Kangana Ranaut Calls Tunisha Sharma Death A Murder - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ఆమెది హత్యే.. మరణశిక్ష విధించాల్సిందే: కంగన

Published Wed, Dec 28 2022 9:50 PM | Last Updated on Thu, Dec 29 2022 9:19 AM

Kangana Ranaut calls Tunisha Sharma death a murder - Sakshi

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల బుల్లితెర నటి తునిషా శర్మ ఆత్మహత్యపై ఆమె స్పందించారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీలో యువనటి తునిషా శర్మ ఆ‍త్మహత్య ఘటనను ప్రస్తావించింది.  ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ తెగ వైరలవుతోంది.

ఇన్‌స్టా స్టోరీలో కంగనా రాస్తూ.. 'ఒక మహిళ అన్నింటినీ తట్టుకోగలదు. ప్రేమలో విఫలమైనా, వివాహా బంధంలో సమస్యలనైనా ఎదుర్కోగలదు. కానీ మహిళకు నిజమైన ప్రేమ లభించడంలేదు. ఆడవారిని శరీరకంగా, మానసికంగా కుంగదీస్తున్నారు. వారికి ఎదురయ్యే అనుభవాలు మహిళల కలలుప్రభావితం అవుతున్నాయి.  మన ఆడపిల్లలను మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపైన కూడా ఉంది. స్త్రీలకు భద్రత లేని భూమి వినాశనానికి గురవుతుంది.' అంటూ ఘాటుగా పోస్ట్ చేసింది. 

మహిళలపై యాసిడ్‌ దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని కంగనా డిమాండ్ చేసింది. అలాంటి వారిపై ఎలాంటి కనికరం లేకుండా మరణశిక్ష విధించాలని కోరింది. చట్టపరమైన, ఆర్థిక మోసాలను ఎలా పరిగణిస్తారో.. భావోద్వేగ మోసాలపై కూడా అదేవిధంగా ప్రవర్తించాలన్నారామె. ఇలాంటి రూమర్స్‌ అని కొట్టిపారేస్తారని.. అవి మనిషికి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో వారికి మాత్రమే తెలుస్తుందన్నారు. కొందరికి పక్కవారి ఎమోషన్స్‌ హాస్యాస్పదంగా అనిపించినా.. కానీ సున్నితమైన మనసు గల వారిపై అవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కంగనా రనౌత్ పేర్కొంది. 

ఇక సినిమాల విషయానికొస్తే చంద్రముఖి సినిమా సీక్వెల్ ‌‘చంద్రముఖి 2’లో నటిస్తోంది.  దీనితో పాటు‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటిస్తోంది. . ఈ చిత్రంలో ఆమె ‘ఇందిరా గాంధీ’ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. అలాగే ‘తేజస్‌’ సినిమాతో పాటు బినోదినీ దాస్‌ బయోపిక్‌లోనూ కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement