Delhi Man Sets Guinness World Record, Covers 286 Metro Stations In 15 Hours - Sakshi
Sakshi News home page

బాబోయ్‌! వీడు మామూలోడు కాదు.. 15 గంటల్లో 268 మెట్రో స్టేషన్లు చుట్టేశాడు!

Published Tue, Jun 27 2023 11:39 AM | Last Updated on Tue, Jun 27 2023 12:04 PM

Delhi Man Set Guinness World Record 2021, 286 Metro Stations 15 Hours - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 268 మెట్రో స్టేషన్‌లను ఓ వ్యక్తి కేవలం 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో కవర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. అతడు ఈ అరుదైన రికార్డు 2021 ఏప్రిల్ లోనే సాధించినా.. గిన్నిస్ సంస్థ మాత్రం ఇటీవల అతని ప్రయత్నాన్ని గుర్తించి.. అతని పేరు మీద సర్టిఫికేట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన శశాంక్ మను అనే వ్యక్తి వృత్తి పరంగా పరిశోధనా విభాగంలో ఫ్రిలాన్సర్ గా పని చేస్తున్నాడు. అతను 2021 ఏప్రిల్ 14న మెట్రో జర్నీని చేపట్టాడు. ఈ ఘనతను సాధించడానికి, ఫ్రీలాన్స్ పరిశోధకుడు ఒక రోజు టూరిస్ట్ కార్డ్‌ని ఉపయోగించుకున్నాడు.

ఈ ఘనత ఇలా సాధించాడు
మొదటగా అతను.. బ్లూ లైన్‌లో ఉదయం 5 గంటలకు ప్రారంభించి.. గ్రీన్ లైన్‌లోని బ్రిగేడియర్ హోషియార్ సింగ్ స్టేషన్‌లో రాత్రి 8:30 గంటలకు ముగించాడు. టూరిస్ట్ కార్డ్ ఉండడంతో ఒక్క రోజులో అపరిమిత రైడ్‌లను ఉపయోగించుకోవడానికి వీలుపడింది. అంతేకాకుండా అతను గిన్నిస్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఆధారాల కోసం ప్రతి స్టేషన్ లో ఓ ఫొటో దిగి, అక్కడ ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సంతకాలను కూడా సేకరించాడు.

ఇన్ని తతంగాల పూర్తి చేస్తే.. గిన్నిస్ రికార్డ్స్ బృందంతో చాలా నెలల చర్చల తర్వాత, మనుకు ఎట్టకేలకు తన కష్టానికి ప్రతిఫలాన్ని అందించింది. గిన్నిస్ రికార్డు సాధించిన మను.. అనంతరం ట్విట్టర్లో తన ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ‘ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్ లను తక్కువ సమయంలోనే తిరిగి జర్నీని పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడే గిన్నిస్ వారు నాకు సర్టిఫికేట్ జారీ చేశారు.. ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు.
 

చదవండి: ఎయిరిండియా విమానంలో తప్పతాగి.. ఫ్లోర్‌పై మలమూత్రవిసర్జన.. అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement