![Sundarangudu Movie Title Song Launched By Hero Srikanth - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/13/srikanth.jpg.webp?itok=6s3iqYht)
ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబయ్యాడు. లవ్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎమ్‌ఎస్‌కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేరట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 'సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ' టైటిల్ సాంగ్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో కృష్ణసాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎంతో ఇష్టంతో సుందరాంగుడు సినిమాలో నటించారు. సినిమా రష్ చూశాను చాలా క్వాలిటిగా తీశారు. ఈ సినిమా యూనిట్ సభ్యులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment