
ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి: శ్రీకాంత్
కర్ణాటక : ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సినీనటుడు శ్రీకాంత్ అభిప్రాయ పడ్డారు. ఆదివారం ఆయన కర్ణాటక రాష్ట్రం పావగడలోని శనైశ్చరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. హోదా కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాడాల్సిందేనన్నారు. అప్పుడే భావితరాలకు మంచి జరుగు తుందన్నారు. అంతకుముందు ఆయన దొడ్డబళ్లాపురంలోని ఘాటీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు.