Jazbaa
-
అయిదేళ్ల తరువాత ఐష్
వెండితెరపై ఐశ్వర్యా రాయ్ కనిపించి ఐదేళ్లయ్యింది. ఆమె తెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు ఇటీవల విడుదలైన ‘జజ్బా’ బ్రేక్ వేసింది. ఇన్నేళ్ల తర్వాత ఐష్‌ని మళ్లీ తెరపై చూడటం ఆమె అభిమానులను ఆనందపరిచింది. హిందీలో ఇటీవల విడుదలైన ఈ ‘జజ్బా’ను ఆరెంజ్ మీడియా అధినేతలు నివాస్‌వర్మ, సతీశ్ తెలుగులోకి ‘అడ్వకేట్ అనురాధ వర్మ’గా అనువదించారు. ఈ 6న చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఓటమి అనేది తెలియని అడ్వకేట్ అనురాధ వర్మగా ఇందులో ఐశ్వర్యా రాయ్ నటించారు. కథ గురించి చెప్పాలంటే... ఒక అమ్మాయిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఓ హంతకుడికి శిక్ష పడేలా చేయడానికి అనురాధ న్యాయస్థానంలో వాదిస్తుంది. ఈ నేపథ్యంలో అనురాధ కూతుర్ని కిడ్నాప్ చూసి, ఆ కేసులో ఓడిపోవాలని కిడ్నాపర్లు బెదిరిస్తారు. కూతురి కోసం అనురాధ కేసు ఓడిపోయిందా? గెలవడంతో పాటు తన కూతుర్ని దక్కించుకుందా? అనేది మిగతా కథ. ఐశ్వర్యా రాయ్ అద్భుతంగా నటించారు. ఆద్యంతం ఉత్కంఠకు గురయ్యేలా దర్శకుడు సంజయ్ గుప్తా తెరకెక్కించారు’’ అని చెప్పారు. -
చప్పగా 'జజ్బా' కలెక్షన్లు!
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తాజా చిత్రం 'జజ్బా' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సందడి చేయడం లేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఐశ్వర్య కమ్‌బ్యాక్ ఫిలింగా 'జజ్బా'పై ఎన్ని అంచనాలు నెలకొన్నా.. వసూళ్లు మాత్రం అంతగా లేవనే చెప్పాలి. అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా తొలిరోజు (శుక్రవారం) రూ. 4.23 కోట్లు, రెండోరోజు శనివారం 5.49 కోట్లు, ఆదివారం 5.52 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ లో మొత్తంగా రూ. 15.24 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వారమైన కలెక్షన్లు పుంజుకుంటాయంటే అదీ లేదు. గడిచిన సోమవారం ఆ సినిమా రూ. 2.11 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. విదేశీ మార్కెట్లో 1.2 మిలియన్ డాలర్లు (రూ. 7.81 కోట్లు) వసూలు చేసింది. దర్శకుడు సంజయ్ గుప్తా తెరకెక్కించిన 'జజ్బా' సినిమాలో ఐశర్య ప్రధాన పాత్ర పోషించగా.. ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీ, జాకీ ష్రఫ్ ఇతర పాత్రలు పోషించారు. -
'జెజ్‌బా' మూవీ రివ్యూ
టైటిల్ : జెజ్‌బా జానర్ ; థ్రిల్లర్ యాక్షన్ డ్రామా తారాగణం ; ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీ, జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణీ దర్శకత్వం ; సంజయ్ గుప్తా సంగీతం ; సచిన్ జిగార్ నేపథ్య సంగీతం ; అమర్ మొహిలే నిర్మాత ; వైట్ ఫెదర్ ఫిలింస్, వీకింగ్స్ మీడియా & ఎంటర్టైన్మెంట్ ఐదేళ్ల విరామం తరువాత ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమాగా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది జెజ్‌బా. 2007లో రిలీజ్ అయిన సౌత కొరియన్ ఫిలిం 'సెవెన్‌డేస్' ఆధారంగా ఈ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ నేటివిటికి తగ్గట్టుగా అన్ని రకాల మార్పులతో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కిన జెజ్‌బా ఆడియన్స్ ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ : ముంబైలో లీడింగ్ క్రిమినల్ లాయర్ అయిన అనురాధ వర్మ (ఐశ్వర్యరాయ్) పరిచయంతో సినిమా మొదలవుతుంది. తన కెరీర్లో వంద శాతం సక్సెస్‌లతో నెంబర్ వన్ లాయర్ అనిపించుకుటుంది. భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా ఉంటున్న అనురాధ తన కూతురు సాన్యా (సారా అర్జున్) ఆలనాపాలనా కూడా తనే చూసుకుంటుంది. కూతురు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంటుంది. ఒకరోజు స్కూల్లో ఆటల పోటీలు జరుగుతున్న సందర్భంలో సాన్యా కిడ్నాప్ అవుతుంది. అయితే కిడ్నాపర్స్ డబ్బులు అడగటానికి బదులు జైలులో ఉన్న నవాజ్ తరపున కేసు వాదించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. సియా(ప్రియాబెనర్జీ) అనే అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన నేరం మీద నవాజ్ జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఇక చేసేదేమిలేక నవాజ్ తరపున కేసు వాదించటానికి అంగీకరిస్తుంది అనురాధ. అదే సమయంలో అనురాధ స్నేహితుడు, సస్పెండ్ అయిన పోలీస్ అధికారి యోహన్( ఇర్ఫాన్ ఖాన్) ఆమెకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరు కిడ్నాపర్స్ నుంచి సాన్యాను ఎలా బయటికి తీసుకువచ్చారు అన్నదే మిగతా కథ. నటీనటులు : రీ ఎంట్రీ లో ఐశ్వర్యరాయ్ తన వయసుకు తగ్గ కథను ఎంచుకుంది. నటిగా తనలో ఏ మాత్రం పట్టు తగ్గలేదని ఈ సినిమాతో నిరూపించుకుంది. కూతురు కిడ్నాప్ అయిన తరువాత బలవంతంగా ఓ కేసు వాదిస్తున్న లాయర్‌గా అండర్ కరెంట్ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించింది. లాయర్ అనురాధకు సాయం చేసే పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ మెప్పించాడు. కొన్ని సీన్స్‌లో ఇర్ఫాన్ నటన ఆ పాత్రకు తనే అల్టిమేట్ చాయిస్ అనిపించేలా ఉంది. ఇక హత్యకు గురైన యువతి తల్లిగా షబానా అజ్మీ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఐశ్వర్యతో పోటీపడి నటించిన షబానా తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నటించిన జాకీ ష్రాఫ్, సారా అర్జున్, అతుల్ కులకర్ణీ, సిద్ధాంత్ కపూర్ తన పాత్ర పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం సంజయ్ గుప్తా స్క్రీన్ ప్లే. క్రైం థ్రిల్లర్లను తెరకెక్కించటంలో మంచి అనుభవం ఉన్న సంజయ్ మరోసారి ఆ జానర్లో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాలు అభిమానులను రెప్పవేయకుండా చూసేలా చేస్తాయి. ప్రథమార్థం చివరలో సినిమా కాస్త స్లో అయినట్టుగా అనిపించినా సెకండాఫ్ మాత్రం అద్భుతంగా వచ్చింది. సినిమాకు ప్రాణం పోసిన మరో సాంకేతిక నిపుణుడు డైలాగ్ రైటర్ కమలేష్ పాండే. ఎమోషనల్ సీన్స్‌తో పాటు కోర్ట్ సీన్స్‌లోనూ కమలేష్ డైలాగ్స్ చాలా బాగా పేలాయి. ఆడియో పరంగా ఆకట్టుకోకపోయినా అమర్ మొహిలే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన రేంజ్ లో పండించాడు. సమీర్ ఆర్య సినిమాటోగ్రఫి ఆశించిన స్థాయిలో మెప్పించింది. విశ్లేషణ : ఒక మామూలు క్రైమ్ డ్రామాను థ్రిల్లర్‌గా మలిచిన సంజయ్ గుప్త మంచి విజయం సాధించాడు. ఐదేళ్ల విరామం తరువాత వెండితెర మీద దర్శనమిచ్చిన ఐశ్వర్య తన అద్భుతమైన నటనతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. గ్లామర్ షో కోరుకునే వారిని నిరాశపరిచినా, నటన పరంగా మాత్రం బెస్ట్ అనిపించుకుంది. ఇక ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీలు డైరెక్టర్స్ బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నారు. అవార్డ్ ఇన్నింగ్ పర్ఫామెన్స్‌లతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. అయితే ఫస్టాఫ్ చివరలో వచ్చిన కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్‌కు బోర్ కొట్టిస్తాయి. సాంకేతిక విభాగం నుంచి చిన్న చిన్న పొరపాట్లు కనిపించినా జెజ్‌బా సక్సెస్ ఫుల్ సినిమాగా ఆకట్టుకుంది. ప్లస్ పాయింట్స్ ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్‌ఖాన్, షబానా అజ్మీల నటన స్క్రీన్ ప్లే డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మ్యూజిక్ ఓవరాల్ గా జెజ్‌బా ఐశ్వర్యరాయ్‌కి సక్సెస్ఫుల్ కంబ్యాక్ -
ఐష్..అదుర్స్!
అప్పటివరకూ అమ్మాయిలా కనిపించే ఏ స్త్రీ అయినా, అమ్మ అయిన తర్వాత దాదాపు ‘ఆంటీ’లా అయిపోతుంది. అలాగే, ఎంతో కొంత ఫిట్‌గా ఉండేవాళ్లు సైతం ఫార్టీ ప్లస్ ఏజ్‌లో ఫిట్నెస్ కోల్పోతుంటారు. కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. అమ్మ అయ్యాక కూడా అమ్మాయిలా మెరుపు తీగలా ఉండగలుగుతారు. ఫార్టీ ప్లస్ ఏజ్‌లోనూ చక్కని శరీరాకృతితో శిల్పాలను తలపిస్తుంటారు. అందాల తార ఐశ్వర్యా రాయ్ ఈ కోవలోకే వస్తారు. ప్రపంచం మెచ్చిన సుందరి కాబట్టి, అమ్మాయిలా ఉన్నప్పుడూ, అమ్మ అయిన తర్వాత కూడా ఐష్ ఎప్పటిలానే స్లిమ్‌గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. ఐష్ కూడా ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆరాధ్యకు జన్మనిచ్చిన కొన్ని నెలల వరకూ వ్యాయామాల జోలికి వెళ్లకుండా, ఆ తర్వాత మాత్రం కసరత్తులు మొదలుపెట్టారు. ఇక, ‘జజ్బా’ చిత్రం ఒప్పుకున్న తర్వాత అయితే కఠినమైన వర్కవుట్లు చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారా తెరపై కనిపించనున్నారు కాబట్టి, అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచకూడదన్నది ఐష్ తపన. అందుకే, ఎప్పటిలా సన్నగా తయారయ్యారు. ఐష్ ఏ రేంజ్లో ఫిట్‌గా ఉన్నారో ‘జజ్బా’లో ఓ పాట కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ‘కహానియా...’ అని సాగే ఈ పాటలో ఐష్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో యోగా, వ్యాయామాలు చేస్తూ కనిపిస్తారు. ఈ పాటకు సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్నవి అవే. ఐష్ నిజంగా అదుర్స్ కదూ! -
'నేనైతే షూటింగ్‌కు వెళ్లేవాణ్నికాను'
ముంబై: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా అందాలతార ఐశ్వర్య రాయ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఓ తల్లిగా, నటిగా రెండు పాత్రలకు ఐశ్యర్య న్యాయం చేస్తోందని అన్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో 'జజ్బా' చిత్రంలో ఐశ్వర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ విశేషాల గురించి సంజయ్ చెబుతూ.. 'ఓసారి ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు ఒంట్లో బాగలేదు. షూటింగ్ రద్దు చేస్తామని ఐశ్వర్యకు చెప్పాను. అయితే ఆమె అందుకు నిరాకరించి షూటింగ్‌కు వచ్చారు. ఆ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వరకు షూటింగ్ జరిగింది. ఇంతలో ఐశ్వర్య సిబ్బంది వచ్చి ఆమె వాంతి చేసుకుందని చెప్పారు. నేను ఎవరని ఆరా తీయగా ఆరాధ్య అని ఐశ్వర్య సిబ్బంది చెప్పారు. ఆ సమయంలో ఐశ్వర్య కుటుంబం ముంబైలో లేదు. షూటింగ్ రద్దు చేయడం ఇష్టం లేక ఐశ్వర్య తన కూతురును కూడా వ్యాన్‌లో షూటింగ్‌కు తీసుకువచ్చారు. నేనే కనుక ఆమె స్థానంలో ఉండుంటే షూటింగ్‌కు వెళ్లేవాణ్ని కాను' అని ఐశ్వర్య అంకితభావాన్ని ప్రశంసించారు. జజ్బా చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది. -
'జాజ్బా' ట్రైలర్‌కు అనూహ్య స్పందన
-
'నాకు భారతీయ నటి అనిపించుకోవడమే ఇష్టం'
ముంబయి: అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్నా జాతీయ నటి అనిపించుకోవడం తనకు సంతోషాన్నిస్తుందని మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ అన్నారు. మనమంతా ఎప్పటికీ భారతీయులమే అని పేర్కొన్నారు. ఒక వేళ అంతర్జాతీయ వేదికకు తెలిసి ఉన్నా అది మిస్ వరల్డ్ గెలుచుకోవడం ద్వారానో, ఇతర అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారానో అయ్యుంటుందని చెప్పారు. ఆమె నటించిన జజ్బా అనే చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఐశ్వర్య విలేకరులతో మాట్లాడారు. ఈ చిత్రంలో నటించినందుకు తనకు చాలా ఆనందంగా ఎంతోమంది ఈ సినిమాలో ఉన్నారని తెలిపారు. పలువురు నటులతో సినిమాలు తీసే రోజులు రావడం నిజానికి చిత్ర పరిశ్రమలో ఓ కొత్త ఉత్సాహంవంటిదని అన్నారు. జస్బా చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. -
లాయర్‌గా మారిన ఐశ్వర్య
-
నాకు ఆ ఫీలింగే లేదు!
దాదాపు అయిదేళ్ళ గ్యాప్ తరువాత ‘జజ్బాజ్’ చిత్రంతో మళ్ళీ వెండితెర మీదకు వస్తున్న నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఆనందంగా ఉన్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్కు వస్తున్న స్పందనే అందుకు కారణమంటున్నారు. అయితే, ఈ సినిమా తనకు రీ-ఎంట్రీ ఏమీ కాదంటున్నారామె. ‘‘అందరూ నాకిది రీ-ఎంట్రీ అంటున్నారు కానీ, నా మటుకు నాకైతే సినిమా పరిశ్రమకు దూరమైన ఫీలింగేమీ లేదు. నిజానికి, మధ్యలో ఒక సినిమాకు మణిరత్నం నన్ను ఎంచుకున్నారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌పై మణి సార్ రీ-వర్క్ చేస్తున్నారు. అది అలా ఉండగా, ‘జజ్బా’ ఛాన్స్ వచ్చింది’’ అని ఐశ్వర్యారాయ్ వివరించారు. ‘జజ్బా’ మూస తరహా సినిమా కాదంటున్న ఆమె అందులో వకీలు పాత్ర పోషిస్తున్నారు. సింగిల్ మదర్ అయిన లాయర్, కిడ్నాప్‌కు గురైన ఆమె కుమార్తె కథ ఇది. రానున్న అక్టోబర్‌లో సినిమా విడుదల కానుంది. ఐశ్వర్యారాయ్ వెండితెర దర్శనం కోసం అప్పటి దాకా ఆగాల్సిందే! -
మునుపటికన్నా అందంగా...
ఐశ్వర్యా రాయ్ రీ-ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికో శుభవార్త. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాజ్బా’ షూటింగ్ నేడు ఆరంభం అవుతోంది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి రాత్రి తొమ్మిది గంటల వరకూ షూటింగ్ ప్లాన్ చేశారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐష్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె చేయని పాత్ర ఇది. అందుకే, షూటింగ్ ప్రారంభించకముందు కొన్ని వర్క్ షాప్స్ నిర్వహించారు. ఆ సమయంలో ఐష్ తన పాత్రను బాగా అర్థం చేసుకున్నారని సంజయ్ పేర్కొన్నారు. లాయర్ల శారీరక భాష, వారి ప్రవర్తన ఎలా ఉంటాయి? అని సంజయ్ పరిశీలించారట. ఆ విషయాలను ఐష్‌కి చెప్పడంతో, ఆమె కూడా తన శారీరక భాషను మార్చుకున్నారట. ఈ విషయాలను స్వయంగా సంజయ్ చెప్పారు. న్యాయస్థానంలో జరిగే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు. వాడివేడి చర్చలు జరిగే సన్నివేశాల్లో నటనపరంగా ఐష్ విజృంభిస్తారనే నమ్మకం ఉందని సంజయ్ అన్నారు. తల్లి కాకముందు ఎలా ఉండేవారో అదే శరీరాకృతికి ఐష్ చేరుకున్నారట. అలాగే ఈ నాలుగేళ్లూ ఇంటిపట్టున ఉన్నారు కాబట్టి, కొత్త మెరుపుతో మునుపటికన్నా అందంగా ఉన్నారని, ఓ రకమైన ఉద్వేగంతో, ఉత్సాహంతో ఐష్ కనిపిస్తున్నారని సంజయ్ తెలిపారు.