ్వర్య కుటుంబం ముంబైలో లేదు. షూటింగ్ రద్దు చేయడం ఇష్టం లేక ఐశ్వర్య తన కూతురును కూడా వ్యాన్‌లో షూటింగ్‌కు తీసుకువచ్చారు. నేనే కనుక ఆమె స్థానంలో ఉండుంటే షూటింగ్‌కు వెళ్లేవాణ్ని కాను' అని ఐశ్వర్య అంకితభావాన్ని ప్రశంసించారు. జజ్బా చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది. -
శ్రీమతికొక సినీ బహుమతి
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మరి, స్త్రీ విజయం వెనుక...? పురుషులూ ఉంటారు. కావాలంటే, కొద్దికాలం విరామం తరువాత మళ్ళీ తెరపై మెరవడానికి సిద్ధమవుతున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను అడిగి చూడండి. సంజయ్ గుప్తా రూపొందిస్తోన్న ‘జజ్బా’ ద్వారా ఐశ్వర్యారాయ్ మరోసారితెరపైకి వస్తున్నారు. ఆ సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేకత కూడా వచ్చి చేరింది. భార్య ఐశ్వర్యారాయ్ కోసం భర్త అభిషేక్ బచ్చన్ సైతం ఆ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ‘‘ఇవాళ్టి షూటింగ్లో బోలెడంత ఉత్సాహం చోటుచేసుకుంది. ‘జజ్బా’లోని ఒక ప్రత్యేక పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ షూటింగ్లో పాల్గొంటున్నారు’’ అని సంజయ్ గుప్తా ట్విట్టర్లో పేర్కొన్నారు. నిజానికి, అభిషేక్, ఐశ్వర్యారాయ్‌ల మధ్య కెమిస్ట్రీ మణిరత్నం రూపొందించిన ‘గురు’, ‘రావణ్’ చిత్రాల్లో తెరపై కనువిందు చేసింది. కొంత విరామం తరువాత మళ్ళీ ఈ సినిమాలో ఆ జంట కనువిందు చేస్తుందన్న మాట. ఇర్ఫాన్ ఖాన్, షబానా ఆజ్మీ లాంటి ప్రముఖులు కూడా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. మొత్తానికి, భార్య పురోభివృద్ధి కోసం భర్త అండగా నిలవాలనడానికి, అభిషేక్, ఐశ్వర్యల జంటే ఉదాహరణ కదూ! -
మునుపటికన్నా అందంగా...
ఐశ్వర్యా రాయ్ రీ-ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికో శుభవార్త. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాజ్బా’ షూటింగ్ నేడు ఆరంభం అవుతోంది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి రాత్రి తొమ్మిది గంటల వరకూ షూటింగ్ ప్లాన్ చేశారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐష్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె చేయని పాత్ర ఇది. అందుకే, షూటింగ్ ప్రారంభించకముందు కొన్ని వర్క్ షాప్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఐష్ తన పాత్రను బాగా అర్థం చేసుకున్నారని సంజయ్ పేర్కొన్నారు. లాయర్ల శారీరక భాష, వారి ప్రవర్తన ఎలా ఉంటాయి? అని సంజయ్ పరిశీలించారట. ఆ విషయాలను ఐష్‌కి చెప్పడంతో, ఆమె కూడా తన శారీరక భాషను మార్చుకున్నారట. ఈ విషయాలను స్వయంగా సంజయ్ చెప్పారు. న్యాయస్థానంలో జరిగే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు. వాడివేడి చర్చలు జరిగే సన్నివేశాల్లో నటనపరంగా ఐష్ విజృంభిస్తారనే నమ్మకం ఉందని సంజయ్ అన్నారు. తల్లి కాకముందు ఎలా ఉండేవారో అదే శరీరాకృతికి ఐష్ చేరుకున్నారట. అలాగే ఈ నాలుగేళ్లూ ఇంటిపట్టున ఉన్నారు కాబట్టి, కొత్త మెరుపుతో మునుపటికన్నా అందంగా ఉన్నారని, ఓ రకమైన ఉద్వేగంతో, ఉత్సాహంతో ఐష్ కనిపిస్తున్నారని సంజయ్ తెలిపారు. -
డూప్ లేకుండా ఫైట్లు
కేన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకులు చూపులు తిప్పుకోలేని స్థాయిలో తళుకులీనుతున్నారు ఐశ్వర్యా రాయ్. ఓ ఆరేడు నెలల క్రితం కూడా బొద్దుగా కనిపించిన ఐష్ ఇలా సన్నబడటం అందరినీ స్వీట్ షాక్‌కి గురి చేసింది. బిడ్డకు జన్మనిచ్చి మూడు నాలుగేళ్లయినా ఇంకా బరువు తగ్గలేదని ఎవరైతే విమర్శించారో వాళ్లందరి నోళ్లూ మూతబడిపోయేలా ఐష్ స్లిమ్ అయ్యారు. ‘పాత ఐష్‌ని చూసినట్లుగా ఉంది’ అని అభిమానులు మురిసిపోతున్నారు. అలాగే, ఐష్ చేయబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన రావడం వాళ్లని మరింత ఆనందంలో ముంచెత్తింది. ఈ అందాల సుందరి తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లయ్యింది. మణిరత్నం దర్శకత్వం వహించినున్న చిత్రం ద్వారా మళ్లీ తెరపై కనిపించనున్నారని, ప్రహ్లాద్ కక్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారని వార్తలు వచ్చాయి. అధికారికంగా ఈ చిత్రాలను ప్రకటించకపోవడంతో, వీటిలో ఐష్ నటిస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సంజయ్ గుప్తా ట్విట్టర్ ద్వారా ఐష్ తన సినిమాలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ‘జాజ్బా’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ఐష్ ఓ శక్తిమంతమైన పాత్ర చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఐష్ వీరోచిత పోరాటాలు కూడా చేస్తారట. వాటిని డూప్ లేకుండా స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నారు ఈ సుకుమారి. -
రెండేళ్లలో సోలార్ పార్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20-25 సోలార్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రేస్ పవర్ ఇన్ఫ్రా ప్రకటించింది. రేస్ పవర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తం 70 మెగా వాట్ల సామర్థ్యంతో నాలుగు సోలార్ పార్కులను కలిగి వుంది. దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో నాలుగు సోలార్ పార్కులను తమ సంస్థ మాత్రమే కలిగి వుందని, రానున్న కాలంలో ఈ సంఖ్యను 25కి పెంచాలన్నది లక్ష్యమని రేస్ పవర్ ఇన్ ఫ్రా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజయ్ గుప్తా తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతోందని, దీనికితోడు కంపెనీలు సామాజిక సేవలో (సీఎస్ఆర్) భాగంగా సౌర ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ విస్తరణ కార్యక్రమాలు, ఈ రంగంలో ఉన్న అవకాశాలను గుప్తా ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. మెగావాట్‌కు రూ.6.8 కోట్లు సోలార్ పార్కులను అభివృద్ధి చేసి వివిధ కంపెనీలకు, సంస్థలకు కావాల్సిన మెగా వాట్ల మేరకు విక్రయిస్తున్నట్లు గుప్తా తెలిపారు. ఈపీసీ విధానంలో ఇప్పటి వరకు 70 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పార్కులను అభివృద్ధి చేయగా మరో 70 మెగా వాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 5-50 మెగావాట్ల సామర్థ్యంతో పార్కులను ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్థల సేకరణ దగ్గర నుంచి గ్రిడ్ అనుసంధానం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తామే నిర్వహిస్తామన్నారు. ఒక్క మెగావాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు రూ.6.8 కోట్లు వ్యయం అవుతుందన్నారు. ఇప్పటికే హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి వివిధ ఎంఎన్‌సీలు తమ సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే కంపెనీల సాంఘిక సేవలో భాగంగా సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టిసారిస్తున్నాయని, ఆ విధంగా పలు ఐటీ సెజ్‌లు, ఫైవ్‌స్టార్ హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు గుప్తా తెలిపారు. కంపెనీలను ఆకర్షించడానికి యూనిట్ ధరపై డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పాలసీనే బెస్ట్ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం మిగిలిన రాష్ట్రాల కంటే చాలా బాగుందని, దీన్ని కొనసాగించాలని గుప్తా కోరారు. రాజస్థాన్, గుజరాత్లో ప్రైవేటు కంపెనీలకు విక్రయించుకునే విధంగా ఓపెన్ పాలసీ లేకపోవడం ప్రధాన లోపం. అలాగే నెట్ మీటరింగ్ పేరుతో సొంత అవసరాలకు సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. నెట్ మీటరింగ్ విధానంలో 10 నుంచి 50 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను 5 సంస్థలకు ఏర్పాటు చేస్తున్నాం. ఇక రేడియేషన్ విషయానికి వస్తే రాజస్థాన్‌తో పోలిస్తే తక్కువ రేడియేషన్ వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతున్నప్పటికీ వ్యయాలను నియంత్రించుకోవడం ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతం సోలార్ విద్యుత్‌కు అనువైనది కాదని, తెలంగాణ, రాయలసీమలోని అనంతపురం జిల్లాలు అనువుగా ఉన్నాయన్నారు. రూ.1,000 కోట్ల టర్నోవర్ గతేడాది రూ.200 కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం ఈ ఏడాది రూ.400 కోట్లు దాటుతుందని, 2016కల్లా రూ.1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపార విస్తరణకు కావల్సిన నిధులను అంతర్గతంగా సమకూర్చుకుంటున్నామని, పీఈ పెట్టుబడులు, రుణాల ద్వారా నిధులు సేకరించే యోచన లేదని గుప్తా తెలిపారు.