ఐష్‌ కమింగ్‌! | Aishwarya Rai Bachchan Is All Set For Her Instagram Debut | Sakshi
Sakshi News home page

ఐష్‌ కమింగ్‌!

Published Fri, May 11 2018 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Aishwarya Rai Bachchan Is All Set For Her Instagram Debut - Sakshi

ఐశ్వర్యా రాయ్‌

సెలబ్రిటీలు చాలామంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది రజనీకాంత్, మహేశ్‌ బాబు, మమ్ముట్టీ, ఆమిర్‌ ఖాన్‌ వంటి సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ను ఓపెన్‌ చేయడం విశేషం. ఇప్పుడు ఐశ్వర్యా రాయ్‌ ఈ లిస్ట్‌లో చేరనున్నారు. ఇంకా బాలీవుడ్‌లో కరీనా కపూర్, సైఫ్‌ అలీ ఖాన్, కంగనారనౌత్, రాణీ ముఖర్జీ, అదిత్యారాయ్‌ కపూర్‌ వంటి సెలబ్రిటీలు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నారు. మరి.. వీళ్లలో ఎవరైనా భవిష్యత్తులో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఖాతాకు సై అంటారేమో చూడాలి.

అందాల రాశి ఐశ్వర్యా రాయ్‌తో ఇక మీ అభిప్రాయాలను చెప్పుకోవచ్చు. ఆమె జీవితంలోకి తొంగి చూడొచ్చు. ఐశ్వర్యా పర్మిషన్‌ లేకుండానే ఆమె అప్‌లోడ్‌ చేసిన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ లైఫ్‌ లేటెస్ట్‌ ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుని మీ దగ్గర దాచుకోవచ్చు. అదెలా అనుకుంటు న్నారా? విషయంలోకి వస్తే... ఈ రోజు ఆమె ఫోటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయనున్నారని బాలీవుడ్‌ ఖబర్‌. ఓన్లీ ఇండియాలోనే కాకుండా వరల్డ్‌ వైడ్‌గా ఉన్న ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవ్వాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారట.

అంతేకాకుండా.. బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఐశ్వర్యను ఎప్పట్నుంచో సోషల్‌ మీడియాలోకి రావాలని అడుగుతున్నారట. సో.. ఫైనల్‌గా ఐష్‌ ఈజ్‌కమింగ్‌.  అది సరే. కానీ.. ఐశ్వర్యా రాయ్‌ అప్‌లోడ్‌ చేయబోయే ఫస్ట్‌ ఫొటో ఏమై ఉంటుందబ్బా అని చాలామంది అప్పుడే ఊహల్లో తేలిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 8 మొదలైన కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఐశ్వర్య పాల్గొననున్నారు. 71వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 17వ సారి ఐశ్వర్య రెడ్‌ కార్పెట్‌పై నడవనుండటం విశేషం. ఇక ఐశ్వర్యా రాయ్, అనిల్‌ కపూర్, రాజ్‌కుమార్‌ రావ్‌ ముఖ్యతారలుగా రూపొందిన ‘ఫ్యాన్నీఖాన్‌’ జూలైలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement