శ్రీమతికొక సినీ బహుమతి | Abhishek to do cameo in Aishwarya's comeback film Jazba | Sakshi
Sakshi News home page

శ్రీమతికొక సినీ బహుమతి

Published Wed, Apr 1 2015 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

శ్రీమతికొక సినీ బహుమతి

శ్రీమతికొక సినీ బహుమతి

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మరి, స్త్రీ విజయం వెనుక...? పురుషులూ ఉంటారు. కావాలంటే, కొద్దికాలం విరామం తరువాత మళ్ళీ తెరపై మెరవడానికి సిద్ధమవుతున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను అడిగి చూడండి. సంజయ్ గుప్తా రూపొందిస్తోన్న ‘జజ్‌బా’ ద్వారా ఐశ్వర్యారాయ్ మరోసారితెరపైకి వస్తున్నారు. ఆ సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేకత కూడా వచ్చి చేరింది. భార్య ఐశ్వర్యారాయ్ కోసం భర్త అభిషేక్ బచ్చన్ సైతం ఆ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ‘‘ఇవాళ్టి షూటింగ్‌లో బోలెడంత ఉత్సాహం చోటుచేసుకుంది.
 
 ‘జజ్‌బా’లోని ఒక ప్రత్యేక పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు’’ అని సంజయ్ గుప్తా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిజానికి, అభిషేక్, ఐశ్వర్యారాయ్‌ల మధ్య కెమిస్ట్రీ మణిరత్నం రూపొందించిన ‘గురు’, ‘రావణ్’ చిత్రాల్లో తెరపై కనువిందు చేసింది. కొంత విరామం తరువాత మళ్ళీ ఈ సినిమాలో ఆ జంట కనువిందు చేస్తుందన్న మాట. ఇర్ఫాన్ ఖాన్, షబానా ఆజ్మీ లాంటి ప్రముఖులు కూడా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. మొత్తానికి, భార్య పురోభివృద్ధి కోసం భర్త అండగా నిలవాలనడానికి, అభిషేక్, ఐశ్వర్యల జంటే ఉదాహరణ కదూ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement