'నేనైతే షూటింగ్కు వెళ్లేవాణ్నికాను'
ముంబై: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా అందాలతార ఐశ్వర్య రాయ్ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఓ తల్లిగా, నటిగా రెండు పాత్రలకు ఐశ్యర్య న్యాయం చేస్తోందని అన్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో 'జజ్బా' చిత్రంలో ఐశ్వర్య నటిస్తున్న సంగతి తెలిసిందే.
షూటింగ్ విశేషాల గురించి సంజయ్ చెబుతూ.. 'ఓసారి ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు ఒంట్లో బాగలేదు. షూటింగ్ రద్దు చేస్తామని ఐశ్వర్యకు చెప్పాను. అయితే ఆమె అందుకు నిరాకరించి షూటింగ్కు వచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వరకు షూటింగ్ జరిగింది. ఇంతలో ఐశ్వర్య సిబ్బంది వచ్చి ఆమె వాంతి చేసుకుందని చెప్పారు. నేను ఎవరని ఆరా తీయగా ఆరాధ్య అని ఐశ్వర్య సిబ్బంది చెప్పారు. ఆ సమయంలో ఐశ్వర్య కుటుంబం ముంబైలో లేదు. షూటింగ్ రద్దు చేయడం ఇష్టం లేక ఐశ్వర్య తన కూతురును కూడా వ్యాన్లో షూటింగ్కు తీసుకువచ్చారు. నేనే కనుక ఆమె స్థానంలో ఉండుంటే షూటింగ్కు వెళ్లేవాణ్ని కాను' అని ఐశ్వర్య అంకితభావాన్ని ప్రశంసించారు. జజ్బా చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది.