
Kasturi Serial Heroine Aishwarya Gets Emotional: ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు కనిపిస్తుంటాయి. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్విని తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. స్టార్‌మాలో ప్రసారం అవుతున్న ‘కస్తూరి’, ‘C/O అనసూయ’సీరియల్స్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి), ఐశ్వర్య(కస్తూరి)లు తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయ్యారు.
చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. 'ఇంటర్‌లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. 'నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయకండి ప్లీజ్' అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment