బ్లాక్ బస్టర్ మూవీ నుంచి క్రేజీ మెలోడీ సాంగ్ రిలీజ్ | Love Mocktail 2 Movie Nidele Nidele Janma Song | Sakshi
Sakshi News home page

Love Mocktail 2: కన్నడ హిట్ సినిమా తెలుగులో రిలీజ్ కి రెడీ

Published Mon, Apr 8 2024 3:38 PM | Last Updated on Mon, Apr 8 2024 3:38 PM

Love Mocktail 2 Movie Nidele Nidele Janma Song - Sakshi

పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అలా భ్రమయుగం, ప్రేమలు, మంజమ్ముల్ బాయ్స్ లాంటి మలయాళ చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇలా ఇప్పుడు ఓ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోతుంది.

(ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్)

కన్నడలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ కృష్ణ.. ఈ మధ్య 'లవ్ మాక్ టైల్ 2' మూవీతో వచ్చాడు. అక్కడ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా 'నీదేలే నీదేలే జన్మ' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. నకుల్ అభయాన్కర్ సంగీతమందించిన ఈ మెలోడీ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. ఇందులో హీరోయిన్ మిలానా నాగరాజ్.. నిజ జీవితంలోనూ హీరో డార్లింగ్ కృష్ణ భార్యనే కావడం విశేషం.

(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement