hero srikanth
-
లవ్ అని చెప్పు...
అక్షయ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా, మరో హీరోయిన్ మమితా బైజు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా చేసిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్–నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ‘లైక్ ఎందుకు లవ్ అని చెప్పు’, ‘ఎల్లప్పుడూ విశ్వాసంతో నన్ను పూజిస్తుంటారో... వారికి నేనెప్పుడూ అండగా ఉంటాను’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదటి వంద టికెట్లు బుక్ చేసిన వారిలో ఒకర్ని ఎంపిక చేసి, క్యాష్ బ్యాక్ కింద రూ. పదివేలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
అల్లు అర్జున్ ను కలిసిన శ్రీకాంత్
-
అట్లాంటాలో తెలుగువారిని చూసి శ్రీకాంత్ సంతోషం
-
పిల్లలు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు: శ్రీకాంత్
హీరో శ్రీకాంత్‌తో మూడునాలుగు సినిమాలే చేసింది ఊహ. అప్పటివరకు ఆన్‌స్క్రీన్‌పై జోడీ కట్టిన ఆమె రియల్ లైఫ్‌లోనూ తనతో జత కట్టింది. శ్రీకాంత్‌ను పెళ్లాడింది. వీరి పెళ్లయి దాదాపు పాతికేళ్లవుతోంది. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరమైంది. ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. ఊహ సినిమాలు మానేయడానికి గల కారణంపై తాజాగా శ్రీకాంత్ స్పందించాడు.అది తన నిర్ణయమేఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'సినిమాలు మానేయమని ఊహకు మేమెవరం చెప్పలేదు. తనే వద్దనుకుంది. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుంది. సినిమాలకు దూరమవ్వాలన్నది కేవలం తన నిర్ణయమే! ముగ్గురు పిల్లలు (రోషన్, మేధ, రోహన్) పుట్టాక వాళ్లే తన ప్రపంచమైపోయింది. ఏమాటకామాట.. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం పెద్ద అదృష్టం. ఊహను పెళ్లి చేసుకున్న క్షణాలు నా జీవితంలోనే బెస్ట్.ఎక్కడా పేరు చెప్పుకోరుపిల్లల విషయానికి వస్తే.. రోషన్ సైకాలజీ చదివాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. నేను శ్రీకాంత్ కుమారుడిని అని ఎక్కడా చెప్పుకోడు. నా కూతురు మేధ కెనడాలో చదువుతోంది. అక్కడున్న తెలుగువారితో ఎన్నడూ కూడా శ్రీకాంత్ మా నాన్న అని చెప్పలేదు. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా వీళ్లు నా పేరు ఉపయోగించుకోరు. శ్రీకాంత్ వాళ్ల అబ్బాయిని అని రికమండేషన్ చేయించుకోరు. వాళ్లంతట వాళ్లే సొంతంగా ఎదగాలని కష్టపడతారు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే? -
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
-
Chiranjeevi Srikanth Latest Photos: శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కేక్ కట్ చేయించిన మెగాస్టార్ (ఫోటోలు)
-
మరి అన్నయ్యంటే ఏమనుకున్నారు.. తన ప్రేమ అమృతం!
మెగాస్టార్ చిరంజీవికి అంతటా అభిమానులే! ఇండస్ట్రీలో కూడా ఆయన్ను ఆరాధించేవారు ఎంతోమంది! వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మెగాస్టార్‌ను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్‌దాదా జిందాబాద్ చిత్రాలు ఎంతలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే! ఈ సినిమాల తర్వాత ఈ అన్నదమ్ములు మరింత క్లోజయ్యారు. ఈరోజు(మార్చి 23న) శ్రీకాంత్ బర్త్‌డే.. అది గుర్తుపెట్టుకుని మరీ చిరంజీవి స్వయంగా అతడి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేనా? స్వయంగా కేక్ కట్ చేయించి తినిపించాడు. కేక్ మీద హ్యాపీ బర్త్‌డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం హైలైట్‌గా మారింది. తర్వాత శ్రీకాంత్ ఫ్యామిలీతో కాసేపు సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. The Dada-ATM combo was clicked as the Mega Star @KChiruTweets visited @actorsrikanth 's home to celebrate the actor’s birthday! 😍😍#Chiranjeevi #MegastarChiranjeevi #ActorSrikanth #RoshanMeka pic.twitter.com/MDrO1YwxCc — Dileep Kumar (@chirufanikkada1) March 23, 2024 చదవండి: హిట్ సినిమాల చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేంటి ఇంతందంగా మారిపోయింది! -
Srikanth Family Visits Tirumala: ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో శ్రీకాంత్ (ఫోటోలు)
-
ఆ సినిమా తర్వాత నా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది: హీరో శ్రీకాంత్
హీరో శ్రీకాంత్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోలకే గట్టి పోటీనిచ్చాడు. అయితే రానురానూ శ్రీకాంత్ కెరీర్ డల్ అయింది. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న శ్రీకాంత్ టాలీవుడ్లో సెంచరీ మార్క్‌ను సులువుగా దాటేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడంపై స్పందించాడు. 'ఆమె సినిమా హిట్టయింది. అప్పటికే తాజ్‌మహల్, పెళ్లి సందడి సినిమాలు కమిటయ్యాను. వాటితో పాటు ఆహ్వానం, వినోదం వంటి చిత్రాలన్నీ వరుసగా హిట్టయ్యాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఆ తర్వాత చేయడానికి మూడు సినిమాలు రిలీజ్‌గా ఉండేవి. హిట్ పడగానే పెద్దపెద్ద బ్యానర్లు వచ్చేవి. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి ఈ పెద్ద బ్యానర్లు వెనక్కు వెళ్లిపోయేవి. మహాత్మ(2009) సినిమా తర్వాత నాకు పెద్ద దెబ్బ పడింది. ఇది నా వందో సినిమా. దీని తర్వాత నా కెరీర్ నెమ్మదిగా కిందకు పడిపోయింది. మహాత్మ తర్వాత ఓ పాతిక సినిమాలు చేశాను. కానీ ఏదీ విజయం సాధించలేదు. బహుశా టైం బ్యాడేమో.. కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: తెలుగింటి హీరోయిన్.. అందంగా లేదని వెక్కిరించినవాళ్లే కుళ్లుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. -
కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఏంటంటే?
ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్, కానిస్టేబుల్ రవిగా రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించింది. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమాకు రివ్యూ ఇచ్చిన శ్రీవిష్ణు దీంతో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉందంటున్నారు. శ్రీకాంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందంటున్నారు. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటున్నారు. హీరో శ్రీవిష్ణు సైతం సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 'పోలీసుల్ని పోలీసులే ఛేదించడం.. శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు టెర్రిఫిక్‌గా ఉన్నాయి' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఆ సన్నివేశాలు గూస్బంప్స్.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సైతం ఈసినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. 'శ్రీకాంత్, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు పిల్లి- ఎలుకల కొట్లాటలా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలే ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్‌గారు గుర్తుండిపోయే పాత్ర చేశారు. అతడి పర్ఫామెన్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి అందరికీ కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. వాటికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నిర్మాతల గుండెధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే' అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. Fantastic #KotaBommaliPS Every scene pure Mass 🔥 Must watch everyone pic.twitter.com/tZo484lviq — RC Varagani 🔥 (@VaraganiSaikum2) November 24, 2023 Mental Mass Entertainer#KotaBommaliPS Worth Watching Movie 👌🔥🔥🔥 pic.twitter.com/ZJIK2KsHvA — Cherry 🍒 (@Rammm755) November 24, 2023 Mind Blowing #KotaBommaliPS 🔥🔥🔥🔥 Best Movie Avuthundhi E year Lo Don't Miss It pic.twitter.com/cy6RFY20t1 — Kranthi 🔥 (@iamkranthi99) November 24, 2023 Movie chala bagundhi very interesting and thrilling go and Watch#KotaBommaliPS pic.twitter.com/cTgQvoh6sQ — Sweety 🦚 (@Pravallika7C) November 24, 2023 Gripping Screenplay 💥 Twists kuda next level unayi #KotaBommaliPS pic.twitter.com/pbFUW5oEY7 — Ramcharan tej (@Ramcharan14377) November 24, 2023 USA is reporting positive things about #KotaBommaliPS❤️🔥Applause for the amazing performances, gripping story, and intense drama is universal 👏 — Rainbow 💞 (@_AAnshu_) November 24, 2023 Watched #KotabommaliPS an intruding movie to watch on the big screens done by @DirTejaMarni . The unique plot of police chasing police and the scenes between @actorsrikanth Garu and @varusarath5 Garu are terrific.@Rshivani_1, @ActorRahulVijay & Each of the performances is… — Sree Vishnu (@sreevishnuoffl) November 23, 2023 I just finished watching the film #KotaBommaliPS. The screenplay between #Srikanth and #VaralaxmiSarathkumar, as well as their cat and mouse game, will have everyone glued to their seats in the theatres. After a long time, #Srikanth garu got a remarkable character, and his… — Harish Shankar .S (@harish2you) November 23, 2023 చదవండి: అమర్‌దీప్‌కు ఫిట్స్.. తనకు ఆ అనారోగ్య సమస్య ఉందన్న నటుడు -
క్రికెట్ గాడ్ సచిన్‌తో ఉన్న ఈ తెలుగు హీరోను గుర్తుపట్టారా?
పై ఫోటోలో ఉన్న పిల్లాడిని గుర్తుపట్టారా? క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రేమగా పట్టుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా సైమా అవార్డు సైతం అందుకున్నాడు. శ్రీలీలతోనూ ఓ సినిమా చేశాడు. ఇతడి తండ్రిటాలీవుడ్లో సీనియర్ నటుడు.. ఈపాటికే ఇతడెవరో గుర్తుపట్టే ఉంటారు. తొలి సినిమాతోనే క్రేజ్ సచిన్ టెండూల్కర్‌తో ఉన్న ఆ పిల్లాడు మరెవరో కాదు.. సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేక. శ్రీకాంత్ ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తండ్రిలోని నటనను పుణికి పుచ్చుకున్న రోషన్ రుద్రమదేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. నిర్మల కాన్వెంట్‌తో హీరోగా మారాడు. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం రిలీజైన ఐదేళ్ల తర్వాత పెళ్లి సందD మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభించింది. ఇప్పుడేం చేస్తున్నాడు? ప్రస్తుతం రోషన్.. వృషభ సినిమా చేస్తున్నాడు. ది వారియర్ అరైజ్ అనేది ఉపశీర్షిక. ఇందులో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Roshann meka (@iamrshn) View this post on Instagram A post shared by Roshann meka (@iamrshn) చదవండి: మంజుల ఇల్లు చూశారా? ఇంటీరియర్ అదిరింది.. ఏకంగా ఆరు బాల్కనీలు.. -
నాకు నచ్చిన హీరోయిన్ తనే: హీరో శ్రీకాంత్
-
సమాజానికి ఉపయోగపడే సినిమా
‘‘తల్లిదండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే ఆ పిల్లలు సమాజానికి ఎలా హానికరంగా తయారవుతారనే ‘డర్టీ ఫెలో’ కథ నాకు బాగా నచ్చింది. సమాజానికి ఉపయోగపడేలా మూర్తి సాయి ఈ సినిమాను తీశాడు. శాంతి చంద్రలాంటి వ్యాపారవేత్తలు ఇండస్ట్రీకి రావాలి’’ అన్నారు శ్రీకాంత్ . శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రిత్ బతీజా హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘మా సినిమా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు శాంతి చంద్ర. ‘‘ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ఆడారి మూర్తి సాయి. -
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
‘నాతో నేను’ రెట్రో సాంగ్ వినగానే పాత రోజులు గుర్తొచ్చాయి: శ్రీకాంత్
‘‘నాతో నేను’ చిత్రంలోని రెట్రో సాంగ్ వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ పాటను తీర్చిదిద్దారు’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రల్లో శాంతకుమార్ తూర్లపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ఈ పాట చూస్తే ప్రేక్షకులు 1980 జ్ఞాపకాల్లోకి వెళతారు’’ అన్నారు శాంతకుమార్. ‘‘త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ప్రశాంత్ టంగుటూరి. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, నేపథ్య సంగీతం: ఎస్ చిన్న, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి. -
సర్దార్ నాకు పోటీ వచ్చినా పర్లేదు..‘మిస్టేక్’ హిట్టుకొట్టాలి: శ్రీకాంత్
‘‘అభినవ్ సర్దార్ చాలా రంగాల్లో విజయం సాధించాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ, ‘మిస్టేక్’ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా మారాడు. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ‘మిస్టేక్’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’. విలన్‌గా సర్దార్ నాకు పోటీ వచ్చిన పర్లేదు కానీ ఈ చిత్రం విజయం సాధించాలి’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టేక్’. అభినవ్ సర్దార్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘భరత్ చెప్పిన కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ సినిమా నిర్మించాను’’ అన్నారు అభినవ్ సర్దార్. ‘‘జూలైలో ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు భరత్ కొమ్మాలపాటి. -
ఫ్యామిలీ వెడ్డింగ్‌లో శ్రీకాంత్,గోపీచంద్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఊహాతో విడాకులు.. మరోసారి స్పందించిన శ్రీకాంత్
టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు శ్రీకాంత్- ఊహ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై గతంలోనే హీరో శ్రీకాంత్ స్పందించారు. గురువారం మార్చి 23న శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఊహా విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాస్తున్నారని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ మాట్లాడుతూ..'సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై సోషల్ మీడియాలో ఎలా పడితే అలా రాసేస్తున్నారు. కొన్ని వార్తలు మరీ దారుణంగా కూడా ఉంటున్నాయి. ఒకసారి నేను మరణించినట్టు ఫొటో పెట్టేశారు. అలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది. నేను తట్టుకున్నా.. ఫ్యామిలీకి తెలిస్తే తట్టుకోలేరు. అలాంటి షాక్ న్యూస్ వింటే ఏదైనా అనర్థం జరగొచ్చు. అలా వార్తలు రాసేవారిలోనే మార్పు రావాలి. నేను డైవర్స్ తీసుకుంటున్నట్లు వదంతులు సృష్టించారు. వాటితో మేం కలిసి వేడుకలకు వెళ్లాల్సి వస్తోందన్నారు నవ్వుతూ. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాలంటే నా భార్యకు పెద్దగా ఇష్టముండదు. ఆ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. కోట శ్రీనివాసరావు మరణించారని రూమర్స్ చూసి షాక్‌కు గురయ్యా.' అని అన్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం శ్రీకాంత్ సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన వారసుడు, హంట్ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ఆర్సీ15, ఎన్టీఆర్30 చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
'సుందరాంగుడు' టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్
ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబయ్యాడు. లవ్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎమ్ఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేరట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 'సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ' టైటిల్ సాంగ్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో కృష్ణసాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎంతో ఇష్టంతో సుందరాంగుడు సినిమాలో నటించారు. సినిమా రష్ చూశాను చాలా క్వాలిటిగా తీశారు. ఈ సినిమా యూనిట్ సభ్యులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అని అన్నారు. -
పాపతో పైలం అంటున్న సుధీర్ బాబు.. 'హంట్' క్రేజీ అప్డేట్
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హంట్'. ఈ మూవీ ద్వారా యువ దర్శకుడు మహేశ్ పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి 'పాపతో పైలం' అంటూ సాగే ఐటమ్ సాంగ్ గ్లింప్స్ (ప్రోమో) రిలీజ్ చేసింది చిత్రబృందం. (చదవండి: సుధీర్ బాబు 'హంట్' అప్డేట్.. టీజర్ రిలీజ్ ఆరోజే..!) ఈ సాంగ్‌లో సుధీర్ బాబు, అప్సర రాణిలతో పాటు నటుడు భరత్ కూడా అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఈ సాంగ్ ప్రోమో చూస్తే మాస్ స్టెప్పలతో ఊర్రూతలూగిస్తోంది. ఫుల్ లిరికల్ సాంగ్ రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ మంచి విజయం అందుకుంది. -
అర్జున్ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్'. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. 'అతను అర్జున్ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్ బీ. అర్జున్ ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా అర్జున్ ‘బీ’కి తెలియవు.. వారిద్దరు విభిన్న వ్యక్తులు' అంటూ మంజుల చెప్పే సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. అర్జున్ 'ఏ'కు తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ ఇవన్నీ అర్జున్ 'బీ'కి కూడా ఉన్నాయి' అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అనే శ్రీకాంత్ డైలాగ్ మరింత హైప్ పెంచుతోంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కానీ అర్జున్ 'ఎ'గా ఉండటమే అతనికి ఇష్టం! మరి అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే. -
షూటింగ్లో హీరో శ్రీకాంత్‌తో నాకు గొడవ అయ్యింది : హీరోయిన్
'చాలా బాగుంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మాళవిక. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో అలరించిన మాళవిక ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. సుమారు12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మాళవిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. రీసెంట్‌గానే పుష్ప సినిమా చూశానని, అందులో సమంత చేసినట్లు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది. ఇక ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా బాగుంది సినిమాలో హీరో శ్రీకాంత్‌కి, గొడవ జరిగిందని తెలిపింది. 'ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవడంతో నాకు అంత కంఫర్ట్ లేదని చెప్పాను. దీంతో శ్రీకాంత్ షూటింగ్ మధ్యలోంచి వెళ్లిపోయారు. ఇక ఈ సినిమాలో అత్యాచారం సీన్లో నటించినందుకు ఇప్పటికీ చాలా డిస్ట్రబ్‌గా అనిపిస్తుంది. హిందీలో కూడా సీయూ ఎట్9 చిత్రంలో ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడంతో పేరెంట్స్ కోప్పడ్డారు. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా' అని మాళవిక చెప్పుకొచ్చింది. -
‘అప్పుడు డిప్రెషన్లోకి వెళ్లిపోయా, సినిమాలు వదిలేయాలనుకున్నా’
హీరో శ్రీకాంత్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రీకాంత్ స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు పరిశ్రమంలో విలన్‌గా, నటుడిగా, హీరోగా అలరించాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సహజమైన నటన, స్టైల్‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా సోలోగా వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు శ్రీకాంత్. కనీసం ఏడాదికి 5 నుంచి 6 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే శ్రీకాంత్ గత కొద్ది రోజులు సినిమాలు చేయడం లేదు. ఈ మధ్య కాస్తా సినిమాలు తగ్గించిన ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో తాను డిప్రెషన్‌కు గురయ్యానని చెప్పాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో ఒక్కసారిగా డౌన్ అయ్యానంటూ గతంలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అప్పుడు హీరోగా నా కెరీర్ పీక్స్‌లో ఉంది. అలాంటి సమయంలో ఒకే ఏడాది నేను నటించిన 7 సినిమాలు పరాజయం అయ్యాయి. నా కెరీర్ అప్పుడే ముగిసిందా అని భయం వేసింది. హీరోగా నా ప్రయాణం ముగిసిపోయిందా?, నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తాయి. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. దీంతో ఇలా ఉంటే కష్టమని నిర్ణయించుకుని తిరిగి మా ఊరెళ్లిపోవాలనుకున్న. అక్కడ వ్యవసాయం చేసుకుని సెటిలైపోయిదామని డిసైడ్ అయ్యాను. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నన్ను ఓదారుస్తూ ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నాకు ఓదార్పునిచ్చాయి. ఆయన ఇచ్చిన ప్రేరణతోనే మళ్లీ సినిమాలు చేస్తూ నా కెరీర్‌ను కొనసాగించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పరిశ్రమలో తను అత్యంత ఇష్టపడే వ్యక్తి, సన్నిహితుడు మెగాస్టార్ చిరంజీవి అని శ్రీకాంత్ ఇప్పటికే పలు ఈవెంట్స్, సినీ వేడుకల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ను శ్రీకాంత్ అన్నయ్య అని పిలుస్తుంటాడు. ఇదిలా ఉండగా తన పెద్ద కుమారుడు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’ మూవీతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం రోషన్ రాఘవేంద్ర రావు డైరెక్షన్లో ‘పెళ్లి సందD’ మూవీ చేస్తున్నాడు. ఇది శ్రీకాంత్ గతంలో నటించిన ‘పెళ్లి సందడికి’ సిక్వెల్‌గా తెరకెక్కుతోంది. -
విన్నర్ ఎవరో తేల్చేసిన హీరో శ్రీకాంత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ ఎవరనేది మరో రెండు వారాల్లో తేలనుంది. ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాలన్న కసితో ఇంటిసభ్యులు గేమ్‌పై ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎలాగైనా గెలిపించాలన్న తపనతో అభిమానులు కూడా ఓట్ల ప్రచారం చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం వీరికి తోడుగా నిలుస్తున్నారు. అయితే ముందు నుంచీ కూడా అభిజితే గెలుస్తాడన్న బలమైన ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. తాజాగా హీరో శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి కన్నా అభిజిత్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. అతడితో పాటు అరియానా, అఖిల్. సోహైల్, హారిక టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారమైతే అభిజిత్ విన్నర్ అవుతాడని అనిపిస్తోందని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఇప్పటికే నాగబాబు అభిజిత్‌కు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా అభికే తమ ఓటని తేల్చి చెప్పారు. (చదవండి: రంగంలోకి దిగిన ‘నారప్ప’... టీజర్ అప్పుడే) కాగా శ్రీకాంత్‌కు బిగ్‌బాస్ షో అంటే ఎంతో ఇష్టం. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ బిగ్‌బాస్‌ను చూస్తుంటారు. గతేడాది ఆయన బిగ్‌బాస్ మూడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా వెళ్లారు. కంటెస్టెంట్లతో డీల్ కుదిర్చేందుకు వెళ్లారు కానీ, ఎవరూ దానికి అంగీకరించలేదు. ఇప్పుడు నాల్గో సీజన్‌ను కూడా ఆయన బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అభితో ఉండట్లేదని హారికను తిడుతున్న నెటిజన్లు) -
మిషన్ 2020
నవీన్‌చంద్ర హీరోగా నటించిన చిత్రం ‘మిషన్ 2020’. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమిది. శ్రీమిత్ర అండ్ మైవిలేజ్ సమర్పణలో బన్నీ క్రియేషన్స్, మధు మృధు ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి. కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్. రమేష్‌రాజు నిర్మాతలు. కరణం బాబ్జి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా నటించిన ‘మెంటల్ పోలీస్’, ‘ఆపరేషన్ 2019’ సినిమాలకు కరణం బాబ్జి దర్శకత్వం వహించి, ఆ చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ‘మిషన్–2020’ కథ చాలా బావుంది. ఈ ఏడాది 2020 సినిమా పరిశ్రమకు పెద్ద సంక్షోభం, ‘మిషన్ 2020’ సినిమా ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. కరణం బాబ్జి మాట్లాడుతూ– ‘‘నాకు హీరో శ్రీకాంత్‌గారు సెంటిమెంట్. నవీన్‌చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ రెడ్డిగారు అంకితభావంతో నటించారు. శ్రీరాపాక గారు రాసిన ఐటమ్ సాంగ్‌తో శనివారం సినిమా షూటింగ్ పూర్తయింది. 2020లో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలతో పాటు, సంగీత దర్శకుడు ర్యాప్రాక్ షకీల్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.