మోడల్‌ ట్రైన్.. వైన్‌గ్లాసులను తాకుతూ కొత్త మెలోడీ .. ఎక్కడంటే! | Longest Melody Played By A Model Train - Guinness World Records | Sakshi
Sakshi News home page

మోడల్‌ ట్రైన్.. వైన్‌గ్లాసులను తాకుతూ కొత్త మెలోడీ .. ఎక్కడంటే!

Published Sun, Apr 11 2021 3:56 PM | Last Updated on Sun, Apr 11 2021 5:45 PM

Longest Melody Played By A Model Train - Guinness World Records - Sakshi

బెర్లిన్‌: జర్మనీ హ్యాంబర్గ్‌లోని మినియేచర్‌ వండర్‌లాండ్‌ మ్యూజియం బొమ్మ రైళ్లకు పెట్టింది పేరు. బొమ్మ నగరాలు, బొమ్మ అడవులు, బొమ్మ నదులను దాటుతూ ప్రయాణిస్తుంటే పిల్లలే కాదు, పెద్దలు పిల్లలై ఆనందిస్తారు. గత సంవత్సరం కరోనా వల్ల ఈ మ్యూజియంను మూసివేయవలసి వచ్చింది. ఈ ఖాళీ సమయంలో మ్యూజియం టీమ్‌ గోళ్లుగిల్లుకుంటూ కూర్చోకుండా వినూత్నమైన ఆలోచన చేసింది. 211 మీటర్ల ట్రాక్‌లో ప్రయాణం చేసే మోడల్‌ ట్రైన్‌కు అటు ఇటూ 2,840 వైన్‌గ్లాస్‌లను పెట్టి అందులో నీళ్లు పోసారు. 
ఇందులో వింత ఏముంది అంటారా? 

ఈ మోడల్‌ ట్రైన్‌ చికుబుకు... అంటూ ప్రయాణించదు. కమ్మని మెలోడిలు వినిపిస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంగీత ప్రయాణంలో వినిపించే ప్రపంచ ప్రసిద్ధ మెలోడి తరంగాలు వైన్‌గ్లాస్‌లోని నీళ్లను తాకి ప్రతిధ్వనిస్తూ కొత్త రకమైన అనుభూతి ఇస్తాయి. ‘లాంగెస్ట్‌ మెలోడి మోడల్‌ ట్రైన్‌’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ రైలుకు యూట్యూబ్‌లో వైరల్‌ అయిన ఒక వీడియో ప్రేరణ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement