విజయవాడ మెట్రోకు టెండర్ల ఆహ్వానం
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆన్ లైన్ టెండర్లను ఢీల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్(డీఎమ్ఆర్సీ) ఆహ్వానించింది. రెండు ప్యాకేజీల పనులకు టెండర్లను శుక్రవారం సాయంత్రం ఆహ్వానించింది. నెహ్రూ బస్టాండ్ నుంచి నడమనూరు కారిడార్ పనులకు 1.33 కి.మీ నుంచి 6.57 కి.మీ వరకు 5 ఎలివేటేట్ ష్టేషన్ల నిర్మాణానికి టెండర్లు వేస్తున్నారు.
మొదటి ప్యాకేజీలో సీటీ కేన్సర్ ఆస్పత్రి, ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజీ, సత్యసాయి మందిరం, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్లకు టెండర్ల దరఖాస్తులకు ఆహ్వానించారు. మొత్తంగా రూ.314 కోట్ల నుంచి 390 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు.
రెండో ప్యాకేజీలో 6.57 కి.మీ నుంచి 12.62 కి.మీ వరకు మెట్రో రైలు నిర్మాణం చేపడతారు. ఈ ప్యాకేజీలో ఆరు ఎలివేటెడ్ స్టేషన్లకు టెండర్లు వేస్తున్నారు. రెండో ప్యాకేజీలో నిడమనూరు, ఎనికెపాడు, రామకృష్ణా వే బ్రిడ్జి, ప్రసాదం పాడు, రామవరపుపాడు, గుణదల స్టేషన్లకు టెండర్ల కోసం డీఎమ్ఆర్సీ సంస్థ ఆహ్వానించింది.