కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా? | Kangana Ranaut Emergency likely to release after Punjab elections | Sakshi
Sakshi News home page

Emergency: కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?

Published Wed, Oct 16 2024 12:34 PM | Last Updated on Wed, Oct 16 2024 4:49 PM

Kangana Ranaut Emergency likely to release after Punjab elections

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్‌ రోల్‌లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు.

తాజా సమాచారం  ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. 

 ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్‌ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్‌ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అందువల్లే పంజాబ్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement