fare
-
ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే..
ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వెళ్లేవారు ఇకపై అక్కడి మెట్రోలో సిటీనంతా చుట్టేయచ్చు. ఆగ్రాలో మెట్రో సేవలు గురువారం(2024, మార్చి, 7) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ఆగ్రా మెట్రోను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. దీని దూరం ఆరు కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరు స్టేషన్లలో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి సామాన్య ప్రజలు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఆగ్రా మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు సాగించనుంది. ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే.. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off metro railway services from Kavi Subhash Metro, Majerhat Metro, Kochi Metro, Agra Metro, Meerut-RRTS section, Pune Metro, Esplanade Metro- Kolkata. pic.twitter.com/2s8mNCjUiX — ANI (@ANI) March 6, 2024 ఆగ్రా మెట్రో గంటకు 90 కి.మీ వేగంతో నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులెవరైనా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టేషన్లో నిలబడితే అలారం మోగుతుంది. మొదటి దశ 6 మెట్రో స్టేషన్లు.. తాజ్ ఈస్ట్ గేట్, కెప్టెన్ శుభమ్ గుప్తా మెట్రో స్టేషన్, ఫతేబాద్ రోడ్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మంకమేశ్వర్ టెంపుల్ ఒక మెట్రో స్టేషన్ మధ్య ప్రయాణానికి రూ.10, చివరి స్టేషన్‌ను రూ.60గా చార్జీలను నిర్ణయించారు. ఒక కోచ్‌లో 60 సీట్లు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. -
ఎడ్ల నాగలికి డిమాండ్.. రోజుకు రూ.3వేలు
జగిత్యాల అగ్రికల్చర్: వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. నాగళ్లు.. కాడెడ్లు కనుమరుగు అవుతుండగా సమయం ఆదాకోసం రైతులు సైతం యాంత్రీకరణ వ్యవసాయం వైపే చూస్తున్నారు. కాడెడ్లు, నాగలిపట్టే మట్టిమనుషులు కరువవుతున్నారు. దీంతో విత్తనాలు వేసేందుకు కాడెడ్లతో పాటు దున్నేందుకు మనిషిని కిరాయి తీసుకునే పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు పసుపు, పత్తి వంటి విత్తనం వేసేందుకు మనిషికి నాగలితో సహా రూ.3వేల వరకు చెల్లిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాడెడ్ల పోషణ నుంచి తప్పుకుంటున్న అన్నదాత ► గ్రామాల్లో ప్రతీరైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. కనీసం ఒక జత కాడెడ్లు లేనివారిని రైతులు అనేవారు కాదు. కాడెడ్లను అమ్ముకునేవారు కాదు. ప్రస్తుతం కాడెడ్లను పోషించే స్థోమత రైతులకు ఉన్నప్పటికీ, వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్మేస్తున్నారు. ► దుక్కి దున్నడం నుంచి పంటకోసే వరకు ప్రతీపని ట్రాక్టర్‌తో చేయడం, ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఉండడం, వాటికి రకరకాల పరికరాలు తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి వాడుతున్నారు. ► ప్రస్తుతం ఏ గ్రామంలో చూసిన పది జతల మించి కాడెడ్లు లేవు. దీంతో విత్తనం వేసేందుకు కాడెడ్లు ఉన్నవారివైపు మిగతా రైతులు చూసే పరిస్థితి నెలకొంది. గతంలో ఇరుగుపొరుగు వారు కలిసి విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటం, భూమిలో తేమ ఎక్కువైనా, తక్కువైనా విత్తనాలు వేయడం ఇబ్బందిగా మారడంతో కాడెడ్ల కోసం రైతులు వెతికకే పరిస్థితి నెలకొంది. ► ట్రాక్టర్‌తో పోల్చితే కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే, భూమిలో అనుకున్నంత లోతులో విత్తనం పడి, బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లా రైతులు ఎక్కువగా పసుపు విత్తనం వేసేందుకు కాడెడ్లపైనే ఆధారపడుతుండటంతో, ఎడ్ల నాగలికి గిరాకీ పెరిగింది. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోనూ పత్తివిత్తనాలు వేసేందుకు కాడెడ్లు ఉన్నవారిని ఆశ్రయిస్తున్నారు. ► కాడెడ్లు ఉన్నవారికి ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దున్నితే రూ.3 వేలు ఇస్తున్నారు. మరికొంతమంది విత్తనాలు వేసేవరకు కేవలం కాడెడ్లను రూ.10–15 వేలకు కిరాయికి తీసుకొస్తున్నారు. ఎద్దుల జత ధర రూ.70వేల నుంచి రూ.80వేల వరకు ఉండటంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. రూ.3వేలకు కిరాయికి తీసుకున్న పెద్దగా పనిలేక ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3 వేలకు కిరాయికి తీసుకున్నా. వారంరోజుల ముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. – క్యాతం సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్ ఎడ్లు దొరికే పరిస్థితి లేదు విత్తనం కోసం ఎడ్లు కొందామన్నప్పటికీ దొరికే పరిస్థితి లేదు. ఒక్కోజతకు రూ.80 వేల ధర ఉంది. దీంతో, విత్తనం వేసే వారం రోజులు ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాను. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తాను. – రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాల రూరల్ -
ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా..న్యూస్ చెప్పిన క్యాబ్ కంపెనీలు!
ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా షాకిస్తున్నాయి ఆయా క్యాబ్ కంపెనీలు. సమ్మర్ సీజన్లో క్యాబ్‌లో ప్రయాణిస్తే వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఏసీని ఉపయోగిస్తుంటాం. కానీ ఇకపై క్యాబ్‌లో తిరిగే ప్రయాణికులు ఏసీ వినియోగించుకుంటే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు క్యాబ్ డ్రైవర్లు సిద్ధమయ్యారంటూ పలు వార్త కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం ప్రయాణికుల్ని ఆందోళన కలిగిస్తుండగా..తాజాగా యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఉబర్ తాజాగా ట్రిప్ ఛార్జీలను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది ఉబర్ క్యాబ్ ఛార్జీలను పెంచింది. గతేడాది ఉబర్ ఏప్రిల్ నెలలో 15శాతం ఛార్జీలను పెంచింది. ఈ ఏడాది తాజాగా దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఉబర్ క్యాబ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా సౌత్ ఏసియా సెంట్రల్ ఆపరేషన్ హెడ్ నితీష్ భూషణ్ తెలిపారు. ‘ఇంధన ధరలలో ప్రస్తుత పెరుగుదల డ్రైవర్లను ఆందోళన కలిగిస్తోంది. వారి నుంచి వచ్చిన విన్నపం మేరకు ట్రిప్ ఛార్జీలను 15% పెంచుతున్నాం. రాబోయే వారాల్లో ఇంధన ధరల కదలికలను పరిశీలిస్తామని చెప్పారు. కాగా ఉబర్ సంస్థ హైదరాబాద్, ముంబై సహా పలు నగరాల్లో చార్జీలను సవరించింది.అవసరమైన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఉబర్ ఇండియా, సౌత్ ఆసియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీశ్ భూషన్ తెలిపారు. ఏసీ ఆన్ చేశారా? ఇక బాదుడే జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఆయా క్యాబ్ సంస్థలకు చెందిన క్యాబుల్లో జర్నీ చేసే ప్రయాణికులు ఏసీ ఉపయోగిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా పలు క్యాబుల్లో ఏసీ ఆన్ చేస్తే ఎంత చెల్లించాలో తెలుపుతూ పలు బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామంటూ క్యాబ్ సంస్థల డ్రైవర్లు స్టికర్లను అతికించారు. చదవండి: క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్ చార్జీలను ఆర్టీసీ పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. జనరల్ బస్ టికెట్ (జీబీటీ) పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగింది. ఎన్జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి.. ఆర్డినరీ పాస్ చార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్–ఆర్టీసీ కోంబో టికెట్ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. ఇటీవలే సేఫ్టీ సెస్ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్ చేయటంతో గరిష్టంగా టికెట్ ధర రూ.5 మేర పెరిగింది. గతం లో రౌండాఫ్ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్ చార్జీలను సవరించింది. అసలైన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం సీఎం వద్ద పెండింగులో ఉంది. ఆయన అనుమతిస్తే అవి కూడా పెరగనున్నాయి. -
తెలంగాణ ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. వాళ్లకి బస్ జర్నీ ఫ్రీ..
సాక్షి, హైదరాబాద్: చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన సంవత్సర కానుక ప్రకటించింది. తల్లిదండ్రులతోకలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12 ఏళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో ఉంటుందని చెప్పారు. (చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా ) -
విస్తారా సేల్: 75శాతం తగ్గింపు
సాక్షి, ముంబై: విమానయాన సంస్థలు వరసపెట్టి మరీ డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ స్పెషల్ మాన్సూన్ ఆఫర్, జెట్ ఎయిర్వేస్ బిగ్ సేవింగ్స్ తరహాలోనే విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా తాజా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశీయ మార్గాల్లో విమాన టికెట్లపై 75 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. పరిమిత కాలం ఆఫర్‌గా ఇది ఈ రోజు(మంగళవారం) అర్ధరాత్రి నుండి 24 గంటలపాటు అందేబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. తన మొత్తంలో నెట్‌వర్క్‌లో ఈ సేల్ పథకంలో భాగంగా టికెట్ ధరలపై 75శాతం తగ్గింపును అందించనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా జూన్ 21నుంచి సెప్టెంబర్ 27 దాకా ప్రయాణానికి అనుమతి. ఢిల్లీ - లక్నో లాంటి చిన్నమార్గాల్లో రూ.1599 టికెట్ లభిస్తుండగా, ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-రాంచీ మధ్య విమాన టికెట్లను రూ.2199కే ఆఫర్ చేస్తోంది.అలాగే ఢిల్లీ-కోలకతా, ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.2,299 గా ఉండనుంది. కోలకతా- పోర్ట్ బ్లెయిర్ విమాన టిక్కెట్ల ధరలు 2,499 రూపాయలు, ఢిల్లీ-గోవా మధ్య రూ.2,799 ప్రారంభ ధరలుగా ఉంటాయని విస్తారా తెలిపింది. అన్ని చార్జీలను కలిపిన తరువాతే ఈ ధరలని ప్రకటించింది. కాగా దేశీయంగా 22 మార్గాల్లో 20 ఎయిర్‌బస్‌లు, ఎ320 విమానాలతో వారానికి 800 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది విస్తారా. -
ఓలా, ఉబర్ క్యాబ్ లకు మీటర్లు తప్పనిసరి!
న్యూఢిల్లీః ఓలా, ఉబర్ వంటి టాక్సీ అగ్రిగేటర్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఇష్టారాజ్యంగా రేట్లను పెంచి, అనైతికంగా వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేట్ క్యాబ్ లపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉబర్, ఓలా ట్యాక్సీల ధరల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. త్వరలో అటువంటి నిబంధనలను మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తేనుంది. ఆయా అగ్రిగేటర్లను 'ఇంటర్మీడియరీస్' పేరున రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వర్గంగా గుర్తించనుంది. ఓలా, ఉబర్ ట్యాక్సీలు అమాంతం రేట్లను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రైవేట్ క్యాబ్ ల దోపిడీ రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం స్పందించింది. వారిని కూడ మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి తెచ్చి ధరలపై నిబంధనలు విధించేందుకు కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు సూచించిన ధరలను అనుసరించే విధంగా చట్టం రూపొందనుంది. భారత ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించనున్న 'ఇంటర్ మీడియరీస్' వర్గం ఇంన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 పరిధిలోకి కూడ వస్తుంది. ఈ విషయంలో చివరి నిర్ణయం తీసుకునేందుకు ఎనిమిది రాష్ట్రాల రవాణా మంత్రులు జూన్ చివర్లో ధర్మశాలలో సమావేశం కానున్నారు. అనుకున్న ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఓలా, ఉబర్ క్యాబ్ లు కూడ ఆటోల్లాగే ఆయా నగరాల నిబంధనలను బట్టి మీటర్లు, డ్రైవర్ల డ్రస్ కోడ్.. వంటివి పాటించాల్సి ఉంటుంది. -
ఆ ట్రైన్ టికెట్ ధర రూ. 3300
న్యూఢిల్లీ: అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలతో పొల్చితే అరశాతం మాత్రమే ఎక్కువగా ఉండనున్నట్టు తమ ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వశాఖ పార్లమెంట్‌కు తెలిపింది. రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాతపూర్వకంగా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్‌కు బుధవారం తెలిపారు. 'మొదటి దశ బుల్లెట్ ట్రైన్ల గరిష్ట వేగాన్ని గంటకు 350 కిలో మీటర్లుగా, ఆపరేటింగ్ వేగాన్ని గంటకు 320 కిలో మీటర్లుగా నిర్ధారించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణానికి 2.07 గంటల సమయం పడుతోంది. ప్రతి స్టేషన్లో స్టాప్ ఉంటే 2.58 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ-నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ- చెన్నై కారిడార్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతుంది' అని తమ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్ కు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర అహ్మదాబాద్- ముంబైకి ప్రయాణించడానికి 2200 రూపాయలు ఖర్చు అవుతుంది. హై స్పీడ్ కారిడార్ గుండా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణిస్తే రైల్వే మంత్రిత్వ శాఖనిర్ధారించిన టారిఫ్ ప్రకారం టికెట్ ధర రూ.3300 అవుతుంది. -
విమానాల్లో చార్జీల మోత!!
-
సంక్రాంతి రద్దీ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక దోపిడీ
-
ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తున్న 'మద్యం'
కాన్బెర్రా : మద్యం ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తుందా అంటే అవుననే వెల్లడిస్తుంది తాజా నివేదిక. మద్యం తాగుతున్నవారిలో రోజుకు 15 మంది ఆస్ట్రేలియన్లు మరణిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. అలాగే 430 మంది ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపింది. మద్యం తాగుతున్నవారిపై విక్హెల్త్ అండ్ ఫౌండేషన్ ఫర్ అల్కహాల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏఆర్ఈ) ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే నివేదికను గురువారం ఇక్కడ విడుదలు చేసింది. 2010 నాటి నుంచి గణాంకాలు ఆధారంగా మద్యం సేవిండం వల్ల 5554 మంది మృతి చెందారని, 157,132 మంది ఆసుపత్రి పాలైయ్యారని వివరించింది. మద్యం సేవించడం వల్ల మృతి చెందుతున్న ఆస్ట్రేలియన్ల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని తెలిపింది. గతంలో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండేదని అయితే గత దశాబ్ద కాలంలో 62 శాతం మేర మృతుల సంఖ్య పెరిగిందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మైఖేల్ త్రొన్ వెల్లడించారు. మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాలను అరికట్టేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఇప్పటికైనా తేరుకోకుంటే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని మైఖల్ వివరించారు. ఆస్ట్రేలియన్లు మద్యం సేవించడం వల్ల కలిగే దుష్పలితాలను అన్ని కోణాల్లో ఆ నివేదక ఆవిష్కరించింది. -
బకాయిల చెల్లింపు కోసం బాదుడు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఎమ్మెస్సార్టీసీ) బస్ చార్జీలను 2.5 శాతం మేర పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన చార్జీలు మొదటి రెండు స్టేజీ (12 కి.మీ.)లకు వర్తించవని, ఆపై ప్రయాణానికి 2.5 శాతం చొప్పున చార్జీలు వసూలు చేస్తారన్నారు. ఎమ్మెస్సార్టీసీ ఉద్యోగులకు ఏరియర్స్‌ను పెంచి ఇచ్చేందుకే ఈ చార్జీలను పెంచాల్సి వచ్చిందని చెప్పారు. ఏరియర్స్ పెంచకపోతే జూన్ 4 నుంచి ఆందోళనకు దిగుతామని సిబ్బంది, యూనియన్లు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో ఏసీ బస్సు చార్జీలు కూడా... ఏసీ బస్సుల చార్జీలను కూడా పెంచే అవకాశముందని, త్వరలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు పెంచాలని నిర్ణయించిన చార్జీల పట్టిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారని, పట్టిక సిద్ధమవుతోందన్నారు. శ్రమ ఫలించింది..: యూనియన్లు ఏరియర్స్ పెంపు కోసం తాము చేస్తున్న ఆందోళన సత్ఫలితాలనిచ్చిందని యూనియన్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏరియర్స్, కరవు భత్యాన్ని పెంచాలని కొన్ని నెలలుగా కోరుతున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో మంగళవారం పలు డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించామని, జూన్ 4వ తేదీన 80 వేలకుపైగా సిబ్బందితో ఆందోళనకు దిగుతామని హెచ్చరించామని యూనియన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చార్జీలను పెంచిన తర్వాత కూడా ప్రభుత్వం ఏరియర్స్‌ను చెల్లించేందుకు నిరాకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు నెలల్లోపే... మార్చిలో చార్జీలను పెంచుతూ ప్రయాణికులపై భారం మోపిన ఎమ్మెస్సార్టీసీ మూడు నెలలు తిరగకుండానే మరోసారి చార్జీలను పెంచింది. గత మార్చిలో ఏసీ బస్ చార్జీలను రూ.15 పెంచారు. దాదర్-పుణే ఏసీ బస్ చార్జీలను రూ.390 నుంచి 405కు పెంచారు. బోరివలి నుంచి పుణే వరకు ప్రయాణించేవారికి రూ.465 నుంచి 480 వరకు చార్జీలను పెంచారు. ఏసీ బస్సు చార్జీలను కూడా త్వరలో పెంచనున్నారు. -
రైల్వే ప్రయాణానికి విమాన చార్జీలు!
సంక్రాంతి.. దసరా లాంటి ముఖ్యమైన పండుగలు వస్తే ప్రజల కంటే ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల యజమానులే ఎక్కువగా సంబరపడిపోతుంటారు. కారణమేంటంటే ప్రయాణికుల రద్దీ వల్ల వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రైవేట్ సహా ఆర్టీసీ యాజమన్యాలు టిక్కెట్ చార్జీలు భారీగా పెంచి సొమ్ము చేసుకుంటుంటాయి. స్పెషల్ బస్సుల్లో అయితే మామూలు కంటే 50 శాతం ఎక్కువ చార్జీ ఉంటుంది. ఇప్పుడు రైల్వే శాఖ వీళ్లందరి కంటే నాలుగాకులు ఎక్కువ చదివేసింది. హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-జమ్మూ సెక్టార్ల మధ్య రెండు సూపర్ ఫాస్ట్ ప్రీమియమ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని నిర్ణయించింది. టిక్కెట్ చార్జీలను మాత్రం కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెంచేసింది. ఏకంగా 250 నుంచి 300 శాతం వరకు ఉండే అవకాశముంది. చివరి నిమిషంలో వీటిలో బుక్ చేసుకుంటే మాత్రం 2500 రూపాయల 2 టైర్ ఏసీ టిక్కెట్ ధర 7000 లేదా మరింత ఎక్కువ కూడా పెరగొచ్చు. వీటితో పోలిస్తే విమాన చార్జీలే తక్కువ. ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా రైల్వే శాఖకు భారీ ఆదాయం సమకూరనుంది. డిమాండ్‌ను బట్టి టిక్కెట్ల ధరను పెంచుతుంటామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా ఢిల్లీ నుంచి ముంబై, జమ్మూలకు తగిన సంఖ్యలో రైళ్ల ఉన్నాయి. హోలీకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో ఇవి చాలడం లేదు. విమానాలకు కూడా రద్దీ ఎక్కవుగా ఉంటోంది. రైల్వే శాఖకు ఇదే కలిసొచ్చింది. ఢిల్లీ నుంచి ఈ నెల 14, 16న ముంబైకి, 14, 16, 21న జమ్మూకు ప్రత్యేక రైళ్లు బయల్దేరుతాయి.