
బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. బీటౌన్‌లో తన కామెంట్స్‌తో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత ఎన్నికల్లో భాజపా ఎంపీగా గెలిచిన కంగనా ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో తలెత్తిన ఎమర్జన్సీ నేపథ్యంలో తెరకెక్కించారు.
అయితే తాజాగా కంగనా రనౌత్ బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లను ఎదగనివ్వరని షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ అంతా ఈర్ష్య, అసూయలతో నిండిపోయిందని ఆరోపించారు. అందువల్లే చాలామంది కెరీర్స్ నాశనమయ్యాయని పేర్కొంది. ఎదగాలనుకునే వారికి బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన వేదిక కాదన్నారు. ఒకవేళ ఎవరైనా తమ టాలెంట్‌తో పైకి వస్తే.. వారిని టార్గెట్ చేసి, పరువు తీసి తొక్కేస్తారని కంగనా వివరించింది. అలాగే తనపై కొంతమంది అసూయతో ఉన్నారని తెలిపింది.
కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఎమర్జెన్సీ' సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే ముఖ్య పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment