Metro Rail project
-
Hyderabad Metro Phase 2: కేంద్రం అనుమతే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు(Hyderabad Metro Phase 2) కేంద్రం అనుమతే కీలకం! కేంద్రం అనుమతి కీలకంగా మారింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టులో 5 కారిడార్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ సంస్థ డీపీఆర్‌ను సైతం రూపొందించింది. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రం అనుమతి కోసం పంపించారు. ఈ రెండో దశలోనే ఫోర్త్‌సిటీతో పాటు ఉత్తరం వైపు మరో రెండు కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కారిడార్ల డీపీఆర్ కోసం అధికారులు తాజాగా కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాతబస్తీలో భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు చురుగ్గా సాతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం మెట్రో రెండోదశకు పచ్చజెండా ఊపుతుందా? లేక మొండిచేయి చూపుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వాటా 18 శాతం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదించిన రెండో దశలో మొదట 5 కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.24,269 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను అంటే రూ.7,313 కోట్లు వెచ్చిస్తుంది. రూ.4,230 కోట్లతో కేంద్రం 18 శాతం నిధులను అందజేస్తుంది. మిగతా 48 శాతం నిధులను అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా సేకరించాలనేది ప్రతిపాదన. మరో 4 శాతం (రూ.1033కోట్లు) పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో(Budget) కేంద్రం తన వాటాగా ఏ మేరకు నిధులను కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దశలవారీగా ప్రాజెక్టు విస్తరణ పనులు కొనసాగనున్న దృష్ట్యా 18 శాతం వాటాలో ఈ బడ్జెట్లో కొద్ది మేరకైనా నిధులు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరానికి వచి్చన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్తోనూ సీఎం రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. మెట్రోతోపాటు మూసీ ప్రక్షాళన, నగర అభివృద్ధి కోసం నిధులను అందజేయాలని కోరారు. ఈ మేరకు మెట్రోకు కేంద్రం నుంచి సముచితమైన నిధులు లభించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.పూచీకత్తు ఎంతో ముఖ్యం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే ‘సావరిన్ గ్యారంటీ’ కూడా మెట్రో రెండో దశకు కీలకంగా మారింది. సావరిన్ గ్యారంటీ ఉంటేనే జైకా, మలీ్టలేటర్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలను అందజేసేందుకు ముందుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధుల కంటే బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరించే రూ.వేల కోట్ల రుణాలపైనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. 48 శాతం నిధులను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చే పూచీకత్తు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందుకోసం భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి వస్తేనే రెండో దశ పనులు ముందుకు సాగుతాయి. -
కొత్త మెట్రోలకు ఏప్రిల్‌లో టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చిలోగా డీపీఆర్‌లు (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు) పూర్తి చేసి, కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై సీఎం మంగళవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం–ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ), జేబీఎస్–శామీర్‌పేట మెట్రో (22 కి.మీ), ప్యారడైజ్–మేడ్చల్ మెట్రో (23 కి.మీ) మార్గాలకు సంబంధించిన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎలైన్మెంట్ రూపొందించే సమయంలోనే క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. మేడ్చల్ మార్గంలో జాతీయ రహదారిపై ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ తీసుకెళ్లాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైంతన త్వరగా ప్రారంభించాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకేచోట ప్రారంభం కావాలి శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకేచోటు నుంచి ప్రారంభమయ్యేలా చూడాలని, అక్కడ అధునాతన వసతులు, భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి నగరంలోకి రానవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్లాగ్షిష్ కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరానికి వెళ్లే రైలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. నగర ఉత్తర ప్రాంతాలను అనుసంధానిస్తూ రెండు కీలకమైన మెట్రో రైలు కారిడార్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల పొడవుతో రెండు కారిడార్లకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి డీపీఆర్ తయా రు చేయాలని.. మెట్రో రైల్ ఫేజ్–2 ‘బీ’లో భాగంగా ఈ రెండు కారిడార్లను కూడా కేంద్రం అనుమతి కోసం పంపించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. సీఎం బుధవారం ఈ అంశంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, ఎన్వీఎస్ రెడ్డిలతో చర్చించారు. ప్రతిపాదిత కారిడార్లు ఇవీ.. ప్యారడైజ్ మెట్రోస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్లు కారిడార్ ఉంటుంది. ఇది నిజామాబాద్/ఆదిలాబాద్ వెళ్లే మార్గం (నేషనల్ హైవే నంబర్ 44) వెంట కొనసాగుతుంది. అలాగే జేబీఎస్ (జూబ్లీ బస్‌స్టేషన్) మెట్రోస్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. ఇది కరీంనగర్/రామగుండం వెళ్లే రాజీవ్ రహదారి వెంట కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రెండు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ నిర్ణయించింది కూడా. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మెట్రో కలసి డబుల్ డెక్కర్ మార్గంగా నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో తాను మల్కాజిగిరి ఎంపీగా ఉన్నందున ఆ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, కారిడార్ల రూట్ మ్యాప్‌లపై అవగాహన ఉందని... అయినా రూట్‌మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచనలు, సలహాలను తీసుకోవాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ సూచించారు. మూడు నెలల్లో డీపీఆర్ సీఎం ఆదేశాల మేరకు ఉత్తర ప్రాంతంలోని రెండు మెట్రో కారిడార్లకు సంబంధించి మూడు నెలల్లో డీపీఆర్ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశలోని పార్ట్ ‘బీ’లో భాగంగా పరిగణిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీపీఆర్‌కు అనుమతి లభించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామని వెల్లడించారు. వీటి నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు నెలల కిందే రెండోదశ ఆమోదం హైదరాబాద్ మెట్రో రైల్ రెండోదశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్లోనే ఆమోదం తెలిపింది. రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర పార్ట్–ఏ కింద ఐదు కారిడార్ల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. అలాగే పార్ట్–బి కింద శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కిలోమీటర్ల పొడవున ఆరో కారిడార్ నిర్మించనున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ప్యారడైజ్– మేడ్చల్, జేబీఎస్– శామీర్‌పేట కారిడార్లను కూడా పార్ట్–బిలోనే చేర్చనున్నారు. ఇప్పటికే మూడు కారిడార్లలో నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా అధికారులు చెబుతున్నారు. రెండో దశలోని పార్ట్–ఏ, పార్ట్–బి మార్గాలు కూడా పూర్తయితే... హైదరాబాద్ మెట్రోరైల్ 11 కారిడార్లు, 240.4 కిలోమీటర్లకు చేరుతుంది. ఉత్తర ప్రాంతాలకు ఎంతో మేలు: మంత్రి పొన్నం ప్రభాకర్ శామీర్‌పేట, మేడ్చల్‌లకు రెండు కొత్త మెట్రో కారిడార్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు నగరంలోని ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని గుర్తు చేశారు. ఈ రూట్లలో ఇప్పటికే ఎక్స్‌ప్రెస్ రోడ్లు మంజూరువడం, తాజాగా మెట్రో నిర్మాణం చేపట్టనుండటంతో.. ఈ ప్రాంతాల ప్రజల కష్టాలు తీరుతాయని మంత్రి చెప్పారు. -
పుణె, థానే, బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో పుణే, థానే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు ప్రాజెక్టుల పొడగింపునకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్–3లో రెండు కొత్త కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 44.65 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లలో మొత్తం 31 సేష్టన్లు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. జేపీ నగర్– కెంపపురా, హోషహళ్లి– కడబగెరే కారిడార్ల నిర్మాణానికి రూ.15,611 కోట్ల ఖర్చు కానుంది. బెంగళూరు పశి్చమ ప్రాంతాన్ని ఈ మెట్రోరైలు ప్రాజెక్టు మెరుగ్గా అనుసంధానిస్తుందని కేంద్రం పేర్కొంది. పుణె మెట్రో ఫేజ్–1లో స్వరగేట్– కాట్రాజ్ భూగర్భ రైల్వే లైన్ పొడిగింపునకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. పుణే శివార్లలో కనెక్టివిటీని పెంచే ఈ లైన్–1బి పొడిగింపు ప్రాజెక్టు వ్యయం రూ.2,954 కోట్లని, కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చును సమంగా భరిస్తాయని తెలిపింది. థానే పశి్చమ ప్రాంతాన్ని కలుపుతూ వెళ్లే.. థానే ఇంటెగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు కారిడార్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కారిడార్‌లో 22 స్టేషన్లు ఉంటాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12,200 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరిస్తాయని వెల్లడించింది. రెండు విమానాశ్రయాల విస్తరణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ శుక్రవారం రెండు విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేసింది. పశి్చమబెంగాల్‌లోని బగ్డోగ్రా విమానాశ్రయంలో రూ. 1,549 కోట్లతో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. బిహార్‌లోని బిహ్తా విమానాశ్రయాన్ని రూ. 1,413 కోట్లతో విస్తరించనున్నారు. -
అమరావతి కోసం విశాఖ మెట్రో ప్రాజెక్టుకు బ్రేక్
-
మెట్రోకు మళ్లీ మోకాలడ్డు!
విశాఖపట్నం వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోపై మళ్లీ చంద్రబాబు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి అంతా ఒక్కచోటకే పరిమితం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు విశాఖ నగరాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ముందు అమరావతికి మెట్రో రైలు వచ్చేవరకు రాష్ట్రంలో ఇంకెక్కడా మెట్రో ఉండకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పనులకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. వాటిని మరింత ఆలస్యం చేసేందుకు మళ్లీ మొదటికి తీసుకొస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే దీన్ని రద్దు చేసి కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇందుకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, విశాఖపట్నంచంద్రబాబుకి నచ్చలేదట.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపటా్నన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం ముందడగు వేసింది. లైట్ మెట్రో ప్రాజెక్టును పట్టాలక్కెంచేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంటూ గతేడాది డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ని కూడా పంపింది. అయితే.. కూటమి ప్రభుత్వం రావడంతో ఆలస్యం, అలసత్వం చోటు చేసుకుంటున్నాయి. విశాఖ అభివృద్ధి తమకు ఇష్టం లేదన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖలో పర్యటించిన ఆయన మెట్రో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్థాయిలో మెట్రో డీపీఆర్ తయారు చేసినట్లు వివరించినా.. తనకు ఆ డీపీఆర్ నచ్చలేదని చంద్రబాబు చెప్పేశారు. మళ్లీ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఇలాగైతే మోక్షమెప్పుడో.. జాతీయ రహదారుల నిర్మాణాల్లో తలమునకలైన ఎన్హెచ్ఏఐతో కలిసి మెట్రో డీపీఆర్ రూపొందించడం అనేది అంతులేని కథగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఆలస్యం, అలసత్వంతో వైజాగ్‌కు మెట్రో రాకుండా చేసేందుకే చంద్రబాబు ఈ తరహా ఆదేశాలు జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందు గన్నవరం నుంచి అమరావతి వరకు మెట్రో రైలు నిర్మించడమే చంద్రబాబు లక్ష్యమని తెలుస్తోంది. అది పూర్తయ్యే వరకూ రాష్ట్రంలో ఎక్కడా మెట్రో మాటే లేకుండా కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. కొత్త డీపీఆర్ తయారీకి.. ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. దానిలో మార్పులు చేర్పులు అంటూ మెలికపెడితే.. మరో ఆరు నెలలు గడిచిపోతుంది. దాన్ని కేబినెట్ ఆమోదించి.. కేంద్రానికి పంపించేందుకు మరో 6 నెలలు.. కేంద్రం ఆమోదించేందుకు మరో ఏడాది.. ఇలా.. ఈ ఐదేళ్లు విశాఖ మెట్రో ప్రాజెక్టు కాగితాల్లోనే కునారిల్లేలా చేయడమే చంద్రబాబు ఉద్దేశమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏదో వంక.. అటకెక్కించడం పక్కా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైజాగ్ మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేసింది. విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. మొత్తం 76.90 కి.మీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేశారు. దీన్ని కేబినెట్ కూడా ఆమోదించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) విధానంలో మెట్రో నిర్మించడానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని.. ఇందులో ప్రభుత్వాలు రూ.5,723.6 కోట్లు భరించాల్సి ఉండగా ప్రైవేట్ డెవలపర్.. వీజీఎఫ్ కింద రూ.8,585.4 కోట్లు భరిస్తూ పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు టెండర్లు ఖరారైనప్పటి నుంచి మూడేళ్లకే తొలి మార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో అడుగులు వేసింది. భవిష్యత్తులో విశాఖలో నిర్మించే ఫ్లైఓవర్లను కూడా దృష్టిలో పెట్టుకొని డీపీఆర్ డిజైన్లు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు.. మెట్రో ఫ్లైఓవర్ల ఎత్తు, వెడల్పులు సరిగా లేవని.. అందులో మార్పులు చేయాలని సూచించడం గమనార్హం. మెట్రో పిల్లర్ల ఎత్తు ఎలా పెంచాలి? ఏ ప్రాంతంలో ఫ్లైఓవర్ పొడవుగా ఉండాలి.. ఎక్కడ వెడల్పు తక్కువగా ఉండాలో నిపుణులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా.. ఏదో ఒక వంకతో.. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుని నెమ్మదిగా అటకెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడుతోంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖని వెనక్కి నెట్టేందుకు కుట్రలు పన్నడంపై నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అమరావతికి రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పాత మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధానిలో నిర్మాణాలు చేపడతామన్నారు.మూడు దశల్లో రాజధాని పనులు పూర్తి చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రపంచంలో ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. అత్యుత్తమ డిజైన్ రూపొందించి సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేసియా తదితర దేశాలను సందర్శించామన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని, తొలిదశలో భాగంగా రూ.48 వేల కోట్లతో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు.తొలిదశ పనులకు గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు రూ.9 వేల కోట్ల చెల్లింపులు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తైనట్లు పేర్కొన్నారు. తొలి దశలో సిటీ నిర్మాణం పూర్తి చేసి రెండో దశలో మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. రాజధాని విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌నే ఇప్పుడూ అమలు చేస్తామని, అయితే అంచనా వ్యయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉందన్నారు. 217 చ.కి.మీ మేర అమరావతి నిర్మాణం రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వగా అదే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఎలాంటి వివాదాలు లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మొత్తం 217 చ.కి.మీ విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపడతామని, సుమారు 3,600 కి.మీ మేర రోడ్లు నిరి్మస్తామని వివరించారు.రూ.48 వేల కోట్లతో చేపట్టిన ఈ తొలిదశ పనులు పూర్తవగానే రెండో దశలో గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఖర్చు గత మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనా వేశామని, మరోసారి టెండర్లు పిలిచి సవరించే అవకాశం ఉందన్నారు. అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియ చేస్తామన్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, సీడీఎంఏ శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు ఎన్వీఆర్కే ప్రసాద్, సీహెచ్ ధనుంజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై అంచనాలకు ఆదేశం అన్న క్యాంటీన్లను మూడు వారాల్లోగా వంద చోట్ల పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా 184 చోట్ల ప్రారంభించినట్లు చెప్పారు. వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
పాతబస్తీపై ఫోకస్!
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీతో కలసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం పాతబస్తీ మెట్రోరైల్ నిర్మాణ పనులకు ఫలక్‌నుమా ఫారూక్‌నగర్‌లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘హైదరాబాద్‌లో రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణ చేపట్టాం. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో మెట్రోరైల్ విస్తరిస్తే సామాన్య ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. అందరూ ఈ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీ అని చిన్నచూపు చూస్తుంటారు. కానీ ఈ ప్రాంతమే ఒరిజినల్ సిటీ. ఓల్డ్ సిటీపై నాకు అవగాహన ఉంది. మా ఊరు(కల్వకుర్తి)కు చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్ మీదుగానే వెళతాం. పాతబస్తీలో రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ అసదుద్దీన్ కోరిన వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేశాం. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడో మెట్రోరైల్‌ను ప్లాన్ చేసిన గత పాలకులు పాతబస్తీ మెట్రోను విస్మరించారు. మేం నాగోల్ నుంచి ఎల్బీనగర్కు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధానం చేస్తాం. దీంతోపాటు రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న హైకోర్టు వరకు, రాయదుర్గం–ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మియాపూర్–ఆర్సీపురం వరకు మెట్రోను విస్తరిస్తాం. మీరాలం ట్యాంక్ వద్ద రూ.363 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే.. మెట్రోరైల్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం. 2004 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి తాగునీటిని తీసుకొచి్చన ఘనత కాంగ్రెస్‌దే. మూసీ నదిని సుందరీకరించి, దేశంలోనే చక్కటి టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తాం. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీతో కలసి లండన్‌లో థేమ్స్ నదిపై అధ్యయనం చేశాం. గుజరాత్లో సబర్మతీ నదిని అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ.. ఇక్కడ గండిపేట నుంచి 55 కిలోమీటర్ల పొడవునా మూసీ సుందరీకరణకు కూడా కేంద్ర నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచి్చనది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే. నేను కూడా మైనారీ్టల అభ్యున్నతికి కృషి చేస్తా. అందుకే మైనార్టీ శాఖ, మున్సిపల్ శాఖలను నా వద్దే ఉంచుకున్నా. చంచల్‌గూడ జైలును తరలిస్తాం చంచల్‌గూడ జైలును హైదరాబాద్ నగరం వెలుపలకు తరలిస్తాం. ఆ స్థలంలో కేజీ, పీజీ క్యాంపస్ ద్వారా విద్యను అందిస్తాం. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తాం. 1994–2004 మధ్య టీడీపీ, 2004–2014 కాంగ్రెస్, 2014–2023 వరకు బీఆర్ఎస్ పాలించాయి. నేను 2024 నుంచి 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ముబీన్, మీర్ జులీ్ఫకర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, అహ్మద్ బలాలా, ఎమ్మెల్సీ రియాజుల్ హఫెండీ, ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీకి మెట్రో సంతోషకరం: అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీకి మెట్రో రైల్ వస్తుండటం సంతోషకరమని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి నిత్యం 10–15వేల మంది హైటెక్ సిటీకి వెళతారని చెప్పారు. సీఎం రేవంత్ పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి సారించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరారు. డీఎస్సీని ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ సుందరీకరణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని నింపుతున్న వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
పాత బస్తీ మెట్రోకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అంటే పాత నగరం కాదని.. ఇదే అసలైన హైదరాబాద్ నగరమని.. దీనిని పూర్థిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఫలక్‌నుమాలోని ఫరూక్నగర్ దగ్గర పాత బస్తీ మెట్రో లైన్ పనులకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు..ఇదే ఒరిజినల్ సిటీ. అసలైన నగరాన్ని పూర్థిస్తాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. అలాగే.. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందు కోసమే లండన్ నగరాన్ని ఇక్కడి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో కలిసి పరిశీలించాం. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు తాజాగా సీఎం రేవంత్ ఆయన శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఈ మెట్రో రూట్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది. చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే..
ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వెళ్లేవారు ఇకపై అక్కడి మెట్రోలో సిటీనంతా చుట్టేయచ్చు. ఆగ్రాలో మెట్రో సేవలు గురువారం(2024, మార్చి, 7) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ఆగ్రా మెట్రోను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. దీని దూరం ఆరు కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరు స్టేషన్లలో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి సామాన్య ప్రజలు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఆగ్రా మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు సాగించనుంది. ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే.. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off metro railway services from Kavi Subhash Metro, Majerhat Metro, Kochi Metro, Agra Metro, Meerut-RRTS section, Pune Metro, Esplanade Metro- Kolkata. pic.twitter.com/2s8mNCjUiX — ANI (@ANI) March 6, 2024 ఆగ్రా మెట్రో గంటకు 90 కి.మీ వేగంతో నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులెవరైనా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టేషన్లో నిలబడితే అలారం మోగుతుంది. మొదటి దశ 6 మెట్రో స్టేషన్లు.. తాజ్ ఈస్ట్ గేట్, కెప్టెన్ శుభమ్ గుప్తా మెట్రో స్టేషన్, ఫతేబాద్ రోడ్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మంకమేశ్వర్ టెంపుల్ ఒక మెట్రో స్టేషన్ మధ్య ప్రయాణానికి రూ.10, చివరి స్టేషన్‌ను రూ.60గా చార్జీలను నిర్ణయించారు. ఒక కోచ్‌లో 60 సీట్లు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. -
7న పాతబస్తీలో మెట్రోరైలు పనులకు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్ఆర్సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు. మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ -
మెట్రో రెండోదశకు జైకా నిధులు!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం మెట్రో రైల్ విస్తరణ, మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో సుమారు రూ.9,000 కోట్ల వరకు జైకా నుంచి, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించే అవకాశముంది. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం 35 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం నిధులు భరించాలి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థపైనే ఆశలు పెట్టుకుంది. మెట్రోతో పాటు, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకా నిధులే కీలకం కానున్నాయి. ‘ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆశించిన స్థాయిలోనే రుణాలు లభిస్తాయని భావిస్తున్నాం.’అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణపై ప్రభుత్వం ఫోకస్
-
మెట్రో, ఫార్మా సిటీ రద్దు చెయ్యం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: గత ప్రభుత్వ హయాంలో తీసుసుకున్న మెట్రో, ఫార్మా సిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోవట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పలు వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న మెట్రో, పార్మా సిటీ నిర్ణయాలను రద్దు చేయడం లేదు. ప్రజా ప్రయోజనాన్ని దృషష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టుకు దూరం తగ్గిస్తాం. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్ లలో మెట్రో విస్తరణ చేస్తున్నాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. నాగోలు నుంచి ఎల్బీ నగర్, ఒవైసీ ఆస్పత్రి వద్ద ఛాంద్రాయణ గుట్ట వద్ద మెట్రో లైన్‌కు లింక్ చేస్తాం. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రబాపురం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. అవసరమైతే హైటెక్ సిటీ దాకా ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం అని అన్నారాయన. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారయన. ఇక గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని.. స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా.. 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. సంక్రాంతి లోపు అన్ని కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వంలో.. ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండవు. అన్ని నిర్ణయాల అమలుకు టార్గెట్ 100రోజులు పెట్టుకుని.. కచ్చితంగా అమలు చేస్తాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పనులకు.. సీఎంగా కేసీఆర్ శంకుస్థాపన సైతం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌రెడ్డి.. మెట్రో విస్తరణ ప్రతిపాదనతో పాటు ఫార్మా సిటీపైనా పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ఆయన రద్దు చేయవచ్చని అంతా భావించారు. అయితే.. రద్దు చేయకుండా వాటిలో సమూల మార్పులు చేయడం గమనార్హం. -
కొత్త మెట్రోరూట్‌తో డిస్టెన్స్ తక్కువ, వయబులిటీ ఎక్కువ?
ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి 'రేవంత్ రెడ్డి' కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో అలైన్మెంట్ ఔటర్ రింగ్ రోడ్డుగుండా వెలుతుందని, దీని ద్వారా ఇప్పటికే ఔటర్‌రింగ్ రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలేని రూట్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ఉండేలా డిజైన్‌ను మార్చాలని సీఎం సూచించారు. కొత్త ప్రణాళికల ద్వారా హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి సమానంగా జరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైదారాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్‌కు సూచించారు. దీన్ని బట్టి ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు మార్గాన్ని ఎంచుకోవడం లేదా.. ఇప్పటికే ఎల్బీనగర్ రూట్లలో మెట్రో ఉంది కాబట్టి, చాంద్రాయణగుట్ట రూట్ ద్వారా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టేలా చూడాలని HMRL ఎమ్‌డిని కోరారు. దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలు మెట్రోను వినియోగించుకునే అవకాశంతో పాటు అటు మెట్రోరైల్‌కు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా మైండ్ స్సేస్ రూట్ ద్వారా మెట్రో నిర్మిస్తే దాదాపుగా 31 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది. అదే ఎల్బినగర్ రూట్ ద్వారా నిర్మిస్తే ఈ డిస్టెన్స్ మరో 5 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ రూట్లో పెద్దగా మలుపులు ఉండే అవకాశం లేదు. ఈ మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం కూడా తగ్గుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డు నుంచి తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. మొదటి ఫేజ్‌లో నిర్మించకుండా మిగిలిపోయిన పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రూట్ పూర్తైతే పాతబస్తీ అభివృద్ధి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎక్స్‌ప్రెస్ ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించి 6 వేల 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తొలత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా కిలోమీటర్ మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. విమానాశ్రయంలో రెండు మెట్రో స్టేషన్లు నిర్మించాలనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన సమీక్షలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వేల రూట్ మార్చాల్సి వస్తే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేయాల్సి వస్తే జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉంది, భవిష్యత్తులో ఈ సంఖ్య 3 కోట్లకు చేరే అవకాశం ఉంది. జనాభా పెరుగుదలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను, తూర్పు నుంచి పడమర వరకు.. మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయనుంది. -
విశాఖ వైపు ‘మెట్రో’ పరుగులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు తొలి విడతలో 76.90 కి.మీ. మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి 2021 అంచనాల ప్రకారం విశాఖ మహా నగరంలో 25 లక్షలకు పైగా జనాభా ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41 లక్షలు. అందుకే తప్పనిసరిగా మెట్రో రైలు అవసరం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అడుగులు పడుతున్న తరుణంలో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. జనవరి 15న పునాది రాయి వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు నిర్మాణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పునాది రాయి వేసేలోగా నిధులు సమీకరించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు సూచించారు. 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తున్నారు. కారిడార్–1లో స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కి.మీ., కారిడార్–2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07 కి.మీ., కారిడార్–3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. మేర లైట్ మెట్రో కారిడార్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రెండో విడత కింద కారిడార్–4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేయనున్నారు. బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ ఒక మణిహారంగా రాబోతోంది. ప్రధాన జంక్షన్ల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు కూడా ట్రామ్ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం 60.05 కి.మీ. మేర మోడ్రన్ ట్రామ్ని నడిపేందుకు 4 కారిడార్లు గుర్తించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్టీల్‌ప్లాంట్ నుంచి అనకాపల్లి, ఎన్ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు కూడా ట్రామ్ కారిడార్ రాబోతోంది. శివారుకు మెట్రో.. సీఎం ఆకాంక్ష ఏపీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే ఆయా ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కూడా కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా డీపీఆర్‌లో మార్పులు, చేర్పులు జరిగాయి. -
ఔటర్ చుట్టూ మెట్రో !
-
శివార్లకు ‘మెట్రో’ జోష్!
శివార్లకు ‘మెట్రో’ జోష్!శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని మెట్రో రైలు మరింత పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే పనులు వేగంగా కొనసాగుతుండగా మరిన్ని మార్గాల్లో మెట్రో విస్తరణపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం స్వయంగా కొత్త రూట్లలో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి సైతం మెట్రో కోసం వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతిపాదించిన రూట్లతో పాటు మరిన్ని మార్గాలకు మెట్రో రైలును విస్తరిస్తే ఔటర్ వెలుపల సైతం నగరం భారీగా విస్తరించనుంది ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణ వల్ల జీవో 111 ప్రాంతాలకు కొత్తగా మెట్రో రైలు అందుబాటులోకి వస్తుంది. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తుక్కుగూడ వరకు మెట్రో రైలును పొడిగిస్తే ఎయిర్‌పోర్టును ఆనుకొని ఉన్న ఏరోసిటీతో పాటు తుక్కుగూడ పారిశ్రామిక ప్రాంతాలకు మెట్రో సదుపాయం లభించనుంది. ప్రభుత్వం ఇప్పటికే బీహెచ్ఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు విస్తరణకు ప్రతిపాదించింది. ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు పూర్తి చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కేంద్రం నుంచి నిధులు లభించకపోవడం వల్ల ఈ రెండు కారిడార్లపైన సమగ్ర నివేదికలు సిద్ధం చేసినప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. కానీ ఈ మార్గాలు కూడా పూర్తయితే బీహెచ్ఎల్ నుంచి పటాన్చెరు వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను పొడిగించవచ్చు. దీంతో హైదరాబాద్ నలువైపులా మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. వివిధ మార్గాల్లో మెట్రో విస్తరణకు ఇప్పుడు ఉన్న అంచనాల మేరకు లెక్కలు వేసినా కనీసం రూ.25 వేల కోట్లకు పైగా కావచ్చునని నిపుణులు చెబుతున్నారు.ఒక కిలోమీటర్ మెట్రో నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. డీపీఆర్ రెడీ.. మెట్రో రైల్ కారిడార్–2లో భాగంగా ప్రభుత్వం బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్, ఎల్బీనగర్–నాగోల్ కారిడార్లను ఎంపిక చేసింది. వయబుల్ గ్యాప్ ఫండింగ్ పథకం కింద (వీజీఎఫ్ స్కీమ్) ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు బీహెచ్ఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్ల మార్గంలో 23 స్టేషన్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మార్గంలో 4 స్టేషన్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మార్గాలపైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్)కూడా ప్రభుత్వం రూపొందించింది. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించకపోవడం వల్లనే పనులు ప్రారంభం కాలేదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ రెండు మార్గాలను చేపట్టేందుకు సుమారు రూ.8453 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఈ రెండు కారిడార్లు పూర్తి చేస్తే మరో 31 కిలోమీటర్లు కొత్తగా అందుబాటులోకి రానుంది. దీంతో ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు నేరుగా బీహెచ్ఈఎల్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు. తుక్కుగూడ విస్తరణకు ప్రతిపాదనలు... మరోవైపు ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వేను అక్కడి నుంచి తుక్కుగూడ వరకు మరో 20 కిలోమీటర్ల వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సైతం సంసిద్ధంగా ఉంది. ఈ రూట్‌పైన స్థానికంగా కూడా వినతులు వెల్లువెత్తాయి. కొత్తగా చేపట్టిన ఫాక్స్‌కాన్ వరకు మెట్రో సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ఎంతో ఊరట లభిస్తుంది. -
టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs భట్టి విక్రమార్క
Updates.. ►తెలంగాణ శాసన మండలిలో విప్‌లను నియమించారు. మండలిలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్ నియామకమయ్యారు. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు నియమించారు. ►తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు కౌంటర్ మధ్య శనివారం వాడీవేడి వాదనలు జరిగాయి. ముందు భట్టి మాట్లడుతూ.. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని అన్నారు. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ.. నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పంపులు మునిగిపోయాయని చుద్దామంటే పోనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.అసెంబ్లీలో తమ మైకులు కట్ చేసి వాళ్లకు మాత్రే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉందన్నారు. ►సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కొరడాతో తాము కొట్టడం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాళేశ్వరం వద్దకు రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదన్నారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్ నేతలు సంబర పడుతున్నారని.. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఎజెన్సీ నుంచే రిపేర్ చేయించామని తెలిపారు. ► తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ ఫిషర్మెన్ విభాగం ప్రయత్నం. మెట్లు సాయికుమార్ సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ క్రమంలో వారు మత్య్సకారులకు రూ. 10లక్షల జీవిత బీమా, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ► శాసనసభ ఆవరణలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌కు బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు. ► నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ► భట్టికి కేటీఆర్ కౌంటర్ కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రోను పూర్తి చేసిన ఘనత మాదే. మెట్రో రైలుకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోంది. కేంద్రానికి నివేదికలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఇష్టారాజ్యంగా మెట్రో ఛార్జీలు పెంచొద్దని స్పష్టం చేశాం. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారమే మెట్రోరైల్ నడుస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తామాని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే మెట్రోను తీసుకువచ్చింది. మెట్రో ఛార్జీలు అగ్రిమెంట్‌కు విరుద్ధంగా పెంచారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మెట్రో లిమిటెడ్‌కు లాభం చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. మెట్రో యాడ్స్ ఇచ్చే విషయంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వడం లేదు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల వాగ్వాదం చోటుచేసుకుంది. -
ఈ నెల 19న ముంబైకి ప్రధాని రాక.. బీఎంసీ ఎన్నికల కోసమేనా?
సాక్షి, ముంబై: ప్రధాని మోదీ జనవరి 19న ముంబైని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తారు. కాగా, జనవరి 15 నుంచి 19 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకావాల్సి ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ ప్రణాళికను మార్చుకోవచ్చు. మెట్రో 2ఏ, 7 లైన్ల ప్రారంభం.. ఈ పర్యటనలో సెంట్రల్ పార్క్–బేలాపూర్ స్టేషన్ల మధ్య నవీ ముంబై మెట్రో యొక్క 5.96–కిమీ విస్తరణను ప్రధాని ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే ముంబై మెట్రో యొక్క 2ఏతోపాటు 7వ లైన్లలోని 35 కి.మీ. విస్తరణ కూడా అదే రోజున ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రెండు మెట్రో లైన్లు లింక్ రోడ్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే గుండా వెళతాయి. వీటివల్ల ఈ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రస్తుతం ఉన్న సబర్బన్ లోకల్ రైలు సరీ్వసుల్లోనూ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. 2022 ఏప్రిల్‌లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మొదటి దశ 2ఏ, 7 లైన్లను ప్రారంభించారు. ఈ రెండు లైన్లు మొత్తం 30 స్టేషన్లు, 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌తో ఉన్నాయి. ఇవి రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవని మహా ముంబై మెట్రో ఆపరేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఎంఓసీఎల్) అధికారులు తెలిపారు. రూ.1,750 కోట్ల విలువైన పనుల శంకుస్థాపన మెట్రోతోపాటు వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు, ముంబైలో 400 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆప్లీ చికిత్సా (మన వైద్యం) ప«థకంలో భాగంగా భాండూప్‌లో నిరి్మంచనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఓషీవరాలో ప్రసూతి గృహం, గోరేగావ్‌లోని సిద్ధార్ధ్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులు.. మొత్తం రూ.1,750 కోట్ల ఖర్చుతో కూడిన 500పైగా అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇందులో వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు పనులకు రూ.26 వేల కోట్లు, ముంబైలో 400 కిలోమీటర్ల సీసీ రోడ్డు పనులకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా ముంబైలో లక్షా మంది హాకర్లకు ప్రధాని సొంత నిధి పథకం ద్వారా రూ.10 వేల చొప్పున రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. బీఎంసీ ఎన్నికల కోసమేనా? ఇదిలా ఉండగా బీఎంసీ ఎన్నికల తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయినా.. ప్రధాని ముంబై పర్యటనకు రావడం, వివిధ అభివృద్ధి పనులు జాతికి అంకితం చేయడం, కొన్ని పనులకు శంకు స్ధాపన చేయడాన్ని బట్టి త్వరలో బీఎంసీ ఎన్నికల నగారా మోగుతుండొచ్చని రాజకీయ పారీ్టలు చర్చిస్తున్నాయి. ఇప్పటికి బీఎంసీ కార్పొరేటర్ల పదవి కాలం గడువు ముగిసి సంవత్సరం కావస్తోంది. అప్పటి నుంచి కార్పొరేషన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 2022 మార్చి 8వ తేదీ నుంచి బీఎంసీ పరిపాలన పగ్గాలు అడ్మిన్ చేతిలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లతోపాటు ఆశావాహులందరు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ముంబై పర్యటనతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
Hyderabad: ఓఆర్ఆర్.. రింగ్‌మెయిన్.. మెట్రో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ అభివృద్ధి ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ చక్కర్లు కొడుతోంది. పలు కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలు.. సర్కారు ప్రణాళికలు ఈ రహదారి కేంద్రంగానే సాగుతున్నాయి. మహా నగరానికి మణిహారంలా 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నగరం నలుమూలలకు కృష్ణా, గోదావరి జలాలను కొరత లేకుండా సరఫరా చేసేందుకు భారీ తాగునీటి పైపులైన్ ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గం ఏర్పాటుకు పునాది రాయి వేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఔటర్ చుట్టూ మెట్రో ప్రతిపాదన చేయడంతో ఈ అంశం సైతం సర్వత్రా చర్చనీయాంశమైంది. పైపులైన్ ఏర్పాటు ఇలా.. గ్రేటర్‌కు మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటు పనుల్లో ఇప్పటికే సుమారు 48 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. పనుల పూర్తికి రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం నగరానికి ఎల్లంపల్లి (గోదావరి), కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. ఈ జలాలను నగరం చుట్టూ మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 3,000 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్ ఏర్పాటు చేసి వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలి. దీంతో నగరం నలుమూలలకు కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయవచ్చు. గతంలో పూర్తిచేసిన 48 కి.మీటర్లకు అదనంగా మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. జలాల నిల్వకు వీలుగా రెండు భారీ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను సైతం నిర్మించాల్సి ఉంటుంది. వీటిలో కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేయాలి. ఔటర్‌కు మెట్రో హారం.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ మెట్రో మార్గం దాదాపు 20 కిలోమీటర్ల మేర ఔటర్‌కు ఆనుకొనే వెళ్లనుంది. ఇక ఓఆర్ఆర్ లోపల కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఔటర్ చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేసిన పక్షంలో ఓఆర్ఆర్ లోపలున్న 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫారా>్మ, బయోటెక్,తయారీ రంగం, లాజిస్టిక్స్, హార్డ్‌వేర్, ఏవియేషన్ తదితర రంగాల సత్వర, సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధిలో మహానగరం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండడంతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులు, రియలీ్ట, నిర్మాణ రంగ ప్రాజెక్టులు విస్తరించిన నేపథ్యంలో మెట్రో కనెక్టివిటీ ఆయా ప్రాంతాలకు అత్యావశ్యకమని విశ్లేషిస్తున్నారు. చదవండి: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం? -
తెలంగాణ మెట్రో కారిడార్‌కు రూ.8,453 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2017 మెట్రో రైల్ పాలసీలో భాగంగా 50:50 ఈక్విటీ షేర్ పద్ధతిలో రూ.8,453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. మెట్రోకారిడార్ సాయం ఏమైందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు. ఎన్‌హెచ్–65లో 6 లేన్లు అవసరం లేదు ప్రస్తుతం నందిగామ సెక్షన్లో నాలుగు లేన్లు సరిపోతాయి లోక్‌సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు ఇచ్చారు. ఎన్‌హెచ్-65లో 6 లేన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్–విజయవాడ ఎన్‌హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. -
CM KCR: కుమారస్వామి కర్నాటక సీఎం కావాలి: కేసీఆర్
నగరంలో సీఎం కేసీఆర్.. అప్డేట్స్ 02:30PM ►ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కొత్త కార్యాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ అని, ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండేనని అన్నారు. రాబోయేది రైతు ప్రభుత్వమేనని చెప్పారు. ► కర్ణాటకలో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తామని వెల్లడించారు. కుమారస్వామి కర్నాటక సీఎం కావాలని ఆయన ఆకాక్షించారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామన్నారు. రైతు పాలసీ, జల విధానం రూపొందిస్తామన్నారు. ► తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత సమావేశాన్ని నిర్వహించింది. బీఆర్ఎస్ ఆవిర్భావం వెంటనే కేసీఆర్ జాతీయ కార్యాచరణ ప్రారంభించారు. కుమారస్వామి, ప్రకాష్ రాజ్‌తో పాటు ఇతర నేతలతో కీలక చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో పార్టీని ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కేసీఆర్ ఫోకస్ పెంచారు. పార్టీ జాతీయ సిద్ధాంతాలు, విధానాలపై సమాలోచనలు జరిపారు. ► బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు.. పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 01.40 PM ► బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కుమారస్వామి, ప్రకాశ్ రాజ్, జాతీయ రైతు సంఘ నేతలు, పార్టీ కార్యవర్గం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 01.25 PM ► తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించిన కేసీఆర్. ఇక నుంచి టీఆర్ఎస్ కాదు.. బీఆర్ఎస్ అంటూ పార్టీ శ్రేణుల నినాదాలతో మారుమోగిపోతున్న తెలంగాణ భవన్ ప్రాంగణం. ► తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు.. కాసేపట్లో జెండా ఆవిష్కరణ.. అధికారిక కార్యక్రమాలు 01.13 PM ► తెలంగాణ భవన్‌కు భారీగా తరలి వచ్చిన గులాబీ దండు. బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ నేపథ్యంలో సందడి వాతావరణం. 01.07 PM ► బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన అధినేత కేసీఆర్. 01.00 PM ► త్వరలో ఢిల్లీకి సీఎం కేసీఆర్. రాజధానిలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 12.58 PM ► తెలంగాణ భవన్ లో ప్రారంభమైన భారత రాష్ట్ర సమితి(BRS) ఆవిర్భావ కార్యక్రమం. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి కేసీఆర్ నివాళులు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. 12.50 PM ► తెలంగాణ భవన్‌ను చేరుకున్న సీఎం కేసీఆర్. కాసేపట్లో బీఆర్ఎస్ను అధికారికంగా లాంచ్ చేయనున్న కేసీఆర్. ఈసీ పంపిన ఆమోద లేఖపై సంతకం చేసి.. జెండా ఆవిష్కరించి అధికారిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. 12.36 PM ► తెలంగాణ భవన్ కు వచ్చిన ప్రకాశ్ రాజ్ ..స్వాగతం పలికిన ఎంపీ సంతోష్ కుమార్.. తెలంగాణ భవన్ వద్ద మొదలైన సంబురాలు.. ► బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్ కు చేరుకుంటుంన్న టిఆర్ఎస్ నేతలు. ఇప్పటికే తెలంగాణ భవన్ కు చేరుకున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యే అవకాశం!. సీఎం కేసీఆర్ అప్పా బహిరంగ సభ హైలెట్స్ ► ఒకప్పుడు నగరంలో తాగు నీటి సమస్య ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చూసుకున్నాం. అన్ని కష్టాలను అధిగమించి ముందుకు వెళ్తున్నాం. అందరికీ అనువైన వాతావరణ నగరంలో ఉంది. అన్నివర్గాలను అక్కన చేర్చుకుంది ఈ విశ్వనగరం. ► చరిత్రలో హైదరాబాద్ ఓ సుప్రసిద్ధమైన నగరం ఇది. ► న్యూయార్క్, పారిస్, లండన్‌లో కరెంట్ పోవచ్చు.. కానీ, హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోయే అవకాశం లేదు. 1912లోనే నగరానికి కరెంట్ సదుపాయం ఉండేది. ► దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో పెద్దది హైదరాబాద్. అలాంటి నగరంలో మెట్రో.. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో ముందుకు పోతున్నాం. ► పరిశ్రమ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. ► హైదరాబాద్ నిజమైన విశ్వనగరం: అప్పా పోలీస్ అకాడమీలో నిర్వహించిన మెట్రో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన ► మెట్రో సెకండ్ ఫేజ్ పనుల కోసం.. హెచ్ఎండీఏ తరపున పదిశాతం పెట్టుబడి రూ. 625 కోట్ల రూపాయలు.. హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద కుమార్ సీఎం కేసీఆర్‌కు అందించారు. అలాగే.. జీఎంఆర్ తరపున పదిశాతం రూ.625 కోట్ల రూపాయల చెక్ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 11.57AM ► అప్పా జంక్షన్ వద్ద పోలీస్ అకాడమీ ప్రాంగణంలో మెట్రో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్. 11.40 AM ► నగర మెట్రో రెండో ఫేజ్ పనుల్లో భాగంగా.. ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రాయదుర్గం, కాజాగూడ, నానక్‌రాంగూడ, నార్సింగి, అప్పా జంక్షన్, రాజేంద్ర నగర్, శంషాబాద్, ఎయిర్పోర్ట్ కార్గో, ఎయిర్పోర్ట్ టెర్మినల్ మార్గాల గుండా ఈ మెట్రో లైన్ రాబోతోంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఖర్చు భారీగా తగ్గనుంది. బోలెడంత టైం సేవ్ కానుంది. ► ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన 11.30 AM ► శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. పాల్గొన్న అధికారులు, మంత్రులు 11.26 AM ► సెకండ్ ఫేజ్ మెట్రోకు భూమి పూజ.. పాల్గొన్న సీఎం కేసీఆర్. పాల్గొన్న మేయర్, అధికారులు, మంత్రులు 11.24 AM ► రాయదుర్గం మైండ్‌స్పేస్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్. 11:20 AM ► కాసేపట్లో రాయదుర్గం మైండ్ స్పేస్ వద్ద మెట్రో 2.0 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. 11:00 AM ► మెట్రో రైల్ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం.. ప్రగతి భవన్ నుంచి మైండ్ స్పేస్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్. ► మెట్రో-2 ప్రత్యేకతలు ప్రతిష్టాత్మకంగా మైండ్‌స్పేస్-శంషాబాద్ రూట్ మెట్రోరైల్‌ను చేపట్టనున్నారు. తొలిసారిగా ఫ్లాట్‌ఫామ్ క్లోజ్డ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పీకవర్లో ప్రతీ ఐదు నిమిషాలకొక మెట్రో రైల్ ఉండనుందట. జెట్ స్పీడ్‌తో గంటకు 120 కి.మీ. వేగం ద్వారా 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లో చేరేలా ఈ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం రూ.6,250 కోట్ల నిధులతో ఈ మెట్రో రైల్ రూట్ విస్తరణను చేపట్టనున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా విమానంలోకి వెళ్లేలాగా ఏర్పాట్లు. లగేజీ స్క్రీనింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. మూడేళ్లలో ఈ రూట్ లైన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. 10:37AM ► హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ శంకుస్థాపన.. ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి విచ్చేశారు. మరి కాసేపట్లో మైండ్ స్పేస్ జంక్షన్ కు చేరుకోనున్న సీఎం కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ(శుక్రవారం) పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ► ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన.. ► పోలీస్ అకాడమీలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ► బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం. అనంతరం పార్టీ శ్రేణుల నడుమ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ. -
ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన
-
Hyd: ఎయిర్పోర్ట్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు శుక్రవారం శంకుస్థాపన జరుగుతోంది. రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రాయదుర్గం మైండ్‌స్పేస్ వద్ద శుక్రవారం ఉదయం 10.05 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత 10.20 గంటలకు తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ప్రతీ అంశం విశేషమేనని హైదరాబాద్ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గురువారం రసూల్‌పురాలోని మెట్రోరైల్ భవన్లో ఆయన ఈ వివరాలు తెలిపారు. మూడు విధాలుగా మార్గం రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్ మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్(ప్రస్తుత మెట్రో తరహాలో)కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారు. మిగతా కిలోమీటరు మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్లను ప్రతిపాదించామని.. విమానాశ్రయంలో రెండు మెట్రోస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మూడో లెవల్లో.. రాయదుర్గం వద్ద ప్రారంభమయ్యే ఎయిర్పోర్ట్ మెట్రో బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద రెండు ఫ్లైఓవర్లపైన మూడో లెవల్లో నిర్మించనున్నారు. ఖాజాగూడ రోడ్డులో కుడివైపుగా నానక్‌రాంగూడ జంక్షన్ మీదుగా ఓఆర్ఆర్ ప్రవేశ ప్రాంతానికి మెట్రో చేరుతుంది. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఓఆర్ఆర్కు, సర్వీస్‌రోడ్డుకు మధ్యలో కొనసాగుతుంది. రెండోదశ కింద మరిన్ని మార్గాల్లో.. మెట్రో రెండో దశలో భాగంగా బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ కారిడార్ (31కి.మీ.), నాగోల్–ఎల్బీనగర్ (5కి.మీ.), బీహెచ్ఈఎల్–లక్టీకాపూల్ (26కి.మీ.) మార్గాల డీపీఆర్‌లను కేంద్రానికి పంపించామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలిదశ మెట్రో మార్గాల్లో 31.50 కోట్ల మంది ప్రయాణం చేశారన్నారు. దీనితో 9.2 కోట్ల లీటర్ల ఇంధన ఆదా జరిగిందని, 21 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించగలిగామని చెప్పారు. అత్యాదునిక సదుపాయాలతో.. ఎయిర్‌పోర్ట్‌లోనే కార్గో, ప్యాసింజర్ పేరిట రెండు మెట్రోస్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రయాణికులు తమ లగేజీని మోయాల్సిన అవసరం లేకుండా.. ప్యాసింజర్ మెట్రోస్టేషన్లో దిగిన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ ప్రవేశద్వారం వద్దకు లగేజీ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్ద లగేజీని తీసుకోవచ్చు. ►విమాన ప్రయాణికులు, వారి లగేజీని రాయదుర్గం మెట్రోస్టేషన్ వద్దే చెకింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. విమాన రాకపోకల సమయాలకు సంబంధించిన వివరాలను మెట్రోస్టేషన్లలో డిస్ప్లే చేస్తారు. ►ఎయిర్పోర్ట్ మెట్రోలో మొదటిసారిగా ప్లాట్‌ఫాం స్క్రీన్డ్ డోర్స్ (పీఎస్డీ)ను ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా రైలు వస్తున్న సమయంలో ప్లాట్‌ఫాంపై గేట్లు తెరుచుకుంటాయి. ►రైలువేగం మరింతగా పెరిగేలా స్టెయిన్లెస్ లేదా అల్యుమినియంతో రూపొందించిన లైట్ వెయిట్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ►ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయ్యాక మొదట మూడు కోచ్‌లతో ప్రారంభిస్తారు. తర్వాత రద్దీని బట్టి ఆరు కోచ్‌లకు విస్తరిస్తారు. ఇందుకు అనుగుణంగా ప్లాట్‌ఫాంలను 6 కోచ్‌లకు అనుగుణంగా నిర్మించనున్నారు. ►తొలుత రద్దీ సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో 20 నిమిషాలకో రైలు నడుపుతారు. తర్వాత అవసరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ పెంచుతారు. ఇక సిటీ మెట్రోకు భిన్నంగా ఎయిర్పోర్ట్ మెట్రోలో సీటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
కేపీహెచ్‌బీ టూ ఓఆర్ఆర్.. మెట్రో నియో పట్టాలెక్కేనా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు ఐటీ కారిడార్ పరిధిలో మెట్రో నియోగా పిలిచే ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం (బీఆర్టీఎస్) ప్రాజెక్టును చేపట్టేందుకు నిధుల లేమి శాపంగా మారింది. పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.3,100 కోట్ల నిధులు వెచి్చంచేందుకు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర సర్కారు రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానిస్తోంది. మరోవైపు రూ.450కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లాభాలు రాకపోవడంతో.. ఇప్పటికే నగరంలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ మార్గంలో అందుబాటులో ఉన్న తొలిదశ మెట్రో ప్రాజెక్టును పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో లాభదాయకం కాలేదు. ఈ నేపథ్యంలో యాన్యుటీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకొస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సర్కారు అంచనాల ప్రకారం.. యాన్యుటీ విధానంలో మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థ ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. తర్వాత అయిదు నుంచి పదేళ్ల అనంతరం వడ్డీతో కలిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయాన్ని వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు చెల్లిస్తుందన్న మాట. అంతేకాదు సదరు నిర్మాణ సంస్థకు ఈ ప్రాజెక్టు చేపట్టే మార్గంలో విలువైన ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక పద్ధతిన తక్కువ మొత్తానికి లీజుకిచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. మెట్రో నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి మెట్రో నియో చక్కటి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈవిధానంలో మెట్రో ప్రాజెక్టు తరహాలోనే రహదారి మధ్యలో పిల్లర్లు ఏర్పాటుచేసి దానిపై రహదారిని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ సిస్టం(ఈబీఆర్టీఎస్) లేదా మెట్రో నియో మార్గం అని పిలుస్తారు. ఈ మార్గంలో కేవలం బ్యాటరీ బస్సులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. - ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఐటీ కారిడార్ సహా పలు రూట్లలో ఇది అనువైన ప్రాజెక్టు. ఈ రూట్లో అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నప్పటికీ.. కేవలం ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన బ్యాటరీ బస్సులను మాత్రమే అనుమతించాలి. దీంతో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్య ఆనవాళ్లు ఉండవు. - ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం బయలుదేరిన వారు ట్రాఫిక్ జంజాటం లేకుండా సమయానికి గమ్యస్థానం చేరుకునే వీలుంటుంది. నగరంలో కేపీహెచ్‌బీ– హైటెక్స్–రాయదుర్గం– కోకాపేట్– ఓఆర్ఆర్ వరకు సుమారు 19 కి.మీ మేర సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో మెట్రోనియో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. కానీ నిధులు వెచి్చంచే విషయంలో ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడం గ్రేటర్ పిటీ. -
'ముఖ్యమంత్రిని ఆహ్వానించేది ఇలాగేనా?'.. బీజేపీపై టీఎంసీ ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేశారు. ప్రారంభానికి ఒక రోజు ముందుగా బెంగాల్ ముఖ్యమంత్రి, గవర్నర్, మేయర్లకు ఆహ్వానాలు పంపారు. అయితే.. మెట్రో స్టేషన్ ఆహ్వానంపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ).. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించింది. "ఆదివారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఇంట్లో ఆహ్వానం పడేసి వెళ్లారు. ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధానం ఇలాగేనా?. రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఈ మెట్రో ప్రాజెక్టును మంజూరు చేశారు. దీని కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. అలాంటి వ్యక్తిని మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్. మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవటంపై కోల్‌కతా రైల్ కార్పోరేషన్లో వివాదం చెలరేగింది. అది జరిగిన రెండో రోజు ఆహ్వానాన్ని సీఎం ఇంటికి పంపించినట్లు తెలిసింది. జులై 11న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మెట్రో స్టేషన్‌ను ప్రారంభిస్తారని కోల్‌కతా రైల్ కార్పోరేషన్ గత శనివారం ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత మమతా బెనర్జీని ఆహ్వానించకుండా కేంద్రం రాజకీయలు చేస్తోందని ఆరోపించింది టీఎంసీ. సీల్దా మెట్రో స్టేషన్ ఎదుట సోమవారం నిరసనలు చేపట్టాలని ముందుగా నిర్ణయించినా.. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది టీఎంసీ. ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
ప్రజారవాణాపై ఫోకస్: మోదీ
పుణే: నగరాలు, పట్టణాల్లో మెట్రో రైలు అనుసంధానంతో సహా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మహారాష్ట్రలోని పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. గర్వారే స్టేషన్లో రైలుకు పంచ్చజెండా ఊపారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంఐటీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్టుకు తానే పునాది రాయి వేసి, ఇప్పుడు తన చేతుల మీదుగానే ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేయడం మినహా అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలిసేది కాదని పేర్కొన్నారు. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయొచ్చన్న సందేశం ఈ మెట్రో రైలు ప్రాజెక్టుతో ప్రజల్లోకి వెళ్లిందని వివరించారు. పనుల్లో జాప్యం జరిగితే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. మెట్రో రైళ్లలో విరివిగా ప్రయాణించాలని కోరారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని, 2030 నాటికి దేశ జనాభాలో 60 కోట్ల మంది నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తారని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా నగరాలు, పట్టణాల్లో రోడ్లను వెడల్పు చేయడం, ఫ్లైఓవర్లు నిర్మించడం కష్టం కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఆధునిక యుగంలో మెట్రో రైలు అనుసంధానం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి రావడం లేదా నిర్మాణంలో ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రధాని మోదీ స్వయంగా టికెట్ కొనుక్కొని పుణే మెట్రో రైలులో గర్వారే నుంచి ఆనంద్‌నగర్ స్టేషన్ వరకు దాదాపు 10 నిమిషాలపాటు ప్రయాణించారు. రైలులో తనతో పాటు ప్రయాణిస్తున్న దివ్యాంగ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. పుణేలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. రూ.11,400 కోట్లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 32.2 కిలోమీటర్లకు గాను నిర్మాణం పూర్తయిన 12 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. చదవండి: పెద్ద దేశాలకే ఇబ్బంది.. భారతీయుల తరలింపుపై మోదీ కీలక వ్యాఖ్యలు Ensuring convenient and comfortable travel for the people of Pune. PM @narendramodi inaugurated the Pune Metro and travelled on board with his young friends. pic.twitter.com/154a2mJk8f — PMO India (@PMOIndia) March 6, 2022 -
నవ భారత నిర్మాణానికి నడుం బిగించండి
కాన్పూర్: యువత తాము కలలుకనే భారతం కోసం ఇప్పటినుంచి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత సుఖాల కన్నా సవాళ్లను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిందని, విద్యార్థిలోకం తక్షణం నడుం బిగించి పనిచేస్తే వచ్చే 25ఏళ్లలో వాళ్లు కలలు గనే భారత్‌ను చూడవచ్చని ఉద్భోదించారు. భారత స్వావలంబనకు తోడ్పడాలని నూతన గ్రాడ్యుయేట్లను ఆయన కోరారు. స్వాతంత్య్రానంతరం భారత్ నూతన పయనం ఆరంభమైందని, నిజానికి 25ఏళ్లు పూర్తయ్యేసరికి ఎంతో అభివృద్ధి జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ సమయం వృథా చేయడం వల్ల దాదాపు రెండు తరాలు గడిచిపోయాయన్నారు. అందుకే ఇకపై ఎంతమాత్రం జాప్యం కూడదని హెచ్చరించారు. అనంతరం కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి మోదీ ఝీల్ వరకు 9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు 356 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని మోదీ కాన్పూర్ నుంచి లక్నోకు 80 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది. దారిపొడవునా తనిఖీలు చేసి, తగిన బందోబస్తును ఏర్పాటు చేశాక మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఐదేళ్లు దోచుకోవచ్చనుకున్నారు సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తన కాన్పూర్ పర్యటనలో నిప్పులు చెరిగారు. గతంలో యూపీలో అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, ఎదురులేకుండా ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకునే లాటరీ దొరికినట్లు భావించిందని దుయ్యబట్టారు. అనంతరం ఏర్పడిన తమ ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో పనిచేస్తోందన్నారు. ఇటీవల కాన్పూర్‌కు చెందిన సుగంధద్రవ్యాల వ్యాపారి వద్ద కోట్ల రూపాయల నగదు దొరకడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది ప్రతిపక్షం సాధించిన విజయమని ఎద్దేవా చేశారు. 2017కు పూర్వం అవినీతి దుర్గంధం రాష్ట్రమంతా వ్యాపించిందని, కట్టలు బయటపడగానే ఎస్పీ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. కాన్పూర్, యూపీ ప్రజలకు మొత్తం అర్థమవుతోందన్నారు. యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు. -
తెలంగాణ బడ్జెట్: ‘గ్రేటర్’కు సర్కారు వారి పాట
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రోకు తాజా బడ్జెట్లో కాసుల వర్షం కురిసింది. మెట్రోకు రూ.వెయ్యి కోట్ల నిధులను కేటాయించడంతో ఎంజీబీఎస్–పాత నగరం (5.3 కి.మీ), రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంలో మెట్రో కూత పెడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత మూడేళ్లుగా మెట్రోకు రాష్ట్ర సర్కారు మొండిచేయి చూపడంతో హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్ఎంఆర్) అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికుల వసతుల కల్పన ప్రాజెక్టులు అటకెక్కిన విషయం విదితమే. చివరకు హెచ్ఎంఆర్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు లేని దుస్థితి నెలకొన్న తరుణంలో తాజా బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. తొలి విడత మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్– ఫలక్‌నుమా మార్గంలో మెట్రో విస్తరణ పనులు నిధుల లేమి కారణంగా పట్టాలెక్కని విషయం విదితమే. రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తాజాగా ప్రభుత్వం కేటాయించిన నిధులతో మొదలవుతాయని మెట్రో వర్గాలు తెలిపాయి. పట్టాలెక్కని ఎంఎంటీఎస్! ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుకు బడ్జెట్లో మొండిచెయ్యే దక్కింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల కొరతతో ఇప్పటికే చాలా చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని రూట్లలో రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ పూర్తయినా కొత్త రైళ్ల కొనుగోళ్లకు నిధులు లేక పట్టాలు అలంకారప్రాయంగా మారాయి. అయిదేళ్ల క్రితం రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.550 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు దశలవారీగా రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైల్వేశాఖ సొంత నిధులతోనే చాలావరకు పనులు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు లేక కొంతకాలంగా రైల్వేశాఖ సైతం చేతులెత్తేయడంతో పనులు స్తంభించాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్‌కు సైతం నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు నిర్మించదలచిన ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే సర్వే పూర్తయింది. ప్రగతిరథ చక్రం రయ్ రయ్ సిటీ బస్సుకు ఊరట లభించింది. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రెండేళ్లుగా ఆర్థిక నష్టాలతో పాటు ప్రయాణికుల ఆదరణను సైతం కోల్పోయిన ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పునర్వైభవాన్ని సంతరించుకొనే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాటు, మరో రూ.1500 కోట్ల బడ్జెటేతర సహాయం అందజేయనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రతిపాదించిన 25 డబుల్ డెక్కర్ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు సైతం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. తాజా కేటాయింపులతో బస్సుల కొనుగోళ్లు వేగంగా జరిగే అవకాశం ఉంది. ‘ఆర్టీసీకి ఇది అన్ని విధాలా సానుకూల సమయం. సకాలంలోనే డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కుతాయి’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేటాయింపులతో కొత్త బస్సులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గ్రేటర్లో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడంతో పాటు ఇప్పుడు ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత ప్రగతి సాధించే అవకాశముంది. ‘మహా’ అత్తెసరు! హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో పాటు మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కైవే, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ర్యాంపులు, చెరువులు సుందరీకరణ, నెక్లెస్ రో డ్డులో అభివృద్ధి పనులు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ బడ్జెట్లో అభివృద్ధి కార్యకలాపాల కోసం కేవలం రూ.10 లక్ష లు మాత్రమే కేటాయించడం అధికారులను విస్మయపరిచింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా హెచ్ఎండీఏ సొంత ఆదాయంతోనే పనులను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రూ.900 కోట్లపైగా అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనులకు ఇక హెచ్ఎండీఏ అటు కోకాపేట, ఇటు మూసాపేట భూముల విక్రయాలపై వచ్చే ఆదాయమే ఆధారం కానుంది. 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు 2011 నుంచి ప్రతి ఏడాది బీఓటీ అన్యూటి పేమెంట్ రెండు వాయిదాల్లో రూ.331.38 కోట్లు చెల్లిస్తోంది. 2016 నుంచి రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చిన హెచ్ఎండీఏ కాంట్రాక్టర్లకు రూ.440 కోట్లు చెల్లించింది. గతేడాది ఓఆర్ఆర్ బీవోటీ అన్యూటి పేమెంట్ల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి జైకా రుణం చెల్లింపుల కోసం రూ.478 కోట్లు అడిగితే రూ.472 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్‌తో రుణాల చెల్లింపు ముగియనుంది. ఆర్ఆర్ఆర్.. హుషార్: భూసేకరణకు రూ.750 కోట్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికిగాను భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించింది. మహానగరం చుట్టూ విస్తరించిన ప్రధాన పట్టణాలను కలుపుతూ సుమారు 330 కి.మీ మేర ఆర్ఆర్ఆర్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆర్ఆర్ఆర్.. దక్షిణ మార్గం రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లనుంది. చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, కడ్తాల్, యాచారం మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద కలుస్తుంది. సుమారు 120 కి.మీ పరిధి రంగారెడ్డి జిల్లాలో ఉండనుంది. దక్షిణ మార్గానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించలేదు. చౌటుప్పల్ నుంచి భువనగిరి, గజ్వేల్ మీదుగా కంది వరకు విస్తరించనున్న ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా బడ్జెట్లో భూ సేకరణకు నిధులు కేటాయించడంతో తొలుత ఈ మార్గంలో భూ సేకరణ చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ మార్గంలో అలైన్మెంట్ ఖరారు కావడానికి కొంత సమయం పట్టనుండటంతో భూ సేకరణ కొంత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో జిల్లా రూపు రేఖలు మారిపోయాయి. త్వరలో ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్తో జిల్లా మరింత అభివృద్ధి దిశగా పయనించే వీలుంది. మూసీకి మహర్దశ: రూ.200 కోట్ల కేటాయింపులు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్ భాగ్యరేఖ.. చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనులకు తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్ నుంచి ప్రతాప సింగారం (45 కి.మీ) మార్గంలో నదికి సమాంతరంగా ఇరువైపులా తీరైన రహదారుల ఏర్పాటు, పాదచారుల దారులు, సుందర ఉద్యానాల ఏర్పాటు, ప్రక్షాళన, సుందరీకరణ పనులు ఊపందుకోనున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబర్మతి, గంగా నది తరహాలో మూసీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు కాలుష్య కోరల నుంచి విముక్తి లభించనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర వాసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడంతో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం ఒకవైపు వాహన విస్ఫోటనం. మరోవైపు కాలుష్యం చిమ్ముతున్న కాలం చెల్లిన వాహనాలు. నగరజీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సముచితమైన ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు తాజా బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు ఈ రంగానికి ఊతమిచ్చాయి. ఎలక్ట్రిక్ రవాణా, వ్యక్తిగత వాహనాల తయారీకి సబ్సిడీ ఇవ్వడంతో పాటు వాహన కొనుగోలుదారులకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపు లభించనుంది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో కేవలం 5,700 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే నమోదయ్యాయి. సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలు కాగా.. మిగతావి బస్సులు, ఇతర కేటగిరీలకు చెందిన రవాణా వాహనాలు ఉన్నాయి. మరోవైపు నగరంలో రోజురోజుకూ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలన్నీ సుమారు 60 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 15 లక్షలకుపైగా కాలం చెల్లినవే. వ్యక్తిగత వాహనాలతో పాటు 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలు కూడా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆటో రిక్షాలు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర కేటగిరీల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తే పర్యావరణానికి కొంత మేరకు రక్షణ లభించనుంది. -
బీజేపీ సీఎం అభ్యర్థిగా ‘మెట్రోమ్యాన్’!
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు కూడా ఉన్నాయి. తమిళ ప్రజలు బీజేపీ పట్ల అంత విశ్వాసం చూపరు. ఈ క్రమంలో కాషాయ పార్టీ కేరళలో పాగా వేసేందుకు సీరియస్‌గా ట్రై చేస్తోంది. దానిలో భాగంగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేరళ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కే సురేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించారు. మిగతా వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. శ్రీధరన్ గత వారం బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అని తెలిపారు. తాజాగా బీజేపీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ.. ‘‘ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ నుంచి పోటీ చేసినా నేను గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే, నేను ఇప్పుడు నివసిస్తున్న మలప్పురంలోని పొన్నానికి సమీపంగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను”అని తెలిపారు. కొచ్చి మెట్రో ప్రాజెక్టుకు గురువుగా ఉన్న శ్రీధరన్ తాను ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సంప్రదాయాన్ని పాటించనని తెలిపారు. ‘‘నేను ఇళ్లకు, దుకాణాలకు, ఊర్లకు వెళ్లను. కానీ నా సందేశం ఓటర్లందరికి చేరుతుంది’’ అన్నారు. వృద్ధులను పక్కకు పెడుతున్న బీజేపీ తాజాగా 88 ఏళ్ల శ్రీధరన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా? లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు! -
మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?
దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాంక్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. మరి తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? శ్రీధరన్‌కి వయోపరిమితి అడ్డు రాదు. బీజేపీ వయోపరిమితి ఆంక్షలను చాలా సందర్భాల్లో సడలించేసింది. వామపక్షాలు మాత్రమే ఇప్పటికీ ఈ వయోపరిమితి నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం మన దేశంలోని రాజకీయ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని తమకు తాముగా ఉల్లంఘిస్తుంటాయి. దేశంలో అనేక సంక్లిష్టమైన బ్రిడ్జిలను, ప్రత్యేకించి అత్యంత ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన మాజీ రైల్వే అధికారి, మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. కానీ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి వయస్సు ఆయనకు అడ్డంకేమీ కాలేదు. ఆయన వేసిన అడుగు సాహసోపేతమైనది కాబట్టే కొనియాడదగినది. కేరళలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండటం, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ చాలా దూరంలో ఉంటున్న నేపథ్యంలో శ్రీధరన్ నిర్ణయం అసాధారణమైందనే చెప్పాలి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అశ్వమేధ యజ్ఞం ప్రకారం బీజేపీకి కేరళలో అధికారం చేజిక్కించుకోవడం చాలా కీలకమైన విషయం. దేశం మొత్తంలో విజయం సాధించాలనే మోదీ ఆకాం క్షకు వ్యతిరేకంగా నిలిచిన చిట్టచివరి దుర్గమదుర్గాల్లో కేరళ ఒకటి. కాబట్టి ఏం చేసైనా సరే కేరళను గెల్చుకోవాలి. మోదీకి ఆ పని చేసిపెట్టే జనరల్‌గా శ్రీధరన్ ఇప్పుడు ముందుకొచ్చారు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవులు చేపట్టడంపై తనకు ఆసక్తి లేదని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి వెనుకాడబోనని శ్రీధరన్ స్పష్టం చేశారు. ఇంతవరకు అంతా బాగుంది. ఎందుకంటే తన ఆకాంక్షను నెరవేర్చుకునే మార్గంలో ఆయనకు వయస్సు ఎందుకు అడ్డు రావాలి? కానీ ఇక్కడ ఒక అవరోధం ఉంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు, ఒక పుకారు వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే ఎన్నికల్లో గెలుపు సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు 75 ఏళ్లు దాటిన బీజేపీ సభ్యులకు మంత్రివర్గంలో చేరే అర్హత ఉండబోదని అప్పట్లో వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేవారికి అప్పట్లో వయోపరిమితిని పెట్టలేదు. కాబట్టే తమకు నూతనంగా ఏర్పడే ప్రభుత్వంలో మంత్రిపదవులు లభించబోవనే స్పష్టమైన అవగాహనతోటే లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను నాటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించారు. ఆ తర్వాత అడ్వాణీ, జోషీలు తమ నియోజకవర్గాలలో గెలిచి అయిదేళ్లపాటు పార్లమెంటులో నిస్సారమైన జీవితం గడిపారు. తర్వాత 2019లో రిటైర్ అయ్యారు. వారిని తర్వాక బీజేపీ మార్గదర్శక్ మండల్ సభ్యులను చేసిపడేశారు. అయితే ఈ మండల్ ఇంతవరకు ఒక్కసారికూడా భేటీకాలేదనుకోండి. రాజకీయాల్లో వీరి అద్భుతమైన ప్రయాణం చివరకు వారి సుప్రసిద్ధ శిష్యుడి (నరేంద్రమోదీ) చేతిలోనే ముగిసిపోయింది. అంటే అక్బర్/బైరాం ఖాన్ కథ మరోసారి ఇక్కడ పునరావృతమైంది. అయితే బైరాం ఖాన్ లాగా అడ్వాణీ, జోషీలు ఢిల్లీనుంచి బహిష్కరణకు గురి కాలేదు. పూర్తి సదుపాయాలతో, సంపూర్ణ భద్రతతో వీరు ప్రభుత్వ వసతి గృహంలో ఢిల్లీలో నివసించడానికి వీరిని అనుమతించారు. ఆ తర్వాత వారి గురించి నేను వినలేదు. ఇటీవలకాలంలో వారిని నేను కలిసిందీ లేదు. కానీ వారు ఆరోగ్యంతో పనిచేసుకుంటున్నట్లు ఆశిస్తాను. ఇప్పుడు శ్రీధరన్ వద్దకు వద్దాం. ఏదేమైనప్పటికీ ఆయన ఒక అసాధారణమైన వృత్తినిపుణులు. ఆయన రాజకీయ జీవితంలోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టారు. బీజేపీలో 75 ఏళ్ల వయోపరిమితి గురించి అయనకు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా తెలిసి ఉండొచ్చు కూడా. అయితే ఈ నియమానికి కూడా ఇప్పటికే కొన్ని మినహాయిం పులు ఏర్పడ్డాయి. కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను ఎంపిక చేసినప్పుడు ఆ నిబంధనను బీజేపీ పాటించలేదు. ఆయన 75 ఏళ్లకు మించిన వయస్సులో కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఆయన నియామకం మాత్రం తప్పనిసరైంది. ఎందుకంటే కర్ణాటకలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారు బేజీపీలో ఎవరూ లేరు. కొంతమంది అయితే ఈ నియమం కేంద్ర స్థాయిలోనే కానీ రాష్ట్రాల్లో వర్తించదని బలహీనమైన వాదనను తీసుకొస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అంటే నరేంద్రమోదీ ఇంకా బీజేపీకి యజమాని కాకముందు, వామపక్షాలకు మల్లే రాజ్యసభకు ఎంపికయ్యే బీజేపీ సభ్యులను రెండుసార్లకు మాత్రమే పరిమితం చేయాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. అరుణ్ షౌరీ, శత్రుఘ్న సిన్హా వంటి బీజేపీ ప్రముఖులను మూడోసారి చట్టసభలోకి అడుగు పెట్టకుండా చేయడానికి ఉపయోగపడింది. కానీ పరిస్థితులు మారిపోయాక, పాలకుల వంతు వచ్చినప్పుడు, ఈ నియమం మళ్లీ మారింది. అప్పటికే చట్టసభల్లో ఉన్నవారికి మూడోసారి, నాలుగోసారి కూడా అవకాశం కల్పిం చారు. దివంగత సీనియర్ నేత అరుణ్ జైట్లీ కూడా లేటు వయసులో ఈ జాబితాలో భాగమయ్యారన్నది వాస్తవం. కాబట్టి నియమాలు, వాటి పాటింపు గురించి చాలానే మాట్లాడుకున్నాం. కాబట్టి శ్రీధరన్‌కి ఇప్పటికీ అవకాశం ఉంది. వయోపరిమితి ఆయనకు అడ్డు రాదు. దీంతో పోలిస్తే వామపక్షాలు ఇప్పటికీ ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. రాజ్యసభలో అసాధారణమైన పనితీరు ప్రదర్శించిన ప్రముఖ వామపక్ష నేతలు కూడా రెండు సార్లు చట్టసభకు ఎన్నికయ్యాక పల్లెత్తు మాటనకుండా రాజ్యసభ నుంచి తప్పుకుని తమతమ పార్టీల నిర్ణయాన్ని గౌరవించారు. సీతారాం ఏచూరి కూడా ఇప్పుడు అదే వరసలో ఉంటున్నారు. వామపక్షాలు ఈ నియమాన్ని తమకు తాముగా రూపొందించుకోవడమే కాకుండా దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నందుకు వారంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. అంతేకానీ మీ ముఖం నాకు చూపించండి, మీకు వయోపరిమితి నిబంధనను చూపిస్తాను అనే రకంగా ఉండే బీజేపీ నినాదాన్ని వామపక్షాల ఆచరణతో పోల్చి చూద్దాం మరి. అయితే బీజేపీ ఏదైనా సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఈ 75 సంవత్సరాల వయోపరిమితిని తీసుకురాలేదు. ఒకే ఒక వ్యక్తి ఆదేశంలో ఇది ఇలా ముందుకొచ్చింది. ఆ సమయంలో నూతన పాలకుల అధికార బలాన్ని అడ్డుకోలేని పలువురు సీనియర్ నేతలకు రంగంనుంచి తప్పించుకోవడానికి ఈ వయోపరిమితి చాలా సులభమైన మార్గంగా ఉపయోగపడేది. ఈ నియమంతో వ్యవహరించడం చాలా సులభం. ఇప్పుడు ఈ నియమం లక్ష్యం నెరవేరిది. ఎందుకంటే మనుషుల కోసమే నియమాలు తయారవుతాయి కానీ నియమాల కోసం మనుషులు తయారు కారు కదా.. అమెరికాలో దేశాధ్యక్షుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హుడు కాదు. అందుచేతనే చాలామంది అమెరికా అధ్యక్షులు చాలా తక్కువ వయస్సులోనే అధ్యక్ష పదవిని చేపట్టేవారు. వారితో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 78 సంవత్సరాల వయస్సులో గద్దెనెక్కడం ప్రత్యేక విషయమే అనుకోండి. భారత్‌లో, అలాంటి పదవీ కాల పరిమితులు లేదు. పదవి, ఆఫీసులో పనిచేసే కాలం విషయంలో మనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. కానీ మనకు కూడా అలాంటి పరిమితులు విధిస్తేనే బావుం టుందా? నేనయితే కచ్చితంగా చెప్పలేను. ప్రజాస్వామ్యంలో మనం ఇలాంటి విషయాలను ప్రజలకు వదిలేయకూడదా? అయితే ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని పార్టీలకు మనం వదిలేసినంత కాలం ఆ పార్టీలు ఇలాంటి నియమాలను రూపొందిస్తూనే ఉంటాయి. మళ్లీ వాటిని ఉల్లంఘిస్తుంటాయి. ఇకపోతే శ్రీధరన్ విషయానికి వస్తే, వయసుతో సహా ఆయన్ని వెనక్కు లాగే అవకాశాలు లేవు. కాబట్టి కేరళ ప్రజలు కోరుకుంటే ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. ఇది జరగాలంటే వారు రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవాల్సి ఉంటుంది మరి. వ్యాసకర్త బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (ఎన్డీటీవీ సౌజన్యంతో...) -
బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, విమాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెట్టుబడుదారులకు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రభుత్వ వాటాను విక్రయిస్తామన్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి 5వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కేరళలో 11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 25 వేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తమిళనాడులో రహదారలు అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మెట్రోకి భారీగా నిధులు ఇక బడ్జెట్లో మెట్రోలైట్, మైట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. బెంగళూరు, నాగ్‌పూర్, కొచ్చి మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చెన్నై మెట్రోకు 63వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. బెంగళూరు మెట్రోరైలు అభివృద్ధికి 14,788 కోట్ల రూపాయలు, కొచ్చి మెట్రోరైలు ఫేజ్-2 అభివృద్ధికి 1957 కోట్ల రూపాయలు.. బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి రూ.18వేల కోట్లు కేటాయించారు. ఇక దేశంలో లక్షా 18వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు గాను 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ పూర్తి చేస్తామన్నారు. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయనున్నాట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం
లక్నో: దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గత శతాబ్దంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు దేశానికి పెద్ద భారంగా పరిణమించాయని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నికల ఫలితాల్లోనూ అవి ప్రతిఫలిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని తేల్చిచెప్పారు. ప్రజలకు కొత్త సౌకర్యాలు కల్పించాలంటే సంస్కరణలు తప్పవన్నారు. భారంగా మారిన చట్టాలను వదిలించుకోవాలన్నారు. వారి మద్దతు కొత్త బలాన్ని ఇస్తోంది ఇటీవల తాము తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిందని మోదీ చెప్పారు. తమ ప్రయత్నాలను జనం ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా పేద, మధ్య తరగతి ప్రజల్లో తమకు ఆదరణ ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. కొత్త ప్రాజెక్టులకు నిధులు గత ప్రభుత్వాల హయాంలో మౌలిక వసతుల రంగంలో ప్రధాన సమస్య ఏమిటంటే.. కొత్త ప్రాజెక్టులను ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప నిధులు సమకూర్చడంపై శ్రద్ధ చూపలేదని ప్రధాని మోదీ ఆక్షేపించారు. తమ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1,000 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైల్ లైన్ల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సైనికుల సంక్షేమానికి చేయూతనివ్వండి మన సైనికుల నిస్వార్థమైన సేవ, సాహసాలు, త్యాగం పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని అన్నారు. సైనిక దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాల్సిన రోజు ఇది అని చెప్పారు. సైనిక సంక్షేమానికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1949 నుంచి ఏటా డిసెంబర్ 7వ తేదీని ఫ్లాగ్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. టీకా కోసం ఎక్కువ కాలం నిరీక్షించలేం కరోనా వ్యాక్సిన్ రాక కోసం దేశం ఎక్కువ కాలం వేచి చూడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. తాను కొన్ని వారాలుగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమైన శాస్త్రవేత్తలతో మాట్లాడుతూనే ఉన్నానని గుర్తుచేశారు. -
ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించనున్న మోదీ
-
ఆగ్రా మెట్రోని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రా మెట్రో రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తొలి విడతగా మూడు మెట్రో స్టేషన్లను ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖులు పాల్గొంటారని ఆగ్రా జిల్లా మెజిస్టే్ట్ ఎన్ ప్రభుసింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. తొలివిడతలో తాజ్‌ఈస్ట్‌గేట్, బసాయ్, ఫతేహాబాద్ రోడ్డు స్టేషన్లు ఉన్నాయి. రూ.273 కోట్లతో ఫతేహాబాద్ 26 నెలల్లో పూర్తవుతుందని అంచనా. కేంద్ర క్యాబినెట్ మెట్రో ప్రాజెక్ట్‌కి ఫిబ్రవరి 28, 2019లోనే ఆమోదం తెలిపింది. అనుకూలమైన అర్బన్, సిటీ ప్రాంతాల్లో మొదటగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజారవాణాకు అనుగుణంగా షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాలను ఎంచుకుని తోలి విడతలో ఫతేహాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీఆర్పీ ప్రకారం రెండు కారిడార్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాయి. నగరంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాలైనా తాజ్‌మహల్, ఆగ్రాపోర్ట్, ఎత్మదుల్లా, సికింద్రాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉన్నాయి. మొత్తం నగరంలో 27 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. నగరంలో29.4 కి.మీ మేర మెట్రో రైల్వే కారిడార్‌ను నిర్మించనున్నారు. -
దేశంలోనే తొలి లైట్‌మెట్రో..విశాఖలో
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా విశాఖలో లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదివారం మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు డీపీఆర్, కారిడార్లలో మార్పులు చేర్పులపై అధికారులు మంత్రులకు వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మెట్రో ప్రాజెక్టు పీపీపీ విధానంలోనా, ప్రభుత్వమే నేరుగా చేపడుతుందా అనే విషయంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నవంబర్ రెండోవారంలో లైట్‌మెట్రో, డిసెంబర్ రెండోవారంలో మోడరన్ ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌లను యూఎంటీసీ కన్సల్టెంట్ సంస్థ ఇవ్వనుందని చెప్పారు. ముందుగా చేపట్టే లైట్‌మెట్రో ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభమై మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. నాలుగు కారిడార్లలో 75.31 కిలోమీటర్ల మేర 52 స్టేషన్లు ఏర్పాటు చేసేలా మొదటి విడత ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారు. విభజన చట్టంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు అంశం ఉన్న నేపథ్యంలో నిధుల గురించి కేంద్రాన్ని అడుగుతామని తెలిపారు. కేంద్ర సహకారం అందినా, అందకపోయినా.. మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటిదశలో స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ మెట్రో.. మరింత ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) రూట్లో మెట్రో ఏర్పాటుకు నిధుల లేమి శాపంగా పరిణమించనుంది. నిధుల సమీకరణ, ప్రాజెక్టును చేపట్టేందుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) యంత్రాంగాన్ని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం శూన్యంగా మారనుంది.. ఈ రూట్లో మెట్రో ఏర్పాటుకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించి ఏడాది ముగిసినా అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టి సుమారు రూ.4 వేల కోట్లు వ్యయం చేసేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంలేదని సమాచారం. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్పీవీ సైతం నిధుల సమీకరణలో చేతులెత్తేయడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి తొలిదశ మెట్రో రైళ్లు కూడా డిపోలకే పరిమితమైన విషయం విదితమే. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ రైళ్లను నడుపుతామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినా.. అనుమతులు లభించకపోవడం గమనార్హం. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎప్పుడో? రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కి.మీ) మార్గంంలో ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రధానంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ కారిడార్ ప్రాంతాలకు విచ్చేసే దేశ, విదేశీ ప్రయాణికులు అరగంట వ్యవధిలోగా విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఈ మార్గాన్ని డిజైన్ చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు ఏడాది క్రితమే సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ నిధుల సమీకరణ విషయంలో స్పెషల్ పర్పస్ వెహికిల్ యంత్రాంగం చేతులెత్తేయడం, పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో పనులు ఎప్పుడు మొదలయ్యే విషయం సస్పెన్స్‌గా మారింది. రెండో దశపై నీలినీడలు.. బీహెచ్ఈఎల్ నుంచి లక్డికాపూల్ (26 కి.మీ), నాగోల్– ఎల్బీనగర్ (5 కి.మీ) మార్గంలో రెండు మెట్రో కారిడార్లను అనుసంధానించేందుకు రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత తరుణంలో రెండో దశ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం సొంతంగా నిధులు వ్యయం చేసే పరిస్థితిలో లేకపోవడం, పీపీపీ విధానంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండోదశపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వ్యయం ఘనం.. ఫలితం అంతంతే.. నగరంలో తొలిదశ మెట్రో ప్రాజెక్టును నాగోల్– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్– మియాపూర్ మూడు రూట్లలో 69 కి.మీ మార్గంలో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తికి 2010–14లో రూ.8683 కోట్లు, 2015–20లో రూ.13,236.. మొత్తంగా రూ.21,919 కోట్లు ఖర్చు చేసినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ఇటీవల వెల్లడించింది. ఇందులో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సింహభాగం నిధులను వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా సేకరించి ఈ ప్రాజెక్టుకు వ్యయం చేసింది. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన ఈ ప్రాజెక్టు నగర రూపురేఖలను మార్చినప్పటికీ.. మెట్రో రైళ్లలో లాక్‌డౌన్‌కు ముందు కేవలం 4 నుంచి 4.5 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారని.. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఆశించినంతంగా సత్ఫలితాన్నివ్వలేదని స్పష్టమవుతోందని పట్టణ ప్రణాళిక రంగ నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ పంజాతో ప్రజా రవాణాపై నీలినీడలు కమ్ముకున్నాయంటున్నారు. ఈ ఛాయలు భవిష్యత్‌లోనూ కొనసాగనున్నాయని అంచనా వేస్తున్నారు. -
పీఎన్బీ హౌసింగ్- జీపీటీ ఇన్ఫ్రా.. జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 258 పాయింట్లు జంప్‌చేసి 38,309కు చేరగా.. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,333 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ వార్తలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్ గెలుచుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ సైతం జోరు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రిఫరెన్షియల్, రైట్స్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదించినట్లు ఇప్పటికే పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై బుధవారం(19న) సమావేశంకానున్న బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 270ను అధిగమించింది. ప్రస్తుతం 10 శాతం లాభంతో రూ. 265 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 19 లక్షలకుపైగా షేర్లు చేతులు మారడం గమనార్హం! జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ పీఎస్‌యూ రైల్వే వికాస్ నిగమ్.. కోల్‌కతా నుంచి రూ. 196 కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టు లభించినట్లు జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ తాజాగా పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా మెట్రో రైల్వే వయాడక్ట్సహా.. రెండు రైల్వే స్టేషన్ల అభివృద్ధిని సైతం చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 31ను అధిగమించింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 30 వద్ద ట్రేడవుతోంది. -
2024 నాటికల్లా విశాఖ మెట్రో..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర వీధుల్లో మెట్రో రైలు పరుగు తీసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే లైట్‌మెట్రో, ట్రామ్ కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ తలమునకలు కాగా.. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ బిజీగా ఉంది. లైట్ మెట్రో రైలు కారిడార్ నిర్మాణానికి ఒక కిలోమీటరుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా.. ట్రామ్ కారిడార్‌కు రూ.100 నుంచి రూ.120 కోట్లుగా భావిస్తున్నారు. లైట్ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ని నవంబర్ నెలాఖరుకు, ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ని డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది. నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ ఉంటోంది.. మెట్రో కారిడార్ రూట్‌మ్యాప్‌లలో జరుగుతున్న అభివృద్ధి 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్ మొదలైన అంచనాలతో డీపీఆర్ తయారవుతోంది. కీలక నిర్ణయాలు పూర్తవడంతో.. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. లైట్ మెట్రోరైలు, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు సంబంధించిన సవివర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ చేతిలో సిద్ధమవుతోంది. లైట్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్‌ను అప్డేట్ చేస్తూ.. 79.91 కి.మీకు సంబంధించిన డీపీఆర్‌ను రూ.5.34 కోట్లకు, 60.20 కి.మీ పొడవున్న ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రూ.3.38కోట్లకు అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డీపీఆర్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. నవంబర్‌లో లైట్ మెట్రో.. డిసెంబర్లో ట్రామ్ ఏప్రిల్, మేలో రెండు డీపీఆర్‌లకు చెందిన బాధ్యతలను అప్పగించి.. ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే.. కోవిడ్–19 కారణంగా లాక్డౌన్ విధించడంతో డీపీఆర్ పనులను యూఎంటీసీ ప్రారంభించడంలో ఆలస్యమైంది. దీంతో ప్రభుత్వం అదనపు సమయం కేటాయించింది. లైట్‌మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ను నవంబర్ నెలాఖరుకు, ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది. ఈ మేరకు నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్ ఉంటోంది.. మెట్రో కారిడార్ రూట్‌మ్యాప్‌లలో జరుగుతున్న అభివృద్ధి, 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్ మొదలైన అంచనాలతో డీపీఆర్ తయారవుతోంది. లైట్ మెట్రో ప్రాజెక్ట్ 79.91 కి.మీ మేర రూపుదిద్దుకుంటోంది. వివిధ దేశాల్లో చేపట్టిన ప్రాజెక్ట్‌లను అధ్యయనం చేసిన అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) ప్రాజెక్ట్ వ్యయంపై ప్రాథమిక అంచనాలను రూపొందించింది. ఒక కిలోమీటర్ మేర లైట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అదే విధంగా లైట్ మెట్రోతో పోలిస్తే ట్రామ్ కారిడార్ నిర్మాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా గుర్తించారు. ఒక కి.మీ ట్రామ్ కారిడార్ నిర్మించేందుకు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు. మొత్తం 79.91 కి.మీ మేర లైట్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్ కారిడార్ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ట్రామ్‌కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నారు. డీపీఆర్ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో స్వల్ప మార్పులుండనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇవీ అంచనాలు లైట్ మెట్రో డీపీఆర్ పూర్తయ్యే సమయం– 2020 నవంబర్ కిలోమీటర్ నిర్మాణానికి లైట్ మెట్రోకు అయ్యే ఖర్చు– సుమారు రూ.200 కోట్లు ట్రామ్ కారిడార్ డీపీఆర్ పూర్తయ్యే సమయం– 2020 డిసెంబర్ కిలోమీటర్ నిర్మాణానికి ట్రామ్ కారిడార్‌కు అయ్యే ఖర్చు– సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకునే సమయం–మార్చి 2021 లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభించే సమయం– జూన్ 2021 విశాఖ వీధుల్లో మొదటి మెట్రో సర్వీసు ప్రారంభమయ్యే సమయం– మార్చి 2024 2024 నాటికల్లా పట్టాలెక్కేలా.. ఈ ఏడాది చివరి నాటికల్లా లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి కానున్నాయి. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్ పూర్తి చేస్తాం. జూన్ 2021 నాటికి లైట్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభిస్తాం. మార్చి 2024 నాటికి లైట్ మెట్రోలో ఒక కారిడార్ నుంచి ప్రయాణాలు ప్రారంభించేలా.. మెట్రోరైలు ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రామకృష్ణారెడ్డి, ఎండీ, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ -
కరోనా ఎఫెక్ట్ : మెట్రో ప్రయాణానికి విముఖత
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు ప్రారంభమైనా రానున్న నెల రోజుల పాటు వాటిలో ప్రయాణం చేయబోమని లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 67 శాతం మంది తేల్చిచెప్పారు. ఇక వచ్చే నెల రోజుల్లో జిమ్నాజియం, స్విమ్మింగ్‌పూల్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులే పేర్కొన్నారు.రాబోయే మూడు నెలల పాటు విహార యాత్రలకు, హోటళ్లలో గడిపేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోలేదని 93 శాతం మంది పేర్కొన్నారు. జూన్ 30తో అన్‌లాక్ 1.0 ముగుస్తున్నా పలు రంగాలకు భారీ సడలింపులు ప్రకటించినా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అన్‌లాక్ 2.0 దశలో ప్రజలు మెట్రో, లోకల్ ట్రైన్లను ఎంతవరకూ ఉపయోగించుకుంటారు...జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లకు వెళ్లడం, విహార యాత్రలకు ప్లాన్ చేయడంపై లోకల్‌సర్కిల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో పౌరులను ప్రశ్నించడం ద్వారా 24,000 సమాధానాలను రాబట్టింది. కాగా వీలైనంత త్వరలో మెట్రో సర్వీసులను పునరుద్ధరిస్తామని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ ఇటీవల వెల్లడించింది. జూన్ 15న ముంబైలో లోకల్ రైళ్ల రాకపోకలు ప్రారంభమైనా ప్రయాణీకుల నుంచి స్పందన పరిమితంగా ఉండటం గమనార్హం. ఇక వచ్చే నెలరోజుల్లో మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు పునఃప్రారంభమైతే వాటిలో ప్రయాణిస్తామని 25 శాతం మంది పేర్కొనగా, కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో మెట్రో ప్రయాణం సురక్షితం కాదని 67 శాతం మంది పౌరులు వెల్లడించారు. పెట్రో ధరలు ఇటీవల భారీగా పెరిగి తమ జేబులకు చిల్లు పెడుతున్నా కరోనా భయంతో వాహనదారులు ప్రజా రవాణావైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక రానున్న నెల రోజుల్లో జిమ్నాజియంలు, స్విమ్మింగ్‌పూల్స్ తెరుచుకున్నా వాటిని సందర్శించబోమని 84 శాతం మంది వెల్లడించగా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులు పేర్కొన్నారు. చదవండి : మెట్రో నష్టాన్ని చెల్లించండి! -
మెట్రో నష్టాన్ని చెల్లించండి!
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా డిపోలకే పరిమితమైన మెట్రో రైళ్లతో నిర్మాణ సంస్థకు వాటిల్లిన నష్టాన్ని పరిహారంగా అందజేయాలని మెట్రో నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు ఎల్అండ్టీ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ..హైదరాబాద్ మెట్రో రైలు సంస్థలు అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ అనధికారికంగా విషయం బయటకు పొక్కడం గమనార్హం. నిర్మాణ ఒప్పందం ప్రకారం మెట్రో నిర్మాణానికి నిర్మాణ సంస్థ చేసిన వ్యయాన్ని..సుమారు 35 ఏళ్లపాటు ప్రయాణికుల చార్జీలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనలు, వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించని పక్షంలో కనీసం 3 నెలలపాటు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మెట్రో నిర్వహణ ఒప్పందాన్ని మరో 4–6 నెలల పాటు పెంచాలని లేఖలో కోరినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 22 నుంచి మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ మూడు రూట్లలో 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉన్న విషయం విదితమే. నిత్యం 4 లక్షల మంది..సెలవురోజుల్లో ç 4.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసేవారు. దీంతో ప్రయాణికుల చార్జీలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనల ద్వారా నిర్మాణ సంస్థకు ప్రతినెలా రూ.50 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించేది. గత 3 నెలలుగా ఆదాయం లేకపోవడంతో రూ.150 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. మెట్రో స్టేషన్లు, డిపోలు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు వెరసి సంస్థకు నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుండటం గమనార్హం. నాడు నిర్మాణ వ్యయం..నేడు నిర్వహణ వ్యయం.. మెట్రో ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు 2011 నుంచి 2017 వరకు ప్రస్థానం కొనసాగింది. ఆస్తుల సేకరణ, న్యాయపర చిక్కులు, రైట్ ఆఫ్ వే సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్లు ఆలస్యమైంది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని కూడా గతంలో నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో లేఖ రాసిన విషయం విదితమే. తాజాగా నిర్వహణపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న సంస్థ నిర్వహణ భారాన్ని పరిహారంగా చెల్లిం చాలని కోరడం గమనార్హం. కాగా దేశ రాజధాని ఢిల్లీ..మన పొరుగునే ఉన్న చెన్నై, బెంగళూరు, ముంబై మహానగరాల్లో మెట్రో ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వాలు, ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా నిర్వహిస్తున్నాయి. కానీ నగరంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం తో ప్రపంచం లోనే అతిపెద్దది కావడం విశేషం. ఈ నేపథ్యంలో నష్టాన్ని ప్రభుత్వం కూడా భరించాలని ఈ సంస్థ కోరుతుండటం గమనార్హం. నష్టాల బాట ఎన్నాళ్లో? లాక్‌డౌన్‌కు ముందు లాభం..నష్టం లేని స్థితికి చేరుకుంటున్న తరుణంలో కోవిడ్ విసిరిన పంజాకు మెట్రో నిర్మాణ సంస్థ కుదేలైపోయింది. లాక్డౌన్ పేరుతో భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోంది. సంస్థ కోరినట్లుగా పరిహారం చెల్లిస్తుందా..నిర్వహణ గడు వు పొడిగిస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది. -
డీపీఆర్ పట్టాలపై విశాఖ మెట్రో
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు అవరోధాల్ని అధిగవిుస్తూ ముందుకు సాగుతోంది. ప్రాజెక్టులో మార్పులకు అనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారు చేసేందుకు సర్వం సిద్ధమైంది. మెట్రో ప్రాజెక్టుకి కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) డీపీఆర్ తయారు చేసేందుకు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. డీపీఆర్ తయారీ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ), రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్(రైట్స్), అర్బన్ మాస్ ట్రాని్సస్ట్ కంపెనీ లిమిటెడ్(యూఎంటీసీ) సంస్థలకు మాత్రమే అనుమతినివ్వడంతో సంబంధిత సంస్థలు తమ టెండర్లను ఏఎంఆర్‌సీకి అందించాయి. గతంలో రూపొందించిన 42.55 కి.మీ డీపీఆర్‌ను అప్డేట్ చేస్తూ 79.91 కి.మీ మేర లైట్ మెట్రో కారిడార్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) బాధ్యతల్ని రూ.5,33,50,600లకు టెండర్ వేసిన అర్బన్ మాస్ ట్రాని్సస్ట్ కంపెనీ లిమిటెడ్(యూఎంటీసీ)కు మార్చి 20వ తేదీన అప్పగించారు. గతంలో రూపొందించిన 46.40 కిలోమీటర్ల మెట్రో డీపీఆర్‌ని అప్డేట్ చేస్తూ మొత్తం పొడిగించిన మేర రిపోర్టు తయారు చెయ్యాలని ఏఏంఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. పీపీపీ పద్ధతిలో రూపొందించనున్న ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ని ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని సదరు సంస్థకు సూచించింది. అదే విధంగా మార్చి 27న మోడ్రన్ ట్రామ్ కారిడార్ డీపీఆర్ తయారీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనేది తేలాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా వేశారు. ఇటీవల ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో టెండర్లను ఓపెన్ చేసిన ఏఎంఆర్‌సీ.. అత్యంత తక్కువ రూ.3,37,67,200 కోడ్ చేసిన అర్బన్ మాస్ ట్రాని్సట్ కంపెనీ లిమిటెడ్ (యూఎంటీసీ)కు అప్పగించారు. ఆరు నెలల్లో పూర్తి చేసేలా.... లైట్‌మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్‌కు సంబంధించి రెండు డీపీఆర్‌లు తయారు చేసే బాధ్యతలను యూఎంటీసీ దక్కించుకుంది. ఇప్పటికే 20 శాతం వరకూ లైట్ మెట్రో డీపీఆర్‌ని పూర్తి చేసింది. వచ్చే వారంలో ట్రామ్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ అగ్రిమెంట్‌పై ప్రభుత్వం సమక్షంలో యూఎంటీసీ, ఏఎంఆర్‌సీ సంతకాలు చెయ్యనున్నాయి. అనంతరం సవివర ప్రాజెక్టు తయారీ పనులు చేపట్టనుంది. మొత్తంగా రెండు డీపీఆర్లూ ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 8న బోర్డు సమావేశం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మారుస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 8న విజయవాడలో బోర్డు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత 9వ తేదీన రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్‌కి పేరు మార్పు అంశాన్ని పంపించనున్నారు. అక్కడ అప్రూవ్ పొందితే..10వ తేదీ తర్వాత అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) ఇకపై ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్సీ)గా పూర్తిగా మార్పు చెందుతుందని అధికారులు తెలిపారు. డీపీఆర్‌లు పూర్తయిన వెంటనే బిడ్డింగ్‌కు.. ఆరు నెలల్లో లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ కారిడార్లకు డీపీఆర్ తయారు చేయాలని గడువు నిర్దేశించాం. లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ 5 నెలల్లో సిద్ధం కానుంది. ట్రామ్ 6 నెలల్లో పూర్తవుతుంది. రెండు డీపీఆర్‌లు పూర్తయిన వెంటనే వాటిని పరిశీలించి.. బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతాం. మెట్రోరైలు ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
ఓరుగల్లుకు మోనో లేదా మెట్రో!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వరంగల్‌లో 15 కిలోమీటర్ల మోనో రైలు మార్గంతో పాటు హైదరాబాద్ తరహాలో మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. మామునూర్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్ నగరాభివృద్ధిపై బుధవారం ఆయన శాసనసభ కమిటీ హాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) మాస్టర్ ప్లాన్‌కు ఈ సమావేశంలో కేటీఆర్ ఆమోదించారు. 2020–41 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్‌తో నగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్ చేరుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2న ప్రారంభించాలి..: ఇక నగరానికి మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో 29 కిలోమీటర్ల మేర పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రారంభించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వెంటనే నగరంలో 1,000 పబ్లిక్ టాయిలెట్లను దసరాలోపు నిర్మించాలని ఆదేశించారు. నగరంలో 250 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో వెయ్యి టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పందుల నివారణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి, పందుల పెంపకందార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు పందుల పెంపకందార్లను ఒప్పించాలన్నారు. దసరా నాటికి ఇళ్లు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఇచ్చిన హామీల అమలు వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. నగరానికి మంజూరు చేసిన 3,900 డబుల్ బెడ్రూం ఇళ్లను దసరా నాటికి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. పూర్తైన 900 ఇళ్లను త్వరలో ప్రారంభించాలన్నారు. మిగిలిన 3,000 ఇళ్లలో 2,200 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800 ఇళ్లు స్థానిక సమస్యలతో ప్రారంభం కాలేదని స్థానిక ఎమ్మెల్యేలు కేటిఆర్ దృష్టికి తెచ్చారు. ఈ ఇళ్లను ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. కాళోజి కళాక్షేత్రం, ఏకశిలా పార్క్ నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య ప్రణాళిక, హరిత ప్రణాళిక, ఎనర్జీ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. ఎనర్జీ ఆడిట్లో భాగంగా నగరంలో తుప్పుపట్టిన, వంగిన స్తంబాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్లను మార్చాలన్నారు. 16న మరోసారి భేటీ.. వరంగల్ నగరం మరింతగా అభివృద్ధి కానున్న నేపథ్యంలో నగరానికి నాలుగు వైపుల డంపింగ్ యార్డులు గుర్తించాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుత డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్లో కలసిన శివారు ప్రాంతాలకు మూడో వంతు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, శివారు ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేషన్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాల మీద చర్చిస్తామని.. అధికారులు సమగ్ర సమాచారంతో ఆ సమావేశానికి రావాలన్నారు. సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మేము ఇంటికి వెళ్లేదెలా !
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ చివరి గమ్యస్థానం చేరుకునేందుకు ఆపసోపాలు పడుతూనే ఉన్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై అధికారులు చెబుతున్న మాటలకు..వాస్తవాలకు పొంతన కుదరడం లేదు. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోలు–రాయదుర్గం రూట్లలో 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు కారిడార్లలో 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. కానీ వీటిలో కేవలం 24 మెట్రో స్టేషన్ల నుంచి మాత్రమే ప్రయాణికులు తమ చివరి గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా షటిల్ సర్వీసులు(మినీ బస్సులు) అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో నిత్యం సుమారు పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే మూడు మెట్రో మార్గాల్లో రోజువారీగా నాలుగు లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో షటిల్ సరీ్వసులు వినియోగిస్తున్నవారు 3 శాతానికి మించి లేరంటే అతిశయోక్తి కాదు. మిగతా ప్రయాణికుల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మెట్రో ప్రయాణ ఛార్జీకంటే పార్కింగ్ రుసుములు,క్యాబ్‌లు,ఆటోల్లో ప్రయాణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం స్వీదా సంస్థ 24 మెట్రో స్టేషన్ల నుంచి 45 మార్గాల్లో సుమారు వంద షటిల్ సరీ్వసులను నడుపుతోందని మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ సర్వీసులు సైతం ఉదయం 7:30 నుంచి 11:30 గంటలు, సాయంత్రం 5.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ప్రైవేటు సంస్థ కావడంతో తమకు బాగా ప్రయాణికులు, ఛార్జీలు అధికంగా ఉండే మార్గాల్లోనే లాభాపేక్షతో షటిల్స్ నడుపుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. వీటిల్లోనూ కనీస చార్జీ రూ.10, గరిష్టంగా రూ.49 వరకు ఉందని..వీటి చార్జీలు సైతం మెట్రో చార్జీలతో పోటీపడుతుండటం గమనార్హం. దీంతో 24 మినహా ఇతర మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే వారికి లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అనేక వ్యయప్రయాసలకు గురిచేస్తోందని వాపోతున్నారు. తక్షణం అన్ని మెట్రోస్టేషన్ల నుంచి సమీపకాలనీలు,ప్రాంతాలకు షటిల్స్ నడపాలని డిమాండ్ చేస్తున్నారు. అద్దె సైకిళ్లు..బైక్‌లకు గిరాకీ అరకొరే.. ఇక పలు మెట్రోస్టేషన్ల వద్ద లాస్ట్‌మైల్ కనెక్టివిటీకోసం ఏర్పాటుచేసిన అద్దె బైక్‌లు, కార్లు, సైకిళ్లకు గిరాకీ అంతంత మాత్రంగానే ఉన్నట్లు సుస్పష్టమౌతోంది. వీటి అద్దెలు సైతంఅధికంగా ఉండడం, వాటిని వినియోగించే ప్రక్రియపై సామాన్య ప్రయాణిలకు అంతగా అవగాహన లేకపోవడంతో వీటిని వినియోగించే ప్రయాణికులు సైతం మొత్తం మెట్రో ప్రయాణికుల్లో 3 శాతానికి మించి లేరని తేటతెల్లమౌతోంది. రైళ్ల ఫ్రీక్వెన్సీ సైతం.. ప్రస్తుతం రద్దీ వేళల్లో ప్రతి ఐదు నిమిషాలకు..రద్దీ లేని సమయాల్లో 8 నుంచి 10 నిమిషాలకో రైలును నడుపుతున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. కానీ పలు సమయాల్లో రైళ్లు 12–15 నిమిషాల కొకటి నడుస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు, రాత్రి 9 నుంచి 11 గంటల మధ్యన ఈ పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. -
ప్రభుత్వ వైఖరి వల్లే ఆగిన మెట్రో
అఫ్జల్‌గంజ్: పాతబస్తీకి మెట్రో రైలు రాకుండా మజ్లిస్ పార్టీ అడ్డుపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీల వైఖరి వల్లే పాతబస్తీకి మెట్రో ఆగిందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో శనివారం ఆయన జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకూ మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మెట్రో ఛార్జీలు అధికంగా ఉన్నాయన్నారు. పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకూ మెట్రోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విప్ జారీ చేశారని, అందుకే రాలేక పోయానని చెప్పానని తెలిపారు. ఎంఎంటీఎస్ ఫేజ్–2ను యాదగిరిగుట్ట వరకూ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. నగరంలోని అసెంబ్లీ ముందుగా మెట్రో రైలు వెళితే చారిత్రాత్మక కట్టడాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు అదే మార్గానికి ఆమోదం తెలిపారో చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో లైట్ మెట్రో రవాణా బెటర్!
సాక్షి, తిరుపతి : తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బావుంటుందని హైద్రాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, అలాగే రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించారు. భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టీటీడీ అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని సుబ్బారెడ్డి సూచించారు. -
హైదరాబాద్ మెట్రోరైలు ఆల్‌టైమ్ రికార్డు
-
ప్రాజెక్టులో కదలిక!
-
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్
-
విశాఖ మెట్రో : ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలించేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టబోతుంది. (8 కారిడార్లు.. 140.13 కి.మీ) గతంలో డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్ఫ్రా కాన్సార్షియం కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం ఉత్వరుల్లో పేర్కొంది. మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం కోసం డీపీఆర్‌ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడరన్ ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు మరో డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది. (మెట్రో రీ టెండరింగ్) (విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు) -
జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో: ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు గానీ.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారని ప్రశ్నించారు. ఈ మేరకు... ‘దార్ ఉల్ షిఫా నుంచి ఫలక్నామా మెట్రో లైన్ సంగతి ఏంటి? జేబీఎస్ మార్గాన్ని పూర్తి చేశారు గానీ.. దక్షిణ హైదరాబాద్ విషయానికి వచ్చే సరికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఇదైతే ఇంకా అద్భుతం.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయి. మరి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా పనులు ఎప్పుడు మొదలు పెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తార’ని అసదుద్దీన్ ట్విటర్ వేదికగా హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం 15 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు చేసిన ట్వీట్‌కు అసదుద్దీన్ పైవిధంగా స్పందించారు. నగరంలో 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గం మాత్రం నిర్మాణ దశలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ 5 కిలోమీటర్లు మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. Amazing that you have funds for JBS & MGBS,when will @hmrgov start and complete MGBS to FALAKNUMA ? https://t.co/FnCyy8Y829 — Asaduddin Owaisi (@asadowaisi) February 6, 2020 -
నగర వాసులకు మరో శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి స్థాయిలో నగర వాసులకు అందుబాటులోకి రానుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెబీఎస్ నుంచి ఎమ్‌జీబీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా వెల్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణం దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైల్లో అందుబాటులోకి వస్తే.. కేవలం 15నిమిషాల్లోన్నే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య ఇక తీరనుంది. కాగా ఈ మార్గం పూర్తవడంతో నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోరైల్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎమ్జీబీఎస్ నుంచి ఫలక్నామ నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఆ 5 కిలోమీటర్ల మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే చెప్పాలి. -
భారత్‌లో తొలి అండర్‌వాటర్ మెట్రో సిద్ధం..
కోల్‌కతా : హుగ్లీ నదిని దాటుతూ పరుగులు పెట్టే తొలి అండర్‌వాటర్ మెట్రో ఈస్ట్-వెస్ట్ ప్రాజెక్టును కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ త్వరలో పట్టాలెక్కించనుంది. 1984లో చేపట్టిన ప్రాజెక్టుకు విస్తరణగా ముందుకొచ్చిన భారత్‌లో తొలి అండర్ వాటర్ మెట్రో ఎన్నో అవాంతరాలు, వ్యయ అంచనాలను అధిగమిస్తూ మార్చి 2022 నాటికి అందుబాటులోకి రానుంది. భారత రైల్వే బోర్డు నుంచి చివరి వాయిదాగా రూ 20 కోట్లు మైట్రో రైల్ అథారిటీకి అందనుండగా విస్తరణలో భాగంగా చేపట్టిన అండర్‌వాటర్ మెట్రో పనులు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు రూ 10,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 49 శాతం మేరకు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూర్చింది. న్యూలైన్‌లో రోజుకు 9 లక్షల మంది అంటే నగర జనాభాలో 20 శాతం మంది ప్రయాణిస్తారు. 520 మీటర్ల అండర్‌వాటర్ టన్నెల్‌ను ఈ రైలు కేవలం నిమిషం లోపే దాటుతుందని అధికారులు వెల్లడించారు. చదవండి : 8 కారిడార్లు.. 140.13 కి.మీ -
మరోసారి ఆగిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మరోసారి మొరాయించింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రో రైలు శనివారం మధ్యాహ్నం సాంకేతిక కారణాలతో పంజగుట్ట స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను స్టేషన్లోనే దింపేశారు. ఫెయిల్ అయిన రైలును ఎర్రమంజిల్–పంజగుట్ట మధ్యలో ఉన్న పాకెట్ ట్రాక్‌లోకి మళ్లించి మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్బీనగర్–మియాపూర్ మధ్య చాలాసేపు మెట్రో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమీర్‌పేట్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు అదనపు రైళ్లను నడపాల్సి వచ్చింది. మధ్యాహ్నం తరువాత ఎల్బీనగర్–మియాపూర్ మధ్య మెట్రో రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. -
విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్సెల్ ఇన్ఫ్రా కన్సార్షియం సింగిల్ బిడ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నూతన డీపీఆర్ సిద్ధం చేసేందుకు కొత్త కన్సెల్టెంట్‌కు బాధ్యతలు అప్పగించింది. ఓపెన్ టెండర్ ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్‌కు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టెండర్ల ప్రక్రియ నిర్వహణకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. కాగా ఇన్నాళ్లూ ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన జరగడంతో ఒకానొక సమయంలో నగరానికి మెట్రో గగనమే అనే ఆలోచనకి ప్రజలు వచ్చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే విశాఖ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకి పునరుజ్జీవం వచ్చింది. 2015–16 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది. మూడు కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. 2016–17లో ఈ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సొంతంగానే ప్రతిప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)కి అప్పగించిన విషయం తెలిసిందే. చదవండి: 8 కారిడార్లు.. 140.13 కి.మీ -
ఓరుగల్లులో మెట్రో పరుగులు!
సాక్షి, వరంగల్: అన్నీ అనుకూలిస్తే చారిత్రక ఓరుగల్లులోనూ హైదరాబాద్ మాదిరిగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ట్రై సిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో నియో రైలు ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇటీవల వరంగల్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మహా మెట్రో ఉన్నతధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు చెందిన మహా మెట్రో, హెచ్ఎండీఎ అధికారుల బృందం బుధవారం వరంగల్ నగరాన్ని సందర్శించింది. మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు, డీపీఆర్ తయారీ తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మెరుగైన రవాణా కోసం వరంగల్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే, ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీ సిటీ బస్సులు తగినన్ని లేవనే చెప్పాలి. దీంతో ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ట్రాన్స్పోర్ట్ హెడ్ విజయలక్ష్మి, హెచ్ఎండీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే సిన్హా, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డితో కలిసి బుధవారం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్ వరకు, అక్కడి నుంచి వరంగల్ స్టేషన్ రోడ్డు మీదుగా చౌరస్తా జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మ మైదాన్ వరకు ప్రధాన రహదారిని మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలించి వివరాలు ఆరా తీశారు. మూడు కేటగిరీలపై చర్చ ట్రైసిటీలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలపై పర్యవేక్షించాక అధికారుల బృందం... జిల్లా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు బల్దియా ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. మహా మెట్రో, హెచ్ఎండీఏ అధికారులు మెట్రో ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వెల్లడించారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇటీవల నాసిక్‌లో మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించిందని తెలిపారు. ఈ మేరకు న్యూ మెట్రో నియో ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50శాతం నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్ షిప్(పీపీపీ) పద్ధతి, గ్లోబల్ ఫైనాన్సియల్ సంస్థలు నుంచి 60శాతం నిధులను రుణంగా తీసుకోవచ్చని వివరించారు. మిగతా 40శాతం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం వెచ్చించాల్సి ఉంటుంవదని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ నగర జనాభా, రహదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మెట్రో నియో రైలు మార్గాలు ఇవే... కాజీపేట రైల్వేస్టేషన్ ప్రారంభమై ఫాతిమానగర్, సుబేదారి, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ రోడ్డు, వరంగల్ చౌరస్తా, జీపీఎన్ రోడ్డు, మండి బజార్, పోచమ్మమైదాన్ వరకు అనుసంధానంగా ప్రాజెక్టు నిర్మిస్తారు. -
మెట్రో రీ టెండరింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్లలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. ఈ మేరకు పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ) సన్నద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బా«ధ్యతను గత ప్రభుత్వం 2017లో ఏఎంఆర్‌సీకి అప్పగించింది. అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీఎంఆర్డీఏ భవన్లో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. టెండర్లు దాఖలు చేయాలనుకుంటున్న ఆయా దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి, మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టును సిద్ధం చేయగా లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతాయి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచి్చన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. వచ్చిన 5 సంస్థలకు ప్రాజెక్టు చేపట్టేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ని 2018 మార్చిలో అన్ని సంస్థల నుంచి స్వీకరించిన ఏఎంఆర్‌సీ.. జనవరి 2019లో అగ్రిమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించింది. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పట్టాలెక్కించాలి్సన చంద్రబాబు ప్రభుత్వం మెట్రోపై అశ్రద్ధ చూపించింది. ఫలితంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టుల్లో పలు మార్పులు చేసింది. కొత్తగా టెండర్ల ప్రక్రియ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లని రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. చేసిన మార్పులకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి దశలో గతంలో 42 కిలోమీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతోనే ఆపెయ్యకుండా స్టీల్ ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ మేరకు ప్రాజెక్టును మరో 4 కి.మీ మేర విస్తరించారు. దీంతో పాటు గతంలో 8 కారిడార్లు మాత్రమే ఉండేవి. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా కారిడార్ల సంఖ్య కూడా 10కి చేరుకుంది. మొత్తం 140 కి.మీ వరకూ మెట్రోరైలు పొడిగించారు. దీంతో పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా రీటెండర్లను పిలవాలని ఏఎంఆర్‌సీ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో కొత్త సంస్థల్ని ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు అదనంగా కిలోమీటర్లు, కారిడార్లు ఏర్పాటు చెయ్యడంతో గతంలో ఉన్న రూ.8,300 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగి రూ.9 వేల కోట్లకు చేరుకుంది. రీటెండర్ ప్రక్రియకు సిద్ధమవుతున్నాం.. విశాఖ మెట్రో ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకనుగుణంగా ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేస్తున్నాం. గతంలో ఉన్న డీపీఆర్‌ని కూడా మారుస్తున్నాం. ఫస్ట్ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. దీనివల్ల పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తులు చేస్తున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ భోగాపురం వరకూ పెంచేందుకు కసరత్తు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ముందుగా ఫస్ట్ ఫేజ్‌పై ప్రధాన దృష్టి సారించాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏఎంఆర్‌సీ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ సంయుక్త కార్యచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నాం. భోగాపురం వరకూ కారిడార్‌ని పొడిగించాలన్నది సీఎం జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నాం. ఆరో కారిడార్‌లో దీనికి సంబంధించిన ప్రతిపాదనని రూపొందించాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
8 కారిడార్లు.. 140.13 కి.మీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజె క్టు పట్టాలెక్కుతోంది. ఇన్నాళ్లూ ఆలోచనలు, ప్రతిపాదనలు, డిజైన్లలో మార్పులు, డీపీఆర్‌లో చేర్పులతోనే కాలయాపన జరగడంతో ఒకానొక సమయంలో నగరానికి మెట్రో గగన మే అనే ఆలోచనకి ప్రజలు వచ్చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే విశాఖ మెట్రో ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మెట్రో ప్రాజెక్టుకి పునరుజ్జీవం వచ్చింది. 2015–16 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతల్ని అప్పటి ప్రభుత్వం అప్పగించింది. 3 కారిడార్లతో డీపీఆర్‌ని సిద్ధం చేశారు. మొత్తం రూ. 12,500 కోట్లు ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. 2016–17లో ఈ ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సొంతంగానే ప్రతిప్రాజెక్టూ చేపట్టిన నేపథ్యంలో పీపీపీ విధానంలోకి వెళ్లడంతో సదరు కార్పొరేషన్ పక్కకు తప్పుకుంది. దీంతో ఈ బాధ్యతల్ని అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్‌సీ)కి అప్పగించారు. మెట్రో నుంచి.. లైట్ మెట్రోగా... పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్‌లో మార్పులు తీసుకొచ్చి.. మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టుని సిద్ధం చెయ్యగా.. లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల.. ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా.. రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్‌లు తగ్గుతా యి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచ్చిన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ 52 శాతం భరించగా.. మిగిలిన 48 శాతం నిధుల్ని సదరు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ భరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.4,200 కోట్లు కొరియా నుంచి రుణం తీసుకొచ్చేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అప్పట్లో ప్రయత్నించింది. తరువాత మరుగున పడిపోయింది. తొలిదశలో 35 కి.మీ.. కానీ... వాస్తవానికి 2016 పనులు ప్రారంభించాలన్నది మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి లక్ష్యం. కానీ అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులో మార్పులు, చేర్పులూ చేస్తూ కాలయాపన చేసింది. 2016లో పనులు ప్రారంభించి తొలిదశలో 35 కి.మీ వరకూ కారి డార్ల పనులు పూర్తి చేసేందుకు 2018 డిసెంబర్‌ని గడువుగా నిర్దేశించుకున్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు ఇంకా పరిశీలన స్థాయిలోనే నిలిచిపోయింది. ఏఎంఆర్‌సీకి 245 ఎకరాలు.. ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూర్చుకునేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఏఎంఆర్‌సీకి ప్రభుత్వ భూములు అందించాలని సర్కారు నిర్ణయించింది. నగరంలోని 245 ఎకరాలు ఇచ్చేందు కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూముల్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చి న ఆదాయాన్ని సముపార్జించుకోనుంది. ఇప్పటికే పలు చోట్ల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భూముల్ని గుర్తించారు. ముడసర్లోవలో 100 ఎకరాలు, మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో 2 ఎకరాలు, ఎన్వీపీ లా కాలేజీ ఎదురుగా 50 ఎకరాలు రెవిన్యూకి చెందిన భూములతో పాటు శిల్పారామం సమీపంలో 13 ఎకరాలు, టూరిజం శాఖకు చెందిన స్థలం, పరదేశీపాలెంలో రెవెన్యూ, జీవీఎంసీకి చెందిన 80 ఎకరాలు ఏఎంఆర్‌సీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. మొత్తంగా కొత్త ప్ర భుత్వం వచ్చాక మెట్రో రైలు ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ►ప్రారంభంలో ప్రతి స్టేషన్ నుంచి 10 నిమిషాలకో ట్రైన్ ►రద్దీని బట్టి.. ప్రతి రెండు నిమిషాలకో ట్రైన్ పరుగులు ►రెండు 750 వాట్స్ డీసీ కోచ్ ►డిపోలు ఏర్పాటు చేసేలా ప్రాజెక్టు రూపకల్పన ►విమానాశ్రయ ప్రాంతంలో ఒకటి, హనుమంతువాక వద్ద మరొక డిపో ఏర్పాటు హైదరాబాద్ మెట్రో కంటే మిన్నగా... హైదరాబాద్ మెట్రో రైల్ కంటే మిన్నగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండబోతుంది. అన్నింటికీ అనుకూలంగా.. ఇక్కడి వాతావరణానికి అనువుగా ప్రణాళికలు రూపొందించాం. మెట్రో నిర్మాణంలో ప్రస్తుత జాతీయ రహదారి భవిష్యత్తు అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ స్థలం అందుబాటులో ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల్ని అంచనా వేసి ప్రాజెక్టుకి రూపకల్పన చేశాం. ప్రభుత్వం నిర్దేశించే మార్గంలో మెట్రో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తాం. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ ప్రాజెక్టు ఎండీ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకం... విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమైంది. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో ట్రాఫిక్, మెట్రో అవకాశాల్ని పరిశీలించిన తర్వాత సమగ్రమైన ప్రణాళికతో రూట్ మ్యాప్‌ని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి -
విశాఖ మెట్రో కారిడార్ మార్గాలను పరిశీలించిన మంత్రులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కారిడార్ల మార్గాలను శనివారం మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. గాజువాక, ఎన్ఎడీ, తాటిచెట్లపాలెం, ఆర్కే బీచ్ ప్రాంతాల్లో పర్యటించి.. కారిడార్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం వీఎంఆర్డీఏ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. రూ.8,300 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు. 8 కారిడార్లుగా లైట్ మెట్రో ప్రాజెక్టుని అభివృద్ధి చెయ్యనున్నామని వెల్లడించారు. తొలి దశలో 3 కారిడార్లలో 46.42 కి.మీ. మేర ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ప్రభుత్వం సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోందని మంత్రి ముత్తంశెట్టి వివరించారు. ప్రభుత్వం టిడ్కో ద్వారా చేపట్టిన గృహ నిర్మాణంలోనూ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.106 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు. బలహీన వర్గాలకు ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, వీఎంఆర్డీఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరే కాలనీలో మెట్రో షెడ్‌కు ఓకే: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే చెట్ల నరికివేతపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆరేకాలనీలో చెట్లను నరకడానికి వీల్లేదని సుప్రీం సోమవారం పునరుద్ఘాటించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన ప్రత్యేక బెంచ్ ఈ మేరకు సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని బెంచ్ లోతుగా పరిశీలించింది. పర్యావరణానికి నష్టం కలగకుండానే మెట్రో షెడ్ నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించింది. ఎన్ని చెట్లు పడగొట్టారు, ఎన్నింటిని తరలించారని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. ఆరే కాలనీలో చెట్ల జోలికి వెళ్లబోమని, యథాతథ స్థితిని కొనసాగించాలని గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని సుప్రీంకోర్టుకు మెహతా విన్నవించారు. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కూడా హామీయిచ్చారు. ‘ఆరే కాలనీలో ఎటువంటి భవన నిర్మాణాలు ప్రాజెక్టులు లేవు. మెట్రో కార్ షెడ్ మాత్రమే నిర్మిస్తున్నార’ని ఆయన తెలిపారు. మెట్రో షెడ్ నిర్మాణానికి అనుకూలంగా ఆయన వాదనలు విన్పించారు. మెట్రో రైలు సర్వీసులు కారణంగా ఢిల్లీలో 7 లక్షల వాహనాలు రోడ్డు ఎక్కడం లేదని, దీంతో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. (చదవండి: ఆందోళనకారులకు భారీ ఊరట) -
హైదరాబాద్ మెట్రోరైల్: డేంజర్ బెల్స్
-
హైదరాబాద్ మెట్రోరైల్: డేంజర్ బెల్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ బాలరిష్టాలు ఎందుకు దాటడం లేదు ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థలో సైతం నిర్వాహణ లోపాలు పదేపదే ఎందుకు తలెత్తుతున్నాయి ? ఊడుతున్న పెచ్చులు, టెక్నికల్ సమస్యలతో మెట్రో ఎందుకు మొరాయిస్తోంది? మెట్రోరైల్లో పరిస్థితులు మారవా? రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ట్రాఫిక్ జామ్‌ల నుంచి ప్రజల్ని కాపాడుతుందని ఏర్పాటుచేసిన మెట్రోరైల్లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న అమీర్‌పేట స్టేషన్లో పెచ్చులూడిపడటంతో ఓ మహిళ ప్రాణాల్ని కోల్పోయింది. దీనికి కారణం పర్యవేక్షణ లోపమేనని అధికారులు తేల్చిన పరిస్ధితి. మెట్రో స్టేషన్ల కింద నిలుచున్న ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసే స్ధాయికి మెట్రో నిర్మాణంలో లోపాలు వచ్చాయంటే ఇది ఎవరి తప్పు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎల్ అండ్ టీ లాంటి పెద్ద నిర్మాణ రంగ సంస్థ నిర్మిస్తున్న మెట్రోరైల్లో ఇన్ని లోపాలున్నాయా? అని ప్రయాణీకులు విస్మయపోయే పరిస్ధితి. సాంకేతిక లోపం.. ప్రయాణికులకు అష్టకష్టాలు ప్యారడైజ్ సర్కిల్ ప్రాంతంలో మెట్రోరైల్లో ఎలక్ట్రికల్ లోపాల కారణంగా మెట్రోరైల్ ఆగిపోయింది. కనీసం అక్కడికి వెళ్లి మరమత్తులు చేద్దామని టెక్నికల్ టీమ్ అనుకున్నాకూడా మెట్రోరైల్లో లోపాన్ని సరిచేయలేకపోయారు. దీంతో మరో ట్రైన్‌ను తెప్పించి దాన్ని అమీర్ పేట్ జంక్షన్‌కు తీసుకువెళ్ళిన పరిస్ధితి. దీంతో దాదాపు గంటపాటు ప్రయాణీకులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే చాలు కింద రోడ్లమీద ఎలాగు ప్రయాణించలేం.. కనీసం మెట్రోరైల్లోనైనా ప్రయాణించాలనుకుంటే వర్షాలకు ఫ్లెక్సీలు మెట్రో ట్రాక్‌పై పడటంతో మెట్రోట్రైన్లు ఆగిపోతున్నాయి. అసెంబ్లీ ప్రాంతంలో లెథనింగ్ అరెస్టర్ రాడ్ ట్రాక్‌పై ఫ్లెక్సీలు పడటంతో ట్రైన్‌ను సడెన్‌గా ఆపివేసిన పరిస్థితి తలెత్తింది. సరిగ్గా ట్రాక్ పైన సేఫ్టీ చెకింగ్లు చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదనే వాదనలు అప్పట్లో వినపడ్డాయి. అంతేకాదు చాలాసార్లు మెట్రోరైల్ సడెన్ బ్రేక్‌లతో ప్రయాణీకులకు దెబ్బలుతగిలి గాయలపాలు అయ్యారు. ఇక, వాహనాల పార్కింగ్‌కు స్ధలాలు లేవు. పైగా ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన పార్కింగ్ స్థలాలను సైతం ప్రైవేటువారికి కట్టబెట్టి ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఇక మెట్రోస్టేషన్లో ప్రయాణీకుల కనీస అవసరాలు తీర్చేందుకు కావాల్సిన టాయిలెట్స్ కానరావు. హైటెక్ హంగులతో నిర్మించిన మెట్రోరైల్లో మంచి నీళ్ళు ఉండవు. వాటర్ బాటిల్స్ కొనుకున్నా వాటిని మెట్రోట్రైన్లో అనుమతించరు. తాగుబోతు వీరంగం తమకు సేఫ్టీ ముఖ్యమంటూ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎంత చెపుతున్నా అందుకు తగ్గ ఏర్పాట్లు మెట్రోరైల్లో పెద్దగా కనపించవు. దీంతో తాగుబోతులు ఎంచక్కా మెట్రోరైల్ ఎక్కి తోటి ప్రయాణీకుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రయాణీకుడు బాగా తాగేసి ట్రైన్‌లోకి వచ్చి హల్చల్ చేశాడు. ఇది కూడా నిర్లక్ష్యానికి నిదర్శనంగానే చెప్పవచ్చు. పైగా మెట్రోరైల్ ఏర్పాటు చేసింది సాధారణ ప్రయాణీకులకు కానీ ఇక్కడ ఆర్టీసీ బస్ బేలుండవు. ఊబర్, ఓలా లాంటి కంపెనీల కార్లకు మాత్రం స్వయంగా హెచ్ఎంఆర్ఎల్ పార్కింగ్ సదుపాయాల్ని కల్పించి ఇస్తుంది. దీనిపై మెట్రో అధికారులపైన విమర్శలు కూడా వస్తున్నాయి. మెట్రోస్టేషన్ల నిర్మాణంలో సైతం లోపాలున్నాయని చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఉప్పల్ స్టేషన్‌కు సంబంధించిన మెట్రోస్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురియడంతో నీరు లోపలికి వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు దానికి కాస్త మెరుగులు దిద్ది.. రంగులు వేసి కప్పిపెట్టారు. తొందరపాటు నిర్ణయాలు.. పర్యవేక్షణాలోపం అనుకున్న టార్గెట్ పూర్తి కావటానికి అనుకున్న టైం కంటే ముందుగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎల్ అండ్ టీ తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు మెట్రో సేఫ్టీని ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. పైన ట్రాక్ నుంచి కింద పిల్లర్ల వరకు చెక్ చేయాల్సిన ఇంజనీర్లు లేకపోవడమే ప్రమాదాలకు కారణంగా కనపడుతోంది. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ బయట జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ రైల్వేలో ప్రతి 50 కిలోమీటర్ల ట్రాక్ చేయడానికి ఒక సీనియర్ ఇంజనీర్‌తోపాటు 200 మంది గ్యాంగ్‌మెన్స్ ఉంటారు. కానీ, హైదరాబాద్ మెట్రోరైల్లో మాత్రం ఆ పరిస్ధితి లేదు. రెండు పిల్లర్ల మధ్య కట్టే గోడలలో కూడా నాణ్యత లోపించింది. పనులు త్వరగా పూర్తి కావాలనే నెపంతో క్వాలిటీ లేకుండానే కట్టిపడేసి పనిపూర్తయ్యిందనిపించారని, పనులు జరుగుతున్నా సరే కొన్నిచోట్ల ట్రాఫిక్‌కు అనుమతి ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పైన మెట్రో వర్క్ జరుగుతున్నప్పుడు సేఫ్టీ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. పర్యావేక్షణ లోపమే కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఇకనైనా ప్రైవేటు కంపెనీలకు పట్టం కట్టడం మానేసి ప్రయాణీకుల్ని ఎంతమందిని ఎక్కించాం అని సొంత డబ్బలు కొట్టుకోకుండా.. వారిని ఎంత జాగ్రత్తగా గమ్యానికి చేర్చామనే దానిపైనే హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. -రాజ్‌కుమార్, బిజినెస్ స్పెషల్ కరస్పాండెంట్, సాక్షిన్యూస్ -
అభివృద్ధి, పర్యావరణం రెండు కళ్లు : జవదేకర్
న్యూఢిల్లీ : ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేత వివాదంపై పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడడానికి నిరాకరించారు. అభివృద్ధి, పర్యావరణం తమకు రెండు కళ్లలాంటివని చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. కనుక నేను ఆరే కాలనీ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. ఎందుకంటే ఆరే ఏరియాలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జరుగుతున్న చెట్ల నరికివేతను అడ్డుకున్న పర్యావరణ వేత్తలు, ఆందోళనకారులకు ఊరటనిచ్చే ఉత్తర్వులు సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి. శనివారం నుంచి ఆరే కాలనీలో చెట్ల నరికివేత సాగుతుండగా.. సుప్రీంకోర్టు తాజాగా దానిపై స్టే విధించింది. ఈ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. అలాగే ప్రస్తుతానికి చెట్ల నరకివేతపై స్టే ఇచ్చింది’ అని గుర్తుచేశారు. అలాగే ముంబై మెట్రో నిర్వాహకులు ఒక చెట్టును నరికితే.. వారు తిరిగి ఐదు చెట్లను పెంచే బాధ్యతను తీసుకోవాలని మీడియా ప్రతినిధులకు జవదేకర్ సూచించారు. కాగా, ముంబై ఆరే కాలనీలో మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్ నిర్మాణంలో చెట్లను నరకడానికి వీల్లేదంటూ కొంతమంది ఆందోళనకారులు, పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాగే కొంతమంది న్యాయ విద్యార్థుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ రాసింది. చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని ఆదేశించాలని వారు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. దీంతో జస్టిస్ గొగోయ్ ఈ కేసు విచారణకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటైన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 21కి విచారణను వాయిదా వేసింది. అలాగే ఢిల్లీ మెట్రో నెట్వర్క్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ దేశ రాజధానిలో మెట్రో నిర్మాణం కోసం చెట్లను తొలగించాల్సి వచ్చింది. ఆనాడు మెట్రో అధికారులు 20-25 చెట్లను తొలగించగా ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కానీ మెట్రో నిర్మాణం అనంతరం వారు తీసివేసిన ప్రతి చెట్టుకు ఐదు చెట్లను నాటారు. నేడు మెట్రో రవాణా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ముప్పై లక్షల మంది ప్రజలు మెట్రోను వినియోగించుకుంటున్నారు. అభివృద్ధి యొక్క మంత్రం పర్యావరణాన్ని పరిరక్షించడం. అభివృద్ధి, పర్యావరణం అనేవి రెండు కలిసి ముందుకు సాగాల్సినవి. ముంబై మహా నగరంలో ఆరే కాలనీ ఓ అద్భుతమైన ప్రాంతం. అదో గ్రీన్ బెల్ట్. అక్కడ 5 లక్షలకు పైగా చెట్లు ఉన్నాయి. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అందులో భాగమే. ఒక్కమాటలో చెప్పాలంటే ముంబైకి అది హరిత ఊపిరితిత్తి లాంటిద’ని పేర్కొన్నారు. -
ఆందోళనకారులకు భారీ ఊరట
సాక్షి , న్యూఢిల్లీ: ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఆందోళన కారులకు సుప్రీంకోర్టుభారీ ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రజలకు అనుకూలంగా తీర్పిచ్చి బాంబే హైకోర్టుకు గట్టి షాకిచ్చింది. ఆరేకాలనీ లో ఇకపై చెట్లను నరకడానికి వీల్లేదని సుప్రీం సోమవారం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ తేదీ అక్టోబర్ 21 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అరెస్టు చేసిన ఆందోళన కారులను తక్షణమే విడుదల చేయాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టు మూడో ఫేజ్ నిర్మాణంలో చెట్లను నరకడానికి వీల్లేదంటూ కొంతమంది ఆందోళనకారులు, పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టను ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి కొంతమంది విద్యార్థుల బృందం లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేసు విచారణకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది. బృహన్ ముంబై కార్పొరేషన్ ట్రీ అథార్టీ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. చెట్ల నరికివేతను ఆపాలంటూ పర్యావరణ వేత్తలు వేసిన పిల్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. అసలు అటవీ ప్రాంతమే కాదని పేర్కొంది. దీంతో శుక్రవారం రాత్రికి రాత్రే పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడంతోపాటు, 144 సెక్షన్విధించడం వివాదాన్ని మరింత రాజేసింది. అంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ తోపాటు 29 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేయగా షరతులతో బెయిల్ లభించింది. చెట్ల నరికివేతకు వ్యతిరేక ఆందోళనకు స్థానికులు, పర్యావరణ వేత్తలు,ఇతర రాజకీయ నేతలతోపాటు, శివసేన కూడా మద్దతునిస్తోంది. అయితే బీజేపీ, శివసేన రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని కాంగ్రెస్, ఎన్సీపీ ఆరోపిస్తోంది. ఐదు లక్షలకు పైగా చెట్లను కలిగి ఉన్న సబర్బన్ గోరేగావ్‌లోని గ్రీన్ బెల్ట్ ఆరే కాలనీలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కూడా ఒక భాగం. ముంబైకి ఇది హరిత ఊపిరితిత్తి లాంటిదని ఈ ప్రాంతానికి పేరు. అలాంటి పచ్చని వాతావరణాన్ని నాశనం చేస్తే ముంబై మరింత కాలుష్యమయం అవ్వక తప్పదంటూ ట్విటర్ లో భారీ ఉద్యమం నడుస్తోంది. అటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలుకూడా ఈ ఉద్యమానికి మద్దతిస్తున్నారు. -
అమ్మో మెట్రో : ప్రాణాలు అరచేతుల్లో..
బెంగుళూరు : మెట్రో స్టేషన్లో ప్రయాణీకులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్లో పిల్లర్ పెచ్చు ఊడిపోయి ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరులోని ఓ మెట్రో స్టేషన్లో ప్రయాణికులకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. వివరాల్లోకి వెళితే..నలుగురు ప్రయాణికులు స్టేషన్‌లోని ఆటోమెటిక్ ఫేర్ కలేక్షన్ గేటు వద్దకు రాగానే వారికి కొద్ది అడుగుల దూరంలో ఫాల్స్ సీలింగ్ నుంచి రెండు ప్యానల్లు ఊడిపడటంతో ఆందోళన చెందారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బెంగళూరులోని ‘నమ్మా మెట్రోస్ నేషనల్ కాలేజీ’ దగ్గరి మెట్రో స్టేషన్లో సెప్టెంబర్ 30న ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ సైడ్ వాల్స్ లీకై గోడల నుంచి స్లాబ్‌లు పడిపోయిన ఘటనలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు కదిలేటప్పుడు వచ్చే శబ్దానికి, వైబ్రేషన్స్‌కి ఇటుకలు వదులై పడిపోయింటాయని, అలాగే 70 సెంటీమీటర్ల మేర ఎతైన గోడలకు ప్లాస్టింగ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని.. త్వరలోనే గోడలకు ప్లాస్టింగ్ చేస్తామని బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్(బీఎమ్ఆర్సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌సేత్ పేర్కొన్నారు. Watch: Four passengers had a narrow escape after a false ceiling at National College metro station in Bengaluru came crashing down on Monday around 6 p.m., the incident came to light on Wednesday. @IndianExpress pic.twitter.com/gtNVmt2c0a — EXPRESS Bengaluru (@IEBengaluru) October 3, 2019 -
3 మెట్రో కారిడార్స్కు మోదీ శంకుస్థాపన
-
21వ శతాబ్దపు నగరాలు నిర్మిద్దాం
ముంబై/ఔరంగాబాద్: 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో భారతీయ నగరాల్లో భద్రత, అనుసంధానత, ఉత్పాదకత విషయంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. లేదంటే రాబోయే ఐదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పగటి కలలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ, ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సమగ్రాభివృద్ధిపై దృష్టి.. ‘గత ఐదేళ్లకాలంలో ముంబై నగరంలో మౌలిక ప్రాజెక్టులపై మేం రూ.1.5 లక్షల కోట్లను వెచ్చించాం. కేవలం ముంబైనే కాకుండా దేశంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సొంతంగా మెట్రో రైలు కోచ్‌లను రూపొందిస్తున్నాం. మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. చిన్న పట్టణాల్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల కారణంగా ఎక్కువమందికి జీవనోపాధి దొరుకుతోంది. గతంలో ఇంతవేగంగా ప్రాజెక్టు నిర్మాణం ఎన్నడూ జరగలేదు కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు’ అని మోదీ వెల్లడించారు. ముంబై మెట్రో కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏటా 2.5 కోట్ల టన్నులమేర తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ‘ఒకేదేశం–ఒకే కార్డు’ వ్యవస్థ కోసం ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థ తయారుచేసిన 500 మెట్రో కోచ్‌లను ప్రధాని ఆవిష్కరించారు. గణేశ్ ఆలయంలో పూజలు అంతకుముందు ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా విలే పార్లేలోని గణేశ్ ఆలయానికి చేరుకున్న మోదీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లోక్మాన్య సేవాసంఘ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఇంటికి తాగునీరు అందించేందుకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం. మహిళలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్న రామ్మనోహర్ లోహియా కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముద్రా పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. ముద్రా పథకం కింద ఇప్పటివరకూ 14 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు. -
చరిత్ర సృష్టించిన ఎన్డీఏ పాలన: మోదీ
ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ-2 ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో మెట్రో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ తమ పాలన ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధించామని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే జల్ జీవన్ మిషన్, ముస్లిం మహిళలకు ఊరట కలిగించే ట్రిపుల్ తలాక్ రద్దు, చిన్నారుల భద్రతను పటిష్టపరిచే చట్టాలు తమ పాలనలో మైలురాయిగా నిలిచాయని మోదీ చెప్పుకొచ్చారు. ప్రస్తుత తరాలను అభివృద్ధి బాట పట్టించడంతో పాటు భావితరాల కలలు, ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి చెందడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముంబైలో మెట్రో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టును రూ.20,000 కోట్లతో మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ముంబై ప్రజల జీవన విధానం సులభతరమవ్వడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అన్నారు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తున్నప్పుడు ఏకకాలంలో నగరాలు అభివృద్ది చెందడం అత్యవసరం అని మోదీ తెలిపారు. వీటి కోసం వచ్చే ఐదేళ్ళలో తమ ప్రభుత్వం 100 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు మోదీ పేర్కొన్నారు. -
తొలి అండర్ వాటర్ మెట్రో...వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ప్రారంభించనున్నారు. కోల్‌కతాలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ గురువారం ప్రకటించారు. కోల్‌కతా హుగ్లీ నది కింద భారతీయ తొలి అండర్‌వాటర్ ట్రైన్ నడుస్తుందని పేర్కొన్న ఆయన ఈ మేరకు తన అధికారిక ట్విటర్లో ఇండియన్ రైల్వే విడుదల చేసిన ఒక వీడియోను పోస్టు చేశారు. అద్భుతమైన ఇంజనీరింగ్‌కు ఇదొక ఉదాహరణ. దేశంలో రైల్వే పురోగతికి చిహ్నం. ఈ సర్వీసుతో కోల్‌కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. ఇది దేశం గర్వపడే విషయం అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సర్వీస్ కోల్‌కతా మెట్రో లైన్-2 అంటే ఈస్ట్-వెస్ట్ మెట్రో కిందకు వస్తుంది. 16 కి.మీ లైన్ వరకూ వేయనున్న ఈ ట్రాక్ పనులు రెండు దశలుగా జరుగుతాయి. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్‌ను సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్‌తో కలుపుతూ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి దశ వుంటుంది. దీన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఆ కొత్త మెట్రో మార్గం ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ మెట్రో సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017లో చివరలో ప్రారంభం కాగా 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలు తయారుచేశారు. జర్మనీ నుంచి రచ్నా, ప్రేర్నా అనే రెండు టాప్-ఆర్డర్ టన్నెల్ బోరింగ్ యంత్రాలను తెప్పించారు. అలాగే నీరు లీకేజీని నివారించడానికి నాలుగు రక్షణ కవర్లు కూడా ఉన్నాయి. भारत की पहली अंडर वॉटर ट्रेन शीघ्र ही कोलकाता में हुगली नदी के नीचे चलना आरंभ होगी। उत्कृष्ट इंजीनियरिंग का उदाहरण यह ट्रेन देश में निरंतर हो रही रेलवे की प्रगति का प्रतीक है। इसके बनने से कोलकाता निवासियों को सुविधा, और देश को गर्व का अनुभव होगा। pic.twitter.com/MDzj42s5XZ — Piyush Goyal (@PiyushGoyal) August 8, 2019 -
ఇందిరానగర్ మెట్రో స్టేషన్లో పిల్లర్ చీలిక
సాక్షి బెంగళూరు: నగరంలోని మరో మెట్రో పిల్లర్‌లో చీలికలు కనిపించాయి. బెంగళూరు ఇందిరానగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ బేరింగ్‌లో శుక్రవారం చీలికలు కనిపించడంతో శుక్రవారం ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) నాసిరకమైన పనుల వల్ల మెట్రో పిల్లర్లలో చీలికలు వస్తున్నాయని ప్రయాణికులు, నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెట్రో పిల్లర్లలో ఎలాంటి చీలికలు రాలేదని, అవన్నీ అవాస్తవాలని బీఎంఆర్సీఎల్ కొట్టిపారేసింది. ఏ పిల్లర్ వద్ద కూడా చీలికలు లేవని, ఊహాగానాల ఆధారంగా ఆరోపణలు చేయడం సరికాదని బీఎంఆర్సీఎల్ ఆరోపించింది. మరోవైపు ఎంజీరోడ్డు–బయపనహళ్లి మార్గంలో నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉందని, అందువల్ల ఈనెల 3,4 తేదీల్లో మెట్రో రైలు సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ గత నెల 30న పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఆయా పిల్లర్ల వద్ద వచ్చిన చీలికలను సరిచేసేందుకే బీఎంఆర్సీఎల్ మెట్రో సేవలను నిలిపేసిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మెట్రో పిల్లర్లలోని చీలికల విషయాన్ని దాచిపెట్టి నిర్వహణ పనుల పేరిట మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీఎంఆర్సీఎల్ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బంది వచ్చిందని ఆరోపించారు. -
‘మెట్రో రైలు కోసం ప్రతిపాదనలు రాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రో రైలు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు సవరించిన ప్రతిపాదనలు అందలేదని పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రోరైలు నిర్మాణానికి సంబంధించి 2015 జూన్, డిసెంబర్ నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని మంత్రి చెప్పారు. అయితే 2017లో ప్రభుత్వం మెట్రోరైలు వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. దానికి అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా కోరుతూ పాత ప్రతిపాదనలను రాష్ట్రానికి తిప్పి పంపించినట్లు మంత్రి తెలిపారు. కొత్త మెట్రో రైలు విధానానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపించిన భోపాల్, ఇండోర్ నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. భోపాల్ నగరంలో 27 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణానికి రూ.6941 కోట్లు, ఇండోర్‌లో 31 కిలోమీటర్ల మెట్రో రైలు కోసం రూ.7500 కోట్ల అంచనా వ్యయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించామన్నారు. భోపాల్ మెట్రోకు రూ.4657 కోట్లు, ఇండోర్ మెట్రోకు రూ.4476 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. -
ఆకాశమార్గాన బస్సులు..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌వాసుల కలల మెట్రోకు అనుసంధానంగా ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం) ఏర్పాటుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా ఐటీ కారి డార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ చిక్కులను తప్పించడంతోపాటు మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలను స్టేషన్లతో అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును సుమారు 20 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకయ్యే వ్యయం ప్రాథమికంగా రూ.2,800 కోట్ల మేర ఉంటుందని నిర్ణయించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు బిడ్ల దాఖలుకు హెచ్ఎంఆర్ సంస్థ వారంపాటు పొడిగించిన నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్టీఎస్ మార్గం ఇలా... ఈ బీఆర్టీఎస్ ప్రాజెక్టును కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి ఫోరం మాల్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్, హెచ్ఐసీసీ, శిల్పారామం, రాయదుర్గం, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, రాయదుర్గం, నార్సింగి తదితర ప్రాంతాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గంలో బీఆర్టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంటే ఈ మార్గం కూడా మెట్రో మార్గాన్ని తలపించినప్పటికీ.. ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఇతర వాహనాలను ఈ మార్గంలో అనుమతించరు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక బస్ స్టేజీ ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ బస్సుకు సైతం రైలు తరహాలో మూడు కోచ్‌లుంటాయి. రద్దీని బట్టి తొలుత రెండు కోచ్‌లు.. ఆ తరువాత మూడు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.2,800 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసిన తరువాత నిధుల వ్యయంపై స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్టును సైతం పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో మెట్రో కారిడార్‌తోపాటు, ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో విస్తరించిన ఐటీ, బీపీఓ, కెపిఓ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానికులకు ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కానుంది. ఇదిలా ఉండగా బీఆర్టీఎస్ను పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న నేపథ్యంలో నిధుల కొరత ఉండదు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతుండటం విశేషం. బీఆర్‌టీఎస్‌తో ప్రయోజనాలివే ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా తగ్గనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోవడంతో విలువైన పని గంటలు ఆదా అవుతాయి. మెట్రోకు కూడా ప్రయాణికులు పెరిగి లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఇబ్బందులు తీరతాయి. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న బీఆర్టీఎస్ రాకతో నగర రూపురేఖలు మారతాయి. బీఆర్టీఎస్ మార్గంలోనూ నూతన కంపెనీల ఏర్పాటు, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మెట్రోతో పోలిస్తే బీఆర్టీఎస్ ఏర్పాటు సాంకేతికంగా, ఆర్థికంగా అంత భారంగా పరిణమించదు. -
మిడ్నైట్ మెట్రో మరెంత దూరం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు నైట్ రైడ్ కల ఇప్పట్లో తీరేలా లేదు. వేకువజామున 5 గంటలకు, అర్ధరాత్రి సమయంలో మెట్రో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోవేళలను పొడిగించాలని కోరుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.), నాగోల్–హైటెక్ సిటీ (28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఈ మార్గాల్లో ఐటీ, బీపీవో, కెపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత, మార్కెటింగ్ రంగాల్లో పనిచేస్తున్న వేతన జీవులతోపాటు మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు వేలాదిగా జర్నీ చేస్తున్నారు. రోజూ సుమారు 3 లక్షల మంది ఈ రూట్లలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకే మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోఉంది. అమీర్‌పేట్ స్టేషన్ నుంచి రాత్రి 11.02 నిమిషాలకు చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంది. అయితే నగరంలో వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు షిఫ్టు వేళలు 24 గంటలూ ఉంటాయి. తెల్లవారుఝామున 5 గంటల నుంచి.. రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులను ఈ ప్రధాన రూట్లలో అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్యుపెన్సీ ఉండదనేనా.. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు మహానగరాల్లో ఉదయం 5.30 గంటల నుంచి 11.30 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో రాత్రి 10.30 గంటల తర్వాత మెట్రోరైళ్లలో ఆక్యుపెన్సీ అంతగా ఉండదని.. దీంతో తమకు గిట్టుబాటు కాదన్న అంచనాతోనే నిర్మాణ సంస్థ అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెట్రో రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రోరైళ్లలో చెల్లుబాటయ్యేలా కాంబి టికెట్ లేదా నెల వారీ పాస్‌ల జారీ అంశంపైనా మెట్రో అధికారుల నుంచి మౌనమే సమాధానమౌతోంది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారు. మరోవైపు పాస్‌ల జారీ విషయంలో ఈ మూడు రవాణా విభాగాల మధ్య సయోధ్య కుదరడంలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాత్రి 1 గం. వరకు నడపాలి హైటెక్ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వర్గాలకు రాత్రి 12 గంటల వరకు క్షణం తీరిక లేకుండా గడపడం సర్వసాధారణం. అర్థరాత్రి 12 గంటల వరకూ సిటీలో పగటి తరహాలోనే ప్రధాన రహదారులపై జన సంచారం, ప్రయాణికులు, వాహనదారుల రాకపోకలుంటాయి. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులను అందుబాటులో ఉంచాలని ఎల్అండ్టీ వర్గాలను సంప్రదించగా... ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి దాటవేయడం గమనార్హం. హైటెక్‌సిటీ వరకు మెట్రో అందుబాటులోకి రాగానే పని వేళలను పెంచుతామని చెప్పిన అధికారులు ప్రస్తుతం మీనమేషాలు లెక్కిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంజీబీఎస్, నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లను మెట్రో స్టేషన్లకు అనుసంధానించారు. అయితే పొరుగు రాష్ట్రాలు, దూర ప్రాంత జిల్లాల నుంచి తెల్లవారుజామున 4–5 గంటలకే వేలాది మంది ప్రయాణికులు నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు చేరుకుంటారు. వీరంతా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు వెళ్లగానే మూసిన గేట్లే దర్శనమిస్తుండటంతో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. -
ఇక ‘మెట్రో’ సిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : నగర, పట్టణ రవాణా వ్యవస్థ ఆధునీకరణకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో మరిన్ని మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపడతామని చెప్పారు.నగరాలు, పట్టణాల్లో ప్రజా రవాణా వ్యవస్ధను పటిష్టపరిచేందుకు పెద్దసంఖ్యలో మెట్రో రైల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా 3వేల కిలో మీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు పెట్టేలా ప్రణాళికలు సాగుతున్నాయని అన్నారు. మరోవైపు సబర్బన్ రైళ్ల కోసం మరిన్ని పెట్టుబడులు సమకూరుస్తామని స్పష్టం చేశారు. . -
మెట్రో రైడ్..రైట్..రైట్ !
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రోలో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడుతోన్న సిటీజన్లు మెట్రో పట్ల ఆకర్షితులౌతున్నారు. అయితే మెట్రో అధికారుల అంచనాలు మాత్రం తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం ఎల్భీనగర్–మియాపూర్(29కి.మీ),నాగోల్–హైటెక్‌సిటీ (28 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నగరం రెండు చివరలను కలుపుతున్న ఈ ప్రధాన మెట్రో మార్గాల్లో నిత్యం 5 లక్షలమంది రాకపోకలు సాగిస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం రోజువారీగా సరాసరి 2.30 లక్షలు, పండగలు, వారాంతపు రోజులు, ఇతర సెలవుదినాలు, ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో గరిష్టంగా 2.60 లక్షలమంది మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తుండటం గమనార్హం. మెట్రో స్టేషన్లలో పార్కింగ్ వసతుల లేమి, అధిక ఛార్జీలు, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సి రావడం తదితర కారణాల నేపథ్యంలో మెజార్టీ సిటీజన్లు మెట్రో జర్నీ పట్ల విముఖత చూపుతున్నట్లు స్పష్టమౌతోంది. నేటి నుంచి ఎల్అండ్టీ ఉచిత షటిల్ సర్వీసులు దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ జిల్లాల పరిధిలోని ఐటీ, బీపీఓ, కెపీఓ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సౌకర్యార్థం ఎల్అండ్టీ సంస్థ ప్రత్యేకంగా శుక్రవారం నుంచి షటిల్ సర్వీసులు(మెర్రీ గో అరౌండ్)నడుపనుంది. ప్రతి 15 నిమిషాలకో బస్సు ఈ స్టేషన్ వద్ద అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారన్నారు. కాగా ఇప్పటికే 12 ఐటీ కంపెనీలు ఉద్యోగుల సౌకర్యార్థం దుర్గంచెరువు, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ల నుంచి సొంతంగా షటిల్ సర్వీసులు ప్రారంభించిన విషయం విదితమే. మెట్రోకు ఐపీఎల్ జోష్... ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా మెట్రో సర్వీసులను అర్ధరాతి వరకు నడపడంతో సుమారు 21 వేల మంది ప్రయాణికులు మెట్రోరైళ్లలో రాకపోకలు సాగించడం విశేషం. నగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారీ సర్వీసు వేళలను పొడిగించడంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సైకిళ్లు, బైక్‌లకు ఆదరణ అంతంతే.. ఇక మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులువుగా చేరుకునేందుకు వీలుగా సైకిళ్లు, ఈబైక్‌లు, ఎలక్ట్రిక్, మోటారుబైక్‌లను అద్దె ప్రాతిపదికన ఏర్పాటుచేసిన విషయం విదితమే. అయితే వీటి అద్దెలు భారంగా పరిణమించడంతో వీటికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాల్లోనే మెట్రో స్టేషన్లకు వచ్చేం దుకు ఆసక్తి చూపుతుండడం, లేదాఆటోలు, బస్సులు, క్యాబ్సర్వీసులను ఆశ్రయిస్తుండడంతో వీటికి ఆదరణ అంతగా లేకపోవడం గమనార్హం. కాంబీ టికెట్ ఎప్పుడో..? ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రోసర్వీసుల్లో ప్రయాణించేందుకు వీలుగా కాంబిటిక్కెట్ను ప్రవేశపెట్టే అంశంపై ఆయా విభాగాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తమ వైపు నుంచి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారులు ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని, తమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కాంబి టికెట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశం సస్పెన్స్‌గా మారింది. ఈ ఏడాది చివరి నాటికి జేబీఎస్,ఎంజీబీఎస్ రూట్లో మెట్రో.. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబర్ నెలల్లో ఎంజీబీఎస్–జేబీఎస్(10 కి.మీ)రూట్లో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ మార్గంలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామన్నారు. మెట్రో రెండోదశకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సిద్ధం చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. -
రయ్.. రయ్
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్ మెట్రో స్టేషన్ శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మే నెలాఖరులోగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని, అప్పటిలోగా హైటెక్ సిటీ వద్ద మెట్రోరైలు రివర్సల్ పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ – హైటెక్ సిటీ మార్గంలో రివర్సల్ సదుపాయం లేకపోవడంతో ట్విన్సింగిల్ లైన్లోనే మెట్రో రైళ్లు ప్రయాణిస్తున్న విషయం విదితమే. రివరల్స్ సదుపాయం ఏర్పాటు చేసిన అనంతరం హైటెక్ సిటీకి వెళ్లే మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం నాగోల్ – హైటెక్ సిటీ,ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలోనిత్యం 2.30 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని వెల్లడించారు. -
అన్ని ప్రయాణాలకు ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్‌ల ద్వారా రవాణా చేసే ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రయాణాలకు కామన్‌గా ఒకే మొబిలిటీ కార్డు అందించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. దీనికి అవసరమైన ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వివిధ మార్గాల ద్వారా ప్రయాణించే వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొబిలిటీ కార్డు వేరే అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్, స్వైపిం గ్ తదితర ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ ఉండేలా రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ప్రత్యేకతలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రోడ్డు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్శ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే సీజీఎం కేవీ రావు, తదితరులు పాల్గొన్నారు. -
లోకేశ్‌తో నెటిజన్ల హోలీ ఆట
సాక్షి, హైదరాబాద్ : ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ రోజు రసాయన రంగులు హాని చేస్తాయని, సహజరంగులు ఆనందాన్ని ఇస్తాయని ట్విటర్లో సూచించారు. హోలీ పండుగను సహజ రంగులతో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. పసుపు సహజమైన రంగు. మీ భవిష్యత్తుకు శుభాన్నిస్తుంది అని పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలు కూడా సింథటిక్ రంగుల్లాంటివే అంటూ ట్వీట్ చేశారు. హోళీ రోజు రసాయన రంగులు హాని చేస్తాయి. సహజరంగులు ఆనందాన్ని ఇస్తాయి. మోసపూరిత వాగ్దానాలు కూడా సింథటిక్ రంగుల్లాంటివే. పసుపు సహజమైన రంగు. మీ భవిష్యత్తుకు శుభాన్నిస్తుంది. హోళీ పండుగను సహజ రంగులతో సురక్షితంగా జరుపుకోండి. ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు. #HappyHoli2019 pic.twitter.com/5DcPtmfVHc — Lokesh Nara (@naralokesh) 21 March 2019 అయితే హోలీ శుభాకాంక్షల వరకు బాగానే ఉన్నా, పండగను కూడా పసుపురంగుతో ముడిపెట్టి రాజకీయ రంగుపులమడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మోససపూరిత వాగ్ధానాల విషయంలో చినబాబును నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మోసపూరిత వాగ్ధానాలతో 2014లో అధికారంలోకొచ్చింది టీడీపీనే అంటూ మండిపడ్డారు. ట్విటర్లో యమా యాక్టివ్‌గా ఉండే లోకేశ్ గతంలో చేసిన ఓ ట్వీట్‌ను వెలికి తీసి మరీ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆ ట్వీట్ ఏంటీ నెటిజన్ల రియాక్షన్ ఏంటో ఓసారి చూద్దాం. 12yrs of TRS & INC, Hyd Metro still a distant dream. 19months of TDP, Vijayawada Metro to be completed by Dec 2018. Hyderabad,choose wisely. — Lokesh Nara (@naralokesh) January 13, 2016 '12 ఏళ్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలిసి హైదరబాద్‌లో మెట్రోరైలు కట్టలేకపోయారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం 2018 డిసెంబర్‌నాటికి విజయవాడ మెట్రో పూర్తి చేస్తుంది' అంటూ 2016లో లోకేశ్ ట్వీట్ చేశారు. 2018 ముగిసి 2019 కూడా ప్రారంభమైంది. అయినా విజయవాడలో మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా పడలేదు. దీంతో హోలీ శుభాకాంక్షలు చెప్పాలని నారా లోకేశ్ చేసిన ట్వీట్ కాస్తా.. టీడీపీ మోసపూరిత వాగ్ధానాలపై సెటైర్లు వేయడానికి నెటిజన్లకు దొరికిన ఓ మంచి అవకాశంగా మారింది. దీంతో సామాజిక మాధ్యమాల్లోనే లోకేశ్‌తో నెటిజన్లు హోలీ ఆడుకుంటున్నారు. Anna ma bza lo metro rail project ayipoyindha.. Road meeda ekkada kanapadaledu underground lo vesara enti pic.twitter.com/BzE3ux63tL — Shankar Datta (@dattasankar2805) February 6, 2019 ఇదేనా విజయవాడలో మీరు కట్టినా మెట్రో లోకేష్ బాబు గారు... pic.twitter.com/Z9KmydX6eK — siva kallam (@sivakallam1002) February 7, 2019 దగ్గరుండి పూర్తి చేసినట్టున్నారు లోకేశం గారు pic.twitter.com/7ErvN0IcfT — prod version (@prod_version) February 6, 2019 Searching for vijayawada metro🕵️ pic.twitter.com/NnOhMp5ohy — kartheek Reddy🇮🇳 (@ItsKartheekRedE) February 6, 2019 pic.twitter.com/ogGjPtAb9a — Kondal Chary R (@chary081) February 6, 2019 @naralokesh @NaraCBN pic.twitter.com/Q4jzeqyAbW — Sravan Reddy (@SravanReddy04) February 7, 2019 Idhe tweet malli pettandi sir pic.twitter.com/BvEj20QIZG — Baddam Bhaskar ™️ (@NRI_Uganda) February 6, 2019 https://t.co/3vUVb94zfR — #BlackDayForHindus 🕉️ (@bharathbunny27) February 7, 2019 నువ్వు మీ అయ్య నిద్ర లేచినప్పటి నుంచి మోసపూరిత వాగ్దానాలు కదా చెప్పేది — Ramakrishna (@ImRam_Kotikala) March 21, 2019 నాడు హరికృష్ణ మరణంతో బుల్ బుల్ కి సంబ్రమాశ్చర్యం కలిగితే, నేడు వివేకానంద రెడ్డి మరణంతో పరవశించిపోయిన మాలోకం — ً (@ChaltanyaReddy) March 21, 2019 నువ్ మీ అయ్యా నే కదా పప్పు మోసకరులు...మీరు మోసం చేసినట్టు 100కారణాలు చెప్తా... నువ్ ని దొంగ పార్టీ.. — Main be chowkidar. SV (@Svsv9988) March 21, 2019 ఓరీ పిచ్చి నా లోనా! కనీసం పండుగకైనా రాజకీయం పులమకు నీకో దండం. 🙏🙏🙏🙏🙏 శ్రీరామ — Srinivasa Rao Madduluri (@RaoMadduluri) March 21, 2019 Mosapuritha vagdanalu?? Like Vijayawada metro??#NinnuNammamBabu pic.twitter.com/iXQRAFx6VP — kr reddy (@krr_reddy) March 21, 2019 pic.twitter.com/frZ13Zssxq — F-A-R-M-E-R 🌾 (@allams04) March 21, 2019 -
1..2..3 సిటీలో దశలవారీగా మెట్రో
మహానగరంలోని ‘మెట్రో’ ప్రయాణంలో మరో ముందడుగు పడింది. నగరంలో కీలకమైన అమీర్‌పేట్– హైటెక్‌సిటీ మార్గంలో రైళ్లు బుధవారం నుంచిఅందుబాటులోకి వచ్చాయి. ఈ రూట్లో సేవలను ఉదయం గవర్నర్ నరసింహన్ ప్రారంభించగా.. సాయంత్రం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రతిరోజు మాదాపూర్ వెళ్లే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి ఊరట లభించినట్లయింది. అయితే, ఆయా స్టేషన్ల వద్ద వాహన పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. సాక్షి,సిటీబ్యూరో/మాదాపూర్: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు మార్గాలు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 200 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గం అందుబాటులో ఉండగా.. తర్వాత 56 కి.మీ మెట్రో మార్గంతో మన గ్రేటర్ హైదరాబాద్ నగరం రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ), నాగోల్–హైటెక్‌సిటీ(27 కి.మీ) రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తుండగా ఈ మార్గాల్లో నిత్యం 2 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నగరంలో 2017 నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. గతేడాదిలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో అందుబాటులోకి వచ్చింది. తాజాగా బుధవారం నుంచి అమీర్‌పేట్–హైటెక్‌సిటీ రూట్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్లో ఎంజీబీఎస్–జేబీఎస్(10 కి.మీ) మార్గంలో కూడా మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని, వచ్చేఏడాదిలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. అన్ని మార్గాలు అందుబాటులోకి వస్తే నగరంలో నిత్యం 15 లక్షల మంది మెట్రోలో జర్నీ చేసి ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి నుంచి విముక్తి పొందుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మెట్రో రెండోదశ మార్గంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగరంలో మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు కోటిన్నర మందికి పైగా జర్నీ చేశారు. ట్రాఫిక్ ఝాంజాటం, కాలుష్యం ఊసు లేకుండా మెట్రో జర్నీపై సిటీజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ వసతుల లేమి ప్రయాణికులకు శాపంగా పరిణమిస్తోంది. నగర మెట్రో మైలురాళ్లు ఇవీ.. 1. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ప్రారంభం మే 14, 2007 2. ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబర్ 19, 2008 3. మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం రద్దు జూలై 7, 2009 4. రెండోమారు ఆర్థిక బిడ్లు తెరిచింది జూలై 14, 2010 5. ఎల్అండ్టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబర్ 4, 2010 6.మెట్రో డిపో నిర్మాణానికి ఉప్పల్‌లో 104 ఎకరాల కేటాయింపు జనవరి 2011 7. ఫైనాన్షియల్ క్లోజర్, కామన్ లోన్ అగ్రిమెంట్ కుదిరింది మార్చి 2011 8. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకు సెంట్రల్ మెట్రో యాక్ట్ వర్తింపు జనవరి 2012 9. 104 ఎకరాల మియాపూర్ డిపోల్యాండ్ను ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు కేటాయింపు మార్చి 2012 10. మెట్రో గ్రౌండ్ వర్క్స్ ప్రారంభం ఏప్రిల్ 26, 2012 11. కియోలిస్ సంస్థకు మెట్రో రైళ్ల నిర్వహణకు కాంట్రాక్టు కేటాయింపు మే 2012 12. మెట్రోకు రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం కేటాయింపు ఆగస్టు 2012 13. కుత్బుల్లాపూర్ కాస్టింగ్ యార్డులో 62 ఎకరాల హెచ్ఎంటీ స్థల లీజు సెప్టెంబర్ 2012 14. బోగీల తయారీకి హ్యుదాయ్ రోటెమ్ కంపెనీతో ఒప్పందం సెప్టెంబరు 2012 15. మెట్రో రైలు పనుల ప్రారంభం నవంబర్ 25, 2012 16. కేంద్ర ప్రభుత్వం నుంచి సర్దుబాటు నిధి రూ.1,458 కోట్ల విడుదలకు ఆమోదం మే 2013 17. హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్ల ఏర్పాటుకునోటిఫికేషన్ విడుదల చేసింది సెప్టెంబర్ 2014 18. రైల్వే బోర్డు నుంచి హెచ్ఎంఆర్కు సిగ్నలింగ్ టెలికం సిస్టంకుఅనుమతి జనవరి 20, 2015 19. వేలీవ్ చార్జీలు లేకుండా మెట్రో రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణానికిరైల్వేశాఖ అనుమతి జనవరి 23, 2015 20. మెట్రో కారిడార్–3 స్టేజ్–1కు ఆర్డీఎస్ఓ సంస్థ నుంచి స్పీడ్ సర్టిఫికెట్ మే 8, 2015 21. నాగోల్– మెట్టుగూడ (8కి.మీ)కు సీఎంఆర్ఎస్ ధ్రువీకరణ జారీ ఏప్రిల్ 20, 2016 22. మెట్రోకు ప్రత్యేక విద్యుత్ టారిఫ్‌ను వర్తింపజేస్తూ ప్రభుత్వ నిర్ణయం ఏప్రిల్ 27, 2016 23. ఆర్డీఎస్ఓ నుంచి 80 కి.మీ వేగంతో మెట్రో రైళ్లు దూసుకెళ్లేందుకు అనుమతి జూన్ 17, 2016 24. మియాపూర్–ఎస్ఆర్నగర్ మార్గంలోప్రయాణికుల రాకపోకలకు సీఎంఆర్ఎస్ అనుమతి ఆగస్ట్ 16, 2016 25. మెట్రో ప్రాజెక్టును 2018 నవంబర్ 30 నాటికి పూర్తికితెలంగాణ ప్రభుత్వ ఆదేశాల జారీ ఆగస్ట్ 16, 2016 26. హెచ్ఎంఆర్ ప్రాజెక్టుకు భద్రతను మంజూరు చేస్తూమున్సిపల్ శాఖ ఆదేశాలు ఆగస్ట్ 22, 2017 27. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి మెట్టుగూడ–అమీర్‌పేట్ మార్గానికిఅనుమతి నవంబర్ 20, 2017 28. నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ రూట్లోమెట్రో పరుగు ప్రారంభం నవంబర్ 28, 2017 29. ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో ప్రారంభం 2018