మునుపటికన్నా అందంగా... | Aishwarya Rai Bachchan will start shooting for Jazbaa | Sakshi
Sakshi News home page

మునుపటికన్నా అందంగా...

Published Mon, Feb 2 2015 10:36 PM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

మునుపటికన్నా అందంగా... - Sakshi

మునుపటికన్నా అందంగా...

ఐశ్వర్యా రాయ్ రీ-ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికో శుభవార్త. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాజ్బా’ షూటింగ్ నేడు ఆరంభం అవుతోంది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి రాత్రి తొమ్మిది గంటల వరకూ షూటింగ్ ప్లాన్ చేశారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐష్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె చేయని పాత్ర ఇది. అందుకే, షూటింగ్ ప్రారంభించకముందు కొన్ని వర్క్ షాప్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఐష్ తన పాత్రను బాగా అర్థం చేసుకున్నారని సంజయ్ పేర్కొన్నారు. లాయర్ల శారీరక భాష, వారి ప్రవర్తన ఎలా ఉంటాయి? అని సంజయ్ పరిశీలించారట.
 
 ఆ విషయాలను ఐష్‌కి చెప్పడంతో, ఆమె కూడా తన శారీరక భాషను మార్చుకున్నారట. ఈ విషయాలను స్వయంగా సంజయ్ చెప్పారు. న్యాయస్థానంలో జరిగే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు. వాడివేడి చర్చలు జరిగే సన్నివేశాల్లో నటనపరంగా ఐష్ విజృంభిస్తారనే నమ్మకం ఉందని సంజయ్ అన్నారు. తల్లి కాకముందు ఎలా ఉండేవారో అదే శరీరాకృతికి ఐష్ చేరుకున్నారట. అలాగే ఈ నాలుగేళ్లూ ఇంటిపట్టున ఉన్నారు కాబట్టి, కొత్త మెరుపుతో మునుపటికన్నా అందంగా ఉన్నారని, ఓ రకమైన ఉద్వేగంతో, ఉత్సాహంతో ఐష్ కనిపిస్తున్నారని సంజయ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement