ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తాజాగా మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్ట్‌లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్‌లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్‌ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్‌ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం మెట్రో కోచ్‌లలో వెండి రంగు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే దీనిని గోల్డెన్ లైన్ కారిడార్‌గా మార్చారు. ఇది 23.62 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మొత్తం 15 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025నాటికి ఇవి పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు.
ఫేజ్-4లో గోల్డెన్ లైన్‌తో పాటు మరో రెండు కారిడార్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జనక్‌పురి వెస్ట్ నుండి ఆర్‌కే ఆశ్రమం వరకు మెజెంటా లైన్‌ను పొడిగించడం, మజ్లిస్ పార్క్ నుండి మౌజ్‌పూర్ వరకు పింక్ లైన్‌ను పొడిగించడం మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలోని ఒక్కో కారిడార్‌ను ఒక్కో రంగుతో గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో లైన్ సమయపూర్ బద్లీ నుండి గుర్గావ్ వరకు, బ్లూ లైన్ వైశాలి నుండి ద్వారక వరకు, రెడ్ లైన్ కొత్త బస్టాండ్ నుండి రితాలా వరకు నడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment