ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వెళ్లేవారు ఇకపై అక్కడి మెట్రోలో సిటీనంతా చుట్టేయచ్చు. ఆగ్రాలో మెట్రో సేవలు గురువారం(2024, మార్చి, 7) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ఆగ్రా మెట్రోను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. దీని దూరం ఆరు కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరు స్టేషన్లలో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి సామాన్య ప్రజలు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఆగ్రా మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు సాగించనుంది. ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే..
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off metro railway services from Kavi Subhash Metro, Majerhat Metro, Kochi Metro, Agra Metro, Meerut-RRTS section, Pune Metro, Esplanade Metro- Kolkata. pic.twitter.com/2s8mNCjUiX
— ANI (@ANI) March 6, 2024
ఆగ్రా మెట్రో గంటకు 90 కి.మీ వేగంతో నడుస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో స్టేషన్‌లను పర్యవేక్షిస్తారు.
ప్రయాణికులెవరైనా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టేషన్‌లో నిలబడితే అలారం మోగుతుంది.
మొదటి దశ 6 మెట్రో స్టేషన్లు.. తాజ్ ఈస్ట్ గేట్, కెప్టెన్ శుభమ్ గుప్తా మెట్రో స్టేషన్, ఫతేబాద్ రోడ్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మంకమేశ్వర్ టెంపుల్
ఒక మెట్రో స్టేషన్ మధ్య ప్రయాణానికి రూ.10, చివరి స్టేషన్‌ను రూ.60గా చార్జీలను నిర్ణయించారు.
ఒక కోచ్‌లో 60 సీట్లు ఉంటాయి.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment