ఢిల్లీ మెట్రోకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ప్రేమికుల రొమాన్స్, మరోసారి యువకుల ఫైట్స్, ఇంకొన్నిసార్లు యువతీయువకుల డ్యాన్స్.. ఇలాంటి వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వీటిని గమనించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) చీఫ్ వికాస్ కుమార్ ఇలా వీడియోలు తీసేవారిని హెచ్చరించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు మెట్రో అధికారులు పలు కఠిన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వీడియో మేకింగ్ ఘటనలను నివారించేందుకు ఒక బృందం మెట్రోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. అభ్యంతరకర వీడియోలు తీస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
త్వరగా ఫేమస్ అయ్యేందుకు చాలామంది మెట్రో లోపల వీడియోలు షూట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు వేగంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కురచ దుస్తులు ధరించి యువతులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతుంటాయి.
ఇటువంటి ఘటనలను నియంత్రించేందుకు మెట్రో లోపల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తోటి ప్రయాణికులు మెట్రో అధికారులకు తెలియజేయాలని డీఎంఆర్సీ చీఫ్ వికాస్ కుమార్ కోరారు.
ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!
Comments
Please login to add a commentAdd a comment