న్యూఢిల్లీ: జహంగీర్‌పురి -ఫరీదాబాద్ మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి శుభవార్త. ఈ రెండు ప్రాంతాల మధ్య ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మేనాటికల్లా ఈ మార్గంలో మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయమై డీఎంఆర్‌సీ అధికార ప్రతినిధి అంజు దయాళ్ మాట్లాడుతూ ‘2015 మే నాటికల్లా ఈ పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నాం. ఆ తర్వాత భద్రతా పత్రం కోసం మెట్రో రైల్ సేఫ్టీ కమిషనరేట్‌ను సంప్రదిస్తాం’అని అన్నారు.
తొలి విడత కింద బడ్లి-ఢిల్లీ మధ్య చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మార్చినాటికల్లా పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు. జహంగీర్‌పురి -ఫరీదాబాద్ కారిడార్‌లో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. ఇదే సమయంలో సిగ్నలింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి.ఈ కారిడార్‌లో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. అవి ఢిల్లీ, బడ్లీమోర్, రోహిణీ సెక్టార్ 18. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 29 వేలమంది రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇక నాలుగో విడతలో భాగంగా బడ్లీమోర్ స్టేషన్‌ను ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా మారుతుంది.
మే నాటికల్లా అందుబాటులోకి మరో మెట్రో మార్గం
Published Thu, Dec 25 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement
Advertisement