guiness record
-
250 మంది మహిళలు, ఒకే ఆలోచన.. గిన్నిస్ బుక్‌లో చోటు
250 మంది మహిళలు ఆరు నెలల్లో 2,719 క్రొచెట్ పాంచోలు తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ΄పాంచోలను గిరిజన పిల్లలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. విశాఖపట్నం వేదికగా వీరందరూ ఒక తాటి మీదకు వచ్చి చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మహిళా మనోవికాసం పేరుతో క్రొచెట్ గ్రూప్‌ను ప్రారంభించిన మాధవి సూరిభట్ల, డెభ్బై ఏళ్ల వయసులోనూ చురుగ్గా పాల్గొన్న రాఘవమ్మ, టీమ్‌లీడర్‌గా ఫణి శిరీష, తనూజలు ఈ సందర్భంగా ఈ రికార్డు సాధనపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్త ప్రపంచం కుటుంబ జీవనంలోనే ఏళ్లు గడిచిపోయాయి. 70 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంబ్రాయిడరీ, క్రొచెట్ అల్లిక చిన్నప్పటి నుంచీ అలవాటు. మహిళా గ్రూప్‌లో చేరి నాలుగేళ్లు అవుతోంది. వచ్చిన పనిని నలుగురితో షేర్ చేసుకోవడం, తెలియంది తెలుసుకోవడం చేస్తుంటాను. ఇంటి దగ్గర రోజూ కొంత సమయం ఎంబ్రాయిడరీకి కేటాయిస్తుంటాను. ఈ గ్రూప్ ద్వారా ఈవెంట్లో పాల్గొని చాలామంది మహిళలతో పరిచయాలు పెంచుకోగలిగాను. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా, చాలా ఆనందంగా అనిపించింది. – డి.వి.రాఘవమ్మ, విజయవాడ గ్రూప్‌కి లీడర్ని మా పిల్లలతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. మూడేళ్ల క్రితం మహిళా మనోవికాస్లో జాయిన్ అయ్యాను. 25 మంది ఉన్న గ్రూప్‌కి లీడర్‌గా ఉన్నాను. ఇలా మొత్తం తొమ్మిది టీమ్స్ ఉన్నాయి. ఒక్కో టీమ్‌లో 25 నుంచి 35 వరకు ఉంటారు. నెల రోజులు ఆన్లైన్లో క్రొచెట్ కోర్సు నేర్చుకున్నాను. కిందటేడాది గ్రూప్ అంతా దాదాపు 4,686 క్రొచెట్ టోపీలు అల్లి, ఈవెంట్ చేశాం. ఆ టోపీలను చలి ఎక్కువ ఉండే గిరిజన ప్రాంతాల పిల్లలకు అందజేశాం. ఈసారి పాంచోస్ను కూడా అదేవిధంగా పంపిణీ చేస్తున్నాం. రెండుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది. – ఫణి శిరీష, హైదరాబాద్ ఆన్లైన్ క్లాసుల నుంచి మొదలు... ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం చేసే నేను పిల్లలు సెటిలయ్యాక మానేశాను. ఇంటి వద్ద ఉంటూ నా హాబీస్ పైన దృష్టి పెట్టాను. అన్నిరకాల హ్యాండ్‌క్రాఫ్ట్స్ చేయగలను. అందులో భాగంగానే నా క్రాఫ్ట్ వర్క్ నలుగురికీ తెలియజేద్దామని ఎఫ్‌బిలో మధురం క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరుతో పోస్ట్ చేసేదాన్ని. కొంతమంది తమకు క్లాసులు చెప్పమన్నారు. దీంతో కోవిడ్ టైమ్‌లో గ్రూప్ స్టార్ట్ చేసి, ఆన్లైన్ క్లాసులు చెబుతూ వచ్చాను. విదేశాలలోనూ నా స్టూడెంట్స్ ఉన్నారు. చెన్నై గ్రూప్‌తో 3 సార్లు క్రొచెట్ గిన్నిస్ రికార్డ్‌లో పాల్గొన్నాను. నా వ్యక్తిగతంగానే ఏడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాను. వైజాగ్‌లోనూ ఈవెంట్ చేయాలనే ఆలోచనతో మహిళా మనోవికాస్ పేరుతో గ్రూప్ ప్రారంభించాను. ఆన్లైన్లో మహిళలకు క్రోచెట్ క్లాసులు తీసుకునేదాన్ని. ఒకరి ఆలోచనను ఇంకొకరు పంచుకుంటూ క్రొచెట్ అల్లికలు చేసి, వాటిని పేదవారికి పంచాలనేది ఆలోచన. దేశ విదేశాల నుంచి ఒకరి ద్వారా మరికొందరు పరిచయం అవుతూ ఆన్లైన్లో ఒక తాటిమీదకు వచ్చారు. కిందటేడాది క్రొచెట్ టోపీలు తయారుచేశాం. ఇప్పుడు పాంచోస్ తయారుచేశాం. పెళ్లి అయిన తర్వాత గృహిణులుగా ఉన్నవారు తమ జీవితంలో ఎలాంటి అచీవ్మెంట్ లేదు అనుకునేవారికి ఇదో మంచి బూస్టింగ్ అయ్యింది. మా గ్రూప్‌లో క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. కీమో తీసుకుంటూ కూడా ఈ అల్లికలు చేశారు. ఈవెంట్‌కు అటెండ్ అవ్వాలనుకునేవారు 150 మెంబర్స్ వచ్చారు. ఆరేళ్ల పాప నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అందరికీ ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పవచ్చు. – మాధవి సూరిభట్ల, విశాఖపట్నం మా పిల్లలకూ నేర్పిస్తున్నాను.. డెలీవరీ టైమ్‌లో ఖాళీగా ఉండటంతో ఆన్లైన్లో క్రోచెట్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఆర్డర్స్ మీద అమీ గ్రూమీ స్టఫ్డ్ టాయ్స్ కూడా చేయడం నేర్చుకున్నాను. మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పది పాంచోస్ చేస్తే చాలు అనుకున్నాను. నేను 25 పాంచోస్ చేసిచ్చాను. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎలా అచీవ్మెంట్ వస్తుంది అని. కొంతమంది ‘మాకు నేర్పిస్తారా, మేం ఎలా ఇందులో పాల్గొనాలి..’ అని అడుగుతున్నారు. ట్రైబల్ పిల్లలకు వాటిని అందజేశారు. – తనూజ, నంద్యాల -నిర్మలా రెడ్డి -
బాబోయ్! వీడు మామూలోడు కాదు.. 15 గంటల్లో 268 మెట్రో స్టేషన్లు చుట్టేశాడు!
న్యూఢిల్లీ: ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 268 మెట్రో స్టేషన్లను ఓ వ్యక్తి కేవలం 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో కవర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. అతడు ఈ అరుదైన రికార్డు 2021 ఏప్రిల్ లోనే సాధించినా.. గిన్నిస్ సంస్థ మాత్రం ఇటీవల అతని ప్రయత్నాన్ని గుర్తించి.. అతని పేరు మీద సర్టిఫికేట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన శశాంక్ మను అనే వ్యక్తి వృత్తి పరంగా పరిశోధనా విభాగంలో ఫ్రిలాన్సర్ గా పని చేస్తున్నాడు. అతను 2021 ఏప్రిల్ 14న మెట్రో జర్నీని చేపట్టాడు. ఈ ఘనతను సాధించడానికి, ఫ్రీలాన్స్ పరిశోధకుడు ఒక రోజు టూరిస్ట్ కార్డ్‌ని ఉపయోగించుకున్నాడు. ఈ ఘనత ఇలా సాధించాడు మొదటగా అతను.. బ్లూ లైన్లో ఉదయం 5 గంటలకు ప్రారంభించి.. గ్రీన్ లైన్‌లోని బ్రిగేడియర్ హోషియార్ సింగ్ స్టేషన్లో రాత్రి 8:30 గంటలకు ముగించాడు. టూరిస్ట్ కార్డ్ ఉండడంతో ఒక్క రోజులో అపరిమిత రైడ్లను ఉపయోగించుకోవడానికి వీలుపడింది. అంతేకాకుండా అతను గిన్నిస్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఆధారాల కోసం ప్రతి స్టేషన్ లో ఓ ఫొటో దిగి, అక్కడ ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సంతకాలను కూడా సేకరించాడు. ఇన్ని తతంగాల పూర్తి చేస్తే.. గిన్నిస్ రికార్డ్స్ బృందంతో చాలా నెలల చర్చల తర్వాత, మనుకు ఎట్టకేలకు తన కష్టానికి ప్రతిఫలాన్ని అందించింది. గిన్నిస్ రికార్డు సాధించిన మను.. అనంతరం ట్విట్టర్లో తన ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ‘ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్ లను తక్కువ సమయంలోనే తిరిగి జర్నీని పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడే గిన్నిస్ వారు నాకు సర్టిఫికేట్ జారీ చేశారు.. ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు. Hey @GWR look what just arrived, the certificate for my Guinness record of visiting all Delhi Metro stations in fastest time! Also the news of my record was prominently covered by many media outlets in India. THANK YOU! pic.twitter.com/ciIgb77ngg — Shashank Manu (@sskmnu) April 4, 2023 చదవండి: ఎయిరిండియా విమానంలో తప్పతాగి.. ఫ్లోర్‌పై మలమూత్రవిసర్జన.. అరెస్ట్ -
100 పెళ్లిళ్లు.. 14 దేశాలకు అల్లుడు.. మరో ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఏంటంటే?
పెళ్లంటే ఆషామాషీ కాదు.. ఇద్దరు మనుషులు ఒక్కటే నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సి ఉంటుంది. అందుకే వివాహాల విషయంలో పెద్దలు ముందు వెనుక ఆలోచించి అడుగులు వేస్తుంటారు. ఈ రోజుల్లో యువకులు ఒక్క పెళ్లి చేసుకోవడానికి నానాతంటాలు పడుతుంటే.. ఓ వ్యక్తి ఏకంగా వందకుపైగా పెళ్లిళ్లు చేసుకుని ఔరా అనిపించాడు. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను తన భార్యలలో ఒకరికి కూడా విడాకులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ వ్యక్తి పేరు గియోవన్నీ విగ్లియోటో. అతను ఏప్రిల్ 3, 1929 న సిసిలీలోని సిరాకుసాలో జన్మించాడు. విచారణ సమయంలో, అతను తన అసలు పేరు నికోయ్ పెరుస్కో అని వెల్లడించాడు. అతని నిజమైన గుర్తింపు ఫ్రెడ్ జిప్ అని కూడా పేర్కొన్నాడు. అతను 1949 1981 మధ్య 105 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అతను భార్యలకు ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఈ పరంపరలో అమెరికాలోని రాష్ట్రాలతో పాటు 14 ఇతర దేశాలలోని యువతులను పెళ్లి చేసుకున్నాడు. ప్రతిసారీ ఫేక్ పత్రాలతో నకిలీ పేర్లతో యువతులతో పరిచయం పెంచుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత వారికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకునే వాడు. పెళ్లైన అనంతరం తాను చాలా దూరంలో జాబ్ చేస్తున్నాని.. ఉద్యోగ నిమిత్తం తప్పినిసరి వెళ్లాలి అంటూ భార్యకు చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు, డబ్బు తీసుకుని పరారయ్యేవాడు.. ఇదే ట్రెండ్‌ను జరిగినంత కాలం కొనసాగించాడు. చివరికి విగ్లియోట్టో డిసెంబర్ 28, 1981న పోలీసుల చేతికి చిక్కాడు. న్యాయస్థానం అతనికి మొత్తం 34 ఏళ్ల జైలు శిక్షతో పాటు 336,000 డాలర్ల జరిమానా కూడా విధించింది. ఎన్నో పెళ్లిళ్లు చేసుకుని, ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసిన అతను 1991 లో 61 సంవత్సరాల వయస్సులో మెదడు రక్తస్రావంతో మరణించాడు. To this day, nobody is sure of the real name of 'Giovanni Vigliotto' - the man who conned women and got married over 100 times. pic.twitter.com/MVFujTws5o — Guinness World Records (@GWR) April 5, 2023 -
కాళ్లు లేకున్నా.. ప్రపంచ రికార్డు బద్ధలు
వైకల్యం అనేది మనసుకే కానీ, శరీరానికి కాదని నిరూపిస్తున్నవాళ్లు ఎందరో. కొందరి సంకల్పానికి ఏకంగా ప్రపంచ రికార్డులే బద్ధలు అవుతున్నాయి. ఆ జాబితాకు చెందిన వ్యక్తే జియాన్ క్లార్క్. కాళ్లు లేకుండా పుట్టాడని తల్లిదండ్రులు నడిరోడ్డు పాలు జేస్తే.. అనాథశ్రమంలో పెరిగి, ఆపై ఓ అమ్మ అండతో ఛాంపియన్‌గా ఎదిగిన పాతికేళ్ల వ్యక్తి కథ ఇది. జియాన్‌కు కాళ్లు లేవు. అందుకే చేతులనే కాళ్లుగా మార్చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా చేతులతో పరిగెత్తిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 20 మీటర్ల దూరాన్ని.. కేవలం 4.78 సెకండ్లలో అదీ చేతులతో పరిగెత్తి చూపించాడు అతను. విశేషం ఏంటంటే.. 2021లోనే అతను ఆ ఘనత సాధించాడట. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు ట్విటర్ ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు. Meet Zion Clark, the fastest man on two hands 💪 pic.twitter.com/AVPNlT0cIT — Guinness World Records (@GWR) January 22, 2023 క్లార్క్ స్వస్థలం ఒహియో స్టేట్‌లోని కొలంబస్ ప్రాంతం . వైకల్యంతోనే పుట్టాడతను. దానివల్ల నడుము కింది భాగం ఉండదు. కయుడాల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే పరిస్థితి అందుకు కారణం. పుట్టిన వెంటనే అతన్ని తల్లిదండ్రులు వదిలేశారు. దీంతో.. ఒహియోలోనే ఓ ఆశ్రమంలో పెరిగాడు. ఆపై ప్రముఖ అమెరికన్ స్టాక్‌మార్కెట్ నిపుణురాలు కింబర్లీ హాకిన్స్ అతన్ని కథ తెలిసి దత్తత తీసుకున్నారు. హాకిన్స్ సంరక్షణలో క్లార్క్.. చదువుకున్నాడు. వీల్‌చైర్ రేసర్‌గా రాటుదేలాడు. అంతేకాదు మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్‌గా, రెజర్ల్గానూ అలరించాడతను. తన ఇద్దరు కన్నపిల్లలకు సమానంగా జియాన్‌ను పెంచిందామె. అతని జీవితం జియాన్ పేరుతో డాక్యుమెంటరీగా తీయగా.. అది సూడాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపిక కావడంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమ్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీకి 40 స్పోర్ట్స్ ఎమ్మీ అవార్డుల్లో రెండు ఎమ్మీలను దక్కించుకుంది కూడా. ఇక ఆపై చేతులతో వేగంగా పరిగెత్తి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. అయితే.. క్లార్క్ 2021లోనే ఆగిపోలేదు. కిందటి ఏడాది మరో రెండు గిన్నిస్ రికార్డులు నెలకొల్పాడు.త్వరలో మరో రెండు రికార్డులు నెలకొల్పనేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జన్మనిచ్చిన వాళ్ల సంగతి ఏమోగానీ.. ఈ తల్లి రుణం తీర్చుకోలేనిదని చెప్తున్నాడు జియాన్. -
వైరల్ వీడియో : మనిషినే తాడుగా తిప్పుతూ...!
-
గిన్నిస్ రికార్డుల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంటారు!
క్రికెట్లో హై క్యాచ్‌లు చూస్తుంటాం. కానీ ఫుట్‌బాల్‌లో హై క్యాచ్‌లు ఎప్పుడైనా చూశారా. అదేంటి ఫుట్‌బాల్‌లో హై క్యాచ్‌లు ఎందుకుంటాయి అనేగా మీ డౌటు. ఏం లేదులెండి అదంతా గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం మాత్రమే. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఫుట్‌బాల్ స్టార్ బ్రెండన్ ఫెవోలా అత్యంత ఎత్తు నుంచి విసిరిన ఫుట్‌బాల్‌ను అందుకొని రికార్డులెక్కాడు. హెలికాప్టర్లో వెళ్లిన బృందం దాదాపు 727.98 అడుగుల ఎత్తు నుంచి బంతిని విసరగా.. బ్రెండన్ పవోలా ఎలాంటి తడబాటు లేకుండా అందుకున్నాడు. దీంతో 2021లో అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు నెలకొల్పిన రికార్డు బద్దలయింది. ఇంతకముందు అమెరికన్ ఫుట్‌బాలర్ రాబ్ గ్రోన్కోవస్కి 600 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని అందుకొని గిన్నీస్ రికార్డు నమోదు చేయగా.. తాజాగా ఆ రికార్డును బ్రెండన్ పవోలా బద్దలు కొట్టి తన పేరిట లిఖించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని.. గిన్నిస్ రికార్డులో చోటు
సాధారణంగా ఓ కంపెనీలో ఎక్కువలో ఎక్కువ ఐదేళ్లు లేదా పదేళ్లు.. మహా అయితే 20 ఏళ్లు పని చేస్తుంటారు. కానీ ఒకాయన మాత్రం 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారంటే నమ్ముతారా! నమ్మడమా.. ఆశ్చర్యపోయాం అంటారా! బ్రెజిల్‌కు చెందిన వాల్టర్ ఆర్థమన్ 1934 నుంచి ఒకే కంపెనీలో పని చేస్తున్నారు మరి. పదిహేనేళ్లు ఉన్నప్పుడు 1938లో ఓ టెక్స్టైల్ కంపెనీలో షిప్పింగ్ విభాగంలో అసిస్టెంట్‌గా చేరారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా.. తర్వాత సేల్స్ మేనేజర్‌గా.. ఇలా ఎదుగుతూ వచ్చారు. ఈ 84 ఏళ్ల కాలంలో సేల్స్ ట్రిప్‌లో భాగంగా ప్రపంచమంతా చుట్టొచ్చారు. బ్రెజిల్‌లోని అన్ని విమానయాన సంస్థ విమానాలూ ఎక్కేశారు. ప్రస్తుతం వాల్టర్‌కు 100 ఏళ్లు. ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా ఈ ఏడాదిలోనే గిన్నిస్ రికార్డుకెక్కారు. 100 ఏళ్ల వయసున్నా కంపెనీ నుంచి పదవీ విరమణ పొందే ఆలోచనేమీలేదని చెబుతున్నారు. అప్పట్లో పని చేసే రోజులను, ఇప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. ‘ఇప్పుడంతా సులువైపోయింది. చేతిలో ఫోన్. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా బిజినెస్‌ను చూసుకోవచ్చు’ అన్నారు. ఇప్పటి యవతకు సలహా ఏమైనా ఇస్తారా అటే.. ‘అస్సలు కోప్పడవద్దు. నవ్వుతూ పని చేసుకుపోండి. నచ్చింది చేయండి’ అని చెప్పారు. -
ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ..
World Biggest Cricket Bat Unveiled In Hyderabad: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బ్యాట్ హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై శనివారం ఆవిష్కరించబడింది. పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బ్యాట్ పొడవు 56.1 అడుగులు కాగా, బరువు 9 టన్నులుగా ఉంది. పాప్లర్ ఉడ్‌తో తయారు చేసిన ఈ బ్యాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకు విషెస్ చెబుతూ.. ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్‌ను ట్యాంక్ బండ్‌పై ఉంచారు. ఈ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, తెలంగాణ పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే -
మరో గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసిన హీరో మోటోకార్ప్...!
భారత అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. హీరో మోటోకార్ప్ ఇంటర్నేషనల్ జీరో ఎమిషన్స్(ఉద్గారాలు) దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది. 'లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’ పేరిట హీరో మోటోకార్ప్ ప్రపంచరికార్డును ఆవిష్కరించింది. కర్భన ఉద్గారాలను తగ్గించడం కోసం హీరో మోటోకార్ప్ తన వంతుగా ‘హీరో గ్రీన్ డ్రైవ్’ ద్వారా దేశవ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ హీరో గ్రీన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,37,775 మొక్కలను నాటే ఫోటోలతో ‘లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’తో హీరో మోటార్‌కార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేయడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ.. "100 మిలియన్ అమ్మకాల మైలురాయితో ఈ ఏడాది కంపెనీ మరింత ఉత్సాహంగా ప్రారంభమైందని తెలిపారు. అంతేకాకుండా ఒకే రోజులో లక్ష యూనిట్ల విక్రయాలను హీరో మోటోకార్ప్ జరిపినట్లు గుర్తుచేశారు. ‘హీరో గ్రీన్ డ్రైవ్’ కార్యక్రమంతో జీరో ఎమిషన్స్‌పై కంపెనీ కట్టుబడి ఉందని వెల్లడించారు. గత నెలలో 'అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగో' సృష్టించినందుకుగాను హీరో మోటోకార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఫీట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు హీరో మోటోకార్ప్ ప్లాంట్‌లో అతిపెద్ద మోటార్సైకిల్లోగోను సుమారు 1845 స్ప్లెండర్ ప్లస్ బైక్స్నుపయోగించి గిన్నిస్ రికార్డును ఆవిష్కరించింది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! -
దుబాయ్ గడ్డ మీద తెలుగు బిడ్డ రికార్డులు
dubai: యూఏఈ (దుబాయ్) గడ్డ మీద తెలుగు బిడ్డ క్రితిక్ తంగిరాల (4 సంవత్సరాల 5 నెలలు) అబ్బురపరిచే రికార్డులు సాధిస్తున్నాడు. తెలుగు బిడ్డ క్రితిక్ తల్లిదండ్రులు డాక్టర్ రవితేజ, డాక్టర్ లక్ష్మిలలిత దుబాయ్‌లో ఉంటున్నారు. పరదేశంలో ఉంటున్న ఈ బుడతడు తెలుగింటి సంప్రదాయాలు, సంస్కృత శ్లోకాల పఠనంపై మక్కువ కనబరుస్తున్నాడు. దుబాయ్ బ్రైట్ రైడర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (సీబీఎస్ఈ)లో ఎల్కేజీ ఆంగ్లభాషలో చదువుత ఆధ్మాత్మిక, భౌగోళిక, ఖగోళ అంశాల్లో విజ్ఞానంతో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించాడు. చిన్నారి క్రితిక్ 105 దేశాలు–రాజధానులు, 4 సంస్కృత శ్లోకాలు, 1 నుంచి 100 నంబర్లు, ఖండాల వర్ణన, సౌర కుటుంబం సంక్షిప్త ప్రసంగంతో ఈ ఏడాది జూన్ 26వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లిషు అక్షరాలను అవరోహణలో (జెడ్ నుంచి ఎ వరకు) 6 సెకన్లలో వల్లించి దుబాయ్ ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. -
మోడల్ ట్రైన్.. వైన్‌గ్లాసులను తాకుతూ కొత్త మెలోడీ .. ఎక్కడంటే!
బెర్లిన్: జర్మనీ హ్యాంబర్గ్‌లోని మినియేచర్ వండర్లాండ్ మ్యూజియం బొమ్మ రైళ్లకు పెట్టింది పేరు. బొమ్మ నగరాలు, బొమ్మ అడవులు, బొమ్మ నదులను దాటుతూ ప్రయాణిస్తుంటే పిల్లలే కాదు, పెద్దలు పిల్లలై ఆనందిస్తారు. గత సంవత్సరం కరోనా వల్ల ఈ మ్యూజియంను మూసివేయవలసి వచ్చింది. ఈ ఖాళీ సమయంలో మ్యూజియం టీమ్ గోళ్లుగిల్లుకుంటూ కూర్చోకుండా వినూత్నమైన ఆలోచన చేసింది. 211 మీటర్ల ట్రాక్‌లో ప్రయాణం చేసే మోడల్ ట్రైన్‌కు అటు ఇటూ 2,840 వైన్గ్లాస్లను పెట్టి అందులో నీళ్లు పోసారు. ఇందులో వింత ఏముంది అంటారా? ఈ మోడల్ ట్రైన్ చికుబుకు... అంటూ ప్రయాణించదు. కమ్మని మెలోడిలు వినిపిస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంగీత ప్రయాణంలో వినిపించే ప్రపంచ ప్రసిద్ధ మెలోడి తరంగాలు వైన్గ్లాస్లోని నీళ్లను తాకి ప్రతిధ్వనిస్తూ కొత్త రకమైన అనుభూతి ఇస్తాయి. ‘లాంగెస్ట్ మెలోడి మోడల్ ట్రైన్’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ రైలుకు యూట్యూబ్‌లో వైరల్ అయిన ఒక వీడియో ప్రేరణ ఇచ్చింది. -
ఘాటైన మిర్చీలు తిన్నాడు.. ఆపై!
టొరంటో: సాధారణంగా మిర్చీలను తగిన మోతాదులో వాడటం వల్ల వంటకాలకు అదనపు రుచి చేకూరుతుంది. అదే మోతాదుకు మించి వాడితే నోరు మంటపుట్టడంతో పాటు అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి, మిర్చీలను వంటకాల్లో భాగంగా కాకుండా నేరుగా ఆరగించడమే వృత్తిగా ఎంచుకున్నాడు. అతను ఆరగించే మిర్చీలు నామమాత్రపు ఘాటు ఉండే సాదాసీదా మిర్చీలనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రపంచ నలుమూలల్లో లభ్యమయ్యే ఘాటైన మిర్చీలను పోటీపడి మరీ ఆరగిస్తుంటాడు. అతను ప్రపంచవ్యాప్తంగా జరిగే చిల్లీ ఈటింగ్ పోటీల్లో పాల్గొంటుంటాడు. కెనెడాకు చెందిన మైక్ జాక్ అనే వ్యక్తి ప్రపంచంలో అత్యంత ఘాటైన మిర్చీలుగా ప్రసిద్ధి చెందిన మూడు కరోలినా రీపర్ మిర్చీలను 10 సెకెన్లలోపు(9.72 సెకెన్ల) ఆరగించి 4 గిన్నీస్ ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నీస్ ప్రపంచ రికార్డుల ప్రతినిధులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, మైక్ గతంలో కూడా అనేక మిర్చీలు ఆరగించే పోటీల్లో పాల్గొని మూడు ప్రపంచ రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. అతను మున్ముందు ఎనిమిది కరోలినా రీపర్ మిర్చీలను తినడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని గిన్నీస్ రికార్డుల సంస్థ వెల్లడించింది. -
కేరళలో భారీ పనస పండు
కొల్లాం : పనస తొనల తియ్యదనం చెప్పాలంటే మాటలు చాలవు. పనస పొట్టు కూర ప్రత్యేక మైన రుచితో శాఖాహారుల నోరూరిస్తూ ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే పనసపండ్లు అందుబాటులోకి వస్తాయి. పండ్లజాతిలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పండుగా పేరున్న పనసపండు సాధారణంగా 5 కేజీల నుంచి 20 కేజీల బరువుతో కాస్తాయి. అయితే కేరళలోని కొల్లాంలో ఎదాములక్కల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ పొలంలో కాసిన పనస పండు ఏకంగా 50 కేజీలకుపైగానే తూగడంతో వారి ఆనందానికి అవుధులు లేకుండా పోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత బరువైన పనసపండు 42.7 కిలోలు అవ్వడంతో, వారు గిన్నిస్ బుక్ వారి సంప్రదించారు. తమ పొలంలో కాసిన పనస 51.4 కిలోల బరువుతో 97 సెంటిమీటర్ల వెడల్పుతో ఉందని జాన్ కుట్టి అన్నారు. గిన్నిస్ బుక్‌తోపాటూ లిమ్కా బుక్ బుక్ ఆఫ్ రికార్డులకు కూడా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. -
ఫార్మా విద్యార్థుల సరికొత్త గిన్నిస్ రికార్డు
ఇండోర్: భారత ప్రధాని నరేంద్రమోదీ ఆరోగ్య భారత్ ప్రచారానికి మద్దతుగా ఇండోర్‌లోని ఫార్మా విద్యార్థులు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు గుళికల ఆకారంలో సమూహాలుగా ఏర్పడి జనరిక్ మందులపై అవగాహన కల్పించారు. వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సమూహంలో 500 మంది నీలం రంగులో, మరో 500 మంది తెలుపు రంగులో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పునీత్ ద్వివేది నేతృత్వంలోని మోడ్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ నిర్వహించింది. దీనిపై ద్వివేది మాట్లాడుతూ.. సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఫార్మసీ దినోత్సవం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇదివరకు కేరళ విద్యాసంస్థలు నెలకొల్పిన 438 ప్రజలతో కూడిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి కొత్తగా వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించడం సంతోషకరమన్నారు. ఈ రికార్డును అందజేయడానికి భారత నుంచి ప్రదీప్ మిశ్రా, యూఎస్ నుంచి డాక్టర్ సుకుల్ తదితరులు గిన్నిస్ బుక్ నిర్వాహకులుగా పాల్గొన్నారు. ద్వివేది జనరిక్ మాత్రల గొప్పతన్నాన్ని వివరిస్తూ బ్రాండెడ్ కంపెనీలు జనరిక్ మాత్రలను ఎక్కువ ధరకు అమ్మితే అవే మందులను చిన్న కంపెనీలు తక్కువ ధరకు అమ్ముతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు, రసాయన శాస్త్రవేత్తలు అధిక లాభాలను అర్జించడానికి మందులను బ్రాండెడ్ కంపెనీలకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. అన్ని కంపెనీల జనరిక్‌మాత్రలు ఒకే నాణ్యత కలిగి ఉంటాయని కేవలం కంపెనీల పేర్లు మాత్రమే మారుతుంటాయని చెప్పారు. -
సత్తెనపల్లిలో గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం జరగనుంది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1,500 మంది నీటితో చేతులను శుభ్రం చేసుకోనున్నారని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సామూహిక చేతుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ కోసం ఆదివారం ఇక్కడ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఇందులో కోడెల పాల్గొని పరిశీలించారు. -
జిఫ్.. జబర్దస్త్..
ఇలా నడిచే కుక్కను మీరెక్కడైనా చూశారా? చాలా మంది తమ పెంపుడు శునకం విసిరేసిన బాల్‌ను తెచ్చిస్తేనే.. సూపర్ అంటూ మురిసిపోతారు. అలాంటిది.. జిఫ్(4) అనే ఈ కుక్క చేసేవి చెబితే.. సూపర్లాంటి పదాలెన్ని వాడినా దీని టాలెంట్‌కు సరిపోవు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉండే జిఫ్ తన వెనుక కాళ్లపై 32 అడుగుల దూరాన్ని కేవలం 6.56 సెకన్లలో.. 16 అడుగుల దూరాన్ని తన ముందు కాళ్లపై 7.76 సెకన్లలో పరిగెత్తేయగలదు. అందుకే.. రెండు కాళ్లపై అత్యంత వేగంగా పరుగెత్తే శునకంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. సెప్టెంబర్‌లో విడుదలయ్యే గిన్నిస్ బుక్-2015 ఎడిషన్‌లో మొదటి రికార్డు కూడా దీనిదేనట. ఇదొక్కటేనా.. జిఫ్ షేక్‌హ్యాండ్ ఇస్తుంది. డాన్సులేస్తుంది. స్కేట్‌బోర్డుపై రైడింగ్ చేస్తుంది. అభిమానులు అడిగితే.. ఆటోగ్రాఫ్(కాలి ముద్ర వేస్తుంది) కూడా ఇస్తుంది. -
నాకు ఓటేయొద్దు ప్లీజ్..: నరేంద్రనాథ్ దూబే
ఫలితాలెలా ఉన్నా, గెలవాలనే లక్ష్యంతోనే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తారు. నరేంద్రనాథ్ దూబే మాత్రం కాస్త వెరైటీ వ్యక్తి. ఎక్కువ ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాలనేది ఆయన లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసమే ఆయన 1984 నుంచి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పొరపాటుగానైనా గెలిచిన పాపాన పోని నరేంద్రనాథ్, ఈసారి కూడా ఇదే ఒరవడి కొనసాగించాలనుకుంటున్నారు. తొలిసారిగా 1984లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చెరాల్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు. ఆ తర్వాత మునిసిపాలిటీ స్థాయి నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పలు ఎన్నికల్లో పోటీచేసి, అప్రతిహతంగా పరాజయ పరంపరను కొనసాగించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి జనశక్తి ఏకతా పార్టీ అభ్యర్థిగా దూబే బరిలోకి దిగారు. గిన్నిస్ రికార్డు సాధించడమే తన ఏకైక లక్ష్యమని, ఈసారి కూడా ఎప్పటి మాదిరిగానే ఓడి తీరుతానని ఈ ఓటువీరుడు ధీమాగా చెబుతున్నారు. -
రక్తదానానికి గిన్నిస్ రికార్డు
సాక్షి, చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. ఈ నెల 24న జయలలిత 66వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భం గా తమిళనాడు రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నేతృత్వంలో ఈ నెల 14న చెన్నై సహా 10 ప్రాంతాల్లో ఏక కాలంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వీటిలో 58,129 మంది రక్తదానం చేశారు. గతంలో హర్యానాలో జరిగిన వైద్య శిబిరంలో 40 వేల మంది రక్తదానం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును తమిళనాడులో నిర్వహించిన రక్తదాన శిబిరం తిరగ రాసింది. గిన్నిస్ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాలను సోమవారం తమిళనాడు సీఎం జయలలితకు ఆ సంస్థ ప్రతినిధి లూసియూ అందజేశారు.