దుబాయ్‌ గడ్డ మీద తెలుగు బిడ్డ రికార్డులు | Orissa: 4 Year Old Dubai Based Indian Boy Creates Guiness Record | Sakshi
Sakshi News home page

DUBAI: విదేశీ గడ్డ మీద తెలుగు బిడ్డ రికార్డులు

Published Fri, Jul 9 2021 2:33 PM | Last Updated on Fri, Jul 9 2021 4:01 PM

Orissa: 4 Year Old Uae Based Indian Boy Creates Guiness Record - Sakshi

dubai: యూఏఈ (దుబాయ్‌) గడ్డ మీద తెలుగు బిడ్డ క్రితిక్‌ తంగిరాల (4 సంవత్సరాల 5 నెలలు) అబ్బురపరిచే రికార్డులు సాధిస్తున్నాడు. తెలుగు బిడ్డ  క్రితిక్‌ తల్లిదండ్రులు డాక్టర్‌ రవితేజ, డాక్టర్‌ లక్ష్మిలలిత దుబాయ్‌లో ఉంటున్నారు. పరదేశంలో ఉంటున్న ఈ బుడతడు తెలుగింటి సంప్రదాయాలు, సంస్కృత శ్లోకాల పఠనంపై మక్కువ కనబరుస్తున్నాడు.

దుబాయ్‌ బ్రైట్‌ రైడర్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (సీబీఎస్‌ఈ)లో ఎల్‌కేజీ ఆంగ్లభాషలో చదువుత ఆధ్మాత్మిక, భౌగోళిక, ఖగోళ అంశాల్లో విజ్ఞానంతో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించాడు. చిన్నారి క్రితిక్‌ 105 దేశాలు–రాజధానులు, 4 సంస్కృత శ్లోకాలు, 1 నుంచి 100 నంబర్లు, ఖండాల వర్ణన, సౌర కుటుంబం సంక్షిప్త ప్రసంగంతో ఈ ఏడాది జూన్‌  26వ తేదీన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లిషు అక్షరాలను అవరోహణలో   (జెడ్‌ నుంచి ఎ వరకు) 6 సెకన్లలో వల్లించి దుబాయ్‌ ఎక్స్‌క్లూజివ్‌ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement