ఆ ధైర్యం నీలో ఉంది కాబట్టే.. | Aishwarya Rai Completes Two Decades In Industry | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యకు అందాల నటి లేఖ

Published Sat, Mar 17 2018 4:21 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Aishwarya Rai Completes Two Decades In Industry - Sakshi

బాలీవుడ్‌ భామ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, అందాల నటి రేఖ

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ భామ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. ఈ నీలి కళ్ల సుందరికి ఇండస్ట్రీలోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. చిత్రసీమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలైన  సందర్భంగా ఐశ్వర్యకు అలనాటి అందాల నటి రేఖ ఓ అందమైన లేఖ రాశారు. ‘నీవు చెప్పింది, చేసేది ప్రేక్షకులు మర్చిపోవచ్చేమో కానీ.. నీ అభినయంతో వారిని కట్టిపడేసిన తీరును మాత్రం ఎప్పుడూ మర్చిపోరు’ అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

‘నీవు ప్రవహించే నదిలాంటి స్త్రీవి. గమ్యస్థానానికి తనకు తానుగా చేరుకునే ధీశాలివి. ఇన్నేళ్లుగా ప్రస్థానం కొనసాగించాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీలో ఉంది కాబట్టే.. ఎందరికో ఆదర్శంగా నిలిచావు. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఎన్నో ఆటుపోట్లను దాటుకుని ఈ స్థాయికి ఎదిగావు. చిన్ని చిన్ని మాటలతో నన్ను ఎంతగానో ఆకర్షించే ఆరాధ్యకు జన్మనివ్వడం ద్వారా పరిపూర్ణమైన స్త్రీగా మారావు. సినిమాల్లో నువ్వు ఎన్నో పాత్రలు పోషించావు. వాటన్నిటికంటే నిజజీవితంలోని అమ్మ పాత్రే నన్ను కట్టిపడేస్తోంది. ఇలాగే ప్రేమను పంచుతూ.. అద్భుతాలు ఆవిష్కరిస్తూ కలకాలం వర్ధిల్లు’ అంటూ ఎంతో కవితాత్మకంగా సాగింది రేఖ లేఖ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement