సాక్షి, విశాఖపట్నం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.
తొలుత ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్‌సైట్లలో ఫలితాలను చూడవచ్చు.
ఏపీ టెన్త్ ఫలితాలు నేడే..
Published Sun, Apr 29 2018 3:14 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment