death row
-
'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!
బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. అప్పటిదాక గడప దాటని అమాయకపు తల్లి అయినా బిడ్డ జోలికొస్తే.. శివంగిలా మారిపోతుంది. ఏదో విధంగా కాపాడాలని తపించిపోతుంది. అలానే ఇక్కడొక తల్లి కూడా వెరొక దేశంలో అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో చిక్కుకుని విలవిలలాడుతున్న కూతుర్ని రక్షించాలని తప్పనపడింది. అందుకు ఆ దేశం వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి ఒప్పందం చేసుకోవడమే ఒక్కటే ఆ తల్లి ముందున్న మార్గం. అయితే ఆ దేశానికి భారతీయ పౌరులెవ్వరికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ఆ తల్లి హైకోర్టులో పోరాడి అనుమతి తెచ్చుకుని మరీ వెళ్లేందుకు పయనమవుతుంది. అక్కడ వాళ్లతో 'బ్లడ్ మనీ డీల్' చేయబోతోంది. ఏంటీ బ్లడ్ మనీ డీల్..? ఏంటా ఆ తల్లి గాథ అంటే.. నిమిషా ప్రియా అనే ఒక నర్సు 2011లో యెమెన్‌కి వెళ్లింది. అక్కడ ఆమె సనాలో నర్సుగా పనిచేసేది. అయితే ఏం జరిగిందే ఏమో 2017 యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. ఆమె సన్నిహితుల ప్రకారం..ఆమె పాస్‌పోర్ట్‌ని మహదీని తీసుకుని ఇవ్వకపోవడంతో ఎలాగైన అతడి నుంచి తీసుకునే క్రమంలో మహదీన్కి మత్తు మందులను ఇంజెక్ట్ చేసింది. దీంతో అతడు మరణించాడు. ఏం చేయాలో పాలుపోని నిమిషా తన సహోద్యోగి హనన్ సాయంతో ట్యాంకులో పడేసే క్రమంలో అతడి శవాన్ని ముక్కలు చేశారు. అయితే నిమిషా పోలీసులకు దొరికిపోయింది. దీంతో యెమెన్ ట్రయల్ కోర్లు కేసుని విచారించి..నిమిషాకి మరణ శిక్ష విధించగా, ఆమె సహోద్యోగికి జీవత ఖైదు విధించింది. 2018 నుంచి నిమిషా యెమెన్ జైలులోనే ఉంది. అప్పటి నుంచి నిమిషా కుటుంబం ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం ఈ విషయమై యెమెన్ సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే..? అక్కడ ఆమె అప్పీలును తిరస్కరించింది యెమెన్ సుప్రీం కోర్టు. దీంతో నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే 'బ్లడ్ మనీ డీల్' ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే నిమిషాకి శిక్ష తప్పుతుంది తిరిగి భారత్‌లోని తన కుటుంబం చెంతకు వెళ్లిపోవచ్చు. అందుకోసం ఆమె తల్లి ప్రేమ కుమారి యెమెన్‌కి వెళ్లాలనుకుంది. కానీ 2017లో కేంద్రం యెమెన్‌కి ట్రావెల్ బ్యాన్ విధించింది. దీని కారణంగా ప్రభుత్వ అనుమతి లేకుండా యోమెన్‌కి వెళ్లటం ఆమెకు అసాధ్యం అందుకని ఆమె ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. అయితే ధర్మాసనం ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని, ఆ తల్లికి కూతురుని రక్షించుకోవడానికి యెమెన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం యెమెన్‌తో భారత్‌కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు పేర్కొంది. అందువల్ల ఆ దేశంతో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం తన వాదనను హైకోర్టుకి తెలిపింది. దీంతో హైకోర్టు భారత ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేకుండా తన స్వంత పూచీతో బాధ్యతతో ప్రయాణిస్తానని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ తల్లిని కోరింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇవాళ (బుధవారం)ఆ తల్లికి పశ్చిమ ఆసియా దేశమైన యెమెన్ వెళ్లి తన కూతురు విడుదల కోసం "బ్లడ్ మనీ డీల్" చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. 'బ్లడ్ మనీ డీల్' అంటే.. యెమెన్ షరియా చట్టాల ప్రకారం ఆమెను విడుదల చేయడానికి బాధితురాలి కుటుంబం నిర్ణయించిన పరిహారం ఇచ్చేలా నేరుగా చర్చలు జరపడాన్ని " బ్లడ్ మనీ డీల్" అంటారు. అందుకోసం ఆ తల్లి వెళ్లడం అత్యంత ముఖ్యం. ఏదీఏమైన తన కూతురు కోసం ఆ తల్లి పడుతున్న కష్టం ఫలించాలని ఆశిద్దాం. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో అతి పెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. పెద్ద సంఖ్యలో రోగులు కన్ను మూస్తున్నారు. రోగులు, క్షతగాత్రులతోపాటు 7,000 మందికిపైగా సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడ ఉందన్న వాదనతో ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. నిత్యం తనిఖీలు చేస్తోంది. బయట నుంచి ఆహారం, నీరు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధనం, విద్యుత్ సరఫరా కాకుండా నిలిపివేసింది. గత ఐదారు రోజులుగా ఇక్కడ చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఐసీయూలోని రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి 22 మంది మరణించారని అల్–షిఫా డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాలి్మయా చెప్పారు. గత మూడు రోజుల వ్యవధిలో ఇక్కడి 50 మందికిపైగా రోగులు మరణించినట్లు సమాచారం. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ స్థావరాలనే కాదు, శరణార్థి శిబిరాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం ఉపేక్షించడం లేదు. తాజాగా జబాలియా క్యాంపుపై జరిగిన వైమానిక దాడిలో ఏకంగా 18 మంది పాలస్తీనా శరణార్థులు మరణించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరం సమీపంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 14 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు ఎంతమంది మృత్యువాత పడ్డారన్నది తెలియరావడం లేదు. గత కొన్ని రోజులుగా మృతుల, క్షతగాత్రుల గణాంకాలను గాజా ఆరోగ్య శాఖ విడుదల చేయడం లేదు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రభుత్వ అధికార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలమే ఇందుకు కారణం. బందీలను హత్య చేస్తున్న హమాస్! అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. ఇప్పటిదాకా నలుగురు బందీలను విడుదల చేశారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేయడంతో ప్రతిస్పందనగా బందీలను మిలిటెంట్లు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వద్ద బందీగా ఉన్న 19 ఏళ్ల నోవా మర్సియానో అనే ఇజ్రాయెల్ మహిళా జవానును ఇప్పటికే హత్య చేశారు. ఆమె మృతదేహం అల్–షిఫా వద్ద లభ్యమైంది. అలాగే 65 ఏళ్ల మరో మహిళా బందీ సైతం హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని అల్–షిఫా వద్ద గుర్తించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆగని దాడులు.. అందని సాయం గాజాపై ఇజ్రాయెల్ సేనలు భీకరస్థాయిలో విరుచుకుపడుతుండడంతో పాలస్తీనియన్లకు మానవతా సాయం అందడం లేదు. దాడులకు విరామం ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆహారం, ఔషధాలు, నిత్యావసరాను గాజాకు చేరవేయలేకపోతున్నామని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆకలి చావులు ప్రారంభం కావడం తథ్యమని తేలి్చచెప్పింది. మరోవైపు గాజాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఊహించినదాని కంటే వేగంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, సాధారణ జనావాసాలతోపాటు ఆసుపత్రుల్లోనూ జనం రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఇతర దేశాల నుంచి ఇంధనం వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో జనరేటర్లు పనిచేయడంలేదు. విద్యుత్ లేక మొబైల్ ఫోన్ల సేవలు సైతం నిలిచిపోయాయి. గాజాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. గాజాను ఆక్రమించొద్దు: బ్లింకెన్ హమాస్‌పై యుద్ధం ముగిసిన తర్వాత గాజా పరిస్థితి ఏమిటి అన్నదానిపై చర్చ ప్రారంభమైంది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకొని, అక్కడ తన కీలు»ొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరోసారి ఇజ్రాయెల్‌కు సూచించారు. ఆఖరి గౌరవానికీ దూరం ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజాలో మెజార్టీ ప్రజలు ముస్లిం మతçస్తులే. దాడుల్లో నిత్యం పదుల సంఖ్యలో జనం మరణిస్తున్నారు. భవనాలు నేటమట్టమవుతున్నాయి. కాంక్రీట్ దిబ్బలుగా మారుతున్నాయి. చాలామంది వాటికింద చిక్కుకొని తుదిశ్వాస విడుస్తున్నారు. గాజాలో చాలా ప్రాంతాలు శ్మశనాలను తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై 5 వారాలు దాటింది. గాజాలో ఇప్పటివరకు 1,500 మంది చిన్నారులు సహా 2,700 మంది కనిపించకుండాపోయారు. వారంతా శిథిలాల కింద విగతజీవులైనట్లు తెలుస్తోంది. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం.. మృతులకు సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తిచేయాలి. మృతదేహాలను సబ్బుతో శుభ్రం చేసి, కొత్త వస్త్రాలు చుట్టి, పన్నీరు చల్లి 24 గంటల్లోగా ఖననం చేయాల్సి ఉంటుంది. గాజాలో వేలాది మంది ఈ ఆఖరి గౌరవానికి నోచుకోవడం లేదు. బయటకు తీసేవారు లేక శిథిలాల కింద శవాలు కుళ్లిపోతున్నాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోతున్నాయి కరెంటు, డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో గాజాలో సహాయక చర్యలు ఎప్పుడో నిలిచిపోయాయి. భవనాల శిథిలాలను తొలగించేవారే లేరు. కనిపించకుండాపోయిన తమ బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసం జనం గాలిస్తున్నారు. శవం కనిపించినా ఎవరిదో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిగో హమాస్ సొరంగం.. అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో సొరంగంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న తన వాదనకు బలం చేకూర్చేలా వీడియోను, కొన్ని ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో గుహ లాంటి ప్రదేశం కనిపిస్తోంది. ఇది నిజంగా హమాస్ సొరంగమేనా? అనేది నిర్ధారించాల్సి ఉంది. అల్–షిఫా హాస్పిటల్లో హమాస్ ఆయుధాల వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అల్ షిఫా ఆస్పత్రి ఐసీయూ వార్డు (ఫైల్ ఫొటో) -
సర్కారీ ఆస్పత్రుల్లో మరణ మృదంగం
- 11 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిలో 42,297 మంది మృతి - సగటున రోజుకు 115 మంది ప్రాణాలు గాలిలో - వెంటిలేటర్లు, మందుల కొరతతో రోగుల మృత్యువాత - ప్రభుత్వ పరిశీలనలో తేలిన చేదు నిజాలు సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రులంటే ప్రాణం పోయాలి... కానీ ఏ ఆస్పత్రికెళ్లినా ఏమున్నది గర్వకారణం...చచ్చేది ఖాయం అన్నట్టుంది పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో పేద రోగులు పెద్దాసుపత్రులకు వెళ్లడం, అక్కడ సరైన వైద్య సేవలు అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవడం... ఇదీ తంతు. ఎక్కడైనా ఇన్‌పేషెంట్ల సంఖ్యలో రెండు శాతం మృతులు ఉంటేనే చాలా ఎక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఈ మృతుల సంఖ్య ఇన్‌పేషెంట్ల సంఖ్యలో 10 శాతం కంటే ఎక్కువగా ఉండటం అత్యంత పేలవమైన వైద్య సేవలు అందుతున్నట్లు అర్థమవుతోంది. ఓవైపు అన్ని సేవలను ప్రైవేటుపరం చేస్తుండటం, మరోవైపు పలువురు ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్య ధోరణితో ఉండటం వంటి కారణాలు రోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ధర్మామీటర్ కొనుగోలు చేసినా అందులో అవినీతి అక్రమాలే ఉండటం, నాసిరకం కొనుగోలు పరికరాలను కొనుగోలు చేయడం వంటివి రోగులను పట్టి పీడిస్తున్నాయి. వివిధ పెద్దాసుపత్రుల్లో 42,297 మంది మృత్యువాత పడినట్టు పరిశీలనలో వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందినట్లు తెలిసింది. గంటకు 4నుంచి 5 మంది... రోజుకు సగటున 115 మంది రోగులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కనీస వసతులు లేకనే మృతి బోధనాసుపత్రులంటే రాష్ట్ర వైద్యవిద్యకు, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆయువుపట్టు లాంటివి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడే వైద్యవిద్య నేర్చుకుంటూంటారు. అలాంటి ఆస్పత్రుల్లోనే కనీస మౌలిక వసతులు లేవు. తీవ్ర గాయాలతో లేదా జబ్బులతో వచ్చిన వారికి వీల్ చైర్లు లేవు. వెంటిలేటర్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. రోజు వస్తున్న పేషెంట్లలో 10 శాతం మందికి మాత్రమే కృత్రిమ శ్వాస అందిస్తున్న పరిస్థితి. ఎంఆర్ఐ, సీటీస్కాన్‌ల విషయంలో అయితే గత మూడు మాసాల్లో రోగులు పడుతున్న వెతలు వర్ణనాతీతం. అన్నిటికీ మించి రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు లేరు. కనీసం మూడు పడకలకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, 20 పడకలకు కూడా ఒక నర్సు లేదు. ఇక వైద్యుల పరిస్థితీ అంతే. ఇప్పటికీ 160 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులకు రక్తం కావాలన్నా దొరకని పరిస్థితి. అవినీతికి ఇదో మచ్చుతునక డయాలసిస్ బాధితుల కోసం 400 పడకలు కొన్నారు. రోగిని బరువు చూసి వైద్యమందిస్తారు. దీనికోసం పడకకే వెయింగ్ స్కేల్ (బరువును కొలిచే యంత్రం) ఉన్నది కొనాలి. కానీ ఒక కంపెనీతో ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్లు కుమ్మక్కై నాసిరకం మంచాలు కొన్నారు. దీంతో ప్రతిసారీ పేషెంటును దించడం, బరువు కొలచడం, మళ్లీ ఎక్కించడం జరుగుతోంది. దీనివల్ల ఒక్కో మంచం కొనుగోలులో రూ.30 వేల తేడా ఉండచ్చుగానీ, వేలాది మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. జబ్బు ముదిరితే చావే గతి... ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న వారిలో మృతి చెందుతున్న వారిని పరిశీలిస్తే... ప్రమాద బాధితులు ఎక్కువమంది మృతి చెందుతున్నారు కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల మృతులు ఏటికేటికీ పెరుగుతున్నట్టు తేలింది శ్వాసకోశ వ్యాధుల బాధితులు ఈ ఏడాది ఎక్కువమంది మృతి చెందారు డెంగీ, గున్యా బాధితులకూ సకాలంలో వైద్యమందక మృతిచెందిన వారిలో ఉన్నారు గుండెజబ్బులతో బాధపడుతున్న వారు ప్రాణాలు వదులుతున్నారు కాలేయ వ్యాధుల మృతులు రెండేళ్లుగా తీవ్రమైనట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది ప్రసవ సమయంలో మృతిచెందుతున్న గర్భిణుల సంఖ్య కూడా వేలల్లో ఉంది 2016లో మృతి చెందిన వారు ఆస్పత్రి - మృతుల సంఖ్య జీజీహెచ్, కాకినాడ- 6,547 జీజీహెచ్, గుంటూరు - 7,940 ఎస్వీఆర్ జీజీహెచ్ తిరుపతి - 4,210 కింగ్‌జార్జి, విశాఖపట్నం - 4,502 రిమ్స్, ఒంగోలు - 1,072 రిమ్స్, శ్రీకాకుళం - 947 జీజీహెచ్, అనంతపురం - 2,618 జీజీహెచ్, విజయవాడ - 3,911 జీజీహెచ్, నెల్లూరు - 1,897 జీజీహెచ్, కర్నూలు - 6,744 రిమ్స్, కడప - 1,909 మొత్తం మృతుల సంఖ్య - 42,297 (ఇవి కాకుండా విశాఖపట్నంలోని ఛాతీ ఆస్పత్రి, గుంటూరు జిల్లా చినకాకాని లోని క్యాన్సర్ ఆస్పత్రిలో 1,200 మందిపైనే మృతి చెందినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అంతేకాదు వైద్యవిధాన పరిషత్‌లోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లోనూ మృతుల సంఖ్య అధికంగా ఉంది) -
మెమన్ 'క్షమాభిక్ష': విచారణ రేపటికి వాయిదా
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ కొనసాగుతూనేఉంది. ఉరిని రద్దుచేయాలని కోరుతూ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. మొదట మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 257 మందిని బలితీసుకున్న ముంబై పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ పాత్ర సుస్పష్టమని, గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ నెల 30న అతడిని ఉరితీయాల్సిందేనని ముకుల్ రోహత్గీ వాదించారు. మెమన్ తరఫు వాదనలను మంగళవారం వింటానన్న కోర్టు.. విచారణను రేపటికి వాయిదావేసింది. అయితే తుది తీర్పు ఎప్పుడు వెలువరించేది తెలియరాలేదు. మరోవైపు గత ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 30న నాగపూర్ జైలులో యాకూబ్ మెమన్ ను ఉరితీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. -
సల్మాన్ ట్వీట్లపై మండిపడ్డ తండ్రి
- ఉద్రిక్తతల నేపథ్యంలో నటుడి ఇంటివద్ద భద్రత పెంపు ముంబై: ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ను ఉరితీయొద్దంటూ ట్వీట్లు చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ఆయన తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన నాటి ఘటన గురించి సల్మాన్‌కు ఏమాత్రం అవగాహన లేదని.. ట్విట్టర్లో అతని రాతలన్నీ అర్థరహితమైనవని, తెలివితక్కువతనాన్ని బయటపెట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివారం మద్యహ్నం తన అభిప్రాయాన్ని మీడియాకు తెలియజేసిన సలీం ఖాన్.. యాకూబ్ ఉరితీత విషయంలో మాత్రం కొడుకుతో ఏకీభవించాడు. 'యాకూబ్ దోషే అయినప్పటికీ ఉరి విధించకుండా అతడ్ని జీవితాంతం జైలులో ఉచడమే సరైన శిక్ష' అని సలీం అన్నారు. సల్మాన్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవాలని ప్రజలను కోరారు. ఇదిలాఉండగా, సల్మాన్ ఖాన్ ట్వీట్లపై రాజకీయ వర్గాలతోపాటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అతడి నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు ముంబై పోలీసులు. సల్మాన్ తన ట్వీట్లను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ముంబై పేలుళ్ల కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ కోరారు. కోర్టు తీర్పులను తప్పుపట్టడం సరికాదని హితవుపలికారు. -
విడిపించండి
శ్రీలంక కోర్టు తమిళ జాలర్లకు విధించిన ఉరిశిక్షకు ప్రధానిదే బాధ్యత అని ఎండీఎంకే అధినేత వైగో పేర్కొన్నారు. శ్రీలంక తీరును నిరసిస్తూ ఎండీఎంకే ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు సమ్మె పాటిస్తున్న మత్స్యకారులు ఈ నెల 6వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీలంకకు హెరాయిన్ చేరవేస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పింది. ఈ ఉదంతంపై మండిపడిన రాష్ట్రం ఆగ్రహంతో ఊగిపోయింది. ఎండీఎంకే అధినేత వైగో నగరంలోని వళ్లువర్‌కోట్టం వద్ద తన అనుచరగణంతో మంగళవారం ఆందోళనకు దిగారు. వందలాది మంది కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐదుగురు యువకులు తమ మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ, చేపల వేటకు వెళ్లిన తమిళనాడు జాలర్లపై సాగుతున్న వేధింపు చర్యల్లో భాగంగా శ్రీలంక ఉరిశిక్షను విధించిందన్నారు. ఒక వేళ వారు హెరాయిన్‌ను అక్రమ రవాణా సాగించారని అనుకున్నా, ఇదే మత్తు పదార్థాన్ని అక్రమరవాణా చేస్తూ దేశంలో ఎందరో పట్టుబడ్డారని, వారెవరికీ ఉరిశిక్ష వేసిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్రీలంక పట్ల అవలంభిస్తున్న మెతకవైఖరే ఉరిశిక్షకు కారణమని ఆయన దుయ్యబట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు భారతరత్న ప్రకటించాలని ఓ బీజేపీ నేత పేర్కొనగా, ఆ పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంలు తమిళ జాలర్లు ఇన్ని అవస్థలు పడుతుండగా, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఇద్దరు సీఎంలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వైగో వ్యాఖ్యానించారు. ప్రజల ముఖ్యమంత్రి అనే నినాదంతో జయలలిత, కన్నీరు పెడుతూ పాలిస్తున్న పన్నీరు సెల్వం మరో ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. ఎంతో హుందాగా బాధ్యతలు నిర్వరిస్తూ ప్రజాసేవ చేయాల్సిన పన్నీర్ సెల్వం కనీసం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు, చాంబర్ వద్ద జయ బోర్డును తొలగించేందుకు సైతం సాహసం చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఉచిత వస్తువుల పంపిణీని మానేసి, పెరిగిన పాల ధరను తగ్గించాలని వైగో సూచించారు. జాలర్ల ఆమరణ దీక్ష తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక ప్రభుత్వం ఉరిశిక్ష విధించడాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్న మత్స్యకారులు ఈనెల 6 వ తేదీ నుంచి ఆమరణదీక్షకు పూనుకోవాలని నిర్ణయించారు. నాగపట్నం, కారైక్కాల్, పుదుక్కోట్టై, తంజై, తిరువారూరు జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటను నిషేధించి నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. జాలర్ల సంఘాల ప్రతినిధులు సీఎం పన్నీర్ సెల్వంను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల 6వ తేదీలోగా ఉరిశిక్ష పడిన జాలర్లు విడుదల కాని పక్షంలో అదే రోజు నుంచి ఆమరణ దీక్షకు దిగుతామని మంగళవారం ప్రకటించారు.