2018 నాటికి మెట్రో తొలిదశ
అమరావతిలోనూ ఏర్పాటుకు యత్నం: శ్రీధరన్‌తో సీఎం
హైదరాబాద్: 2018 ఆగస్టు నాటికి విజయవాడ, డిసెంబర్ నాటికి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్‌ను కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీధరన్ భేటీ అయ్యారు.
మెట్రో రైలు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, జైకా తోడ్పాటు ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. మెట్రోరైలు నిర్మాణ ప్రగతిని ప్రతీనెలా సమీక్షించేలాఒక చార్ట్‌ను తయారు చేయాలని కోరారు. విజయవాడ, విశాఖ, తిరుపతి మెట్రోలతో పాటు అమరావతిలోనూ మెట్రోరైలు నిర్మాణానికి దృష్టి సారించాలని సూచించారు.