
దుబాయ్: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. హత్య కేసులో కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.కేరళ రాష్ట్రంలోని కన్నూర్ కు చెందిన మహ్మద్ రినాష్, పీవీ మురళీధరన్ లకు మరణశిక్ష అమలు చేసిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే.. ట్రావెల్ ఏజెన్సీ ఏఐ ఎయిన్ లో పని చేసిన రినాష్.. ఓ హత్య కేసులో ఇరుక్కున్నాడు. యూఏఈకి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన నేరం కింద మరణశిక్ష అమలు చేయగా,. మురళీధరన్ అనే వ్యక్తి భారత్ కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మరణశిక్షను అమలు చేశారు.
వీరి హత్య కేసులో భాగంగా కావాల్సిన అన్ని న్యాయపరమైన ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే వారిపై ఉన్నవి హత్యానేరాలు కావడంతో మరణశిక్ష అమలు తప్పలేదని, వారి చివరి మజిలీలో భాగంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరి చొప్పున అక్కడికి వెళ్లేందుకు ఏర్పాటు చేసినట్లు విదేశాంగ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీనే వీరికి మరణశిక్షను ఖరారు చేయగా, తాజాగా వారి శిక్షను అమలు చేశారు. ఇప్పటిరవకూభారత్ కు చెందిన 28 మంది యూఏఈలో మరణశిక్ష బారిన పడ్డారు. ఇటీవల మార్చి 3వ తేదీన ఒక మహిళకు కూడా మరణశిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment