ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. | AP Tenth exam results Declared | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 4:13 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

AP Tenth exam results Declared - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. తొలుత ఏయూలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్‌సైట్లలో ఫలితాలను చూడవచ్చు.

  • మొత్తం హాజరైన విద్యార్థులు : 6,13,378
  • ఉత్తీర్ణత శాతం : 94448
  • మొదటి స్థానం : ప్రకాశం జిల్లా (97.93 శాతం )
  • చివరి స్థానం : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (80.37 శాతం)
  • బాలుర ఉత్తీర్ణతా శాతం : 94.41
  • బాలికాల ఉత్తీర్ణతా శాతం : 94.56
  • వంద శాతం ఉత్తీర్ణత సాధించిని పాఠశాలలు : 5,340
  • సున్నా శాతం ఉత్తీర్ణత పొందిన పాఠశాలలు : 17
  • ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం : 78.35
  • 10జీపీ సాధించిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులు : 26,475
  • 10జీపీ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు : 3745

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement