The first phase
-
తొలి దశ పీజీ అడ్మిషన్లు పూర్తి
∙7,275 సీట్ల భర్తీ ∙25,26 తేదీల్లో రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకిగానూ తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. పీజీ కోర్సుల్లో మొత్తం 13,943 సీట్లు ఉండగా, వాటిలో మొదటి విడతగా 7,275 మంది వి ద్యార్థులు కళాశాలల్లో చేరినట్లు కే యూ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణారెడ్డి, జా యింట్ డైరెక్టర్లు డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జె. లక్ష్మణ్‌నాయక్ బు««దlవారం తెలిపారు. మెుత్తం 38 కోర్సుల్లో చేరిన విద్యార్థుల వివరాలు, మిగితా ఖాళీల వివరాలను కళాశాలలవారీగా వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకానివారు, తొలిదశలో సీట్లు పొందలేకపోయిన వారు 25,26 తేదీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాలన్నారు. వీరు ఈనెల 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. మొదటిదశలో సీట్ల కేటాయింపు పూర్తయి, కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఈనెల 25 నుంచి 30 వరకు స్లైడింగ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపునకు సంబంధించిన రెండో జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటిస్తామన్నారు. వారంతా వచ్చే నెల 6లోగా ఫీజు చెల్లించి కళాశాలల్లో చేరొచ్చన్నారు. పూర్తి వివరాలకు కేయూ వెబ్సైట్లో చూడాలన్నారు. ప్రవేశ పరీక్షలు లేని సంస్కృతం ,హిందీ, ఎంఐటీ, ఉర్దూ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ , నానో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 24న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
మెట్రోపై అనుమతి రాకుండనే ముందుకెళ్తున్న టీడీపీ సర్కార్
-
2018 నాటికి మెట్రో తొలిదశ
అమరావతిలోనూ ఏర్పాటుకు యత్నం: శ్రీధరన్‌తో సీఎం హైదరాబాద్: 2018 ఆగస్టు నాటికి విజయవాడ, డిసెంబర్ నాటికి విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్‌ను కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శ్రీధరన్ భేటీ అయ్యారు. మెట్రో రైలు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, జైకా తోడ్పాటు ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. మెట్రోరైలు నిర్మాణ ప్రగతిని ప్రతీనెలా సమీక్షించేలాఒక చార్ట్‌ను తయారు చేయాలని కోరారు. విజయవాడ, విశాఖ, తిరుపతి మెట్రోలతో పాటు అమరావతిలోనూ మెట్రోరైలు నిర్మాణానికి దృష్టి సారించాలని సూచించారు. -
నేడు మొదటి దశ పోలింగ్
సాక్షి, బెంగళూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 15 జిల్లాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. మొదటి దశ ఎన్నికల్లో మైసూరు, బెళగావి రెవెన్యూ డివిజన్లలోని మైసూరు, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, హాసన్, కొడగు, మండ్యా, బెళగావి, హావేరి, ఉత్తర కర్ణాటక, ధార్వాడ, గదగ్, చామరాజనగర, ఉడిపి, బాగల్‌కోటే, విజయపుర జిల్లాల్లోని 3,156 గ్రామం పంచాయతీల్లో 43,579 స్థానాలు ఉన్నాయి. ఇందులో 554 స్థానాలకు నామినేషన్లు ఎవరూ వేయలేదు. అంతేకాకుండా 4,460 స్థానాల్లో ఏకగ్రీవ ఎంపిక జరిగింది. దీంతో మిగిలిన స్థానాలకు 1,20,663 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశ ఎన్నికల కోసం 16,965 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుత వాతావరణంలో మొదటిదశ ఎన్నికలను నిర్వహించేందుకు మొత్తం 20,225 మంది భద్రతా బలగాలను వినియోగించనున్నారు. రిజర్వ్ బలగాలను కూడా అందుబాటులో ఉంచినట్లు ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచారి తెలిపారు. -
రుణమాఫీ విందు..ఎవరికో ముందు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రుణమాఫీ గురించి ప్రభుత్వం ఎ ట్టకేలకు చేసిన ప్రకటన ఇందూరు రైతుల కు ఊరట కలిగించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఒకేసారి కాకుండా నాలుగు విడతలలో రుణమాఫీ చేసేందు కు సుముఖత వ్యక్తం చేయడంతోపాటు, మొదటి విడతగా 25 శాతం నిధులను విడుదల చేసింది. దీంతో జిల్లాకు చెందిన 4,33,132 మంది రైతులకు తీపి కబురందినట్లయ్యింది. జిల్లాలో రూ.1863.65 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా, తొలి విడతలో రూ. 465.91 కోట్లు మాఫీ కా నున్నాయి. అయితే, ఈ జాబితాలో ఎవరెవరికీ అవకాశం ఉంటుందన్న చర్చ రైతులలో సాగుతోంది. ఎవరికో ముందు ఎడతెగని కసరత్తు రుణమాఫీ కోసం అర్హులైన రైతుల జాబితాను రూపొందించడానికి అధికారులు ఎడతెగని కసరత్తు చేశారు. ఎ, బి, సి, డి, ఇ దశలుగా విభజించి వివరాలు సేకరించా రు. ప్రభుత్వ ఉత్తర్వులు, రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో అధికారులు, బ్యాంకర్లు ఓ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తింప చేయాల్సి ఉంది. ఇందుకోసం రైతు కుటుంబంలోని సభ్యులు, వారి పేర్లతో ఉన్న ఖాతాలు, బంగారంపై తీసుకున్న రుణాల మొత్తాలను లెక్కగట్టాల్సి వచ్చింది. ఇలా చేస్తే ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుంది? ఎన్ని కోట్ల రూపాయలు మాఫీ అవుతాయి? అన్న అంశాలు కీలకంగా మారాయి. సుమారు మూడు మాసాల నెలల వ్యవధిలో వివిధ దశలు, ప్రక్రియల ద్వారా అర్హులైన జాబితాను రూపొందించారు. 4,33, 132 మంది రైతులకు రూ.1863.65 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని తేల్చారు. రుణాలు ఇచ్చింది ఇలా ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలోని 4,33,132 మంది రైతులకు రూ. 1,863.65 కోట్ల రుణాలు నాలుగు విడతలలో మాఫీ కానున్నాయి. మొదటి విడతగా రూ. 465.91 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. 2013-14లో రూ.1,921.00 కోట్లు లక్ష్యం కాగా రూ.1,810.01 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,152.6 కోట్లు కాగా, రూ.1,075.24 కోట్లు ఇచ్చారు. రబీలో రూ.768.4 కోట్లకుగాను రూ.734.77 కోట్లు పంపిణీ చేశారు. అదే విధంగా జిల్లాలోని 142 సహకార సంఘాలతో పాటు వివిధ బ్యాంకులలో రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.53.64 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు తీసుకున్న మొత్తం రుణాలు రూ.1863.65 కోట్లు కాగా, ఇవన్నీ కూడ రుణమాఫీ కిందకు వస్తాయని అధికారులు నెలరోజుల కిందటే ప్రకటించారు. మొదటి విడతతోపాటు మిగతా రుణాలు మా ఫీ చేసేందుకు అవకాశం ఉందని చెబుతున్న అధికారులు రీ-షెడ్యూల్ తేదీలను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
పోలింగ్ ప్రశాంతం
చెదురుమదురు సంఘటనలే జరిగారుు.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతం బందోబస్తుతో సత్ఫలితం: డీజీపీ ప్రసాదరావు హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాల్లో తొలి విడత పోలింగ్ బుధవారం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయున బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. 90 వేల మంది పోలీసులు, 158 కంపెనీల కేంద్ర బలగాలు, 58 కంపెనీల ఏపీఎస్పీ బలగాలతో కలపి కట్టుదిట్టంగా నిర్వహించిన బందోబస్తు మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. అక్కడక్కడా కొన్ని చెదురువుదురు సంఘటనలు చోటుచేసుకున్నాయుని, అందుకు బాధ్యులైన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయుకులపై కేసులు నమోదు చేశావున్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 కేసులు హింసాత్మకంగా నమోదయ్యాయున్నారు. డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం హింసాత్మక సంఘటనలు ఒక చానల్ కెమెరావున్ను కొట్టినందుకు గజ్వేల్ టీడీపీ అభ్యర్థితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో కొద్దివుంది గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయూరు. ఖవ్ముంలో కానిస్టేబుల్‌పై చేరుుచేసుకున్న సీపీఐకి చెందిన ప్రభాకరరావుపై కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం వెంకటాపురం గ్రామంలో ఎస్ఐ శ్రీధర్ అల్లరిమూకను చెదరగొట్టే క్రమంలో ఒక గర్భిణీ కింద పడిపోరుుంది. దీంతో ఆగ్రహం చెందిన గ్రావుస్తులు పోలింగ్‌ను నిలిపివేశారు. నారాయణ్‌పూర్ డీఎస్పీ జోక్యం చేసుకుని ఎస్ఐపై చర్య తీసుకుంటావుని హామీ ఇవ్వడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. కొడంగల్‌లో టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి తన అనుచరులతో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇన్నోవా కారు ఇంజిన్‌తోపాటు, దగ్ధమైన స్థితిలోఉన్న లక్షాయూభైవేల రూపాయులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదైంది. తనపై దాడి చేశాడని బీజేపీ కార్యకర్త శ్రీసాగర్ చేసిన ఫిర్యాదు మేరకు అంబర్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ వి.హనుమంతరావుపై నారాయణగూడ పోలీసు స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తపై చేరుుచేసుకున్నందుకు ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై కేసు నమోదుచేశారు. బేగంపేట ఎస్ఐని అడ్డుకుని దుర్భాషలాడినందుకు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గజ్జెల కాంతంపై కేసు నమోదైంది.