అక్షయ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా, మరో హీరోయిన్ మమితా బైజు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా చేసిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్–నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు.
‘లైక్ ఎందుకు లవ్ అని చెప్పు’, ‘ఎల్లప్పుడూ విశ్వాసంతో నన్ను పూజిస్తుంటారో... వారికి నేనెప్పుడూ అండగా ఉంటాను’ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదటి వంద టికెట్లు బుక్ చేసిన వారిలో ఒకర్ని ఎంపిక చేసి, క్యాష్ బ్యాక్ కింద రూ. పదివేలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment