Route
-
సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..
-
కేజ్రీవాల్ చేతిలో మొహల్లా బస్సుల బ్రహ్మాస్త్రం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికారంలో ఉన్న ఆప్ మరోమారు అధికారం సొంతం చేసుకునేందుకు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. వాటిలో ఒకటే ‘మొహల్లా’.. మొహల్లా క్లీనిక్‌ల తరువాత మొహల్లా బస్సులను రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.మొహల్లా క్లినిక్‌లకు అమితమైన ఆదరణకేజ్రీవాల్ సారధ్యంలో ఢిల్లీలో ఏర్పాటైన 300కు పైగా మొహల్లా క్లినిక్‌లు అమితమైన ప్రజాదరణ పొందాయి. 1.6 కోట్ల మంది మొహల్లా క్లీనిక్‌ల ద్వారా ఉచితంగా ఆరోగ్య సేవలను అందుకున్నారు. ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ రోడ్లపైకి ఎక్కనున్న మొహల్లా బస్సులు రవాణా రంగంలో మరో విప్లవానికి నాంది పలకబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొహల్లా బస్సులు బ్రహ్మాస్త్రంగా మారనున్నాయనే మాట కూడా వినిపిస్తోందిమహిళల భద్రతే ధ్యేయంగా..మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొహల్లా బస్సులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. శాంతిభద్రతల అంశాన్ని ఎన్నికల్లో ఆయుధంగా మలచుకునే ఉద్దేశంలోనే అరవింద్ కేజ్రీవాల్ మొహల్లా బస్సులను తీసుకువస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ప్రతిరోజు మూడు అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఢిల్లీ ఎంత అభద్రతలో ఉందో తెలియజేస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటామో లేదో అనే అభద్రతా భావంతో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కోసం మొహల్లా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో యోచిస్తోంది. గల్లీల్లోనూ సులభంగా తిరిగేలా..మొహల్లా బస్సులు 9 మీటర్ల పొడవు కలిగివుంటాయి. ఇవి చిన్నపాటి గల్లీల్లోనూ సులభంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేజ్రీవాల్-అతిషి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మొహల్లా బస్సుల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలో మరో రెండు వారాల్లో ఢిల్లీ రోడ్లపై మొహల్లా బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ బస్సులో 23 సీట్లు ఉండనున్నాయి. అలాగే 13 మంది నిలుచునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా 36 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో ఆరు సీట్లు మహిళలకు కేటాయించారు.రాత్రి 10 గంటల వరకూ అందుబాటులో..తొలిదశలో 140 మొహల్లా బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మొత్తం 16 గంటల్లో 12 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ విధంగా ఒక్కరోజులో లక్షా 20 వేల 960 మంది ప్రయాణికులు ఒక రోజులో ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొహల్లా బస్సులు ప్రారంభం కావడం విశేషం. మొహల్లా బస్సుల వినియోగం ఢిల్లీ రవాణా రంగంలో ఒక మైలురాయిగా మారనుందనే మాట వినిపిస్తోంది. మొహల్లా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు. ఫలితంగా వీటి నుంచి కాలుష్యం ఏర్పడదు. ఇది కూడా చదవండి: మరోమారు తెరపైకి అమృత్సర్.. -
భక్తులతో కిటకిటలాడిన అలిపిరి (ఫొటోలు)
-
Kedarnath: మట్టిపెళ్లల్లో కూరుకుపోయి నలుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రా మార్గంలో పెద్ద ప్రమాదం జరిగింది. సోన్‌ప్రయాగ్ -గౌరీకుండ్ మధ్య మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద పలువురు కూరుకుపోయారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మట్టిపెళ్లల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. పలు విపత్తుల కారణంగా యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా పరిస్థితులు కాస్త అనుకూలించడంతో యాత్ర మళ్లీ వేగం పుంజుకుంది. అయితే తాజా ఘటన తర్వాత అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉంటూ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. -
కన్వర్ యాత్ర: సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్
కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించింది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను రాయాలని తొలుత ఆదేశించింది. తరువాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. వీటిపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. విచారణలో ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని కోరింది. దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.దీనికిముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని, మైనారిటీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నదని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సియు సింగ్ మాట్లాడుతూ పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని అన్నారు.విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో జారీ చేసిన నేమ్ ప్లేట్లకు సంబంధించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్టే విధించింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
Amarnath Yatra 2024: యాత్రా మార్గంలో చెత్తకు చెక్ పెట్టేలా ఏర్పాట్లు
అమర్నాథ్ ధామ్ యాత్ర అంత్యంత వైభవంగా జూన్ 29న ప్రారంభంకానుంది. ఈ నేపధ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా అమర్నాథ్ యాత్రా మార్గంలో ప్రతీయేటా మూడు నుంచి నాలుగు వందల టన్నుల చెత్త పేరుకుపోతుంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపించనుంది.ఒకవైపు అమర్నాథ్ యాత్ర జరుగుతుండగానే మరోవైపు ఈ మార్గంలో చెత్తను పారవేసే ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణాభివృద్ధి శాఖ సభ్యులు సేవలు అందించనున్నారు. యాత్రా మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకు చెత్తవేసుకునే కిట్ అందించనున్నారు.యాత్రా మార్గంలో వ్యర్థాలను తొలగించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్, లంగర్, గుహ వరకు వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక శిబిరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిలిపివేశారు.అమర్నాథ్ యాత్రా మార్గంలో 2850 మరుగుదొడ్లు, 516 స్నాన ఘాట్లు నిర్మించారు. పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు బేస్ క్యాంప్‌లలోని వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ బాత్రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె బిర్డి తాజాగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశమైన చందన్వాడిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు, సీఎపీఎఫ్ అధికారులతో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. -
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
దేశంలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్‌కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్‌లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్‌ను సందర్శించిన తర్వాతే చార్‌ధామ్‌కు వెళ్లేవారు. రిషికేశ్కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్ బద్రీనాథ్ ధామ్‌కు నడక మార్గంగా ఉండేది.రిషికేశ్‌లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్‌లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్‌కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.కొన్నాళ్ల క్రితం రిషికేశ్ అడవిలా ఉండేదని రామేశ్వర్ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్ధామ్ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు. -
ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే..
ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వెళ్లేవారు ఇకపై అక్కడి మెట్రోలో సిటీనంతా చుట్టేయచ్చు. ఆగ్రాలో మెట్రో సేవలు గురువారం(2024, మార్చి, 7) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ఆగ్రా మెట్రోను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. దీని దూరం ఆరు కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరు స్టేషన్లలో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి సామాన్య ప్రజలు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఆగ్రా మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు సాగించనుంది. ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే.. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off metro railway services from Kavi Subhash Metro, Majerhat Metro, Kochi Metro, Agra Metro, Meerut-RRTS section, Pune Metro, Esplanade Metro- Kolkata. pic.twitter.com/2s8mNCjUiX — ANI (@ANI) March 6, 2024 ఆగ్రా మెట్రో గంటకు 90 కి.మీ వేగంతో నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులెవరైనా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టేషన్లో నిలబడితే అలారం మోగుతుంది. మొదటి దశ 6 మెట్రో స్టేషన్లు.. తాజ్ ఈస్ట్ గేట్, కెప్టెన్ శుభమ్ గుప్తా మెట్రో స్టేషన్, ఫతేబాద్ రోడ్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మంకమేశ్వర్ టెంపుల్ ఒక మెట్రో స్టేషన్ మధ్య ప్రయాణానికి రూ.10, చివరి స్టేషన్‌ను రూ.60గా చార్జీలను నిర్ణయించారు. ఒక కోచ్‌లో 60 సీట్లు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. -
ఢిల్లీ మెట్రోలో గోల్డెన్ లైన్.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం!
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తాజాగా మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్ట్‌లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్‌లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్‌ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్‌ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మెట్రో కోచ్‌లలో వెండి రంగు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే దీనిని గోల్డెన్ లైన్ కారిడార్‌గా మార్చారు. ఇది 23.62 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మొత్తం 15 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025నాటికి ఇవి పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు. ఫేజ్-4లో గోల్డెన్ లైన్‌తో పాటు మరో రెండు కారిడార్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జనక్‌పురి వెస్ట్ నుండి ఆర్కే ఆశ్రమం వరకు మెజెంటా లైన్‌ను పొడిగించడం, మజ్లిస్ పార్క్ నుండి మౌజ్‌పూర్ వరకు పింక్ లైన్‌ను పొడిగించడం మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలోని ఒక్కో కారిడార్‌ను ఒక్కో రంగుతో గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో లైన్ సమయపూర్ బద్లీ నుండి గుర్గావ్ వరకు, బ్లూ లైన్ వైశాలి నుండి ద్వారక వరకు, రెడ్ లైన్ కొత్త బస్టాండ్ నుండి రితాలా వరకు నడుస్తుంది. -
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగో టర్మినల్‌గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
దేవరకద్ర మార్గంలో ఎలక్ట్రిక్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పాత లైన్ల విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వే శాఖ ఇప్పుడు కొత్త లైన్లను వేగంగా విద్యుదీకరిస్తోంది. మహబూబ్‌నగర్–కర్నాటకలోని మునీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ సరిహద్దు పరిధిలో దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య ఇటీవలే లైన్ అందుబాటులోకి వచ్చింది. 64 కి.మీ. ఈ నిడివిలో ప్రయాణికుల రైళ్లను ఇటీవలే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల మధ్య మార్గాన్ని కూడా విద్యుదీకరించారు. పనులు పూర్తి కావటంతో డీజిల్ లోకోమోటివ్ల బదులు ఎలక్ట్రిక్ లోకో మోటివ్‌లతో రైళ్లను తిప్పనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఉపయోగాలెన్నో.. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగుళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు గద్వాల మీదు గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రాయచూరుకు గద్వాల మీదుగా కాకుండా కృష్ణా మీదుగా వెళ్లేది దగ్గరి దారి. ఇన్నాళ్లూ విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో రైళ్లను నడపటం సాధ్యం కాలేదు. ఇప్పుడు దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ అందుబాటులోకి రావటంతో ఇక రాయచూరు సహా కొన్ని ఇతర రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల గద్వాల మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఇంజన్లతో పోలిస్తే డీజిల్ లోకోమోటివ్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఆ ఇంధన భారం కూడా తగ్గనుంది. వేగంలో పెద్దగా తేడా రాకున్నా, ఇంజన్ పికప్ బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సరుకు రవాణా రైళ్లకు ఒకటికి మించి ఇంజన్లను వాడుతుంటారు. మూడు డీజిల్ ఇంజన్ల బదులు రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎక్కువ వ్యాగన్లు ఉన్న రైలును సులభంగా లాగుతాయి. కొన్ని రకాల సరుకును తరలించే సందర్భంలో.. రెండు డీజిల్ ఇంజిన్ల బదులు ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ సరిపోతుంది. ఇక విద్యుదీకరించాల్సింది ఆ రెండు మార్గాలే ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (పనులు జరుగుతున్నాయి), ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మెదక్–అక్కన్నపేట మార్గాలను మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా, సిద్దిపేట వరకు లైన్ అందుబాటులోకి రావటంతో ఇటీవలే ప్రయాణికుల రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనోహరాబాద్–సిద్దిపేట మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కావటంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పనులు ప్రారంభమైన ఏడాదిలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. -
కోవిడ్ తర్వాత కొత్త నగరాలకు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒకప్పుడు ఇవే దేశంలో ప్రధాన ఐటీ హబ్‌లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఐటీ కంపెనీలు రూటు మారు స్తున్నాయి. చండీగఢ్, మంగళూరు, అహ్మదా బాద్, కాన్పూర్, తిరువనంతపురం, భోపా ల్, జైపూర్, వరంగల్, విశాఖపట్నం,విజయ వాడ లాంటి నగరాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్‌కు దేశంలోని కేవలం ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన సమాచార సాంకేతిక రంగం.. కోవిడ్ తదనంతర పరిణా మాల నేపథ్యంలో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బహుళజాతి సంస్థలు నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవాలని భావి స్తుండటమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నగరాల్లోనే 11–15% నైపుణ్యం ఉన్న యువత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే 11–15 శాతం సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ఉన్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. దాదాపు 60 శాతం పట్టభద్రులు ఈ పట్టణాల నుంచే ఉత్తీర్ణులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో 30 శాతం మేరకు ఉద్యోగాల కోసం ప్రథమ శ్రేణి నగరాలకు తరలి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్‌లు ఎక్కువగా ఇక్కడే.. 2022లో దాదాపు 7 వేల (39%) స్టార్టప్‌లు ఈ కొత్త నగరాల నుంచే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 13 శాతం స్టార్టప్ కంపె నీల ఫండింగ్ ఈ ద్వితీయ శ్రేణి నగరాలకే వెళ్లినట్లు తెలిపింది. పెట్టుబ డిదారులు కూడా ప్రథమ శ్రేణి నగరాల్లోని వాటికంటే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నట్లుగా అధ్యయనంలో తేలినట్లు నివేదిక పేర్కొంది. కొత్త హబ్‌లు ఎక్కడెక్కడ? దేశంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాలైన టువంటి చండీగఢ్, నాగ్‌పూర్, అహ్మదా బాద్, మంగళూరు, కాన్పూర్, తిరువనంతపుర, లఖ్‌నవూ, గౌహతి, రాంచీ, భోపాల్, జైపూర్, ఇండోర్, నాసిక్, భువనేశ్వర్, రాయ్‌పూర్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, హుబ్బళి, విజయవాడ, తిరు పతి, మైసూరు, వెల్లూరు, మధురై, తిరుచిరా పల్లి, కొచ్చి నగరాలపై ఐటీ సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. తెలంగాణలోని పలు నగరాల్లో హబ్‌లు ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్‌లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వికేంద్రీకరణతో సానుకూల మార్పులు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ప్రధాన నగరాలు, పట్టణాలకు పరిమితం కాకుండా రెండో, మూడో శ్రేణి నగరాలు, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ వల్ల చాలా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కోవిడ్ తర్వాత చాలావరకు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా మంచి ఉత్పాదకత వస్తుండటంతో కంపెనీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నిర్వహణ వ్యయం మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి మరోవైపు వికేంద్రీకరణ కారణంగా ఉద్యోగులకు కూడా ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ మరింత జరిగి శాటిలైట్ సెంటర్ల ద్వారా చిన్న చిన్న హబ్‌లు కూడా ఏర్పడబోతున్నాయి. ఇంటర్నెట్ స్పీడ్, నిరంతర కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలుంటాయి. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ప్రత్యామ్నాయ హబ్‌లు అత్యంత ఆవశ్యకం దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఏ విధంగా ఐటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న అంశంపై డెలాయిట్, నాస్కామ్ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించి నివేదికను తయారు చేశాయి. ‘ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఇన్ ఇండియా’ పేరిట ఇది రూపొందింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ప్రస్తుతం మరో 26 నగరాలకు విస్తరించిందని ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు నాస్కామ్ అధిపతి సుకన్యరాయ్ తెలిపారు.కాగా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలను, అక్కడ ఉన్న అవకాశాలను, ఇతర అంశాలను వివరించింది. ఏడు ప్రధాన నగరాల్లో విస్తరించిన ఐటీ రంగంలో దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అయితే నైపుణ్యం, నిర్వహణ వ్యయం, కొత్త నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వారు ఉన్నచోటే ఉపాధి కల్పించేలా ఆ ప్రాంతాల్లోనే కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని నివేదిక చెబుతోంది. కోవిడ్ తరువాత ఈ వికేంద్రీకరణ వేగం పుంజుకుందని తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు ప్రత్యామ్నాయంగా ఐటీ హబ్‌ల ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు నాస్కామ్, డెలాయిట్ స్పష్టం చేశాయి. 2030 నాటికి నైపుణ్యం మిగులు.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ నిపుణుల కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే 2030 నాటికి ఈ పరిస్థితి మారుతుందని, డిమాండ్ కంటే అధికంగా ఐటీ నిపుణులు ఉంటారని సుకన్యరాయ్ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేలా తగిన మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావడం ఐటీ రంగానికి కలిసివచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, మరోవైపు భవనాల కోసం చెల్లించే అద్దె కానీ, సొంత భవనాల నిర్మాణ వ్యయం కానీ ప్రధాన నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జింగ్ సిటీస్ (కొత్త నగరాలు)లో 25 నుంచి 30 శాతం వరకు తక్కువ వేతనాలకే నిపుణులు లభిస్తుండటం, 50 శాతం వరకు తక్కువకు అద్దెకు భవనాలు లభించడం వంటి అనుకూల పరిణామాలు ఐటీ రంగం వికేంద్రీకరణకు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. -
ప్రాక్సిమస్ గ్రూప్ గూటికి రూట్ మొబైల్
న్యూఢిల్లీ: ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ సేవల సంస్థ రూట్ మొబైల్లో బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్ గ్రూప్ 84 శాతం వరకు వాటాలను దక్కించుకోనుంది. ఇందులో భాగంగా ముందు దాదాపు 58 శాతం వాటాలను రూ. 5,922 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌తో నిబంధనల ప్రకారం.. 26 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రానుండటంతో, ఆ మేరకు షేర్లన్నింటినీ కొనుగోలు చేస్తే మొత్తం 84 శాతం వరకూ వాటాలను పెంచుకునే అవకాశం ఉంది. అయితే, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలనే నిబంధన మేరకు 12 నెలల్లోగా కొన్ని షేర్లను విక్రయించి తన వాటాను 75%కి తగ్గించుకోవాల్సి రానుంది. షేరు ఒక్కింటికి రూ. 1,626.40 చొప్పున అనుబంధ సంస్థ ప్రాక్సిమస్ ఓపల్ ద్వారా ప్రాక్సిమస్ గ్రూప్ తమ సంస్థలో 57.56% వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రూట్ మొబైల్ తెలిపింది. లావాదేవీ పూర్తయ్యాక రూట్ మొబైల్ సీఈవో రాజ్‌దీప్ గుప్తా తన ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతూనే.. గ్రూప్ సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారు. రూట్ మొబైల్లో వాటాల కొనుగోలుతో అంతర్జాతీయంగా సీపాస్ విభాగంలో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రాక్సిమస్ గ్రూప్ సీఈవో గిలామ్ బూటిన్ తెలిపారు. ప్రాక్సిమస్ సంస్థలో పెట్టుబడి.. ఒప్పందం ప్రకారం రూట్ మొబైల్ వ్యవస్థాపక వాటాదారుల్లో కొందరు ప్రాక్సిమస్ ఓపల్లో అలాగే ప్రాక్సిమస్కు చెందిన మరో అనుబంధ సంస్థ టెలీసైన్లో మైనారిటీ వాటాలు తీసుకోనున్నారు. ఇందుకోసం 299.6 మిలియన్ యూరోలను వెచి్చంచనున్నారు. రూట్ మొబైల్ మరింత ముందుగానే బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు టెలీసైన్తో భాగస్వామ్యం ఉపయోగపడగలదని గుప్తా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఎస్ఈలో రూట్ మొబైల్ షేరు సుమారు 9% క్షీణించి రూ. 1,486 వద్ద క్లోజైంది. -
కాశీకి వెళ్తున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడం ఖాయం..!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలోని పలు రోడ్లు, భవనాల పేర్లు త్వరలోనే మారిపోనున్నాయి. ఆయా ప్రాంతాలు నూతన పేర్లతో, పలు హంగులు సంతరించుకోనున్నాయి. నగరంలోని గిరిజాఘర్ రహదారికి భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు పెట్టనున్నారు. ఫాత్మాన్ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డుగా మారనుంది. మక్బుల్ ఆలం రోడ్డు.. బిర్హా గాయకుడు పద్మశ్రీ హీరాలాల్ యాదవ్ రోడ్డుగా మారనుంది. వారణాసి మేయర్ అశోక్ తివారి ఈ మార్పులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కాశీ నగరం ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా పేరొందిందని అశోక్ తివారి పేర్కొన్నారు. ఇక్కడి ప్రాచీనత, ఆధ్మాత్మికత, కళలు, సాహిత్యం, సంప్రాదాయం మానవాళికి మార్గదర్శక మన్నారు. నగరంలోని పలు రహదారులు, భవనాల పేర్లను మార్చేందుకు యోగి సర్కారు నడుంబిగించిందన్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన నగరపాలక సమావేశంలో సభ్యుల సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు. స్థానికతను ప్రతిబింబించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలకు అనుగుణంగా పేర్లు పెట్టడం జరుగుతుందన్నారు. నగరంలోని భోజుబీర్ మార్గానికి రాజర్షి ఉదయ్ ప్రతాప్ జూదేవ్, పాండేయ్పూర్-ఆజమ్గఢ్ రహదారికి మున్షీ ప్రేమ్‌చంద్ పేర్లు పెట్టేందుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. నగరంలోని పలు వార్డుల పేర్లు కూడా మారనున్నాయన్నారు. ఇది కూడా చదవండి: ఈ ఐదు రైళ్లు ఎక్కితే మర్నాడు లేదా ఆ మర్నాడు దిగాల్సిందే..! -
సిబ్బంది లేని రైల్వే స్టేషన్లు అవి.. టిక్కెట్లు ఎవరిస్తారంటే..
మనం పలు రైల్వే స్టేషన్ల పేర్లు వినేవుంటాం. వాటిలో కొన్నింటి పేర్ల చివర సెంట్రల్, టెర్మినల్, రోడ్డు అని ఉండటాన్ని చూసేవుంటాం. అయితే కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చివర పీహెచ్ అని రాసివుంటుంది. అలా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల చివరన పీహెచ్ అని ఉంటుంది. ఇక్కడ పీహెచ్ అంటే పాసింజర్ హాల్ట్ అని అర్థం. అంటే ఈ స్టేషన్లలో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఇటువంటి స్టేషన్లు మిగిలిన స్టేషన్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ స్టేషన్లలో రైల్వేశాఖ తరపున ఎటువంటి అధికారిగానీ, ఉద్యోగిగానీ ఉండరు. పాసింజర్ హాల్ట్ అనేది డీక్లాస్ తరహా స్టేషన్. రైళ్లు ఆగేందుకు సిగ్నల్ చూపేలా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. అయితే సిగ్నల్స్ లేని ఇటువంటి స్టేషన్లలో రైళ్లు ఎలా ఆగుతాయనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇటువంటి రైల్వే స్టేషన్లలో రైళ్లను రెండు నిముషాల పాటు ఆపాలంటూ ట్రైన్ డ్రైవర్‌కు ముందుగానే ఆదేశాలు అందుతాయి. ఈ మేరకు డ్రైవర్ ఆయా స్టేషన్లలో రైళ్లను ఆపుతాడు. కాగా ఇటువంటి స్టేషన్లలో రైల్వే సిబ్బందే లేకపోతే మరి ప్రయాణికులు టిక్కెట్లు ఎలా తీసుకోవచ్చనే సందేహం కలుగుతుంది. ఇటువంటి డీ క్లాస్ స్టేషన్లలో రైల్వేశాఖ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని కమిషన్ ఆధారంగా టిక్కెట్లు విక్రయించేందుకు నియమిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటువంటి రైల్వేస్టేషన్లకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇటువంటి స్టేషన్ల నుంచి రైల్వేకు ఎటువంటి ఆదాయం రావడంలేదని సమాచారం. -
హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్..! తొలిసారిగా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్‌కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్‌కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1000గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్‌కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్‌కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్‌లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్‌ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది. “గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్‌ను సంస్థ ప్రారంభించింది. చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ రిక్వెస్ట్.. ట్వీట్‌తో.. రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్‌లను ఇస్తున్నాం. తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్‌కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్‌కు రూ.1200గా ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తున్నాం. హైదరాబాద్‌లో ప్రస్తుతం జనరల్ మెట్రో పాస్‌లు 1.30 లక్షలు, ఆర్డీనరీ పాస్‌లు 40 వేల వరకు ఉన్నాయి. వాటి మాదిరిగానే కొత్తగా తీసుకువచ్చిన రూట్ పాస్‌ను ప్రయాణికులు ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. -
సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!
కల్లోలిత సూడాన్ నుంచి పౌరులను తరలించేందుకు భారత్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తోంది. ఏప్రిల్ 15న సూడాన్ రాజధాని ఖర్టూమ్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య జరుగుతున్న హోరాహోరి పోరు హింత్మకంగా మారింది. దీంతో సూడాన్ దారుణంగా దెబ్బతింది. ఈ అత్యర్యుద్ధంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఈపాటికే భారత్ కూడా వారిని అప్రమత్తం చేసి, సూచనలందించింది. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ యుద్ధంలో విమానాశ్రయలే దారుణంగా దెబ్బతినడంతో తరలింపు కష్టతరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించిన భారత్ వారిని సురక్షితమైన భూమార్గం గుండా తరలించాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఐతే రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపు ఆపరేషన్‌లో సహయం చేయడం కోసం ప్రస్తుతానికి అక్కడే ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, యూఎస్ ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయాన్ని తన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ని ఉపయోగించి తాత్కాలికంగా నిలిపేసి, సిబ్బంది ఖాళీ చేయించింది. ఈమేరకు మేజేమెంట్ అండ్ సెక్రటరీ అంబాసీడర్ మాట్లాడుతూ..రాపీడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ మాతో సమన్వయమై యూఎస్ ఆపరేషన్‌కు మద్దతిచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారు సహకరించిన మేరకు సహకరించారు. ఆపరేషన్ సమయంలో మా సభ్యులపై కూడా కాల్పులు జరిపారు. ఐతే వారి స్వప్రయోజనాల కోసం చేశారని భావిస్తున్నాం అని అన్నారు. కాగా, వివిధ దేశాల నుంచి 150 మందికి పైగా ప్రజలు ఒక రోజు ముందుగానే సౌదీ అరేబియా చేరుకున్నారు. ఐతే సౌదీలు కాకుండా భారతదేశంతో సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నట్లు సమాచారం. అదీగాక తమ పౌరులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నమని విదేశీ దేశాలు తెలిపాయి. అందులో భాగంగా దక్షిణ కొరియ, జపాన్ తమ సమీపంలో ఉన్న దేశాల నుంచి బలగాలను మోహరించి పౌరులను తరలించే యత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక యూరోపియన్ యూనియన్ కూడా ఇదే తరహాలో తరలించే యత్నం చేస్తోంది. ఐతే ఇప్పటి వరకు సూడాన్‌లో జరిగిన పోరాటంలో దాదాపు 420 మందికి పైగా మరణించారని, మూడు వేలమందికి పైగా గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది కూడా. (చదవండి: విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..) -
నవీన్ ఫ్లోరైన్- రూట్ మొబైల్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో డిజిటల్ కమ్యూనికేషన్ సేవల కంపెనీ రూట్ మొబైల్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ నికర లాభం 43 శాతం ఎగసి రూ. 68 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 319 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 3.23 శాతం బలపడి 24.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్ 11 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవీన్ ఫ్లోరైన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం దూసుకెళ్లి రూ. 2,260 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,268 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. రూట్ మొబైల్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూట్ మొబైల్స్ నికర లాభం రెట్టింపునకుపైగా పెరిగి రూ. 33 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 349 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 2.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో రూట్ మొబైల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 964 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం లాభపడి రూ. 990 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. కాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
రూట్ మొబైల్ లిస్టింగ్.. అధరహో
ఓమ్నిచానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ రూట్ మొబైల్.. బిగ్‌బ్యాంగ్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 350 కాగా.. బీఎస్ఈలో ఏకంగా రూ. 708 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 102 శాతం(రూ. 358) లాభంకాగా.. ప్రస్తుతం రూ. 641 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 735 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 626 వద్ద కనిష్టానికీ చేరింది. ఈ నెల 11న ముగిసిన రూట్ మొబైల్ ఇష్యూ 73 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. గత వారం లిస్టయిన ఐటీ సేవల కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ మరింత అధికంగా 111 శాతం ప్రీమియంతో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన విషయం విదితమే. యాంకర్ నిధులు పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూట్ మొబైల్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితరాలున్నాయి. ఐపీవో ద్వారా రూట్ మొబైల్ మొత్తం రూ. 600 కోట్లను సమీకరించింది. నిధులను రుణ చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ వివరాలు రూట్ మొబైల్ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్ప్రైజెస్, మొబైల్ ఆపరేటర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్ టు పీర్(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్, ఓటీటీ బిజినెస్ మెసేజింగ్, వాయిస్, ఓమ్ని చానల్ కమ్యూనికేషన్ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్ మొబైల్ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. -
రూట్ మొబైల్ ఐపీవోకు యాంకర్ నిధులు
ఐపీవోలో భాగంగా ఓమ్నిచానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ రూట్ మొబైల్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితరాలున్నాయి. లాట్ 40 షేర్లు రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమైంది. శుక్రవారం(11న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 345-350. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షలకు మించకుండా బిడ్స్ దాఖలు చేయవచ్చు. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సందీప్ కుమార్ గుప్తా, రాజ్‌దీప్ కుమార్ గుప్తా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వీటికి అదనంగా మరో రూ. 240 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని రూట్ మొబైల్ భావిస్తోంది. చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ వివరాలు రూట్ మొబైల్ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్ప్రైజెస్, మొబైల్ ఆపరేటర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్ టు పీర్(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్, ఓటీటీ బిజినెస్ మెసేజింగ్, వాయిస్, ఓమ్ని చానల్ కమ్యూనికేషన్ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్ మొబైల్ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. -
మెట్రో: తాజాగా బీహెచ్ఈఎల్ – లక్డీకాపూల్ రూట్!
మెట్రో రెండో దశ ప్రాజెక్టులో తొలుత అనుకున్న రూట్లలో కొన్ని మార్పులు జరిగాయి. తాజాగా బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ (25 కి.మీ) రూట్లో మెట్రో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు రాయదుర్గం– శంషాబాద్ (30 కి.మీ), ఎల్బీనగర్– నాగోల్ (5 కి.మీ) మార్గాల్లో మొత్తంగా 60 కి.మీ రూట్లో రెండో దశ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుపై వేగంగా కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండో దశ ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్లు వ్యయం కానుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రెండో దశ మార్గాల్లో చేపట్టనున్న డిపోలు, స్టేషన్లు, పార్కింగ్ సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాలను ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. – సాక్షి, హైదరాబాద్ బీహెచ్ఈఎల్– లక్డీకాపూల్ రూట్ ఇలా.. బీహెచ్ఈఎల్(రామచంద్రాపురం)లో మెట్రో డిపోకు సుమారు70 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పరిధిలో 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో బీహెచ్ఈఎల్, మదీనగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ జంక్షన్,షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌లలో మెట్రో స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. రాయదుర్గం– శంషాబాద్ రూట్ ఇలా.. రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటుచేయనున్నారు. ఈ మార్గంలో బుద్వేల్ లేదా శంషాబాద్ ప్రాంతాల్లో 60 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో ఏర్పాటు కోసం కేటాయించనున్నారు. ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ఈ మేరకు డీఎంఆర్సీ అధికారులు రెండో దశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా? ప్రస్తుతం రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినప్పటికీ గతంలో మరో ఐదు మార్గాల్లో రెండో దశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఎల్బీనగర్– హయత్‌నగర్, ఎల్బీనగర్– ఫలక్‌నుమా– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మియాపూర్– పటాన్చెరు, తార్నాక– ఈసీఐఎల్, జేబీఎస్– మౌలాలి మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంఆర్సీ నివేదికలో అంశాలివే.. ♦ రెండో దశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక, ట్రాక్‌ల నిర్మాణం ఎలా ఉండాలో సూచించనుంది. ♦ భద్రతాపరమైన చర్యలు ♦ టికెట్ ధరల నిర్ణయం ♦ రెండో దశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ♦ వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన ♦ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూల్ ఖరారు సెప్టెంబర్ తొలి వారంలో ఎల్బీనగర్– అమీర్‌పేట్.. గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైళ్లు ఎల్బీనగర్– అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో సెప్టెంబర్ తొలి వారంలో పరుగులు పెట్టనున్నాయి. ఈ మార్గానికి సంబంధించి త్వరలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ అందనుందని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మార్గం సుగమం కానుంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ రూట్లో నిత్యం సుమారు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అమీర్‌పేట్– హైటెక్ సిటీ (13 కి.మీ) మార్గంలో ఈ ఏడాది నవంబర్‌లో మెట్రో రైళ్లు కూతపెట్టనున్నాయి. ఇక జేబీఎస్– ఫలక్‌నుమా మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. -
ఆ బంగారం.. జస్ట్ టిప్ మాత్రమే!?
ఖట్మాండు : నేపాల్-చైనా వాణిజ్య రహదారిలో బంగారంతో వెళుతున్న ఒక వాహనాన్ని నేపాల్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టిబెట్ నుంచి స్వచ్ఛమైన బంగారంతో ఈ వాహనం ఖట్మాండు వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నేపాల్-చైనా మధ్య అధికారికంగా నిర్వహించబడుతున్న హైవే ఈ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీరంగ్ బోర్డర్ పాయింట్ వద్ద వాహనాన్ని అనుమతించిన ఒక పోలీస్ అధికారికి వాహనదారులు స్వచ్ఛమైన 17 కిలోగ్రాములు బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. -
దారి తప్పిన హీరోయిన్
నెల్లూరు, సిటీ: జిల్ ఫేమ్ రాశిఖన్నా సోమవారం నెల్లూరులోని ఓ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళుతూ కారు డ్రైవర్ తప్పిదంతో దారి తప్పడం వల్ల ఆలస్యంగా హాజరైందని సమాచారం. నగరంలోని లాట్ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. హీరోయిన్ రాశిఖన్నా ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం రాశి హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడినుంచి ఓ ట్రావెల్స్‌కు చెందిన కారులో నెల్లూరుకు పయనమైంది. అయితే, డ్రైవర్ పొరపాటున నెల్లూరు వైపునకు బదులు వేలూరు వైపు తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో 11.45 నిమిషాలకు షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరు కావాల్సి ఉండగా 2 గంటలకు వచ్చారు. ఈ విషయాన్ని షోరూమ్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. -
అరచేతిలో బస్సు గుట్టు!
"FindBus@Hyd' యాప్‌ను విడుదల చేసిన రిక్తమ్ సంస్థ త్వరలో ఇతర పట్టణాలకూ విస్తరణ సాక్షి, బంజారాహిల్స్: ‘మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నారా? అది ఏ రూట్లో వస్తోందో...ఎక్కడ ఉందో... మీరు ఉన్న చోటుకు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలనుందా?... ఈ సమాచారం ఇక మీ అరచేతిలోనే ఉండబోతోంది. ఈ వివరాలన్నీ చిటికెలో మీ కళ్ల ముందు ప్రత్యక్షం కాబోతున్నాయి. దీని కోసం రిక్తమ్ టెక్నాలజీ కన్సల్టెంట్ ప్రై.లి. "FindBus@Hyd'పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా సోమవారం తాజ్ బంజారాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిక్తమ్ టెక్నాలజీ డెరైక్టర్ సిద్ధార్థ కొంగర ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే... ‘హైదరాబాద్‌లో బస్సులో ప్రయాణించడమంటే కత్తిమీద సామే. ఓ వైపు విపరీతమైన ట్రాఫిక్, మరోవైపు అర్థం కాని బస్సు రూట్లు. ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతుంటాం. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించేందుకుసరికొత్త టెక్నాలజీతో ఉచితంగా సేవలను అందించేందుకు "Find-B-us-@-Hyd' యాప్‌ను రూపొందించాం. దీనికి ఇంటర్నెట్ సాయం అవసరం లేదు. ఐ ఫోన్, ఆండ్రాయిడ్ వాళ్లకే.. ప్రస్తుతం ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించేవాళ్లకుమాత్రమే ఈ "FindBus@Hyd'యాప్‌ను వినియోగించుకునే వీలుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే.. http://bit.ly/findbushyd,ఐ ఫోన్ ఉంటే. http://bit.ly/findbushyd.ios లింక్‌ల నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో అన్ని సెల్‌ఫోన్లలోనూ ఈ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తాం. ఇతర పట్టణాలకూ విస్తరిస్తాం మనం ఎక్కిన బస్సు ఎంత సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటుంది?... టికెట్టు ధర ఎంత? వంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా రెండు నెలల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. అంతేకాకుండా విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ ఈ సేవల విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నాం’ అని చెప్పారు. విలేకరుల సమావేశంలో సెట్విన్ ఎమ్డీ సుభాష్ చంద్రబోస్, రిక్తమ్ టెక్నాలజీ ఎమ్డీ సిద్ధారాయ్ షింగ్‌శెట్టి, డెరైక్టర్ సిద్ధార్థ కొంగర, ఫైండ్‌బస్ యాప్ డెవలపర్లు రేవతి మీనంపల్లి, మౌనిక వంగాలా పాల్గొన్నారు. "FindBus@Hyd'యాప్‌తో ప్రధానంగా 4 రకాల సేవలను పొందవచ్చు. సెర్చ్ బై బస్ ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఆ రూట్లో వెళ్లే బస్సుల సమాచారం తెలుస్తుంది. సెర్చ్ బై బస్ ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఆ రూట్లో వెళ్లే బస్సుల సమాచారం తెలుస్తుంది. సెర్చ్ బై సోర్స్ అండ్ డెస్టినేషన్ ప్రారంభ స్థానం, గమ్యస్థానాన్ని ఎంటర్ చేస్తే చాలు.. ఆ రూట్లో వెళ్లే బస్సుల నంబర్లు, మార్గమధ్యలో వచ్చే బస్ స్టాపుల వివరాలు, మారాల్సిన బస్సుల రూట్లు కూడా తెలుస్తాయి. సెర్చ్ బై రూట్ ఏదైనా ఒక స్టాప్‌ను ఎంపిక చేసుకుంటే ఆ స్టాప్ మీదుగా వెళ్లే బస్సుల సమాచారం తెలుస్తుంది. స్టాప్ నియర్ మి మనకు దగ్గర్లో ఉన్న బస్ స్టాపులవివరాలు తెలుసుకోవచ్చు. -
తెలంగాణ జెఏసీకి దారేది?