Melody songs
-
లవ్ మెలోడీతో...
రామ్‌చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘జరగండి...జరగండి...’, ‘రా మచ్చా...’ పాటల లిరికల్ వీడియోలను విడుదల చేశారు. తాజాగా రామ్‌చరణ్, కియారా కాంబినేషన్లో రూపొందిన ఓ మెలోడీ సాంగ్‌ను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకి తమన్ స్వరకర్త. చలో మైసూర్: రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో ఆరంభమైంది. ఈ షూట్లో పాల్గొనేందుకు ఆది వారం రామ్‌చరణ్ మైసూర్ వెళ్లారు. -
బ్లాక్ బస్టర్ మూవీ నుంచి క్రేజీ మెలోడీ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అలా భ్రమయుగం, ప్రేమలు, మంజమ్ముల్ బాయ్స్ లాంటి మలయాళ చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇలా ఇప్పుడు ఓ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోతుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) కన్నడలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ కృష్ణ.. ఈ మధ్య 'లవ్ మాక్ టైల్ 2' మూవీతో వచ్చాడు. అక్కడ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా 'నీదేలే నీదేలే జన్మ' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. నకుల్ అభయాన్కర్ సంగీతమందించిన ఈ మెలోడీ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. ఇందులో హీరోయిన్ మిలానా నాగరాజ్.. నిజ జీవితంలోనూ హీరో డార్లింగ్ కృష్ణ భార్యనే కావడం విశేషం. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) -
‘నాతో నేను’ రెట్రో సాంగ్ వినగానే పాత రోజులు గుర్తొచ్చాయి: శ్రీకాంత్
‘‘నాతో నేను’ చిత్రంలోని రెట్రో సాంగ్ వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ పాటను తీర్చిదిద్దారు’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రల్లో శాంతకుమార్ తూర్లపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్ టంగుటూరి నిర్మించిన ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ఈ పాట చూస్తే ప్రేక్షకులు 1980 జ్ఞాపకాల్లోకి వెళతారు’’ అన్నారు శాంతకుమార్. ‘‘త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ప్రశాంత్ టంగుటూరి. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, నేపథ్య సంగీతం: ఎస్ చిన్న, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి. -
మోడల్ ట్రైన్.. వైన్‌గ్లాసులను తాకుతూ కొత్త మెలోడీ .. ఎక్కడంటే!
బెర్లిన్: జర్మనీ హ్యాంబర్గ్‌లోని మినియేచర్ వండర్లాండ్ మ్యూజియం బొమ్మ రైళ్లకు పెట్టింది పేరు. బొమ్మ నగరాలు, బొమ్మ అడవులు, బొమ్మ నదులను దాటుతూ ప్రయాణిస్తుంటే పిల్లలే కాదు, పెద్దలు పిల్లలై ఆనందిస్తారు. గత సంవత్సరం కరోనా వల్ల ఈ మ్యూజియంను మూసివేయవలసి వచ్చింది. ఈ ఖాళీ సమయంలో మ్యూజియం టీమ్ గోళ్లుగిల్లుకుంటూ కూర్చోకుండా వినూత్నమైన ఆలోచన చేసింది. 211 మీటర్ల ట్రాక్‌లో ప్రయాణం చేసే మోడల్ ట్రైన్‌కు అటు ఇటూ 2,840 వైన్గ్లాస్లను పెట్టి అందులో నీళ్లు పోసారు. ఇందులో వింత ఏముంది అంటారా? ఈ మోడల్ ట్రైన్ చికుబుకు... అంటూ ప్రయాణించదు. కమ్మని మెలోడిలు వినిపిస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంగీత ప్రయాణంలో వినిపించే ప్రపంచ ప్రసిద్ధ మెలోడి తరంగాలు వైన్గ్లాస్లోని నీళ్లను తాకి ప్రతిధ్వనిస్తూ కొత్త రకమైన అనుభూతి ఇస్తాయి. ‘లాంగెస్ట్ మెలోడి మోడల్ ట్రైన్’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ రైలుకు యూట్యూబ్‌లో వైరల్ అయిన ఒక వీడియో ప్రేరణ ఇచ్చింది. -
సందెపొద్దు అందాలున్న చిన్నదీ
అతను కొంత ప్రకృతిలో కలం ముంచాడు. అతను కొంత పలుకుబడిలో పాళీని అద్దాడు. అతను కొంత సంస్కృతిని మన్నులా అందుకుని నుదుటికి పూసుకున్నాడు. అతను కొంత ఈ నేల పాడే పాటను తానూ పాడాడు. ఆ పాటలో బైరాగి తత్త్వం ఉంది. ఆ పాటలో జానపదుల శృంగారం ఉంది. ఆ పాటను అందరూ ‘జాలాది’ అన్నారు. ప్రేక్షకులు అతన్ని తమ మదిలో ఉంచుకున్నారు. సందెపొద్దు అందాలున్న చిన్నదీ ఏటి మీద తానాలాడుతు ఉన్నదీ... జాలాది రాజారావు అనే పూర్తి పేరుగల జాలాది రెగ్యులర్ సినీకవి కాదనిపిస్తుంది. ఆయన కవి సమయాలు ప్రత్యేకం అనిపిస్తుంది. ఆయన రాయవలసిన పాటల సందర్భాలు ఉన్నప్పుడే ఆయన కలానికి ఆహ్వానం దక్కుతుందని అనిపిస్తుంది. ఆయన రాసిన తొలి సినిమా ‘పల్లె సీమ’. దర్శకుడు పి.సి.రెడ్డి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మద్రాసు గదిలో వాన కురిసిన ఒక రాత్రి చూరు నుంచి కారే చప్పుళ్లను విని రాసిన పాటే జాలాదికి తొలి సినిమా పాట అయ్యింది. సూరట్టుకు జారతాంది సితుక్కు సితుక్కు వానసుక్క... గుడివాడలో పుట్టి హైస్కూల్ వయసులోనే స్వాతంత్య్ర పోరాటంలో కొరియర్‌గా పని చేసి ఆ తర్వాత డ్రాయింగ్ టీచర్‌గా మారి సమాజాన్ని మార్చాలంటే కలం అందుకోక తప్పదు అని కలం అందుకున్న కవి జాలాది. నటుడు కైకాల సత్యనారాయణ, సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్.స్వామి వీరంతా ఆయన స్నేహితులు. అక్కినేని అన్న కుమారుడైన అక్కినేని వెంకటరత్నం క్లోజ్ ఫ్రెండ్. వీరే నాటకాలు రాస్తున్న జాలాదిని నాడు మద్రాసు అనబడే నేటి చెన్నైకి పిలిపించారు. తొలిపాట ‘పల్లెసీమ’లో హిట్ అయితే మలిపాట ‘చల్ మోహనరంగ’లో సూపర్‌హిట్ అయ్యింది. కృష్ణ నటించిన ఈ పాట రేడియో సిలోన్లో అత్యధికులు కోరిన ఆ పాటగా, ఆల్ ఇండియా రేడియోలో మళ్లీ మళ్లీ మోగిన పాటగా అందరికీ గుర్తు. ఘల్లుఘల్లున కాలి గజ్జెలందియ మోగ కలహంస నడకాల కలికి అయితే ప్రతి సినీ కవి వెలిగే సమయం ఒకటి వస్తుంది. జాలాదికి కూడా వచ్చింది. జాలాదిని ‘సినిమా వేమన’ను చేసిన పాట ఒకటి ఉంది. ఆ పాట ఆయనకు శాశ్వత కీర్తి సంపాదించి పెట్టింది. భారతీయ తత్వాన్ని ఇంత సులువైన పదాల్లో చెప్పడం జాలాదికి మాత్రమే సాధ్యం అని రుజువు చేసింది. ‘ప్రాణం ఖరీదు’లో ఆయన రాసిన ఆ పాటలో ‘పలుపుతాడు మెడకేస్తే పాడె ఆవురా... పసుపుతాడు ముడులేస్తే ఆడదాఝెరా’ అన్నాడు. ‘అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే... చీము నెత్తురులు పారే తూము ఒక్కటే’ అని జన్మసమానత్వం చెప్పడానికి ఆయన ఉయోగించిన శ్లేషకు ఇప్పటి వరకూ సరి సమాన పాట లేదు. గుర్తుకొచ్చిందా పల్లవి? తప్ప ఎవరు రాయగలరు? యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు జాలాది ఎన్నో క్లాసిక్స్ రాశారు. కాని వాటికి ఆ సమయాన రావలసిన అవార్డులు రాలేదు. ప్రేక్షకుల రివార్డులు తప్ప. జాలాదికి పనిని వెతుక్కుంటూ వెళ్లడం తెలియదు. పని తనను వెతుక్కుంటూ వస్తేనే పని చేశారు. సగటు సినిమా రాజకీయాలు ఆయనకు తెలియవు. ముక్కుపట్టుకుంటే తుర్రుమనే ఈ ప్రాణం కోసం పెనుగులాట ఎందుకు అనేది ఆయన భావన. అదే తత్వాన్ని ‘ఎర్రమందారం’లో పాటగా రాసి నంది అవార్డు పొందారు. ‘కన్ను తెరిస్తే ఉయ్యాలా... కన్ను మూస్తే మొయ్యాలా’ అని రెండు ముక్కల్లో జీవిత పరమార్థాన్ని తేల్చాడాయన. యాలో యాల ఉయ్యాల.. ఏడేడు జన్మాల మొయ్యాల... జాలాది మోహన్‌బాబు సినిమాలకు ఎక్కువ పాటలు రాశారు. ‘అల్లుడుగారు’, ‘చిట్టెమ్మ మొగుడు’, ‘మేజర్ చంద్రకాంత్’... ఈ సినిమాలలో మోహన్‌బాబు ఆయనచే పాటలు రాయించారు. ‘మేజర్ చంద్రకాంత్’ కోసం జాలాది రాసిన దేశభక్తి గీతం తెలుగువారి శాశ్వత దేశభక్తి గీతంగా మారి ఆగస్టు పదిహేనున వాడవాడన మారుమోగే పాట అయ్యింది. పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి జాలాది తన మూడు దశాబ్దాల కెరీర్లో దాదాపు వెయ్యికి పైగా పాటలు రాశారు. చైతన్యవంతమైన గీతాలతో పాటు కమర్షియల్ గీతాలు కూడా రాశారు. ప్రయివేటు ఆల్బమ్స్ కోసం క్రీస్తు గీతాలు అనేకం రాసిన జాలాది ‘కుంతీపుత్రుడి’ కోసం ఈ పాట రాసి సాయి భక్తులకు కానుకగా ఇచ్చారు. లేలే బాబా నిదుర లేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా... జాలాది 2011లో మరణించారు. కాని ఆయనకూ ఆయన కుటుంబానికీ ‘పుణ్యభూమి నా దేశం’ పాటకు తగిన అవార్డులు రాలేదన్న చిన్న అసంతృప్తి ఉంది. సినిమా పరిశ్రమలో ఆయన గౌరవాన్ని పొందారు. అదేచోట వివక్షను కూడా చవి చూశానని చెప్పుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆయనకు ‘కళాప్రపూర్ణ’ ఇచ్చింది. ప్రేక్షకులు మాత్రం పూమాలలతో ఆయనను హత్తుకుంటూనే వచ్చారు. రేడియో పెడితే రోజూ ఆయన పాట వినిపిస్తుంది. బతుకు బండి నడవడానికి ఆయన పాట ఒక తోడు. బండెళ్లిపోతోంది చెల్లలా... బతుకు బండెళ్లిపోతోంది చెల్లెలా... – సాక్షి ఫ్యామిలీ -
పక్కింటి అబ్బాయిలా ఉంటాడు
- దాసరి నారాయణరావు ‘‘ఈ చిత్రం పాటలు విన్నా. ఈ మధ్య ఇంత మెలోడీ పాటలున్న సినిమా ఏదీ రాలేదు. సుమంత్ అశ్విన్ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. కొన్ని సీన్స్ చూశా. బాగున్నాయి. హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ అశ్విన్‌లో ఉన్నాయి. విలన్ పాత్రలో నటించే ప్రభాకర్‌ను చూస్తే చాలా సెన్సిటివ్ అనిపిస్తోంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరి జంటగా ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో మను దర్శకత్వంలో శ్రీసత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘రైట్... రైట్’. జె.బి. స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి నారాయణరావు బిగ్ సీడీ, పాటల సీడీ ఆవిష్కరించి దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ఎంఎస్ రాజుకు అందించారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ గుర్తుకొస్తోంది. సుమంత్ అశ్విన్ బాగా నటిస్తున్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. దర్శకునిగా పరిచయమవుతున్న మనుకు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘డ్రైవర్‌కు, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఈ కథ మొదట ఎంఎస్ రాజుగారికే చెప్పా. ఆయనకు నచ్చి ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు. నటీనటులు, టెక్నీషియన్లు నాకు బాగా సపోర్ట్ చేశారు’’ అని దర్శకుడు మను తెలిపారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘‘క్షణం’, ‘ఊపిరి’వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులు, కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని చెప్పారు. దర్శకులు బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, నిర్మాత ‘దిల్’ రాజు, సహ నిర్మాత ఎమ్‌వి నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సంగీత దర్శకుడు కోటి, నటుడు సీనియర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.