క్రికెట్‌లో హై క్యాచ్‌లు చూస్తుంటాం. కానీ ఫుట్‌బాల్‌లో హై క్యాచ్‌లు ఎప్పుడైనా చూశారా. అదేంటి ఫుట్‌బాల్‌లో హై క్యాచ్‌లు ఎందుకుంటాయి అనేగా మీ డౌటు. ఏం లేదులెండి అదంతా గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం మాత్రమే. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఫుట్‌బాల్ స్టార్ బ్రెండన్ ఫెవోలా అత్యంత ఎత్తు నుంచి విసిరిన ఫుట్‌బాల్‌ను అందుకొని రికార్డులెక్కాడు. హెలికాప్టర్‌లో వెళ్లిన బృందం దాదాపు 727.98 అడుగుల ఎత్తు నుంచి బంతిని విసరగా.. బ్రెండన్ పవోలా ఎలాంటి తడబాటు లేకుండా అందుకున్నాడు.
దీంతో 2021లో అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు నెలకొల్పిన రికార్డు బద్దలయింది. ఇంతకముందు అమెరికన్ ఫుట్‌బాలర్ రాబ్ గ్రోన్‌కోవస్కి 600 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని అందుకొని గిన్నీస్ రికార్డు నమోదు చేయగా.. తాజాగా ఆ రికార్డును బ్రెండన్ పవోలా బద్దలు కొట్టి తన పేరిట లిఖించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment