'నాకు భారతీయ నటి అనిపించుకోవడమే ఇష్టం' | Aishwarya wants to be known as national actress | Sakshi
Sakshi News home page

'నాకు భారతీయ నటి అనిపించుకోవడమే ఇష్టం'

Published Tue, Aug 25 2015 8:18 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'నాకు భారతీయ నటి అనిపించుకోవడమే ఇష్టం' - Sakshi

'నాకు భారతీయ నటి అనిపించుకోవడమే ఇష్టం'

ముంబయి: అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్నా జాతీయ నటి అనిపించుకోవడం తనకు సంతోషాన్నిస్తుందని మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ అన్నారు. మనమంతా ఎప్పటికీ భారతీయులమే అని పేర్కొన్నారు. ఒక వేళ అంతర్జాతీయ వేదికకు తెలిసి ఉన్నా అది మిస్ వరల్డ్ గెలుచుకోవడం ద్వారానో, ఇతర అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారానో అయ్యుంటుందని చెప్పారు.

ఆమె నటించిన జజ్బా అనే చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఐశ్వర్య విలేకరులతో మాట్లాడారు. ఈ చిత్రంలో నటించినందుకు తనకు చాలా ఆనందంగా ఎంతోమంది ఈ సినిమాలో ఉన్నారని తెలిపారు. పలువురు నటులతో సినిమాలు తీసే రోజులు రావడం నిజానికి చిత్ర పరిశ్రమలో ఓ కొత్త ఉత్సాహంవంటిదని అన్నారు.  జస్బా చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement