
‘‘డ్రింకర్ సాయి’లో ఒక మంచి ప్రేమకథను చూస్తారు. ఈ సినిమాలో బాగీ పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ఐశ్వర్యా శర్మ తెలిపారు. ధర్మ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యా శర్మ మాట్లాడుతూ– ‘‘మా నాన్న స్టేజ్ యాక్టర్ కావడంతో నేనూ ఆర్టిస్టుగానే ఉండాలనుకున్నాను. ఇంటర్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. కొన్ని యాడ్స్‌లో నటించాను. ‘డ్రింకర్ సాయి’తో హీరోయిన్‌గా పరిచయమవుతున్నాను. ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ బాగీ పాత్ర చేశాను. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అందుకే ఈ స్టూడెంట్ క్యారెక్టర్ సవాల్‌గా అనిపించింది. ఇక ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికీ, ‘డ్రింకర్ సాయి’ సినిమాకు పోలిక లేదు’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment