‘నాతో నేను’ రెట్రో సాంగ్‌ వినగానే పాత రోజులు గుర్తొచ్చాయి: శ్రీకాంత్‌ | Hero Srikanth Launching Natho Nenu Lyrical Retro Song | Sakshi
Sakshi News home page

‘నాతో నేను’ రెట్రో సాంగ్‌ వినగానే పాత రోజులు గుర్తొచ్చాయి: శ్రీకాంత్‌

Published Tue, Jul 4 2023 3:59 AM | Last Updated on Tue, Jul 4 2023 11:25 AM

Hero Srikanth Launching Natho Nenu Lyrical Retro Song - Sakshi

‘‘నాతో నేను’ చిత్రంలోని రెట్రో సాంగ్‌ వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ పాటను తీర్చిదిద్దారు’’ అని హీరో శ్రీకాంత్‌ అన్నారు. సాయికుమార్, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్‌ ప్రధాన పాత్రల్లో శాంతకుమార్‌ తూర్లపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాతో నేను’.

ప్రశాంత్‌ టంగుటూరి నిర్మించిన ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్‌ విడుదల చేశారు. ‘‘ఈ పాట చూస్తే ప్రేక్షకులు 1980 జ్ఞాపకాల్లోకి వెళతారు’’ అన్నారు శాంతకుమార్‌. ‘‘త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ప్రశాంత్‌ టంగుటూరి. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్‌ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, నేపథ్య సంగీతం: ఎస్‌ చిన్న, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement